‘కారు’ లేని కేసీఆర్ | KCR doesn't own a car | Sakshi
Sakshi News home page

‘కారు’ లేని కేసీఆర్

Published Thu, Apr 10 2014 2:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

‘కారు’ లేని కేసీఆర్ - Sakshi

‘కారు’ లేని కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సొంతంగా ఒక్క కారు కూడా లేదట! తనకే కాదు.. తన సతీమణి శోభ పేరు మీద కూడా ఎలాంటి వాహనం లేదని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులను ప్రకటించారు. మొత్తం రూ.14.94 కోట్ల  ఉన్నాయని అందులో స్థిరాస్తులు రూ. 8.65 కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ. 6.29 కోట్లుగా చూపారు. తన సతీమ ణి వద్ద రూ. 21 లక్షలు విలువైన చరాస్తులున్నాయని, మొత్తం రూ.7,87,53,620 అప్పులున్నాయని తెలిపారు. 2012-13లో రూ. 6,59,684 ఆదాయాన్ని అర్జిస్తే, 2013-14లో రూ. 8,67,830  ఆర్జించినట్లు ఆదాయ పన్నుల రిటర్న్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.

 నామా ఆస్తులు రూ. 338 కోట్లు
ఖమ్మం లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నామా నాగేశ్వరరావు మొత్తం రూ. 338 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.222 కోట్లు స్థిరాస్థులైతే.. రూ. 116 కోట్లు చరాస్తులని పేర్కొన్నారు. తన పేరు మీద రూ. 141 కోట్ల స్థిరాస్తులు, రూ. 45 కోట్ల చరాస్తులు ఉండగా.. మిగతావి తన భార్య నామా చిన్నమ్మ, కుమారులు పృథ్వీతేజ, భవ్యతేజ పేర్ల మీద ఉన్నట్లు వివరించారు. తన పేరుతో రూ.19 కోట్లు, తన భార్య పేరుతో రూ.7 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు.
 
కామ్రేడ్ నారాయణా కోటీశ్వరుడే
ఖమ్మం లోక్‌సభకు సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తున్న కె.నారాయణ తనకు, తన భార్యకు కలిపి రూ. 3 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. తన వద్ద రూ. 4.27 లక్షల నగదు, రూ. 77.50 లక్షల విలువైన భూములు, రూ. 25.10 లక్షల విలువ గల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తన భార్య వసుమతిదేవి పేరు మీద రూ.20.83 లక్షల నగదు, రూ. 66.50 లక్షల విలువ గల భూములు, రూ. 1.44 కోట్ల విలువ గల చరాస్తులు ఉన్నాయని నివేదించారు.

 కుబేరుడు వివేక్.. మొత్తం ఆస్తులు రూ. 265 కోట్లు

 గత ఎన్నికలతో పోలిస్తే ఎంపీ వివేకానంద ఆస్తులు వుూడింతలు దాటారుు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకస్‌భ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ సవుర్పించిన వివేక్.. తన అఫిడవిట్‌లో తనకు రూ. 194.28 కోట్ల స్థిరాస్తులు, రూ.44.28 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. భార్య పేరిట రూ.10.99 కోట్ల స్థిరాస్తులు, రూ.16.70 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తన పేరిట రూ. 2.99 కోట్లు, భార్య పేరిట రూ.9.32 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. 2009 ఎన్నికల్లో ఆయున తన ఆస్తులను రూ. 72.95 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు అప్పులేమీ లేవని ప్రకటించారు.

 కేసీఆర్ వద్ద రూ. 40 లక్షలు అప్పుచేసిన కేటీఆర్

 సిరిసిల్ల నుంచి రెండోసారి పోటీకి దిగిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ వద్ద రూ.40 లక్షల అప్పు తీసుకున్నట్లు పే ర్కొన్నారు. 2009 ఎన్నికలప్పుడు రూ.4.20 కోట్ల ఆస్తులు.. రూ.57 లక్షల అప్పు ప్రకటించిన కేటీఆర్ ఈసారి... తన పేరిట, తన భా ర్యా పిల్లల పేరిట రూ.5.09 కోట్ల చరాస్తులు, రూ.2.86 కోట్ల స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. వ్యవసాయు రుణం, గోల్డ్‌లోన్, తండ్రికి ఇవ్వాలినవి కలిపి రూ. 2 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.
 
వీరేందర్‌గౌడ్ ఆస్తులు రూ. 62 కోట్లు


 చేవెళ్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తూళ్ల వీరేందర్‌గౌడ్ (దేవేందర్‌గౌడ్ తనయుడు) తనకు రూ. 62 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు ప్రకటించారు. ఇందులో రూ. 29.6 కోట్లు పలు కంపెనీలు, వ్యక్తుల నుంచి తనకు రావాల్సిన బకాయిలుగా చూపగా, మరో రూ. 27.5 కోట్ల మేర పలు కంపెనీల్లో తనకు వాటాలున్నట్టు వెల్లడించారు. రూ. 3.5 కోట్లు విలువ చేసే పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపారు. దంపతులిద్దరికీ సొంత వాహనాలు లేకపోవడం విశేషం. కాగా తనకు రూ. 13.25 కోట్ల ఆప్పులు కూడా ఉన్నాయని వీరేందర్ వెల్లడించారు.  

 పొన్నాల ఆస్తులు రూ. 7 కోట్లు

 టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనకు, తన భార్యకు కలిపి రూ. 7 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఖిలాషాపురంలో ఇల్లు, జూబ్లీహిల్స్‌లో రూ. 50 లక్షల విలువ చేసే అపార్ట్‌మెంట్, రాంపూర్, వరంగల్ చుట్టు పక్కల ప్రాం తాల్లో 14.66 లక్షల విలువైన సాగుభూమి ఉన్నట్లు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement