Astrosat
-
విశ్వ మూలాల పరిశోధనలకే
ఇస్రో ఇవాళ విజయవంతంగా ప్రయోగించిన ఆస్ట్రోశాట్ విశ్వం మూలాల పరిశోధనలు చేస్తందని శాటిలైట్ ప్రాజెక్ట్ డైరైక్టర్ కే సూర్యనారాయణశర్మ తెలిపారు. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కావడం విశేషం. దీని కోసం శాస్త్ర వేత్తలు 11ఏళ్లు కష్టపడ్డారు. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక వంటి అంశాలపై పరిశోధనల కోసం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ప్రతిపాద కేంద్రానికి పంపారు. అయితే.. కేంద్రం దీనికి అనుమతి ఇవ్వలేదు. అయితే 2004లో ఈ ప్రయోగాలకు అనుమతి లభించింది. 2006లో ఉపగ్రహానికి రూపకల్పన జరిగింది. ఇందులో అమర్చిన ఐదు రకాల పేలోడ్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రీసెర్చి (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ), ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐయూసీఏఏ), రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) వారి భాగస్వామ్యంతో తయారుచేశారు. మరో రెండు పేలోడ్స్ తయారీలో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (సీఎస్ఏ) అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెసైస్టర్ (యూఓఎల్) భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్ (యూవీఐటీ), లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్ఏఎక్స్పీసీ), సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్ (ఎస్ఎక్స్టీ), కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్ (సీజడ్టీఐ), స్కానింగ్ స్కై మానిటర్ (ఎస్ఎస్టీ) అనే ఐదు రకాల ఉపకరణాలను ఖగోళ పరిశోధనకు మాత్రమే తయారు చేశారు. ఉపగ్రహంలో అమర్చిన నాలుగు టెలీస్కోప్‌లు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగినవని చెప్పారు. ఈ ఉపగ్రహం విశ్వంలో పరిభ్రమిస్తూ ఖగోళంలోని స్థితిగతులపై ప్రతి రోజూ.. బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి 10 నుంచి 15 నిమిషాల పాటు సమాచారాన్ని అందజేస్తుందని అయన తెలిపారు. ఈ ఉపగ్రహం తయారీకి రూ.178 కోట్లు వ్యయం చేశారని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం కక్ష్యలో ఐదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. ఇదే తరహాలోనే ఆదిత్య అనే ఉపగ్రహాన్ని తయారు చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. విశ్వం గురించి పరిశోధన చేసే విద్యార్థులకు, పరిశోధకులకు పుణేలో నవంబర్‌లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆస్ట్రోశాట్ ఉపయోగాలు గురించి వివరించనున్నామని ఆయన తెలిపారు. -
పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం విజయవంతం
-
హాఫ్ సెంచరీ కొట్టిన భారత్
విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో హాఫ్ సెంచరీ శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్ఎల్వీ సీ30 ప్రయోగం విజయవంతమవడంతో విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో భారత్ హాఫ్ సెంచరీ చేసినట్టయింది. పీఎస్ఎల్వీ సీ30 ప్రయోగంలో ఆరు విదేశీ శాటిలైట్స్‌ను పంపారు. ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన 14 కిలోల ఎన్ఎల్ఎస్14, అమెరికాకు చెందిన 28 కిలోల లీమూర్ అనే నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపారు. ఈ ఆరు విదేశీ ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 ని దాటింది. ఇప్పటి వరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇస్రో ఇలా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది మూడో సారి. -
పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్ఎల్వీ సీ30 ప్రయోగం విజయవంతంమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను పంపించారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగి సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ30 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభంకావడానికి కొద్దినిమిషాల ముందు లాంచ్ కోసం వెహికిల్ డైరెక్టర్ కు మిషన్ డైరెక్టర్ అనుమతి ఇచ్చారు. దాంతో ఆటో మెటిక్ లాంచ్ సీక్వేన్స్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. పదేళ్ల శ్రమ ఫలితమే ఆస్ట్రోశాట్.. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇది. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి దీన్ని ప్రయోగించారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు. -
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ
-
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ
నేడు పీఎస్ఎల్వీ సీ-30 ద్వారా ప్రయోగం.. ఖగోళ పరిశోధనల కోసం తొలి ప్రయత్నం భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం, ఆదివారం వివిధ దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం రాత్రి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశారు. - శ్రీహరికోట/హైదరాబాద్ పదేళ్ల శ్రమ ఫలితమే ఆస్ట్రోశాట్.. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇది. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి దీన్ని ప్రయోగిస్తున్నారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగిస్తున్నారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే... ఆస్ట్రోశాట్ ఉపగ్రహ ప్రయోగం అంతరిక్ష పరిశోధకులకు మంచి అవకాశం అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి శాస్త్రీయ ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. కిరణ్‌కుమార్ ఆదివారం షార్కు చేరుకుని పీఎస్ఎల్వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను పరిశీలించారు. అనంతరం సహచర శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రయోగ పనులను సమీక్షించారు. విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో హాఫ్ సెంచరీ! ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ సీ-30 ఆరు విదేశీ శాటిలైట్స్‌ను కూడా తీసుకెళుతోంది. ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన 14 కిలోల ఎన్ఎల్ఎస్14, అమెరికాకు చెందిన 28 కిలోల లీమూర్ అనే నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈ ఆరు విదేశీ ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 ని దాటుతుంది. ఇప్పటి వరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇస్రో ఇలా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది మూడో సారి. -
పీఎస్ఎల్వీ సీ-30 కౌంట్ డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ- సీ30కి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మిషన్ సంసిద్ధతా కమిటీ(ఎంఆర్ఆర్) రాకెట్‌కు తుది తనిఖీలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించగా వారు శుక్రవారం ప్రీకౌంట్డౌన్ ప్రక్రియలను నిర్వహించి శనివారం కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 50 గంటల కౌంట్‌డౌన్ తర్వాత సోమవారం ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగం ద్వారా ఇస్రో ఆస్ట్రోశాట్‌తో పాటు మరో 6 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతారు. ఇస్రోసహాఇండోనేసియా, కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. సూర్యమండలాన్ని పరిశోధించేందుకు, విశ్వంలోని సుదూర పదార్థాల అధ్యయనానికి ఆస్ట్రోశాట్‌ను పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్(యూవీఐటీ), లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్ఏఎక్స్పీసీ), సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్ (సీజడ్టీఐ), స్కానింగ్ స్కై మానిటర్ అనే ఉపకరణాలను అమర్చారు. -
మూడు ప్రయోగాలకు సిద్ధం: షార్ డెరైక్టర్
సూళ్లూరుపేట: ఈ ఏడాదిలో 3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్ చెప్పారు. షార్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈనెలలో జీఎస్ఎల్వీ డీ6 ద్వారా జీశాట్-6 ఉపగ్రహాన్ని పంపుతామని తెలిపారు. ఈనెల 27న సాయంత్రం 4.52కు ప్రయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. పది ట్రాన్స్పాండర్లున్న ఈ ఉపగ్రహంతో మల్టీమీడియా, శాటిలైట్ ఫోన్లకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సెప్టెంబర్‌లో పీఎస్ఎల్వీ సీ30 ద్వారా ఆస్ట్రోశాట్‌తో పాటు ఇండోనేషియాకు చెందిన లపాన్-ఏఈ, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్-14, యూఎస్ఏకు చెందిన లీమోర్ నానో ఉపగ్రహాలను ప్రయోగిస్తామని వివరించారు. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఆస్ట్రోశాట్‌లో ఆరు ఆస్ట్రానమీ పేలోడ్స్ పంపిస్తున్నామని తెలిపారు. డిసెంబర్లో పూర్తి వాణిజ్యపరమైన పీఎస్ఎల్వీ సీ29 ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించారు. 2016 మార్చిలోపు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే రెండు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పీఎస్ఎల్వీ ప్రయోగాలకు అవసరమైన ఎక్స్ఎల్ స్ట్రాపాన్ బూస్టర్లను షార్‌లో కూడా తయారుచేసేందుకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో గ్రూప్ డెరైక్టర్ పి.విజయసారథి, పీఆర్వో విశ్వనాథశర్మ పాల్గొన్నారు. -
వచ్చే నెలలో ఆస్ట్రోశాట్ ప్రయోగం
సూళ్లూరుపేట: ఇస్రో.. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి వచ్చేనెల ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ నెల27న జీఎస్ఎల్వీ-డీ6 రాకెట్ ద్వారా జీశాట్-6 ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఇస్రో పీఎస్ఎల్వీ-సీ30 ద్వారా వచ్చే నెల ఆస్ట్రోశాట్ ప్రయోగానికీ సన్నద్ధం అవుతోంది. జీఎస్ఎల్వీ-డీ6 ప్రయోగానికి షార్ రెండో రాకెట్ ప్రయోగవేదిక పై, పీఎస్ఎల్వీ-సీ30 ప్రయోగానికి మొదటి ప్రయోగవేదికపై సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ ప్రయోగానికి సంబంధించి.. మరో రెండు రోజుల్లో ఉపగ్రహాన్ని రాకెట్‌కు అమర్చనున్నారు. తర్వాత 18వ తేదీన వ్యాబ్ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదిక మీదకు చేర్చే ప్రక్రియను చేపట్టనున్నారు. అనంతరం 27న సాయంత్రం 4.20 గంటలకు ప్రయోగం జరగనుంది. అదేవిధంగా ఆస్ట్రోశాట్ ఉపగ్రహం కూడా మరో రెండు వారాల్లో షార్కు చేరుకోనుందని షార్ వర్గాలు తెలిపాయి.