assembly lobby
-
జగన్ కోసం వస్తే తరిమేశారు
అమరావతి : ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోవడానికి వచ్చిన సందర్శకులతో శుక్రవారం అసెంబ్లీ లాబీలు కిక్కిరిసి పోయాయి. ఓ వైపు సభ జరుగుతుండగా జగన్ ను కలుసుకోవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన చాంబర్ ముందు గుమికూడారు. జగన్ తన చాంబర్లో ఉండగా బయటకు వస్తే కలుద్దామని వేచి ఉన్నారు. జగన్ వ్యక్తిగత సిబ్బంది వారందరినీ వరుసగా కలిపే యత్నం చేస్తుండగా అసెంబ్లీ ప్రధాన భద్రతాధికారి అక్కడకు వచ్చి ‘ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు...’ అంటూ అందరినీ గద్దించి పంపేశారు. చాలా మందిని అసెంబ్లీ ఆవరణను దాటించే వరకు వదల్లేదు. ఎంతో ఆశతో జగన్‌ను కలుద్దామని వచ్చిన సందర్శకులు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు నిరాశతో వెనుదిరిగారు. వాస్తవానికి జగన్ అసెంబ్లీకి వచ్చినపుడల్లా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు ప్రతిరోజూ ఆయన్ను కలవడానికి తాపత్రయపడుతున్నారు. అసెంబ్లీ ముగియగానే అదే పనిగా వేచి ఉండి ఆయనను కలిసే వెళుతున్న సందర్భాలు రోజూ జరుగుతున్నాయి. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు, ఇతర అసెంబ్లీ సిబ్బంది కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ హడావిడి కొనసాగుతోంది. అయితే శుక్రవారం అసెంబ్లీ చివరి రోజు కావడంతో సందర్శకుల రద్దీ మరితంగా పెరిగింది. చాలా మంది సెల్ఫీలు తీసుకుందామని ఆసక్తిని చూపారు. ఇలా ప్రజలు జగన్ కోసం అసెంబ్లీకి రావడం అధికారపక్షానికి కంటగింపుగా తయారైందట. అసెంబ్లీలో ఏ నేతకు కూడా లేని విధంగా ఇంత మంది సందర్శకులు జగన్ కోసం రావడం చూసి, వెంటనే భద్రతా సిబ్బందికి పురమాయించిన కారణంగానే వారందరినీ బయటకు పంపేశారని చెబుతున్నారు. -
నల్లగొండలో నేతలకు రక్షణలేదు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి ♦ టీఆర్ఎస్లో ‘మాజీ’లు, రౌడీలు పెరిగిపోయారు ♦ పార్టీ మారాల్సిన అవసరం లేదు ♦ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నా! సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో రాజకీయ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని మాజీమంత్రి, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్లో మాజీ నక్సలైట్లు, చిల్లర రౌడీలు, మామూళ్లు వసూలు చేసే వీధి గూండాలు పెరిగిపోయారని విమర్శించారు. మామూళ్ల గురించి ప్రశ్నించిన నాయకులనుచంపుతామం టూ బెదిరిస్తున్నారని ఆరోపిం చారు. ఇంత రౌడీయిజం ఏనాడూ లేదని, టీఆర్ఎస్ నేతల రౌడీయిజం గురించి ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మారాల్సిన అవసరం తమ అన్నదమ్ములకు లేదన్నారు. టీఆర్ఎస్లో చేరాలంటూ చాలామంది మంత్రులు అడుగుతున్నారని వెల్లడించారు. తెలంగాణకోసం మంత్రి పదవినే త్యాగం చేశానని కోమటిరెడ్డి గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేరన్నారు. ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్రావు వంటివారికే మంత్రి పదవిని ఇచ్చారని అన్నారు. అలాంటి మంత్రి పదవికోసం ఆశపడి పార్టీ మారాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్లో ఉన్నవారిని చూస్తే రాజకీయాలంటే అసహ్యం వేస్తున్నదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పనిచేసే పరిస్థితి లేకుంటే మానేసి వ్యాపారాలు చేసుకుంటానని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టంచేశారు. పీసీసీ పదవిగాని, మరో పెద్ద పదవినిగాని ఆశించడం లేదన్నారు. టీఆర్ఎస్లోకి పోవాల్సిన అవసరం లేదన్నారు. ఏప్రిల్ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానని కోమటిరెడ్డి వెల్లడించారు. తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతానని కోమటిరెడ్డి చెప్పారు. -
ఏ నిబంధనల ప్రకారం తొలగించారు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ లాబీల్లో ఉన్న దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తొలగింపుపై విపక్ష వైఎస్సార్సీపీ భగ్గుమంది. ఏ నిబంధనల ప్రకారం ఫొటోను తొలగించారని నిలదీసింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. రైతుల ఆత్మహత్యలు, తాగునీటి ఎద్దడి మీద ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి, ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దివంగత నేత వైఎస్సార్ ఫొటోలను ప్రదర్శిస్తూ ఆ పార్టీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరనస వ్యక్తం చేశారు. వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వ్యక్తిగత ఇష్టాఇష్టాలను సభలో ప్రతిబింబించకూడదని, ఫొటోల ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని స్పీకర్ సూచించారు. అందుకు విపక్ష సభ్యులు అంగీకరించలేదు.చివరకు వైఎస్సార్సీపీ ఉప నేత జ్యోతుల నెహ్రూకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలంతా మానవతావాదిగా గుర్తించిన వైఎస్... అని ఆయన కొనసాగిస్తుండగా మైక్ కట్ చేశారు. ‘‘కరువు మీద వాయిదా తీర్మానం ఇచ్చారు. వైఎస్‌పై మాట్లాడేందుకు కాదు. తగిన రూపంలో నోటీస్ ఇచ్చి మాట్లాడితే అభ్యంతరం లేదు’’ అని స్పీకర్ తెలిపారు. ‘‘ఆ మహనీయుడి దారిలో నడిచి ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చేవే కాదు. వైఎస్సార్ ఫోటోను అసెంబ్లీ లాబీల్లో నుంచి తొలగించడం ఆవేదనకు గురి చేసింది’’ అని జ్యోతుల స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫొటో తొలగింపులో నిబంధనలు ఉల్లంఘించలేదని స్పీకర్ సమాధానం ఇచ్చారు.తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు వైఎస్ ఫొటోలు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో 10 నిమిషాలపాటు సభ వాయిదా పడింది. జీరో అవర్‌లోనూ.. : ప్రశ్నోత్తరాల తర్వాత మొదలైన జీరో అవర్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీల్లో ఎవరో వైఎస్సార్ ఫొటోలు అంటించారని, వారి మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. అసెంబ్లీ లాంజ్‌లో ఉన్న వైఎస్సా ర్ ఫొటోను తీసేయడానికి ఏ నిబంధనలు అనుమతించాయని ప్రశ్నించారు. గత శాసనసభ ఆమోదం, అప్పటి స్పీకర్ నిర్ణయంతో ఏర్పాటు చేసిన ఫోటోను ఎలా తొలగిస్తారన్నా రు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా లాంజ్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించామని వెల్లడించారు. స్పీకర్ జోక్యం చేసుకొని.. ఫొటో తొలగింపు నేపథ్యం వివరించారు. లాంజ్‌లో ఫొటో పెట్టాలంటే సభ ఆమోదం, జనరల్ పర్పస్ కమిటీ తీర్మానం ఉండాలన్నారు. కమిటీ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామనీ తెలిపారు. అసెంబ్లీ లాంజ్‌లో ఎమ్మెల్యేల నివాళి అసెంబ్లీలో నిరసన తెలిపి బయటకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలందరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలను చేతబట్టుకుని అసెంబ్లీ లాబీల్లో నుంచి లాంజ్‌కు వెళ్లారు. ఎక్కడి నుంచైతే వైఎస్సార్ ఫొటోను తొలగించారో అదే ప్రదేశంలో ఒక ఫొటోను అతికించారు. ఆ తరువాత ఒక బల్లపై వైఎస్సార్ ఫొటోను పెట్టి ఆయనకు పూలు చల్లి నివాళులర్పించారు. -
తెలంగాణ మట్టిలో కిరణ్ సీమాంధ్ర విత్తనం
హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు ముగియగానే అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. మీరు హైదరాబాద్‌లో పుట్టానని చెప్పుకుంటున్నారు... తెలంగాణ మట్టిలో సీమాంధ్ర విత్తనం మీరు అని కిరణ్‌తో హరీష్ రావు అన్నారు. కిరణ్య కుమార్ రెడ్డి సీమాంధ్ర వ్యక్తేనని... ఆయన సీమాంధ్రకే సీఎం అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో పుట్టినంత మాత్రాన సీఎం తెలంగాణ వ్యక్తి కాలేరన్నారు. మట్టి మారినంత మాత్రాన విత్తనం రూపు మారదని హరీష్ చలోక్తులు విసిరారు. -
కేసీఆర్‌తో మాకు సంబంధం లేదు: డీకె అరుణ
-
కేసీఆర్‌తో మాకు సంబంధం లేదు: డీకె అరుణ
రాష్ట్ర మంత్రుల మధ్య అసెంబ్లీ లాబీల్లో బుధవారం ఆసక్తికర సంభాషణలు కొనసాగాయి. అలాంటి సంభాషణే.. తెలంగాణ మంత్రి డీకే అరుణ, సీమాంధ్ర మంత్రి.. పార్థసారథి మధ్య అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకుంది. విభజన ప్రక్రియ ఆగుతుందేమో, రాష్ట్రం విడిపోదేమోనని మంత్రి పార్థసారథి.. డీకే అరుణతో వ్యాఖ్యానించగా.. విభజన ప్రక్రియ సజావుగా సాగుతోందని.. రాష్ట్రం విడిపోవడం ఖాయమని.. ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీ పెడతారేమోనన్న పార్థసారధి వ్యాఖ్యలకు స్పందించిన అరుణ.. హైకమాండ్‌కు కిరణ్ విధేయుడని దిగ్విజయ్ చెబుతున్నారని.. ఆయన కొత్త పార్టీ పెట్టరేమోనని జవాబిచ్చారు. కాగా.. కేసీఆర్‌కు తెలంగాణ రావాలని లేదట కదా అని పార్థసారథి అన్నారు. కేసీఆర్‌తో తమకు సంబంధం లేదని.. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ కాంగ్రెస్ మొదటినుంచీ పోరాడుతోందని అరుణ అన్నారు. ఇది ఇలా ఉండగా.. కిరణ్ కొత్తపార్టీ పెట్టే అవకాశముందని.. మరోమంత్రి టీజీ వెంకటేష్ లాబీల్లో అన్నారు. కిరణ్ కొత్త పార్టీతోపాటు.. వైఎస్ఆర్సీపీ, టీడీపీకి వెళ్లేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. టీజీ మనసులోమాట బయట పెట్టారు.