assets seize
-
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
జీఎస్టీ రిటర్ను ఎగవేస్తే.. ఖాతా జప్తే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రిటర్నులు దాఖలు చేయని అసెసీలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి రానుంది. ప్రభుత్వం.. అలాంటి అసెసీల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం లేదా ఏకంగా రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయని సంస్థలతో వ్యవహరించాల్సిన విధానాలకు సంబంధించి కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించింది. ఇందులో నిర్దిష్ట కఠిన చర్యలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. దఫదఫాలుగా నోటీసులు... కాంపొజిషన్ స్కీమ్ ఎంచుకున్న అసెసీలు.. మూడు నెలలకోసారి, మిగతా వారు నెలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటోంది. అయితే, జీఎస్టీ అసెసీల్లో 20 శాతం మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని, దీనివల్ల పన్ను వసూళ్లు గణనీయంగా దెబ్బతింటున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐసీ... ఎస్‌వోపీని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో డిఫాల్టరుకు ముందు సిస్టమ్ నుంచి ఒక నోటీస్ వెడుతుంది. ఆ తర్వాత అయిదు రోజుల్లోగా చెల్లించకపోతే.. ఫారం 3–ఎ కింద మరో నోటీసు జారీ అవుతుంది. ఇది వచ్చాక 15 రోజుల్లోగానైనా చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికీ కట్టకపోతే.. అధికారులు సదరు అసెసీ కట్టాల్సిన పన్ను బాకీలను మదింపు చేసి, ఫారం ఏఎస్‌ఎంటీ–13 జారీ చేస్తారు. -
మంత్రి మహేందర్‌కు ఎస్బీఐ షాక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికలవేళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన కుటుంబీకుల ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జప్తు చేసింది. రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ‘పట్నం రాజేందర్‌రెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ’పేరిట ఏడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా షాబాద్ ఎస్బీఐ శాఖలో రుణం తీసుకున్నారు. ఈ అప్పుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్, మంత్రి సతీమణి సునీత పూచీకత్తు ఇచ్చారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టు 9న రుణగ్రహీతకు నోటీసు జారీ చేసింది. బకాయిపడ్డ రూ.1.78 కోట్లను రెండు నెలల్లోపు చెల్లించాలని షరతు విధించినా స్పందన రాకపోవడంతో సొసైటీ ఆస్తులతోపాటు పూచీకత్తుదారు ఇంటి స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేయడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ఎడ్యుకేషనల్ సొసైటీ లిమిటెడ్ పేరిట షాబాద్‌లోని వివిధ సర్వే నంబర్లలో మొత్తం 25 ఎకరాల భూమిని, జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి పేరుపై వికారాబాద్ జిల్లా తాండూరు యశోదనగర్‌లో సర్వే నంబర్137/పి (ప్లాట్ నం.27/సీ పార్టు)లో ఉన్న వంద చదరపు గజాల విస్తీర్ణంలోని ఇంటిని జప్తు చేసింది -
విజయ్ మాల్యా ఆస్తులు జప్తు
లండన్ : వేల కోట్ల అప్పులను ఎగ్గొట్టి 13 బ్యాంకుల నెత్తిన పిడుగు వేసిన విజయ్ మాల్యాపై భారీ పిడుగు పడింది. లండన్‌కు చేరువలో హెర్ట్‌ఫోర్డ్ షైర్లో మాల్యాకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా లేడి వాక్, బ్రాంబుల్ లాడ్జ్, టెవిన్, క్వీన్ హూ లేన్లతో పాటు వెల్విన్‌లోని మాల్యా ఇళ్లలో సోదాలు నిర్వహించడానికి అధికారులకు అనుమతులు ఇచ్చింది. భారత్ ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు’ ట్యాగ్‌ను విజయ్ మాల్యాపై వేయడంతో లండన్ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాల్యా విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. 159 చోట్ల మాల్యాకు ఆస్తులు.. విజయ్ మాల్యాకు దాదాపు 159 చోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈడీతో కలసి బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించిన నివేదికలను గురువారం దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు సమయం కావాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు. కాగా ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల’ కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు వచ్చేనెల 27 లోగా విజయ్ మాల్యా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.9000 కోట్ల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
దావూద్ వేట షురూ.. ఆస్తులు సీజ్!
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అతడి ఆస్తులన్నింటిని సీజ్ చేసేందుకు ముందడుగేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్‌గానీ, దర్యాప్తు సంస్థలుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. తమకు యూఏఈ నుంచి దీనికి సంబంధించి సమాచారం ఇంకా రాలేదని అంటున్నాయి. అయితే, యూఏఈ సీజ్ చేసిన ఆస్తులు విలువ దాదాపు రూ.15వేల కోట్లు ఉంటుందని అంచనా. 1993నాటి ముంబై పేలుళ్లకు ప్రధాన కారణం దావూద్ ఇబ్రహీం అని తెలిసిందే. ఇంకా ఎన్నో నేరాలు అతడు చేశాడు. అతడి కోసం భారత్ ఎప్పటి నుంచో వెతుకుతోంది. పాక్‌లోనే అతడు తలదాచుకున్నాడని తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యూఏఈ తాము నేరస్తులకు, ఉగ్రవాదులకు వ్యతిరేకం అని పరోక్షంగా చెప్పింది. దీంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ 2015లో యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు దావూద్ విషయాన్ని అక్కడ ప్రభుత్వానికి చెప్పడమే కాకుండా అతడి ఆస్తుల వివరాలను అందించి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే అతడి ఆస్తులు సీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.