Arun Shourie
-
శౌరీది జాలిపడాల్సిన మేధావితనం
మండల్ శక్తులను ముందుకురికించిన వీపీ సింగ్ గురించి అరుణ్ శౌరీ తప్పు అంచనా వేశారు. కానీ తన సొంత శైలిలో దేశాన్ని పాలిస్తున్న మోదీ విషయంలో కూడా శౌరీ అంచనా తప్పింది. మోదీ ప్రధాని పీఠం అధివసించినప్పటికీ శౌరీలాంటి ఫారిన్ డిగ్రీ హోల్డర్లు తామే వ్యవస్థను నడపగలమని భావించి ఉంటారు. కానీ మోదీ వారి స్థానమేంటో చూపించారు. అయితే శౌరీ దృష్టిలో మోదీ చేసిన సీరియస్ తప్పు ఏదంటే, తాను ధిక్కరించిన అంబేడ్కర్‌నే మోదీ ఆరాధించడం! అంబేడ్కర్ ఒక కొత్త దేవుడిగా ఆవిర్భవించారనీ, కానీ అది చెల్లిపోయే పరిణామం కావచ్చనీ 1990లలో శౌరీ వంటివారు భావించి ఉంటారు. కానీ అంబేడ్కర్ నిజమైన ప్రజాస్వామ్య సంరక్షకుడిగా వెలిగిపోతున్నారు. కాస్త ఆలస్యంగా అయినా సరే, అరుణ్ శౌరీ మీడియా వర్గాల్లో మళ్లీ క్రియాశీలంగా ఉంటు న్నారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై తన అభిప్రాయం గురించీ, గతంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఎడిటర్‌గా తన పాత్ర గురించీ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. 1999–2004లో వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా బీజేపీతో తన సంబంధం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. వీపీ సింగ్, నరేంద్రమోదీ గురించి తన అంచనా తప్పిందనీ... 1989లో, 2014లో వీరిద్దరినీ ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థులుగా బలపర్చడంలో తాను పొరపాటు చేశాననీ చెప్పారు. 1990లలో పెల్లుబికిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు అను కూలంగా బలమైన వాణిని వినిపించిన వారిలో అగ్రగామి అరుణ్ శౌరి. ఆ సమయంలో బీజేపీ ఒక పార్టీగా వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు పలికింది. కానీ బీజేపీ విద్యార్థి, యువజన విభాగాలు మండల్ రిజర్వేషన్లపై హింసాత్మకంగా వ్యతిరేకించాయి. బోఫోర్స్ కుంభకోణాన్ని ఎండగట్టిన వీపీ సింగ్ ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి అయ్యారు. అందుకే కాంగ్రెస్ పార్టీకీ, వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్‌కూ బద్ధ శత్రుత్వం ఏర్పడింది. ఆ కారణం వల్లే అరుణ్ శౌరీ, వీపీ సింగ్‌కి సన్నిహిత మిత్రుడైపోయారు. మండల్ కమిషన్ నివేదికను అమలు పర్చడానికి ముందు వరకు వీపీ సింగ్‌కి బలమైన మద్దతుదారుగా కొనసాగారు. ఆ తర్వాతే వీపీ సింగ్‌కి వ్యతిరేకంగా మారారు. ఈ క్రమంలోనే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది. ఆ తర్వాత కూడా ప్రతిభా సిద్ధాంతానికి అత్యంత క్రియాశీలక మైన మద్దతుదారుగా శౌరీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన దూషణ పర్వాన్ని కొనసాగించారు. ‘ప్రతిభా సిద్ధాంతం’ అనేది 1990లలో ద్విజ మేధావులు నిర్మించిన బోగస్ సామాజిక శాస్త్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంత ప్రతిపాదకులు ఏ స్థాయికి వెళ్లారంటే మన దేశంలోని కులవ్యవస్థ బ్రిటిష్ వలసవాద సృష్టి అని ఆరోపించే సాహసానికి ఒడిగట్టారు. ఈ సిద్ధాంతం వెనుక మాస్టర్ మైండ్ అరుణ్ శౌరీనే అంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. బ్రిటిష్ కుల గణనలో తప్ప భారత దేశంలో కులం అనేదే ఉనికిలో లేదని చెప్పే రచనలను ఎన్నింటినో ఆయన ప్రోత్సహించారు. ఆ సమయంలోనే ‘వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ – అంబేడ్కర్, అండ్ ద ఫ్యాక్ట్స్ విచ్ హావ్ బీన్ ఎరేజెడ్’ అనే ఒక అసహ్యకరమైన గ్రంథరాజాన్ని కూడా రాసిపడేశారు. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియాలో మండల్ అనుకూల శక్తుల స్వరాలకు చోటే లేకుండా పోయింది. ఈ విధంగా శౌరీ మండల్ వ్యతిరేక శక్తుల మేధోవంతమైన హీరోగా మారిపోయారు. ఆ సమయంలోనే నేను ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న గ్రూపు నిర్వహిస్తున్న ‘నలుపు’ అనే తెలుగు పక్షపత్రికలో ‘పరాన్న భుక్కులకు ప్రతిభ ఎక్కడిది’ అనే వ్యాసం రాశాను. మా దృష్టిలో అరుణ్ శౌరీ ఒక సజీవుడైన కౌటిల్యుడు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు శౌరీ ప్రేరేపించిన మండల్ వ్యతిరేక వాదంపై పోరాడాలని మేం భావించాం. ఆ సమయంలోనే సుప్రసిద్ధ విప్లవ గాయకుడు, రచయిత గద్దర్ ‘అరుణ్ శౌరిగా... నీకు ఆకలనేదేమెరుక’ అని ఒక పాట కూడా రాశారు. ఇక్కడ ఒక పంజాబీ బ్రాహ్మణ కులతత్వ మేధావి ఈ దేశంలోని ఉత్పాదక కమ్యూనిటీలన్నింటినీ ప్రతిభారహితులు అని నిందిస్తు న్నాడు. క్రమంగా మండల్ అనుకూల శక్తుల నంబర్ వన్ శత్రువుగా అరుణ్ శౌరీ మారిపోయారు. వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పగూలి పోయాక, బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిపోయాక, శౌరీ బీజేపీకి సంబంధించి పూర్తికాలం మేధావిగా మారిపోయారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగా నికి ఉద్యోగాలను మళ్లించడం అనే ఏకైక ఎజెండాతో పనిచేశారు. ఆ విధంగా వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన రిజర్వేషన్ వ్యతిరేక లక్ష్యం నెరవేరింది. శౌరీ రిజర్వేషన్ వ్యతిరేక ప్రచార కాలంలో లేక అడ్వాణీ రథయాత్ర ప్రచార కాలంలో మోదీ ఒక ఈవెంట్ మేనేజర్‌గా ఉండే వారు. శౌరీ అనేక సందర్భాల్లో నరేంద్రమోదీని గొప్ప రాజకీయ వాదిగా కాకుండా ఈవెంట్ మేనేజర్ మాత్రమేనని చెప్పేవారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా శౌరీ ఎలా అంచనా కట్టారనేది సందేహం. మోదీపై తన అంచనా తప్పు అని ఇప్పుడెలా గ్రహించారు? ఏ అంశాలను బట్టి తన అంచనా తప్పు అని భావిస్తున్నారనేది ప్రశ్న. మోదీ తన ఓబీసీ కులాన్ని ఉపయోగించుకుని 2014 నాటి ఎన్నికల్లో గెలుపు సాధించలేరని వాజ్‌పేయి కాలం నాటి పాలక ద్విజ నేతలు చాలామంది భావించి ఉంటారు. ఒకవేళ మోదీ ప్రధాని పీఠం అధివసించినప్పటికీ శౌరీ లాంటి మరికొందరు ఫారిన్ డిగ్రీ హోల్డర్లు, ప్రపంచ బ్యాంకు నిపుణులు తామే వ్యవస్థను నడపగలమని భావించి ఉంటారు. కానీ మోదీ మాత్రం శౌరీనీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి అహంభావపు సీనియర్లనూ పక్కన పెట్టేశారు. అదే శౌరీకి తగిలిన మొట్టమొదటి షాక్. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని శౌరీ భావించి ఉంటారు. కానీ అరుణ్ శౌరీ శత్రువులకు సంబంధించిన పునాదే మోదీ ఓటు పునాదిగా మారిపోయింది. అయితే శౌరీ దృష్టిలో అన్నిటికంటే మోదీ చేసిన సీరియస్ తప్పు ఏదంటే, తాను ధిక్కరించిన ‘ఫాల్స్ గాడ్’ అంబేడ్కర్‌నే మోదీ ఆరాధించడం. అంబేడ్కర్ ఒక కొత్త దేవుడిగా ఆవిర్భవించారనీ, కానీ అది చెల్లిపోయే పరిణామం కావచ్చనీ 1990లలో శౌరీ వంటివారు భావించి ఉంటారు. కానీ తాను దూషించిన ఆ ఫాల్స్ గాడ్ అంబే డ్కరే, శౌరీ రియల్ దేవుడు మహాత్మా గాంధీకంటే ఎక్కువ అను యాయులను కలిగి ఉన్నారు. శౌరీ ఆరాధించే మరొక దేవుడైన వివేకానందుడు అతడి హిందుత్వ భక్తులకు సందర్భానుసారం ఉల్లేఖనల్లో మాత్రమే ఉనికిలో ఉంటూ వచ్చారు. లేదా శశిథరూర్ వంటి ఐక్యరాజ్య సమితిలో శిక్షణ పొంది వచ్చిన కాంగ్రెస్ మేధావుల ఉల్లేఖనలకే వివేకానందుడు పరిమితమవుతూ వచ్చారు. అదే అంబే డ్కర్ విషయానికి వస్తే దళిత ఓబీసీ, ఆదివాసీ గృహాల నుంచీ, అన్ని మేథో ఫోరంలలో, పండుగల సందర్భాల్లో, కోర్టు తీర్పుల్లో, యూని వర్సిటీ చర్చల్లో, వార్తా పత్రికల కాలమ్‌లలో ఒక ప్రజాస్వామ్య సంరక్షకుడిగా వెలిగిపోతున్నారు. రాజ్యాంగాన్ని రాసిన అసలు రచయిత అంబేడ్కర్ కాదని అరుణ్ శౌరీ చేసే వాదనను మందమతి సైతం అంగీకరించడు. జీవిత పర్యంతం ప్రతిభా సిద్ధాంతానికి వ్యతిరేకిగా, ప్రజాస్వామ్యానికి అనుకూలవాదిగా ఉంటూ థియరీ, ఆచరణ రెండింటినీ ప్రారంభిం చిన అంబేడ్కర్ జాతి మొత్తం ఆలోచనల్లో ఇప్పుడు వెలుగొందు తున్నారు. కానీ నిరాశా నిస్పృహలతో సతమతమవుతున్న హిందూ ప్రాణిగా ఇప్పుడు తాను చనిపోవడానికి వేచి ఉంటున్నానని శౌరీ స్వయంగా చెప్పుకున్నారు. మండల్ వ్యతిరేక ద్విజ మేధావుల సర్కిల్లో మోదీ ఒక ప్రతిభ లేని ఓబీసీ! కానీ పాలనలో వారి స్థాన మేంటో మోదీ చూపించారు. దేశాన్ని మొత్తంగా తానే ఏలుతున్నారు. తన సొంత కారణాలతో మండల్ శక్తులను ముందుకురికించిన వీపీ సింగ్ గురించి శౌరీ తప్పు అంచనా వేశారు. కానీ తనలాంటి మేధావులను పక్కన బెట్టి, తన సొంత శైలిలో దేశాన్ని పాలిస్తున్న మోదీ విషయంలో కూడా శౌరీ అంచనా తప్పింది. మండల్ కాలంలో నా స్వరం ఎలా మూగబోయిందో అలాగే మోదీ కాలంలో శౌరీ స్వరం కూడా మూగబోయినందుకు ఒకరకంగా నేను సంతోషిస్తాను. అంబేడ్కర్ ఇప్పుడు నిజమైన దేవుడిగా మారి పోయారు. తనపై అంత ధిక్కారపూరితమైన పుస్తకం రాసినందుకు శౌరీని బహుశా అంబేడ్కర్ శిక్షించాలని భావించి ఉండరు. కానీ భారతీయ వాస్తవికత పట్ల మేధోపరమైన అలక్ష్యానికి గానూ శౌరీ తనపై తానే జాలి పడాల్సి ఉంది. అంబేడ్కర్ లేకుండా మండల్ రాజకీయాలు లేవు. మండల్ రాజకీయాలు లేకుండా ఈరోజు మోదీ ప్రధాని అయివుండేవారు కాదు. వ్యాసకర్త: ప్రొ.కంచ ఐలయ్యషెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
‘అరుణ్ శౌరీపై క్రిమినల్ కేసు పెట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీతోపాటు, ప్రభుత్వ మాజీ ఉద్యోగి ప్రదీప్ బైజల్, హోటలియర్ జ్యోత్స్నా సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీబీఐ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ లక్ష్మి విలాస్ ప్యాలెస్ హోటల్లో పెట్టుబడుల్లో అవినీతి జరిగిందన్న కేసులో అరుణ్ శౌరీని ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితుడిగా పేర్కొంది. హోటల్ అమ్మకాన్ని తిరిగి ప్రారంభించాలని కోర్టు సూచించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా అరుణ్ శౌరీ ఉన్న సమయంలో ప్రభుత్వానికి భారీ నష్టంతో ఈ హోటల్‌ను విక్రయించినట్లు గుర్తించింది. హోటల్ లక్ష్మి విలాస్ విలువ రూ.252 కోట్లకు పైగా ఉండగా.. కేవలం రూ.7.5 కోట్లకు అమ్ముడైందని కోర్టు తీర్పులో పేర్కొంది. కాగా, సీబీఐ కోర్టు తీర్పుపై రాష్ట్ర హైకోర్టుకు వెళ్తానని అరుణ్ శౌరీ స్పష్టం చేశారు. ప్యాలెస్ చరిత్ర ఇది ఫతే సాగర్ ఒడ్డున ఉన్నఈ ప్యాలెస్ ఉదయ్‌పూర్ రాజులకు చెందినది. రాజరిక పాలన చివరి రోజుల్లో ఈ ప్యాలెస్‌ని ప్రభుత్వానికి అప్పగించారు. భారత్ స్వతంత్ర దేశంగా మారిన తర్వాత ప్రభుత్వం దీనిని హోటల్‌గా నడిపింది. 2002లో దీనిని లలిత్ సూరి గ్రూప్ హోటల్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆసమయంలోనే కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. అయితే, సరైన ఆధారాలు లేవని 2019లో సీబీఐ కేసు మూసివేతకు నివేదిక సిద్ధం చేసింది. కానీ, జోధ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు ఈ నివేదికను తిరస్కరించి తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం దీని లలిత్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అని పిలుస్తున్నారు. లలిత్ సూరి మరణించడంతో సంస్థ బాధ్యతలు జ్యోత్స్నా సూరి నిర్వర్తిస్తున్నారు. (చదవండి: వైరల్: కూతురి డైట్‌పై తండ్రి సరదా కామెంట్) -
‘ధిక్కారం’పై కేసు వాపసుకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం అనుమతిచ్చింది. ఇదే అంశంపై ఇప్పటికే పలు ఇతర పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్లు వీరు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. (ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా) జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ ఈ అంశంపై గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపి పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. నేరపూరిత ధిక్కరణ విషయంలోని ఓ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు, సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుందని పిటిషనర్లు గతంలో సుప్రీంను ఆశ్రయించారు. (రామోజీకి ‘సుప్రీం’ నోటీసులు) -
రఫేల్‌పై సుప్రీంలో రివ్యూ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు బుధవారం సర్వోన్నత న్యాయస్దానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం సంతకం చేయకుండా సీల్డ్ కవర్లో ఇచ్చిన నోట్లో పేర్కొన్న అవాస్తవ అంశాల ఆధారంగా తీర్పు వెలువరించారని రివ్యూ పిటిషన్లో వారు ఆరోపించారు. ఓపెన్ కోర్టులో తమ పిటిషన్ విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని గత ఏడాది డిసెంబర్లో సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందంలో మోదీ సర్కార్‌ను సమర్ధిస్తూ తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు అన్నారు. -
మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డ సీనియర్
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం కాంగ్రెస్ నేత సైఫుద్ధీన్ సోజ్ రాసిన కశ్మీర్: గ్లింప్సెస్ ఆఫ్ హిస్టరీ- స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శౌరీ... కశ్మీర్ అంశంపై మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. ‘కశ్మీర్, పాకిస్థాన్‌ల విషయంలో ఇప్పుడున్న మన ప్రభుత్వం ఓ పద్ధతి, వ్యవహారాలను అవలంభించట్లేదు. కేవలం హిందూ-ముస్లింల మధ్య ఎలా చిచ్చు పెట్టాలన్న ఒకే ఒకే ఎజెండాతో ముందుకు పోతున్నాయి’ అని మండిపడ్డారు. కశ్మీర్ అల్లకల్లోల పరిస్థితులపై స్పందిస్తూ.. ఆ ప్రభావం ఒక్క కశ్మీర్ ప్రజల జీవితంపై మాత్రమే ప్రభావం చూపట్లేదని, యావత్ దేశ ప్రజలు మనోభావాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో కేంద్రం తీసుకున్న బలగాల మోహరింపును(ఆలౌట్ యాక్షన్) నిర్ణయాన్ని మూర్ఖపు చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఆవుల పేరిట ముస్లింలను చంపటం హేయనీయం. ఆ చర్యలు తమ వర్గం హిందువులచే పీడించబడుతుందన్న భావాన్ని ముస్లింలలో పెంచుతుందని’ శౌరి తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను నకిలీ స్ట్రైక్స్‌గా పేర్కొన్న ఆయన.. మోదీ ప్రభుత్వం ఎన్నికల, ఈవెంట్ల సర్కార్‌గా ఆయన ఎద్దేవా చేశారు. కొసమెరుపు.. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంరబరానికి ప్రత్యేక ఆహ్వానాలను సైఫుద్దీన్ సోజ్ అందించారు. అయినప్పటికీ వారిద్దరూ గైర్హాజరు కావటం విశేషం. కశ్మీర్ ప్రజల తొలి ప్రాధాన్యం స్వాతంత్ర్యానికేనంటూ సైఫుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపటం, సోజ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించటం విదితమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇది క్లియర్ అటెంప్ట్!
న్యూఢిల్లీ: బూటకపు వార్తలు రాసే జర్నలిస్టులను శిక్షిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసి.. వెంటనే ఉపసంహరించుకున్న ఉత్తర్వులపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ మండిపడ్డారు. మీడియాను అణచివేసేందుకు చేసిన ప్రయత్నం ఇదని స్పష్టమవుతుందని, మున్ముందు ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియకుండానే కేంద్ర సమాచార, ప్రసార మంత్రి స్మృతి ఇరానీ ఈ ఉత్తర్వులు తీసుకొచ్చినట్టు తాను భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆయనకు తెలియకుండా చిన్న ఆకు కూడా కదలదు. మరీ అలాంటప్పుడు ఇంత తీవ్రమైన ప్రభావం కలిగిన ఉత్తర్వులు పీఎంవోతో సంప్రదించకుండానే రూపొందించారా’అని శౌరీ పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ (ప్రభుత్వ గుర్తింపు) రద్దుచేస్తామని, ఎవరైనా నకిలీ కథనాలపై ఫిర్యాదుచేస్తే.. గుర్తింపు కోల్పోక తప్పదంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వివాదాస్పద మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడం, పాత్రికేయలోకం తీవ్రంగా నిరసన తెలుపడంతో ఈ ఉత్తర్వులను కేంద్రం వెనుకకు తీసుకుంది. ఈ వ్యవహారం నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్వాలని, మీడియాను అణచాలని చూసిన ప్రతిసారి సునామీ తరహా ప్రతిఘటన ఎదురవుతుందని గుర్తించాలని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్ అయిన అరుణ్ శౌరీ హితవు పలికారు. ఫేక్‌న్యూస్‌ను కట్టడి చేయడం ఈ ఉత్తర్వుల వెనుక ఉద్దేశం కాదని, ఎందుకంటే ప్రభుత్వంలోని వారే అతిపెద్ద ఫేక్‌న్యూస్ సృష్టికర్తలని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఉత్తర్వులను ఎంతమాత్రం ఆమోదించవద్దని, మీడియా స్వేచ్ఛను హరించేందుకే ప్రభుత్వం ఇలాంటి మార్గదర్శకాలను సాధనంగా వాడుకుంటుందని ఎమర్జెన్సీ కాలంలో పౌరహక్కుల కోసం కథనాలు రాసిన శౌరీ పేర్కొన్నారు. -
మోదీని తప్పుగా అంచనా వేశా!
సాక్షి, సిమ్లా : మోదీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత అరుణ్ శౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీకి మద్దతునిచ్చి తాను పెద్ద తప్పు చేశానని ఆయన వ్యాఖ్యానించారు. తాను రెండు తప్పులు చేశానని, అందులో ఒకటి గతంలో వీపీ సింగ్ జనతా దళ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం కాగా, రెండోది నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వటమని శౌరీ వ్యాఖ్యానించారు. కసౌలిలో నిర్వహించిన కుశ్వంత్ సింగ్ ఆరవ సాహిత్య వేడుకలకు హాజరైన శౌరీ హౌ టూ రికగ్నైజ్ రూలర్స్ ఫర్ వాట్ దే ఆర్..(‘పాలకులను ఎలా గుర్తించాలి... అవేంటి?) అన్న అంశంపై ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ‘వారు(మోదీని ఉద్దేశించి) ఇప్పుడేం చేస్తున్నారో దానిని అనుసరించొద్దు. గతంలో వారేం చెప్పారో దాని గురించి ఆలోచించండి అని శౌరీ పేర్కొన్నారు. ఇది మన గొప్ప ఫెయిల్యూర్. మన దినపత్రికలు, నాలాంటి వారు మోదీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాం. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని చెబితే నమ్మేశాం. కానీ, అదంతా ఉత్తదేనని శౌరీ తేల్చేశారు. గుజరాత్ వైబ్రెంట్ సదస్సుల పేరుతో 15 లక్షల కోట్ల పెట్టుబడులంటూ చెప్పుకున్న మోదీ సాధించింది మాత్రం కేవలం ఆరు శాతం అభివృద్ధేనని.. గుజరాత్ మోడల్ అన్నది ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ అని శౌరీ ఎద్దేవా చేశారు. నేతలు చెప్పే ప్రకటనలు, హామీల ఆధారంగా కాకుండా.. వారి వ్యక్తిత్వం ఆధారంగా వాస్తవాలను గ్రహించి అంచనా వేయాల్సిన అవసరం ఉందని శౌరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మోదీపై మరో సీనియర్ నేత దండయాత్ర
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై సొంతపార్టీ నుంచే విమర్శలు వేగం పుంజుకుంటున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా మోదీపై దండెత్తుతున్నారు. ఇప్పటికే పరోక్షంగా అద్వానీ, మురళీమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శత్రఘ్న సిన్హా మోదీని విమర్శించగా ఆ జాబితాలో మరో సీనియర్ నేత చేరారు. ఏడాది కిందట దేశంలో మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం పెద్ద నోట్లు రద్దును తాజాగా అరుణ్ శౌరీ తప్పుబట్టారు. అదొక పెద్ద మనీలాండరింగ్ స్కీమ్ అంటూ ఆరోపించారు. అది ఒక పిచ్చి చర్య అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎవరికైతే నల్లధనం పెద్ద మొత్తంలో ఉందో వారంతా ఆ డబ్బును తెల్లడబ్బుగా మార్చుకున్నారని అన్నారు. మరోపక్క, జీఎస్టీని కూడా ఆయన తప్పుబట్టారు. జీఎస్టీ పూర్తిగా తప్పుదోవపడుతుందని, అమలు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా సామాన్యుల డబ్బు కొల్లగొట్టినట్లవుతుందని, వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కేంద్రం చేసిన తప్పుల్లో జీఎస్‌ఎటీ కూడా ఒకటని అని, దానిని తిరిగి సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ అమలు ప్రారంభించి మూడు నెలలు కూడా పూర్తికాకమునుపే ఏడుసార్లు సవరించారని దుయ్యబట్టారు. 'జీఎస్టీ ప్రారంభం సందర్భంలో వారంతా అతిగా ఊహించుకొని భారత స్వాతంత్ర్యంతోటి పోల్చారని విమర్శించారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ చాలా స్లోగా ముందుకెళుతోందని, దాదాపు ఇప్పట్లో సరిచేయలేనంత దుస్థితిలో ఉందని, 2019 ఎన్నికల్లో ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుందని జోస్యం చెప్పారు. -
నల్లధనాన్ని ఎక్కడ దాస్తారో కూడా తెలియదా?
హైదరాబాద్: అక్రమ సంపాదనంతా విదేశాల్లోనే దాచి ఉంచారని, అది దేశంలో లేదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్‌శౌరి అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికితీయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లధనం కూడబెట్టిన వ్యక్తి ఎవరైనా దానిని రూపాయల రూపంలోనే దాచి ఉంచుకుంటాడా? బ్లాక్‌మనీ ఉన్న వారెవరైనా దానిని విదేశాల్లోనే దాచి పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని కంపెనీలు, ఎస్టేట్లు కొనుక్కునేందుకు ఉపయోగిస్తారని చెప్పారు. డెంగీ దోమ స్విట్జర్లాండ్‌లో తిరుగుతూ ఉంటే దాని కోసం ఇక్కడ వెతకడమేంటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోట్లరద్దుతో బ్లాక్‌మనీని కట్టడి చేయటం సాధ్యమా కాదా, మంచిదా చెడ్డదా అనేది నేతలతో పాటు ప్రజలకు కచ్చితంగా తెలియదని అన్నారు. బ్యాంకింగ్ సెక్టార్‌ను వృద్ధి చేయటం, పన్నుల విధానాన్ని పటిష్టం చేయటంపై దృష్టి పెట్టాల్సి ఉండగా బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. -
నల్లధనాన్ని ఎక్కడ దాస్తారో కూడా తెలియదా?
-
మోదీ అధ్యక్ష తరహా పాలన చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నీ తానై అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ బహిషృత నేత అరుణ్ శౌరీ ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నగదు లేకున్నా చెక్కు జారీ చేసే విధానాలను అవలంభింస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం ఎలా ఉండబోతోంది అన్నప్రశ్నకు సమాధానంగా శౌరీ స్పందిస్తూ... పకడ్బందీగా పౌరులపై దాడులు చేయడానికి, పరిపాలనను వికేంద్రీకరించి భయపెట్టడానికి,అసమ్మతి వర్గాల గొంతులు నులిమేయనున్నారని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని నియంతృత్వంలోఇందిరాగాంధీ, జయలలితలతో పోల్చారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని వారిని 'టిష్యు పేరర్' లాగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పశ్చాత్తాపం చెందే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. -
'ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదని, దేశ నైతిక ప్రమాణాలకు ఆయన నిదర్శనంగా నిలబడాలని సూచించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే 'దాద్రి' ఘటనపై మోదీ మౌనం దాల్చారని ఆరోపించారు. 'ప్రధాని అంటే హోమియోపతి డిపార్ట్ మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ కాదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంటూ కాదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. నైతిక మార్గంలో నడుస్తూ ప్రమాణాలు నెలకొల్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది' అని అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. అసహనం పెరిగిపోవడం, గోమాంసం వివాదం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. యూపీఏకు కొనసాగింపుగా ఎన్డీఏ పాలన ఉందని అంతకుముందు విమర్శించారు. బిహార్ ఓట్ల కోసం దాద్రి ఘటనపై ప్రధాని మోదీ మౌనం వహిస్తే.. ఆయన మంత్రులు, బీజేపీ నేతలు మాత్రం దాద్రి చిచ్చు చల్లారకుండా చూస్తున్నారని ఆరోపించారు. 2002 నుంచి అసహనానికి ఎక్కువగా గురైంది ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై శౌరి స్పందించారు. మోదీని గుడ్డిగా వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్నవారి వెనుక రాజకీయ శక్తులున్నాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.