Artificial meat
-
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్‌ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్‌తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్‌లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్‌క్రీమ్‌గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్‌లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్‌లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
కృత్రిమ మాంసం తక్షణ అవసరం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మాంసం తయారీ తక్షణ అవసరం అని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ వ్యాఖ్యానించారు. ఒకట్రెండేళ్లలో ఈ మాంసం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నామని అధిక శాతం ప్రజలు పలు సర్వేల్లో తెలిపినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో శుక్రవారం ‘ది ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్’పేరుతో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశుపోషణకు ఫుల్స్టాప్ పెట్టి కృత్రిమ మాంసం ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన తరుణం ఇదేనన్నారు. పశుపోషణ ఆపేస్తే నాలుగేళ్లలో భూతాపాన్ని అరికట్టొచ్చని చెప్పారు. భూతాపానికి మీథేన్ కూడా ఓ కారణమని, పశుపోషణ వల్ల మీథేన్ ఉద్గారాల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. వరిసాగు, బొగ్గు మండించడం ద్వారా కూడా మీథేన్ వెలువడుతుందని పేర్కొన్నారు. అయితే కోళ్లు, గొర్రెలు, మేకల వంటి పశువుల పెంపకం ఆపేస్తే మీథేన్ ఉద్గారాలు తగ్గుతాయన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం కాకముందే పశువుల పెంపకాన్ని ఆపేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జంతువుల నుంచి కొన్ని కణాలను తీసుకుని బయోరియాక్టర్లలో వృద్ధి చేయడం ద్వారా తయారయ్యే ఈ మాంసం ప్రకృతి వనరులెన్నింటినో ఆదా చేస్తుందని తెలిపారు. మాంసంలో చేరుతున్న కొన్ని రకాల వైరస్ల కారణంగా కేన్సర్లు వస్తున్నాయని చాలా అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నట్లు 53 శాతం మంది తెలిపినట్లు ఫొర్నెలిటిక్స్ సంస్థ సర్వే చెబుతోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం లక్షల సంఖ్యలో పశువులను పంపిణీ చేస్తున్న విషయంపై మాట్లాడుతూ.. గతంలో ఏపీలోనూ ఇదే తరహా ప్రయత్నం చేశారని ఇంటికో ఆవు పంపిణీ చేస్తే అందులో 90 శాతం కబేళాలలకు తరలిపోయాయని గుర్తు చేశారు. మొక్కల నుంచి ఇలా..! ప్రోటీన్లు అధికంగా ఉండే మొక్కలు, వృక్షాల ఉత్పత్తులను తీసుకుని ల్యాబుల్లో మాంసంగా తయారు చేస్తారు. చూసేందుకే కాదు.. తినేందుకు కూడా అచ్చు మాంసంలాగే ఉంటుంది. జంతువుల నుంచి ఎలా? ఆరోగ్యవంతమైన జంతువులను సరైన మంచి పరిసరాల్లో పెంచి వాటి నుంచి కొన్ని కణాలను తీసుకుని ల్యాబ్‌ల్లో అభివృద్ధి చేసి, దాని నుంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. కృత్రిమ మాంసం తినడం వల్ల ఎలాంటి వ్యాధుల రావని, పైగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ‘కృత్రిమ మాంసం ఉత్పత్తి విషయంలో పరిశోధనలను ముమ్మరం చేసి, వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు గుడ్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నం చేస్తోంది. ఈ రంగంలోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుంటూ మొక్కల ఆధారిత మాంసం, కృత్రిమ మాంసం ఉత్పత్తికి ప్రయత్నం చేస్తున్నాం.’ –వరుణ్ దేశ్‌పాండే, గుడ్‌ఫుడ్ ఇన్స్టిట్యూట్ ‘కృత్రిమ మాంసం ఎలా తయారు చేయొచ్చో శాస్త్రవేత్తలకు తెలుసు. జంతువుల నుంచి కాకుండా మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుంటుంది. కొబ్బరి నీళ్లు, తేనె వంటి వాటి పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఫలిస్తే కృత్రిమ మాంసంలో కణాలు మినహా మరే ఇతర జంతు సంబంధిత పదార్థాలు ఉండవు’ – పవన్ కె.ధర్, కృత్రిమ బయాలజీ విభాగం, జేన్యూ, ఢిల్లీ ‘కృత్రిమ మాంసం తయారీని వాణిజ్య స్థాయిలో అభివృద్ధి చేయడం ఎలా అన్నది ఒక సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో కృత్రిమ మాంసం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం’ – రాకేశ్ మిశ్రా, డైరెక్టర్ సీసీఎంబీ, హైదరాబాద్ ‘పశుపోషణ కారణంగా పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంత ఇంత కాదు. ఈ నేపథ్యంలో జంతువులను చంపాల్సిన అవసరం లేకుండా కావాల్సిన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించే టెక్నాలజీలను ప్రొత్సహించాల్సి ఉంది.’ – సౌమ్యారెడ్డి, జంతు ప్రేమికురాలు -
డిజిటల్‌తో అవకాశాల వెల్లువ
జోహన్నెస్‌బర్గ్: డిజిటల్ విప్లవంతో బ్రిక్స్, ఇతర వర్థమాన దేశాలకు కొత్త అవకాశాలు వెల్లువెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ వల్ల వచ్చే మార్పుకు ఈ దేశాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు శుక్రవారం నిర్వహించిన ‘ఔట్రీచ్ సెషన్’లో మోదీ ప్రసంగించారు. డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఆఫ్రికా దేశాలతో భారత్‌కున్న చారిత్రక, లోతైన సంబంధాలను ప్రస్తావించారు. ‘డిజిటల్ విప్లవం వల్ల ఈ రోజు మనం మరో చారిత్రక సందర్భానికి చేరువలో ఉన్నాం. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ తీసుకొచ్చే మార్పుకు పూర్తిగా సంసిద్ధం కావాలి. ఆఫ్రికాలో అభివృద్ధి, శాంతి స్థాపనకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్–ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి సహకారం కొత్త శిఖరాలను తాకింది. గత నాలుగేళ్లలో ఇరు వర్గాల మధ్య దేశాధినేతలు, ఉన్నతాధికారుల స్థాయిలో 100కు పైగా ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలు జరిగాయి. 40 ఆఫ్రికా దేశాలకు సుమారు రూ.75 వేల కోట్లకు పైగా రుణ సాయం కల్పించాం. ఆఫ్రికా ప్రాంతీయ ఆర్థిక కూటమికి జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల గత మూడు దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచీకరణ ఫలాలను వారికి చేరువచేయడం చాలా ముఖ్యం. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచీకరణకు రక్షణాత్మక వాణిజ్య విధానాలు సవాలుగా మారాయి’ అని మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాలతో సంబంధాల బలోపేతానికి ఉగాండా పార్లమెంట్లో ప్రతిపాదించిన 10 మార్గదర్శక సూత్రాలను మరోసారి ప్రస్తావించారు. మూడు ఆఫ్రికా దేశాల పర్యటన, బ్రిక్స్ సదస్సు ముగించుకుని మోదీ శుక్రవారం సాయంత్రం భారత్ తిరుగు పయనమయ్యారు. పుతిన్‌తో మోదీ భేటీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. రష్యా–భారత్‌ల స్నేహం దృఢమైనది. భిన్న రంగాల్లో సహకారం, కలసిపనిచేయడాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, పర్యాటకం తదితరాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు, టర్కీ, అంగోలా, అర్జెంటీనా అధ్యక్షులతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. గోల్డ్ మైనింగ్‌కు ‘బ్రిక్స్’ ప్రశంస.. రష్యాలోని సైబీరియాలో భారత్ నేతృత్వంలో ప్రారంభంకానున్న బంగారం తవ్వకాల ప్రాజెక్టును బ్రిక్స్ కూటమి ప్రశంసించింది. çక్లుచెవెస్కోయె గోల్డ్ మైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భారత్‌కు చెందిన సన్ గోల్డ్ లిమిటెడ్‌దే కీలక పాత్ర. చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్ కార్పొరేషన్, రష్యా సావెరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఫార్ ఈస్ట్ అండ్ బైకాల్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్లతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఈ గనుల నుంచి ఏటా 6.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేలా ప్రణాళికలు రచించారు. ఉత్పాదకత ప్రారంభించడానికి ముందు సుమారు రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అతిపెద్ద పెట్టుబడి, సాంకేతిక భాగస్వామి చైనా కంపెనీ కాగా, రష్యాలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సన్ గోల్డ్ లిమిటెడ్ అనుభవం ఈ ప్రాజెక్టుకు కీలకం కానుంది. -
మూడేళ్లలో కృత్రిమ మాంసం!
ఇంకో మూడేళ్లలో జంతువులు ఏవీ పెంచకుండానే మాంసపు బర్గర్ తినొచ్చు. నెదర్లాండ్స్ స్టార్టప్ కంపెనీ మోసా మీట్ ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. జంతు కణాలను పరిశోధన శాలల్లో కృత్రిమ పద్ధతుల్లో పెంచడం ద్వారా తయారయ్యే మాంసం ఇప్పటికే తయారవుతున్నప్పటికీ ఖరీదు చాలా ఎక్కువ. ఈ సమస్యను అధిగమించేందుకు మోసా మీట్ భారీఎత్తున నిధులు సమీకరిస్తోంది. ఎక్కువ ఖర్చుతో పరిశోధనశాలను ఏర్పాటు చేసినా.. ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం ద్వారా కృత్రిమ మాంసం ధరలను తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే 2021 నాటికి కృత్రిమ మాంసంతో తయారయ్యే బర్గర్ ఖరీదు తొమ్మిది డాలర్ల వరకూ ఉండవచ్చునని.. రానున్న ఏడేళ్లలో ఈ ధర మరింత తగ్గవచ్చునని అంచనా. మోసా మీట్ ప్రయత్నానికి గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్గీ బ్రిన్, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ఒకటి మద్దతు పలుకుతున్నట్లు, నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. తాము ఉత్పత్తి చేసే కృత్రిమ మాంసం జంతువుల కండరాల నుంచి సేకరించిన కణాలతో తయారవుతుందని, జంతువులకు మత్తు మందు ఇచ్చి బయాస్పీ ప్రోబ్ ద్వారా కణాలను సేకరిస్తామని, ఆ తరువాత పరిశోధనశాలలో కొన్ని రసాయనాలను జోడించి కణాలు ఎదిగేలా చేస్తామని ఒక శాస్త్రవేత్త వివరించారు. -
కృత్రిమ మాంసం రెడీ
తయారీ బృందంలో తెలుగు శాస్త్రవేత్త నాలుగైదేళ్లలో మార్కెట్లోకి: ఉమా వలేటి వాషింగ్టన్: మాంసం కోసం జంతుబలి అవసరం లేకుండా.. కల్తీలేని, ఆరోగ్యకర మాంసాన్ని అందించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఓ తెలుగు శాస్త్రవేత్తతో కూడిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగశాలలో జంతు కణజాలం నుంచి కృత్రిమంగా మాంసాన్ని రూపొందించింది. ప్రయోగం విజయవంతం కావటంతో రాబోయే రోజుల్లో ప్రయోగశాలలో పెద్ద మొత్తంలో కృత్రిమ మాంసాన్ని తయారుచేయవచ్చని బృంద సభ్యుడైన తెలుగు శాస్త్రవేత్త ఉమా వలేటి తెలి పారు. దీంతో మాంసం కోసం జంతువులను వధించాల్సి న అవసరం ఇకపై ఉండదని హృద్రోగ నిపుణుడు కూడా అయిన వలేటి చెప్పారు. ఇలాంటి మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉండదని, బ్యాక్టీరియా వల్ల చెడిపోదని దీంతో ఎక్కువకాలం నిలువ ఉంచుకోవచ్చన్నారు. కొత్త కణాల్ని తయారుచేసుకునే సామర్థ్యమున్న కొన్ని జంతువుల కణాలు సేకరించి.. దీనికి ఆక్సిజన్, పోషక పదార్థాలు అందిస్తే 9 నుంచి 21 రోజుల్లో మాంసం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఎక్కువగా వినియోగించే ఎద్దు, పంది, కోడి మాంసాలపై ప్రయోగాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో రెస్టారెంట్లలో, ఐదేళ్లలో రిటైల్ మార్కెట్లలో దీన్ని ప్రవేశపెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. మొదటి ఉత్పత్తి పరిశ్రమ అమెరికాలో నెలకొల్పుతామని, ఇండియా, చైనాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. అమెరికాలోని మెం ఫిస్‌లో స్టెమ్ సెల్ బయాలజిస్టు నికోల స్ జెనోవెసే, బయో మెడికల్ ఇంజినీర్ విల్ క్లెమ్‌తో కలిపి వలేటి మెంఫిక్ మీట్స్‌ను స్థాపించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు.