ardhanareeswara
-
‘ఉమ’ నిస్టు సగమై సంగమమై!
లోకంలో భార్యను ప్రేమించే వారు చాలామంది ఉండొచ్చు. అయితే శివుడు తన భార్యను ప్రేమించినంతగా మరొకరెవరూ ప్రేమించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివుడికి పార్వతి మీద ప్రేమ ఎంతటి గొప్పదంటే ఆమెకు తన శరీరంలో సగభాగాన్ని పంచి ఇచ్చేటంత! శివుడి అర్ధనారీశ్వర తత్వాన్ని, శివుడిలో శక్తిగా వెలిగే అమ్మవారిని దర్శించడానికి సౌందర్యలహరిలో అనేక ఉదాహరణ లున్నాయి కానీ... మచ్చుకు మొదటి రెండు శ్లోకాలు పట్టుకుంటే చాలు. ‘శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మపి అత స్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి‘శివుడు శక్తితో కలిసినప్పుడే శక్తిమంతుడై సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు. శక్తి కలవనప్పుడు కనీసం స్పందించే శక్తి కూడా లేనివాడుగా ఉన్నాడు. అలాంటి నీగురించి చెప్పాలంటే గతజన్మల్లో పుణ్యం లేకపోతే...బ్రహ్మ–విష్ణు–రుద్రులకైనా సాధ్య మవుతుందా? అమ్మవారిని పొగుడుతూ మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి మాట ‘శివ‘ అని అయ్యవారితో మొదలుపెట్టడంలో శంకరుడి హృదయాన్ని పట్టుకోవాలి. ‘కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మేశివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్‘ శివపార్వతులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనవారు. ఒకరు ఎక్కువా కాదు. ఒకరు తక్కువా కాదు. ఆది దంపతులు ఇద్దరూ సమానం. అమ్మవారి సౌందర్యానికి తగిన శబ్దసౌందర్యంతో సాగిన రచన ఇది. శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థగాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రక రకాలుగా చెప్పడం, అత్యంత సంక్లిష్టమైన విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత తేలికగా చెప్పడం... ఇలా తోడుకున్నవారికి తోడుకున్నన్ని అందాలు, ఆనందాలు, అర్థాలు, పరమార్థాలు. శంకరుడు పుట్టక΄ోయి ఉంటే దేవుళ్ళకు ఇన్నిన్ని స్తోత్రాలే ఉండేవి కావు. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు అవసరమైన శివుడి అర్ధనారీశ్వర రూపంలో ఇంకా అనేక ఆధ్యాత్మిక, యోగ సాధనా రహస్యాలు దాగున్నాయి. కాళిదాసు రఘువంశ ప్రార్థన శ్లోకాల్లో చెప్పినట్లు–‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ‘అని శివరాత్రి పూట శివుడిలో భాగమైన పార్వతికి; పార్వతిలో భాగమైన శివుడికి; వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉన్న జగత్తుకు తల్లిదండ్రులైన ఆదిదంపతులిద్దరికీ నమస్కారం పెట్టి... లోకంలో దంపతులు కూడా అలా వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉండాలని కోరుకుందాం. – పమిడికాల్వ మధుసూదన్ -
చికాగో తెలుగు సంఘాల సమర్పణలో ‘అర్ధనారీశ్వరం’
చికాగో : అమెరికా చికాగోలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్ 7వ తేదీన నేపర్విల్లోని నార్త్ సెంట్రల్ కాలేజ్ ఫైఫర్ హాలులో సమర్పించిన కూచిపూడి సంగీత నృత్యరూపకం ‘అర్ధనారీశ్వరం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పద్మభూషణ్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమికి చెందిన 21 మంది కళాకారులు ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అనేక తెలుగు సంఘాలు సమైక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాల్లో అమెరికన్ తెలుగు అసోషియేషన్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్, చికాగో తెలుగు అసోషియేషన్, చికాగో ఆంధ్ర అసోషియేషన్ ఉన్నాయి. చికాగోలోని 8 డ్యాన్స్ స్కూళ్ల గురువులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. సహకారం అందించిన వారిలో ఆనంద డ్యాన్స్ థియేటర్ గురువు జానకి ఆనందవల్లి నాయర్, ఆచార్య పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమి గురు ఆశా అడిగ ఆచార్య, ఆనంద డ్యాన్స్ గురువు సంగీత రంగాల, కూచిపూడి నాట్య విహార గురువు శోభ తమ్మన, నృత్య తరంగ డాన్స్ అకాడమి గురువు అపర్ణ ప్రశాంత్, ప్రేరణ అకాడమి ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురువు అరుణ చంద్ర, సంస్కృతీ ఫౌండేషన్ గురువు శోభ నటరాజన్, డా వినీల చక్కులపల్లి కాకర్లలు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభ సమయంలో ‘అర్ధనారీశ్వరం’ ప్రదర్శన దృశ్యాలను నిర్వహకులు ప్రేక్షకులకు వివరించారు. రెండు గంటల పాటు సాగిన ఈ సంగీత నృత్యరూపకంలో ఆరణ్యంలో గంగ కోసమై భగీరథుని తపస్సుతో ప్రారంభమై, బ్రహ్మాదిదేవతల ప్రవేశము, గంగ ప్రవేశము, కైలాసంలో ప్రమధగణాలతో శివుని తాండవం, పరమేశ్వరుడు భగీరథ ప్రార్థనను మన్నించడం, ఉత్తుంగ తరంగ గంగాప్రవాహినియైన గంగావతరణం, గౌరి అసూయ శివుని అనునయం, గౌరి కైలాసం నుంచి నిష్ర్కమించడం, గౌతమమహర్షి ఆదేశంతో గౌరి కేదారేశ్వర పూజ చేయడం, శివుడు ప్రత్యక్షంగా గౌరీశంకరులు ఏకమవ్వడం, అర్ధనారీశ్వరుని లాస్య తాండవ నృత్యం, ప్రమధాది భక్త గణముల నృత్యముతో రసవత్తరంగా కథ ముగుస్తుంది. నృత్య ప్రదర్శనలోని సన్నివేశాలను ప్రతిబింబించేలా స్టేజీ అలంకరణ ప్రేక్షకులను కట్టిపడేసింది. కూచిపూడి నాట్యకళాకారుల, గాయనీగాయకుల, వాద్యబృందం అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. 19 ఏళ్ల తర్వాత చికాగో విచ్చేసిన వెంపటి బృందం వారి నృత్య ప్రదర్శనను ఘనంగా ఏర్పాటు చేయడంలో కార్యనిర్వహక ముఖ్య సభ్యులు రామరాజ బి యలవర్తి, జగదీశ్ కానూరి, సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని విశేష కృషి చేశారు. -
అశ్వంపై అర్ధనారీశ్వరుడు
శ్రీకాళహస్తి: కొత్త పెళ్లికొడుకైన శ్రీకాళహస్తీశ్వరస్వామి మంగళవారం రాత్రి అశ్వవాహనంపై పట్టణంలో విహారించారు. నూతన వధువైన జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై భకు్తలకు దర్శనమిచ్చారు. కైలాసగిరి ప్రదక్షిణ సందర్భం గా ఉదయం వెళ్లిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూరు్తలు తిరిగి సాయంత్రానికి పట్టణ పొలి మేర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భకు్తలు పెద్ద ఎతు్తన ఎదురెళ్లి వారికి స్వాగతం పలి కారు. అనంతరం స్వామివారు అశ్వవాహనం పై అధిరోహించారు. ఇక అమ్మవారు సింహవాహనంపై ఆశీనులయా్యరు. శివనామస్మరణలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతుల్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, సభ్యులు, శాఫ్ చైర్మన్ పీఆర్ మోహన్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.