హాఫ్ సెంచరీ కొట్టిన భారత్
విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో హాఫ్ సెంచరీ
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగం విజయవంతమవడంతో విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో భారత్ హాఫ్ సెంచరీ చేసినట్టయింది. పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగంలో ఆరు విదేశీ శాటిలైట్స్‌ను పంపారు. ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన 14 కిలోల ఎన్‌ఎల్‌ఎస్14, అమెరికాకు చెందిన 28 కిలోల లీమూర్ అనే నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపారు.
ఈ ఆరు విదేశీ ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 ని దాటింది. ఇప్పటి వరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇస్రో ఇలా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది మూడో సారి.