Assistant Manager
-
ఆమె ఆ బ్యాంకులో నాడు స్వీపర్‌గా నేడు మేనేజర్‌గా...
మనకే చాలా కష్టాలు ఉన్నాయనుకుంటాం. పైగా నా వద్ద ఇది అది లేదు అందువల్లే సాధించలేకపోయాను అంటుంటారు. కానీ కొంతమంది ఎలాంటి సాయం లేక చూసుకునే వాళ్లు కూడా లేక అనాథలైనప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లని ఆదర్శంగా తీసుకోకుండా బాధపడుతూ ఉండిపోతాం. ఇక్కడొక మహిళ ఆ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసింది. మళ్లీ అదే బ్యాంకులో మేనేజర్‌గా అత్యన్నత హోదాను పొందింది. అదెలా సాధ్యమైందంటే... వివరాల్లోకెళ్తే....ప్రతీక్ష అనే మహిళ 1964లో పూణేలోని ఒక నిరుపేద తల్లిదండ్రులకు జన్మించింది. ఆమెకు 16 ఏళ్ల వయసులోనే సదాశివ కడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేశారు. దీంతో ఆమె పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేసింది. ఆమె భర్త ఎస్బీఐ బ్యాంకులో బుక్ బైండర్‌గా పనిచేసేవాడు. పెళ్లైన ఏడాదికి ఆ జంటకు ఒక మగబిడ్డ జన్మించాడు. వారు ఒకరోజు వారి బంధువుల గ్రామానికి వెళ్తుండగా సదాశివ ఒక ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆమె 20 ఏళ్లకే వితంతువుగా మారిపోతుంది. పైగా బిడ్డ పోషణ భారం ప్రతీక్షపై పడిపోతుంది. తన భర్త పనిచేసే బ్యాంకు వద్దకు వెళ్లి తనకు సాయం చేయమని వేడుకుంది. దీంతో వారు ఆ బ్యాంకులో ఆమెకు స్వీపర్‌గా ఒక ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు ఆమె ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులను చూసి తాను ఆ స్థాయికి చేరాలనుకుంది. కానీ తాను కనీసం పది వరకు కూడా చదువుకోలేదు కాబట్టి ఎలా ఉద్యోగం సంపాదించగలను అని మదనపడింది. పైగా తన సంపాదన తన బిడ్డ ఆకలి తీర్చడానికి కూడా సరిపోయేది కాదు. ఏం చేయాలో తోచేది కాదు. కానీ ఏదోరకంగా టెన్త్ పాసవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది ప్రతీక్ష. బంధువులు, స్నేహితు సాయంతో పుస్తకాలు కొనుక్కుని చదువుకుని మరీ టెన్త్ పాసైంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలంలే ఇంటర్మీడియెట్ కూడా పాసవ్వాలి. పైగా తాను కాలేజ్‌కి వెళ్తే కొడుకుని చూసుకోవడం కష్టమైపోతుంది. ఎలా అనుకుంటుండగా తనను బ్యాంక్ పరీక్షలు రాయమని ప్రోత్సహిస్తున్న ప్రమోద్ తోండ్‌వాల్కర్‌ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. దీంతో అతను తన ఇంటిని, కొడుకు ఆలనాపాలనను చూసుకోవడంతో ప్రతీక్షకు సగం కష్టం తగ్గినట్లు అనిపిస్తుంది. ఇక ఆమె పగలంతా పనిచేస్తూ రాత్రిళ్లు నైట్ కాలేజ్‌లకి వెళ్తుండేది. అలా ప్రతీక్ష ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాంకు పరీక్షలు రాసి క్లర్క్‌గా తొలి ఉద్యోగాన్ని సంపాదించింది. ఆ తర్వాత 2004లో ట్రైనీ ఆఫీసర్‌గా పదోన్నతి పొంది పలు ఉన్నత పదవులను చేపట్టింది. తదనంతరం ఆమె అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాకు చేరుకుంది. కష్టాల కడలిని ఈది అనుకున్నది సాధించేంత వరకు వదలని ప్రతీక్షలాంటి వాళ్లు ఎంతమందికో ఆదర్శం. ఆమె మరో రెండేళ్లలో రిటైర్ అవునుంది. Widowed at just 20 years of age, Pratiksha Tondwalkar of #Pune got job as Sweeper in #SBI Bank She continued her studies while working & got elevated as clerk,Trainee Oficer, then as MMII, MM III , Scale IV, CGM & is now AGM Sweeper to AGM. #inspiring#RealHero #BharatKeVeer pic.twitter.com/SeaNJTqtk7 — Srikanth Matrubai (@SrikantMatrubai) July 1, 2022 (చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు) -
హైదరాబాద్‌లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. త్వరపడండి
హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ).. హెడ్ ఆఫీస్(తెలంగాణ డివిజన్ ఆఫీస్)లో పని చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► విభాగాలు: ఫైనాన్స్, టెక్నికల్, లా. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ► జీతం: నెలకు రూ.35,120 నుంచి రూ.87,130 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం(ఆన్లైన్)లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ► వెబ్సైట్: esfc.telangana.gov.in -
బ్యాంకు జాబ్ ట్రై చేస్తున్నారా.. మీకో గుడ్ న్యూస్
డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. 650 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా శిక్షణ ఇచ్చి.. నియామకం ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, శిక్షణ విధానం గురించి తెలుసుకుందాం.. ఇండస్ట్రియల్ డెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. మణిపాల్(బెంగళూరు), నిట్టే(గ్రేటర్ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా.. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు(9 నెలలు తరగతి బోధన, 3 నెలల ఇంటర్న్‌షిప్) శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఖాయం అవుతుంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 650. ఇందులో జనరల్–265, ఎస్సీ–97, ఎస్టీ–48, ఈడబ్ల్యూఎస్–65, ఓబీసీలకు–175 పోస్టులు కేటాయించారు. ఎంపిక ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. వీటిల్లో ప్రతిభ ఆధారంగా కోర్సుకు ఎంపిక చేస్తారు. 200 మార్కులకు ఆన్లైన్ టెస్ట్ ► ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహలో 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఈ విభాగంలో నంబర్స్, కోడింగ్, డీ కోడింగ్, అనాలజీ, సిరీస్,డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఇందులో వివిధ గణంకాలకు సంబంధించి అభ్యర్థుల మ్యాథమెటికల్ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఎదురవుతాయి. డేటా ఆధారంగా విశ్లేషణ చేసే సామర్థ్యం అభ్యర్థుల్లో ఉందో లేదో ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషపై ఉన్న పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్స్, జంబుల్డ్ సెంటెన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రామర్, వొక్యాబులరీ, యాంటోనిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అభ్యర్థుల తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. ఇందులో సింప్లిఫికేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నంబర్ సిరీస్, టైమ్ అండ్ వర్క్, డేటా సఫీషియన్సీ, మిక్చర్ అండ్ అలిగేషన్స్ వంటి వాటిపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్, ఎకానమీ, ఆర్బీఐ–విధులు, జీడీపీ, జీఎన్‌పీ, ఎన్డీపీ/ఎన్‌ఎన్‌పీ, ఇతర ఆర్థిక, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఎక్కువగా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి గత 5 లేదా 6 నెలల కాలానికి సంబంధించిన పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంస్థలు తీసుకున్న నిర్ణయాలు, ప్రముఖ వ్యక్తులు, రచనలు, క్రీడలు, ఒలింపిక్స్ సహా ఇతర ప్రాధాన్యత అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ► అభ్యర్థులు తాజా కరెంట్ అఫైర్స్‌తోపాటు 2021 కేంద్ర బడ్జెట్, 2020–21 ఆర్థిక సర్వేలను కూడా అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్ ఇలా ► ఆన్లైన్ పరీక్షను సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. అంటే.. పరీక్షకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ సమయంలో ఎక్కువగా ముఖ్యాంశాల రివిజన్‌పై దృష్టిపెట్టాలి. ► బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులు ఇప్పటికే సిలబస్ అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఇప్పుడు పరీక్ష తేదీకి అనుగుణంగా రివిజన్ కొనసాగిస్తే సరిపోతుంది. ► ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా.. బ్యాంక్ పరీక్షల గత ప్రశ్న పత్రాలు, మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎంపికైతే ► ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు ఫీజు మూడున్నర లక్షలు. అర్హత గల అభ్యర్థులు ఐడీబీఐ నుంచి రుణం కోసం ప్రయత్నించొచ్చు. కోర్సులో చేరేటప్పుడే అభ్యర్థులు మూడేళ్ల సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ► ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం(తొమ్మిది నెలలు)లో నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్ కాలం(మూడు నెలలు)లో నెలకు రూ.పది వేలు అందిస్తారు. ► పీజీడీబీఎఫ్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఏ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి వేతన శ్రేణి రూ.36000–రూ.63840 లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.idbibank.in -
రూ.39.55 లక్షల స్వాహా..
వైరా : అతను బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులతో నవ్వుతూ మాట్లాడి, మాటలతో మచ్చిక చేసుకుంటాడు. నమ్మకం కలిగేలా పరిచయాన్ని పెంచుకోవటంతో పాటు తోటి ఉద్యోగులకు కూడా టోకరా పెట్టి పరారీ అయ్యాడు. ఎట్టకేలకు వైరా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆ వివరాలను వైరా సీఐ నాయుడు మల్లయ్యస్వామి బుధవారం విలేకరులకు తెలిపారు. కల్లూరుకు చెందిన పిల్లి సతీష్‌కుమార్ వైరా డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ బ్యాంకుకు వచ్చి పోయే ఖాతాదారులు, రైతులతో పరిచయాన్ని పెంచుకొని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదును బదిలీ చేస్తూ మొత్తం 34 మంది ఖాతాదారుల ఖాతాలను వాడుకొని ఎవరికీ అనుమానం రాకుండా డిపాజిట్, విత్‌డ్రా చేయటం, ఓచర్లలో ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.39,55,728 నగదును డ్రా చేసుకొని ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి ఊడాయించాడు. మరోవైపు బ్యాంకులో సహ ఉద్యోగుల ఐడీ, పాస్ వర్డ్‌లను వినియోగించి ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు. గతేడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ పిల్లి సతీష్‌కుమార్ గత ఏడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ నగదును వినియోగదారులు ఖాతాలకు జమచేయమని ఇవ్వటం, ఇచ్చిన నగదును ఖాతాల్లో జమచేసి వినియోగదారులకు తెలియకుండానే నగదును మాయం చేశాడు. సతీ ష్‌కుమార్ వద్ద నుంచి రూ.39,55,528 నగదును స్వాధీనం చేసుకొని, ఖమ్మం డీసీసీబీ సీఈఓ వి వసంతరావు ఫిర్యాదు మేరకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్డుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైన బ్యాంకు ఖాతా నంబరు, పిన్ నంబర్లు తెలియజేయవద్దని సూచించారు. జల్సాలకు అలవాటు పడి... ఓ వైపు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూనే జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనే సతీష్‌కుమార్‌ను బ్యాంకు నేరాలకు పాల్పడేందుకు చేసింది. బ్యాంకు నుంచి కాజేసిన మొత్తాన్ని విలాసాలకు వినియోగించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. -
‘రెప్పపాటు’లో ఘోర ప్రమాదం
లావేరు :రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. సొంత ఊరికి అద్దె కారులో వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో వృద్ధ దంపతులు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం... శ్రీకాకుకుళం జిల్లాలోని సారవకోట మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన జంగాం అప్పన్న గుం టూరు జిల్లాలోని రేపల్లె ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి రావడానికి నిశ్చయించుకున్నారు. తల్లితండ్రులిద్దరూ వృద్ధాప్యంతోపాటు, అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో, రైలు లేదా బస్సులో అయితే ప్రయాణం కష్టమని భావించి విజయవాడలో ఇ న్నోవా కారును బాడుగకు తీసుకున్నా రు. అందులో తన తల్లిదండ్రులైన కృ ష్ణమూర్తి (68), సావిత్రి (60)లతోపాటు, భార్య మాధురి, కుమార్తె లాస్య, వదిన గాయత్రి, ఆమె కుమారుడు హరిహరణ్ సోమవారం సాయంత్రం బయలుదేరారు. విజయవాడ నుంచి దాదాపు ఏడు గంటలు ప్రయాణించి, మరో గంటలో స్వగ్రామమైన కుమ్మరి గుంట చేరుకుంటారన్న సమయంలో లావేరు మండలంలోని సుభద్రాపురం గ్రామం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని మంగళవారం వేకువజామున 3 గం టల సమయంలో వీరి కారు ఢీకొంది. దీంతో కారుముందుభాగం దాదాపు లారీ కిందికి దూసుకుపోయి నుజ్జునుజ్జయింది. కారు ముందుభాగంలో కూర్చొన్న అప్పన్న తండ్రి కృష్ణమూర్తితోపాటు, వెనుకసీటులో ఉన్న తల్లి అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న అప్పన్న, అతని భార్య మాధురి, కుమార్తె లాస్య, వదిన పద్మ, వారి కుమారుడు హరిహరణ్‌కు గాయాలయ్యాయి. వీరిలో పద్మకు తీవ్రగాయాలు కావడంతో విశాఖపట్నం ఆస్ప త్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో సుభద్రాపురం గ్రామస్తులు వెంటనే వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. లావేరు ఎస్ఐ జి. అప్పారావు తన సి బ్బందితో సంఘటన స్థలికి వచ్చి, కా రులో ఇరుక్కుపోయి గాయపడిన వా రిని స్థానికుల సహకారంతో 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కారులో ఇరుక్కుపోయి మృతి చెందిన అప్పన్న తల్లిదండ్రులను బయటకు తీయించి పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంగా ఉన్న లారీని, కారును తొల గించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాలకు రి మ్స్‌లో ఎస్ఐ అప్పారావు పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు డ్రైవర్‌కు నిద్ర వచ్చి రెప్ప వాల్చడం వ ల్లే అదుపుతప్పి లారీని ఢీకొన్నట్లు తె లుస్తోందన్నారు. కాగా, ఇంత ప్రమా దం జరిగినా కారు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలూ లేకుండా సురక్షితంగా బ యటపడ్డారు. కుమ్మరిగుంటలో విషాద ఛాయలు సారవకోట: జంగం కృష్ణమూర్తి, సావిత్రిల మృతితో వారి స్వగ్రామమైన కుమ్మరిగుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతో బంధువులు రోదిస్తూ వారి ఇంటికి తరలివచ్చారు. సావిత్రి కన్నవారి గ్రామమైన జగ్గయ్యపేటలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. -
శ్మశానంలో కూర్చుని ఆ కథ రాశా...
దర్శకుడు కావాలని పదిహేనేళ్లు తపస్సు చేశాడు రాజ్‌కిరణ్. అసిస్టెంట్ మేనేజర్‌గా, సహాయ దర్శకునిగా, అసోసియేట్ డెరైక్టర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎట్టకేలకు ‘గీతాంజలి’తో దర్శకుడయ్యారు. ఆయనతో జరిపిన మాటామంతీ. కైకలూరులో ఫొటోస్టూడియో నడిపా: మాది కృష్ణాజిల్లా కైకలూరు. నేను ఫొటోగ్రాఫర్‌ని. ఫోటో స్టూడియో కూడా రన్ చేశాను. సినిమాలంటే చిన్నప్పట్నుంచీ పిచ్చి. నూతనప్రసాద్ మా ఊరు నుంచే వెళ్లి పెద్ద స్టార్ అయ్యారు. ఆయనలా నేనూ స్టార్ అవ్వాలని కలలు కనేవాణ్ణి. నిర్మాత మాగంటి బాబుగారి ద్వారా హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అప్పటికే నాకు పెళ్లయ్యింది. పిల్లలు కూడా. జీవనోపాధినిచ్చే స్టూడియోకి తాళం వేసి హైదరాబాద్‌లో అవకాశాల కోసం వేట మొదలుపెట్టా. సినీ ప్రయాణం అలా మొదలైంది: రవిరాజా పినిశెట్టిగారి ‘అల్లుడుగారొచ్చారు’ చిత్రానికి అసిస్టెంట్ మేనేజర్‌గా చేరాను. సీన్ పేపర్లు జిరాక్స్ తీసుకురమ్మని పంపిస్తే... రెండు సెట్లు తీయించి, ఒక సెట్ నా దగ్గర ఉంచుకునేవాణ్ణి. వన్ లైన్ ఆర్డర్ అంటే ఏమిటి? సన్నివేశాలు ఎలా రాయాలి? అనేది వాటిని చూసి నేర్చుకునేవాణ్ణి. తర్వాత ‘చూసొద్దాం రండి’, ‘9 నెలలు’ చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాను. ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ చిత్రంతో అసోసియేట్ డెరైక్టర్‌గా ప్రమోటయ్యా. ఆ తర్వాత కథలు తయారు చేసుకుని, దర్శకత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. సునీల్‌తో చేద్దామన్నారు: ఓ శ్మశానంలో కూర్చొని ‘గీతాంజలి’ కథ రాసుకున్నా. ఈ కథకు నేను పెట్టిన పేరు ‘టూ లెట్’. తర్వాత అది ‘బాలాత్రిపుర సుందరి’గా మారింది. ఈ కథ విని నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓకే చేశారు. అయితే... సునీల్‌తో చేద్దామన్నారు. అప్పటికే శ్రీనివాసరెడ్డికి మాటిచ్చి ఉన్నాను. అందుకే ఒప్పులేకపోయాను. తర్వాత ఎన్నో చేతులు మారి చివరకు కోన వెంకట్‌గారి వద్దకు చేరిందీ కథ. ఆయన నిర్మాత ఎంవీవీ సత్యనారాయణగార్ని రంగంలోకి దించడంతో ఇక కథ ఎక్కడా ఆగలేదు. కోన వెంకట్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. బ్రహ్మానందంగారి సైతాన్‌రాజ్ పాత్ర, షకలక శంకర్ పాత్ర ఆయన క్రియేషనే. త్వరలో ఓ యువ హీరోతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతు న్నాను.