సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం కాంగ్రెస్ నేత సైఫుద్ధీన్ సోజ్ రాసిన కశ్మీర్: గ్లింప్సెస్ ఆఫ్ హిస్టరీ- స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శౌరీ... కశ్మీర్ అంశంపై మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు.
‘కశ్మీర్, పాకిస్థాన్‌ల విషయంలో ఇప్పుడున్న మన ప్రభుత్వం ఓ పద్ధతి, వ్యవహారాలను అవలంభించట్లేదు. కేవలం హిందూ-ముస్లింల మధ్య ఎలా చిచ్చు పెట్టాలన్న ఒకే ఒకే ఎజెండాతో ముందుకు పోతున్నాయి’ అని మండిపడ్డారు. కశ్మీర్ అల్లకల్లోల పరిస్థితులపై స్పందిస్తూ.. ఆ ప్రభావం ఒక్క కశ్మీర్ ప్రజల జీవితంపై మాత్రమే ప్రభావం చూపట్లేదని, యావత్ దేశ ప్రజలు మనోభావాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లో కేంద్రం తీసుకున్న బలగాల మోహరింపును(ఆలౌట్ యాక్షన్) నిర్ణయాన్ని మూర్ఖపు చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఆవుల పేరిట ముస్లింలను చంపటం హేయనీయం. ఆ చర్యలు తమ వర్గం హిందువులచే పీడించబడుతుందన్న భావాన్ని ముస్లింలలో పెంచుతుందని’ శౌరి తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను నకిలీ స్ట్రైక్స్‌గా పేర్కొన్న ఆయన.. మోదీ ప్రభుత్వం ఎన్నికల, ఈవెంట్ల సర్కార్‌గా ఆయన ఎద్దేవా చేశారు.
కొసమెరుపు.. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంరబరానికి ప్రత్యేక ఆహ్వానాలను సైఫుద్దీన్ సోజ్ అందించారు. అయినప్పటికీ వారిద్దరూ గైర్హాజరు కావటం విశేషం. కశ్మీర్ ప్రజల తొలి ప్రాధాన్యం స్వాతంత్ర్యానికేనంటూ సైఫుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపటం, సోజ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించటం విదితమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment