సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్12) ప్రయోగించేందుకు ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ప్రయోగానికి 27.30 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తారు.
అయితే శనివారం ఎంఆర్‌ఆర్ సమావేశం, లాబ్ సమావేశం అనంతరం కౌంట్‌డౌన్ సమయం, ప్రయోగ సమయం అధికారికంగా ప్రకటించనున్నారు. శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం నిర్వహించారు. రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించిన అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు.
లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరోమారు ల్యాబ్ సమావేశం నిర్వహించారు. జీఎస్‌ఎల్‌వీ ఎప్12 రాకెట్‌కు సంబంధించి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం 10.42 గంటలకు 2,232 కిలోలు బరువు కలిగిన నావిక్–01 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగి వైపుకు దూసుకెళ్లేందుకు షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా వుంది.
కలాం స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలి
మిసైల్‌మ్యాన్ ఏపీజే అబ్దుల్‌కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ పిలుపునిచ్చారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాలులో దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన ఈ ఏడాది పదో తరగతిలోకి వెళ్లనున్న విద్యార్థులు 56 మందిని ఎంపిక చేసి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో భాగంగా యువికా–2023 కార్యక్రమానికి ఆహ్వానించి తీసుకొచ్చారు.
శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్‌తో వర్చువల్ పద్ధతిలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సుమా రు గంటకు పైగా సమాధానాలు ఇచ్చి వారిని ఉత్తేజ పరిచారు. అనంతరం చైర్మన్ ఎస్.సోమనాథ్ మా ట్లాడుతూ ఈ తరం విద్యార్థులు ఎంతో తెలివైన వారని, వారిలో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీస్తే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపారు.
నేటి తరం విద్యార్థులు స్పేస్ టెక్నాలజీ వైపు రాకుండా ఇతర రంగాలవైపు మొగ్గు చూపుతు న్న నేపథ్యంలో వారిని స్పేస్ సైన్స్ వైపు మళ్లించేందుకు యువ విజ్ఞాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని చెప్పారు. రాకెట్లు, ఉపగ్రహాలు, ఆర్బిట్లు అనే వి మేథమేటిక్స్‌తో ఎక్కువగా ముడిపడి ఉంటా యని అన్నారు. అందుకే మేథమేటిక్స్‌లో మంచి ప్రావీ ణ్యం ఉంటే ఇస్రో శాస్త్రవేత్తలుగా రావడానికి ఎంతో వీలుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, షార్ కంట్రోలర్ శ్రీని వాసులురెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్.వెంకట్రా మన్, గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment