Army oparation
-
హిజ్బుల్ కమాండర్ హతం
శ్రీనగర్: ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే హతమయ్యాడు. ఇతడు ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కశ్మీర్‌లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు. నైకూ పోలీసుల నుంచి ఇప్పటికే మూడుసార్లు తప్పించుకున్నాడు. అయితే ఈసారి తప్పించుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అతన్ని హతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సాగిందిలా.. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. షర్షాలి అనే మరోగ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు ఎవరో గుర్తించాల్సి ఉంది. కశ్మీర్ వాలీలో శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని సెల్‌ఫోన్ టవర్లను మూసేసినట్లు తెలిపారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. నైకూ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అతడి మరణం మరికొందరు చేసే అల్లర్లకు, నిరసనలకు కారణంగా మారేందుకు అంగీకరించరాదని ట్వీట్ చేశారు. -
ఆర్మీ x కశ్మీర్ సర్కార్
శ్రీనగర్: ఉగ్రవాదులను తుదముట్టించేందుకు జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాల్లో ఆదివారం రాత్రి ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు హతమయ్యారు. ఇందులో ఇద్దరు లష్కరే మిలిటెంట్లతోపాటు వారితో ఉన్న నలుగురినీ ఆర్మీ అంతమొందించింది. అయితే ఆ నలుగురూ ఉగ్రవాదులేనని ఆర్మీ స్పష్టం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారు పౌరులేనంటోంది. ఆదివారం రాత్రి దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లోని పహ్నూ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జవాన్లు వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆ రెండు వాహనాలనుంచి హఠాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు ప్రారంభించారు. జవాన్లు అప్రపమత్తమై కాల్పులు ప్రారంభించటంతో.. లష్కరే ఉగ్రవాది ఆమిన్ మాలిక్, ఆషిక్ సహా ఆరుగురు హతమయ్యారు. ఆర్మీ చేతుల్లో జైషే ఉగ్రవాది హతం ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ కీలక నేతగా (ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రూపొందిస్తూ) ముఫ్తీ వకాస్ భారత బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఫిబ్రవరి 10న సంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడిలో వకాస్ సూత్రధారి అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం అవంతీపూర్ జిల్లా హత్వార్లోని ఓ ఇంట్లో ముఫ్తీ వకాస్ ఉన్నాడన్న సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన బలగాలు 20 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తిచేశాయి. -
చోటూ గ్యాంగ్ ఏరివేతకు ఆర్మీ
సింధూ నది నడిమధ్యలోని ఓ లంకగ్రామాన్ని స్వాధీనం చేసుకుని, పోలీసులు సహా 24 మందిని బందీలుగా పట్టుకున్న చోటు గ్యాంగ్ ఏరివేతకు ఆర్మీ రంగంలోకి దిగింది. 11 రోజులుగా మాఫియా గ్యాంగ్ కు, పోలీసులకు మధ్య జరుగుతోన్న కాల్పుల్లో ఇప్పటివరకు ఏడుగురు పోలీసులు చనిపోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని సొంతరాష్ట్రం పంజాబ్ లోని రాజన్ పూర్ లంక గ్రామంలో ఈ కాల్పుల పర్వం చోటుచేసుకోవటం గమనార్హం. 11 రోజులుగా పోలీసులు చేస్తుప్రయత్నాలు కొలిక్కిరాకపోవటంతో మాఫియా గ్యాంగ్ పనిపట్టేందుకు సైన్యం బరిలోకి దిగాల్సివచ్చింది. చోటా గ్యాంగ్ ఏరివేతకు 1600 మంది సైనికులను రంగంలోకి దించినట్లు ఆర్మీ ప్రతినిధి జనరల్ ఆసిమ్ బజ్వా తెలిపారు. దాదాపు 10 కిలోమీటర్లు విస్తరించిన లంక గ్రామంలో తలదాచుకున్న గ్యాంగ్ స్టర్లు బందీలుగా పట్టుబడ్డ పోలీసులతోపాటు ప్రజలను అడ్డంపెట్టుకుని కాల్పులు జరుపుతున్నారని, అందుకే సైన్యం మరింత అప్రమత్తంగా ముందుకు కదులుతున్నదని బజ్వా వివరించారు. పంజాబ్ ప్రావిన్స్ లో అనేక దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు చేసిన చోటా గ్యాంగ్ మాదకద్రవ్యాల సరఫరాలోనూ అందెవేసిన చెయ్యి. గులామ్ రసూల్ అలియాస్ చోటు.. చోటు గ్యాంగ్ కు నాయకుడు. కొద్దిమంది అవినీతి పోలీసుల అండదండలతో కొద్దికాలంలోనే నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకున్న చోటూ గ్యాంగ్ ఇప్పుడు సైన్యం ఆపరేషన్ తో కనుమరుగుకాక తప్పనిపరిస్థితి.