asvapuram
-
70 కిలోల గంజాయి స్వాధీనం
ఖమ్మం జిల్లా అశ్వాపురం పోలీసులు 70 కిలోల గంజాయిని శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇన్నోవా వాహనంలో గంజాయిని తీసుకెళుతుండగా పట్టుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు సుమారు 70 కిలోల గంజాయి, ఇన్నోవా వాహనం, రూ.2 లక్షల నగదు ను సీజ్ చేశారు. -
ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించి..
అశ్వాపురం, న్యూస్‌లైన్: ఆడేపాడే వయసులో విద్యుత్ ప్రమాదం జరిగి రెండు చేతులు కోల్పోయినా అతను ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తమ్ముడికి, చెల్లెలికి ఉత్తరం రాయాలనే పట్టుదలే అతనిని వైకల్యం జయించేలా చేసింది. కాలితో రాయడంతో పాటు అన్ని పనులు చేసుకునేలా మార్చి ఉన్నత విద్యావంతుడిని చేసింది. అతనే అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పంచాయతీ కుమ్మరిగూడేనికి చెందిన పర్సిక రాజు. కుమ్మరిగూడేనికి చెందిన చంద్రయ్య, సీతమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 1981లో జన్మించిన రాజు ఆరేళ్ల వయసుల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు గ్రామ చివరకు వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతనిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పట్లో సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండు చేతులు కోల్పోయాడు. రెండు చేతులు లేకపోవడంతో అతను మొదట్లో బాధపడ్డాడు. తోటి పిల్లలు బడికెళ్తుంటే తాను వెళ్లలేకపోతున్నానని కుమిలిపోయాడు. ఈ క్రమంలో బూర్గంపాడు, కిన్నెరసాని వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న చెల్లెలు భవానీ, తమ్ముడు రామారావులు ఉత్తరం రాయాలని ఆలోచన వచ్చింది. దీంతో అతను ప్రతీ రోజు సాధన చేసి కాలితో రాయడం నేర్చుకుని వారికి ఉత్తరాలు రాశాడు. అతని పట్టుదల, చదువుకోవాలనే ఆశ చూసిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అతను మార్చి 2005లో అశ్వాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2005 -07 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2007 నుంచి 2010 వరకు భద్రాచలం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, ఆ తర్వాత బీఎడ్ పూర్తి చేశాడు. అనంతరం ఖాళీగా ఉండకుండా అశ్వాపురంలోని సన్మార్గ్ వికలాంగుల ఆశ్రమంలో కంప్యూటర్ విద్యను సైతం నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... చేతులు లేవని ఇంట్లో కూర్చుని ఉండకుండా పట్టుదలతో ఉన్నత చదువులు చదివా. తల్లిదండ్రులు, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఇప్పటి వరకు ఆనందంగానే ఉన్నా. నా విద్యార్హతకు తగిన ఉద్యోగం కల్పించి జీవనోపాధి కల్పించాలని పలుమార్లు భద్రాచలం పీఓలకు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేదు. సీఆర్టీగా ఉద్యోగం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నాకు ఉపాధి కల్పించి ఆదుకోవాలి. - పర్సిక రాజు -
భార్యను హతమార్చి.. భర్త బలవన్మరణం
=అనుమానంతో కిరాతకం =దుంపెల్లిగూడెంలో విషాద ఛాయలు =దంపతుల మృతితో ఒంటరైన కుమారుడు గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని దుంపెల్లిగూడెంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కొత్త ఉపేందర్‌రెడ్డి అలియూస్ ఉప్పల్‌రెడ్డి(45)కి సుమారు 19 ఏళ్ల క్రితం ఇదే మండలం అశ్వాపురం సమీపంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన పన్నాల కోటిరెడ్డి, సామ్రాజ్యం కుమార్తె విజయ(35)తో వివాహమైంది. వారి ఒక్కగానొక్క కుమారుడు నరేందర్‌రెడ్డి ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కొద్ది సంవత్సరాలుగా భార్యను అనుమానిస్తూ ఉప్పల్‌రెడ్డి గొడవపడేవాడు. ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగారుు. అయినా గొడవలు సద్దుమణగకపోవడంతో 8 నెలల క్రితం విజయ తల్లిగారింటికి వెళ్లిపోయింది. పది రోజుల క్రితం రామన్నగూడెంలో జరిగిన తమ బంధువు దశదినకర్మకు ఇరువైపుల బంధువులు వచ్చారు. ఆ సమయంలోనే విజయను అత్తవారింటికి పంపించాలని బంధువులు మాట్లాడడంతో తల్లి సామ్రాజ్యం వారం రోజుల క్రితం కుమార్తెను దుంపెల్లిగూడెంలో దింపి వెళ్లింది. రెండు రోజులుగా పొలం పనులకు భార్యభర్తలు కలిసే వెళ్లారు. గురువారం సాయంత్రం ఇంటికొచ్చాక అతడి సెల్‌ఫోన్‌కు ఫోన్ వచ్చింది. దీంతో ఉప్పల్‌రెడ్డి ఫోన్ పట్టుకుని బయటికి వచ్చి ఈ నంబర్ ఎవరిదో చూడండంటూ ఇంటిపక్కల వారికి చూపించాడు. ఆ నంబర్ ఎవరిదో తమకు తెలియదని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత దంపతుల మధ్య ఏం జరిగిందోగానీ ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్కింటికి చెందిన వారు వెళ్లి తలుపు తట్టారు. తలుపు తెరుచుకోగానే ఇంట్లో నుంచి పురుగుల మందు వాసన గుప్పుమనడంతోపాటు కదలని స్థితిలో మంచంపై ఉన్న దంపతులను చూసి పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీధర్‌రావు, పస్రా ఎస్సై బాలాజీవరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీసుకొస్తుండగా విజయ ఒంటిపై గాయాలు కనిపించడంతో ఆమెను గాయపరిచి చ ంపి, పురుగుల మందు తాగించి, ఆ తర్వాత ఉప్పల్‌రెడ్డి కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అరుుతే పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని వారు తెలిపారు. మృతురాలి తల్లి సామ్రాజ్యంబోరున విలపించింది. తల్లిదండ్రుల మృతితో అనాథగా కుమారుడు తల్లిదండ్రుల మృతితో వారి కుమారుడు నరేందర్‌రెడ్డి అనాథగా మారాడు. ఇప్పటికే ఇంట్లో గొడవలతో మేనమామ మధుసూదన్‌రెడ్డి వద్ద ఉంటూ చదువుకుంటున్న అతడు తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా మిగిలాడు.