Assets and liabilities
-
ఆర్థిక దివాళా దిశగా శ్రీలంక
దేశాల మధ్య ఏర్పడే చెలిమికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టడం, వాటిమధ్య కుదిరే ఒప్పందాలను బరువైన పదబంధాలతో అభివర్ణించడం సర్వ సాధారణం. కానీ స్నేహం కుదిరే ఆ రెండు దేశాల మధ్యా సమాన స్థాయి లేనప్పుడు వాటి మధ్య కుదిరే ఒప్పందాల్లో కూడా అదే ప్రతిఫలిస్తుంది. కుదిరే ఒప్పందాలు చిన్న దేశానికి శిరోభారమవుతాయి. దాన్ని రుణ సంక్షోభంలోకి నెట్టేస్తాయి. చైనా–శ్రీలంకల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా చైనా సాయంతో లంకలో నిర్మించిన హంబన్‌టోటా ఓడరేవు పరిస్థితి ప్రస్తుతం అదే. ఆ భారీ ఓడరేవు ఎలాంటి కార్య కలాపాలు సాగక తీవ్ర నష్టాలు తీసుకొస్తుంటే... దానికి ఏటా భారీ మొత్తంలో చైనాకు వాయిదాలు చెల్లించాల్సి వస్తుంటే శ్రీలంక విలవిల్లాడింది. తనను దివాళా తీయిస్తున్న ఈ ఓడరేవును వదుల్చుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడింది. చివరకు ఈ భారాన్ని మోయడం తమ వల్ల కాదని చేతులెత్తేసి దాన్ని నిర్మించిన చైనా పబ్లిక్ రంగ సంస్థ చైనా మర్చంట్ పోర్ట్స్(సీఎంపీ) సంస్థకే తిరిగి అప్ప గించింది. ఆ ఓడరేవులో 85 శాతం వాటాను దానికి అప్పగించి, దాన్ని 99 ఏళ్లకు చైనాకు లీజుకిచ్చింది. ఆ ఒప్పందంలో ఉన్న అంశాలేమిటో, అది మన భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మున్ముందు తెలుస్తుంది. హిందూ సముద్ర ప్రాంత దేశాల్లో తన పలుకుబడి పెంచుకోవడానికి, ముందూ మునుపూ పాగా వేసి మన దేశానికి సవాలు విసరడానికి చాన్నాళ్లక్రితమే చైనా ఆర్ధిక దౌత్యాన్ని ఎంచు కుంది. అందులో భాగంగానే శ్రీలంకతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. లంకలో తమిళ టైగర్లను ఊచకోత కోసిన శ్రీలంక సైన్యం తీరుపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ సైన్యంపై యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ విచారణ జరగాలని కోరుతున్న సమయంలో చైనా శ్రీలంకకు, ఆనాటి దేశాధ్యక్షుడు రాజపక్సకు బాసటగా నిలిచింది. ఆ తర్వాతే హంబన్‌టోటా ఓడ రేవు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దీని నిర్మాణంలో చైనాకు వాణిజ్యపరమైన ప్రయోజనాలు మాత్రమే కాదు...వ్యూహాత్మక అవసరాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. ఇది అటు ఆఫ్రికా, పశ్చిమాసియాలకూ... ఇటు ఆగ్నేయా సియా దేశాలకూ మధ్య ఉంటుంది. చైనాతో మొదలుపెట్టి ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని 65 దేశాలను అనుసంధానించే వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్) లాంటి బృహత్తర ప్రాజెక్టును కలగంటున్న చైనా అధినేత జీ జిన్‌పింగ్ వ్యూహంలో హంబన్‌టోటా కూడా భాగం. లక్షా 70 వేల కోట్ల డాలర్లు( రూ.1,08,85,000 కోట్లు) వ్యయం కాగల ఓబీఓఆర్ ప్రాజెక్టు కోసం ఆ 65 దేశాల్లోనూ భారీయెత్తున రహదార్లు, రైలు మార్గాలు, ఓడరేవులు నిర్మాణాల్లో పాలుపంచుకోవడానికి చైనా సిద్ధపడుతోంది. ఈలోగా హంబన్‌టోటా ఓడరేవు వ్యవహారం మొత్తం గాలి తీసే చందంగా తయారైంది. హంబన్‌టోటా ఓడరేవుకు వ్యయమైన 150 కోట్ల డాలర్లలో 85 శాతం మొత్తాన్ని... అంటే 127.5 కోట్ల డాలర్లను లంకకు 6.5 శాతం వడ్డీతో చైనా ఎగ్జిమ్ బ్యాంకు రుణంగా ఇచ్చింది. మిగిలిన 22.5 కోట్ల డాలర్లను శ్రీలంక భరించింది. ఏడేళ్లక్రితం ఈ ఓడరేవు ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైంది. కానీ 2015 సార్వత్రిక ఎన్నికల్లో రాజపక్స ఓడిపోయాక అనంతరం వచ్చిన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వానికి ఇదొక గుదిబండగా మారింది. ఆ రుణాన్ని ఏడాదికి 6 కోట్ల డాలర్లు చెల్లించాల్సి రావడం దానికొక సమస్యగా మారింది. వాస్తవానికి ప్రారంభమైన మూడేళ్లలో... అంటే 2013కల్లా ఆ ఓడరేవు ద్వారా దండిగా ఆదాయం లభించి రుణం సులభంగా చెల్లించగలగాలి. కానీ శ్రీలంకకు నిరుడు ఆఖరుకల్లా అక్కడ 300 కోట్ల మేర నష్టాలొచ్చాయి. రుణ వాయిదాలను చెల్లించడం దానివల్ల కావడం లేదు. నిజానికి మహిందా రాజపక్స ప్రభుత్వం హయాంలో దేశంలోకి తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులను సమీక్షించి అవసరమైతే వాటిని వెనక్కు పంపుతామని సిరిసేన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ హంబన్‌టోటా ఓడరేవు ఒప్పందం జోలికెళ్లడానికి ఆయన సాహసించలేకపోయారు. అలాగని దాన్ని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓడరేవుకు ఆదాయం రావాలంటే చైనా షిప్పింగ్ కంపెనీల ఓడలు ఆ రేవులో ఆగాలి. అక్కడినుంచి ఎగుమతులు, దిగుమతులు ముమ్మరంగా సాగిం చాలి. ఓడరేవుకు చేర్చి 15,000 ఎకరాల నిడివిలో ప్రత్యేక ఆర్ధిక మండలి (ఎస్ఈ జడ్) నిర్మించి అక్కడ చైనా తయారీ రంగ పరిశ్రమలు వస్తే... భారత్– శ్రీలంక మధ్య ఉన్న ఒప్పందానికి అనుగుణంగా ఆ ఎస్ఈజడ్లో ఉత్పత్తయ్యే వస్తువులకు భారత్‌లో టారిఫ్‌లు ఉండవని లెక్కేశారు. ఈ ఏడాది మొదట్లో ఆ ఎస్ఈజడ్ కూడా ప్రారంభమైంది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు మొదలు కాలేదు. ఈలోగా లంక తీరంలో చైనా నావికా దళ కార్యకలాపాలు పెరగడంపై మన దేశం కూడా అప్రమత్తమైంది. అక్కడ చైనా పట్టు పెరిగితే అది భారత్ భద్రతకు ముప్పు కలిగిస్తుందని మన దేశం భావిస్తోంది. అందుకే హంబన్‌టోటాకు సమీపంలో ఉన్న విమానాశ్రయంలో జపాన్ భాగస్వామ్యంతో 20.5 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతామని, అందుకు ప్రతిగా దాన్ని 40 ఏళ్లపాటు లీజుకివ్వాలని మన దేశం ప్రతిపాదించింది. ఏ దేశమైనా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఏవి ప్రాధాన్యత కలిగినవో, ఏవి లాభదాయకమైనవో నిపుణులతో అంచనాలు వేసుకుని సొంతంగా నిర్ణయిం చుకోవాలి. వేరే దేశం తన స్వప్రయోజనాల కోసం ప్రతిపాదిస్తే వెనకా ముందూ చూడకుండా అంగీకరిస్తే శ్రీలంక తరహాలోనే ఆర్ధికంగా దివాళా తీసే స్థితి ఏర్ప డుతుంది. చైనా–పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్‌పైనా పాకిస్తాన్ ఆర్ధిక నిపుణుల నుంచి ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తమవుతున్నాయి. ఆ కారిడార్ వల్ల పాకిస్తాన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువని వారు చెబుతున్నారు. నేపాల్, మయన్మార్, పాకిస్తాన్లలో చైనా నిర్మించతలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టులపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమ వుతోంది. లంక అనుభవం ఆ దేశాల కళ్లు తెరిపిస్తే అది మనకు కూడా మేలు చేకూరుస్తుంది. -
ఒక్క మంత్రీ ఆస్తులు చెప్పలేదు!
మహారాష్ట్రలో ఇటీవల కొలువుదీరిన దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలోని ఒక్క మంత్రి కూడా తమ ఆస్తులు, అప్పులు ఎంతన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయం సమాచారహక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది. అనిల్ గల్గాలి అనే ఆర్టీఐ కార్యకర్త మంత్రుల ఆస్తులు, అప్పుల గురించి సమాచారం కోరారు. అయితే.. అలాంటి సమాచారం ఏదీ తమకు అందుబాటులో లేదని సాధారణ పరిపాలన శాఖ అండర్ సెక్రటరీ డీకే నాయక్ సమాధానమిచ్చారు. ఈ విషయమై తాను రెండుసార్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు కూడా లేఖలు రాశానని ఆర్టీఐ కార్యకర్త చెప్పారు. తన ఆస్తులు, అప్పులు ఎంత ఉన్నాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి గవర్నర్‌కు తెలియజేయాలి. అలాగే మంత్రులు, సహాయ మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పాలి. ప్రస్తుతం మంత్రివర్గంలో 18 మంది కేబినెట్ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు ఉన్నారు. -
పంట పోయె.. ప్రాణం పాయె
పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నీళ్లందకపోతే తల్లడిల్లిపోయారు. తెగుళ్లు సోకితే దిగులు చెందారు.. ఇంతలో కాలం మొహం చాటేసింది. చినుకు కోసం ఆకాశం వైపు చూసి చూసిన వారి ఆశ ఆవిరైపోయింది. ఆరుగాలం కష్టించిన అన్నదాత ఆశలసౌధం కూలిపోయింది. లక్షలు వెచ్చించి సాగుచేసిన పంటలు చేతికి అందుతాయనే భరోసా లేకుండాపోయింది. అప్పుబారి నుంచి బయటపడే మార్గం లేక చావే శరణ్యమని రైతన్నలు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తమను నమ్ముకున్నవారిని ఒంటరిచేశారు. కొందుర్గు/మిడ్జిల్ : కాలం కనికరించక.. పంటలు చేతికిరాక.. అప్పులు తీర్చే దారిలేక ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకేరోజు ముగ్గురు రైతులు మృత్యువాతపడడంతో ఆయా గ్రామాల్లో తీవ్రవిషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళ్తే..మండలంలోని చిన్నఎల్కిచర్ల గ్రామపంచాయతీ పుల్లప్పగూడ గ్రామానికి చెందిన గొల్ల(చక్కని) నర్సింహులు(30)కు ఎకరా పొలం ఉంది. దీంతోపాటు ఈ ఏడాది మరో పదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్నవేశాడు. పంటపెట్టుబడి కోసం రూ.రెండులక్షలు అప్పుచేశాడు. వర్షాలు సరిగా కురియకపోవడంతో పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై శనివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. కాగా, మూడు రోజులక్రితమే భార్య విమల పుట్టినిల్లు జడ్చర్ల మండలం కిష్టాపూర్‌కు వెళ్లింది. భర్త చావువార్త విని భార్య తల్లడిల్లిపోయింది. మృతుడు నర్సింహులు తల్లి లక్ష్మమ్మ ఏడేళ్ల క్రితమే గుండెపోటుతో మృతిచెందింది. ఇక తండ్రి చెన్నయ్య గ్రామంలోని ఇతరుల ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తండ్రి వచ్చి చూసి కన్నీరుమున్నీరయ్యాడు. పంటను చూసి కలతచెంది ఇదే మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన చిటికెల(పిచ్చకుంట్ల) నర్సింహులు(30)కు సమీపంలో ఎకరాపొలం ఉంది. ఈ ఏడాది మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న, పత్తి పంటలు సాగుచేశాడు. ఇందుకోసం కొందుర్గు సహకార బ్యాంకులో రూ.పదివేలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.1.90లక్షలు అప్పులుచేశాడు. ఇదిలాఉండగా, అతని భార్య యాదమ్మ అనారోగ్యంతో ఈనెల 7న మృతిచెందింది. ఓవైపు భార్యచనిపోవడం, మరోవైపు పంటలు ఎండిపోవడం చూసి నర్సింహులు తీవ్రంగా కలతచెందాడు. ఈ క్రమంలో ఈనెల 9న పురుగుమందు తాగాడు. స్థానికులు గమనించి చికిత్సకోసం వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. అనాథలుగా చిన్నారులు అమ్మానాన్నలు చనిపోవడంతో శ్రీశైలం, శ్రీకాంత్ అనాథలుగా మిగిలారు. వారిలో ఒకరు ఒకటో తరగతి చదువుతుండగా, మరో చిన్నారి అంగన్వాడీకేంద్రానికి వెళ్తున్నాడు. తల్లిదండ్రులు ఏమయ్యారో.. ఇంటివద్ద ఏం జరుగుతుందో తెలియక వెర్రిమొహలు వేసుకుని చూస్తున్న వారిని చూసి పలువురు అయ్యో.. పాపం! అని కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబసభ్యులను కొందుర్గు ఎంపీపీ పరామర్శించి ఆర్థికసహాయం అందజేశారు. కరెంట్ తీగలు పట్టుకుని మరోరైతు మిడ్జిల్: వర్షాభావం, కరెంట్‌కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు కరెంట్‌తీగలను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మండలంలోని బైరంపల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు కటికె గోపాల్జీ(60)వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న ఆరెకరాల పొలంలో బోరుకింద రెండెకరాలు వరిపంటను సాగుచేశాడు. ఇటీవల కరెంట్‌కోతలు ఎక్కువకావడంతో నీళ్లందక పంటంతా ఎండిపోయింది. మరో నాలుగెకరాల్లో పత్తిపంటను సాగుచేయగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అదికూడా చేతికిరాకుండా పోయింది. పంటల సాగుకోసం సుమారు రూ.రెండులక్షలు అప్పుచేశాడు. ఇదిలాఉండగా, అనారోగ్యానికి గురైన తన భార్య వైద్యఖర్చుల కోసం మరో రూ.లక్ష అప్పుచేశాడు. బాకీలను ఎలా తీర్చాలని నాలుగురోజులుగా కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావిస్తూ మదనపడేవాడు. అప్పులు పెరిగిపోవడం, పంటలు చేతికొస్తాయనే ఆశలేదని దిగులుచెందేవాడు. పొలం వద్దకు వెళ్లివస్తానని చెప్పి ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంటినుండి వెళ్లాడు. అక్కడే ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్‌తీగలను పట్టుకుని సృహతప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న రైతులు ఇది గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోగా ప్రాణాలు విడిచాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబసభ్యులను సర్పంచ్ మణెమ్మ, ఎంపీటీసీ సభ్యుడు శివ పరామర్శించి..ఓదార్చారు. ఈ ఘటనతో బైరంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘కారు’ లేని కేసీఆర్
-
‘కారు’ లేని కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సొంతంగా ఒక్క కారు కూడా లేదట! తనకే కాదు.. తన సతీమణి శోభ పేరు మీద కూడా ఎలాంటి వాహనం లేదని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులను ప్రకటించారు. మొత్తం రూ.14.94 కోట్ల ఉన్నాయని అందులో స్థిరాస్తులు రూ. 8.65 కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ. 6.29 కోట్లుగా చూపారు. తన సతీమ ణి వద్ద రూ. 21 లక్షలు విలువైన చరాస్తులున్నాయని, మొత్తం రూ.7,87,53,620 అప్పులున్నాయని తెలిపారు. 2012-13లో రూ. 6,59,684 ఆదాయాన్ని అర్జిస్తే, 2013-14లో రూ. 8,67,830 ఆర్జించినట్లు ఆదాయ పన్నుల రిటర్న్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. నామా ఆస్తులు రూ. 338 కోట్లు ఖమ్మం లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నామా నాగేశ్వరరావు మొత్తం రూ. 338 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో రూ.222 కోట్లు స్థిరాస్థులైతే.. రూ. 116 కోట్లు చరాస్తులని పేర్కొన్నారు. తన పేరు మీద రూ. 141 కోట్ల స్థిరాస్తులు, రూ. 45 కోట్ల చరాస్తులు ఉండగా.. మిగతావి తన భార్య నామా చిన్నమ్మ, కుమారులు పృథ్వీతేజ, భవ్యతేజ పేర్ల మీద ఉన్నట్లు వివరించారు. తన పేరుతో రూ.19 కోట్లు, తన భార్య పేరుతో రూ.7 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. కామ్రేడ్ నారాయణా కోటీశ్వరుడే ఖమ్మం లోక్‌సభకు సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తున్న కె.నారాయణ తనకు, తన భార్యకు కలిపి రూ. 3 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. తన వద్ద రూ. 4.27 లక్షల నగదు, రూ. 77.50 లక్షల విలువైన భూములు, రూ. 25.10 లక్షల విలువ గల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తన భార్య వసుమతిదేవి పేరు మీద రూ.20.83 లక్షల నగదు, రూ. 66.50 లక్షల విలువ గల భూములు, రూ. 1.44 కోట్ల విలువ గల చరాస్తులు ఉన్నాయని నివేదించారు. కుబేరుడు వివేక్.. మొత్తం ఆస్తులు రూ. 265 కోట్లు గత ఎన్నికలతో పోలిస్తే ఎంపీ వివేకానంద ఆస్తులు వుూడింతలు దాటారుు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకస్‌భ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ సవుర్పించిన వివేక్.. తన అఫిడవిట్లో తనకు రూ. 194.28 కోట్ల స్థిరాస్తులు, రూ.44.28 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. భార్య పేరిట రూ.10.99 కోట్ల స్థిరాస్తులు, రూ.16.70 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తన పేరిట రూ. 2.99 కోట్లు, భార్య పేరిట రూ.9.32 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. 2009 ఎన్నికల్లో ఆయున తన ఆస్తులను రూ. 72.95 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు అప్పులేమీ లేవని ప్రకటించారు. కేసీఆర్ వద్ద రూ. 40 లక్షలు అప్పుచేసిన కేటీఆర్ సిరిసిల్ల నుంచి రెండోసారి పోటీకి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ వద్ద రూ.40 లక్షల అప్పు తీసుకున్నట్లు పే ర్కొన్నారు. 2009 ఎన్నికలప్పుడు రూ.4.20 కోట్ల ఆస్తులు.. రూ.57 లక్షల అప్పు ప్రకటించిన కేటీఆర్ ఈసారి... తన పేరిట, తన భా ర్యా పిల్లల పేరిట రూ.5.09 కోట్ల చరాస్తులు, రూ.2.86 కోట్ల స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. వ్యవసాయు రుణం, గోల్డ్‌లోన్, తండ్రికి ఇవ్వాలినవి కలిపి రూ. 2 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరేందర్‌గౌడ్ ఆస్తులు రూ. 62 కోట్లు చేవెళ్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తూళ్ల వీరేందర్‌గౌడ్ (దేవేందర్‌గౌడ్ తనయుడు) తనకు రూ. 62 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు ప్రకటించారు. ఇందులో రూ. 29.6 కోట్లు పలు కంపెనీలు, వ్యక్తుల నుంచి తనకు రావాల్సిన బకాయిలుగా చూపగా, మరో రూ. 27.5 కోట్ల మేర పలు కంపెనీల్లో తనకు వాటాలున్నట్టు వెల్లడించారు. రూ. 3.5 కోట్లు విలువ చేసే పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపారు. దంపతులిద్దరికీ సొంత వాహనాలు లేకపోవడం విశేషం. కాగా తనకు రూ. 13.25 కోట్ల ఆప్పులు కూడా ఉన్నాయని వీరేందర్ వెల్లడించారు. పొన్నాల ఆస్తులు రూ. 7 కోట్లు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనకు, తన భార్యకు కలిపి రూ. 7 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఖిలాషాపురంలో ఇల్లు, జూబ్లీహిల్స్‌లో రూ. 50 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్, రాంపూర్, వరంగల్ చుట్టు పక్కల ప్రాం తాల్లో 14.66 లక్షల విలువైన సాగుభూమి ఉన్నట్లు తెలిపారు.