ATM machines
-
Hyderabad: ఆ ఇద్దరూ అమన్, అలోక్!
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు బీహార్‌లోని వైశాలీ జిల్లా, ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్‌గా తేలింది. వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. ఈ మేరకు లుక్ ఔట్ నోటీసులు రూపొందించి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు పంపారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం నలుగురు ఉండే వారని, 2023లో ఉత్తరప్రదేశ్‌లో ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు బీదర్ అధికారులు చెబుతున్నారు. మీర్జాపూర్‌లోనూ ఓ గార్డు హత్యఈ గ్యాంగ్ బైక్‌లపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకుంటోంది. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠాలో అమన్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్ని సభ్యులుగా ఉండేవారు. వీళ్లు 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో పంజా విసిరారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. పట్టపగలు, నడిరోడ్డుపై సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంకు పెట్టెతో ఉడాయించారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా ఓ స్పెషల్ టాస్‌్కఫోర్స్ (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ గ్యాంగ్‌లో ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించింది. ఎస్టీఎఫ్కు ఇద్దరు మాత్రమే చిక్కారు ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 30 మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ ఎస్టీఎఫ్ దాదాపు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా గాలించింది. ఎట్టకేలకు గత ఏడాదిసెపె్టంబర్లో చందన్ కుమార్‌ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలీలో పట్టుకుంది. అప్పట్లో అమన్, అలోక్‌లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వేట ము మ్మరం చేయగా... ఇరువురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై బీహార్‌లోనూ ఈ ద్వయం పలు నేరాలు చేసినట్లు తేలింది. చివరకు గత నెల 16న బీదర్‌లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటేష్‌ను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. రివార్డు ప్రకటించిన కర్ణాటక పోలీసులుఅఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌పై కాల్పులు జరపడం, పారిపోవడం జరిగిపోయాయి. ఈ హత్యాయత్నం ఘటనపై అఫ్జల్‌గంజ్ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చెన్నై వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. దీంతో వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల్లో దుండగుల ఫొటోలను జత చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు కలబురిగి డీఐజీ (9480800030) లేదా బీదర్ ఎస్పీ (9480803401) లేదా బీదర్ డీఎస్పీలకు (9480803420) సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచారం ఇచి్చన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
ఏటీఎంలోకి పాము, వీడియో వైరల్
సాక్షి, కోయంబత్తూరు : కేరళలో వీవీ ప్యాట్‌లో పాము ప్రత్యక్షం అయిన ఘటన మరవకముందే ....తాజాగా ఏటీఎం మిషన్‌లోకి పాము దూరిన సంఘటన కలకలం రేపింది. తమిళనాడు కోయంబత్తూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. థనీర్ర్పండల్ రోడ్‌లోని ఏడీబీఐ బ్యాంక్ ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఓ కస్టమర్...పాము ఉండటాన్ని గమనించి...వెంటన అలారాన్ని మోగించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకు వెళ్లగా...పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. హుక్ హ్యాండిల్‌కు చుట్టుకున్న నాలుగు అడుగుల కోబ్రాను ఎట్టకేలకు పాములు పట్టే వ్యక్తి పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మూడో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేరళలోని కన్నౌర్ నియోజకవర్గంలోని మయ్యిల్ కందక్కైలో పోలింగ్ బూత్‌లోని ఓ వీవీ ప్యాట్‌లో పాము దర్శనమివ్వడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. చివరకు పామును బయటకు రప్పించిన అధికారులు ...పోలింగ్‌ను కొనసాగించారు. -
డబ్బులు లేని ఏటీఎంకు పూజలు
హైదరాబాద్: ఏటీఎం లలో డబ్బులు రాకపోవడంతో పని చేయని ఏటీఎం లకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని కొత్తపేటలో మంగళవారం ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్ద ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వినూత్నప్రదర్శన నిర్వహించారు. ఏటీఎంలలో డబ్బులు రాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, వెంటనే కేంద్రానికి కనువిప్పు కలగాలని కోరుతూ పూజారులతో ఏటీఎంలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి పూజలు చేశారు. -
ఏటీఎం ద్వారా ‘పోస్ట్’ చేద్దాం
సాక్షి, హైదరాబాద్: సహజంగా ఎవరికైనా ఉత్తరం పంపాలంటే మీరు ఎక్కడికెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాం పోస్టాఫీసుకే కదా అని ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఇకపై పోస్టు పంపాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంకు వెళ్తే చాలు. ఏటీఏం ఏంటీ.. ఉత్తరం ఏంటీ.. అనుకుంటున్నారా! అవును.. ఇదంతా త్వరలోనే నిజం కానుంది. ఎస్బీఐ తమ ఏటీఎం మెషీన్ల ద్వారా ఉత్తరాలు బట్వాడా చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకోడానికి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే తొలుత స్పీడ్ పోస్టు సౌకర్యం మాత్రమే కల్పించనున్నారు. ఈ కొత్త ఆలోచన ఎలా పనిచేస్తుందో మీరే చదవండి.. వినియోగదారులు ఉత్తరాలు పంపేందుకు వీలుగా ఏటీఎంల సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేస్తారు. ఏటీఎం కార్డు పెట్టగానే తెరపై స్పీడ్‌పోస్టు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏటీఎం మిషన్ పక్కన బరువు తూచే చిన్న యంత్రం కూడా ఉంటుంది. ఏటీఎంలో స్పీడ్ పోస్టు ఆప్షన్ క్లిక్ చేశాక పక్కనున్న తూకంపై మీ కవర్ పెట్టగానే పోస్టుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుపుతుంది. ఆ మొత్తాన్ని ఏటీఎం ద్వారా చెల్లించిన తర్వాత మిషన్ నుంచి వచ్చే రషీదును కవర్‌కు అతికించి పక్కనే ఏర్పాటు చేసిన క్లియరెన్స్ బాక్సులో వేయాలి. తపాలా శాఖ సిబ్బంది వచ్చి పోస్టు చేయాల్సిన కవర్లను సేకరిస్తారు. ఏటీఎం ద్వారా పంపిన స్పీడ్ పోస్టుల వివరాలు ఎప్పటిప్పుడు ఎస్బీఐ, తపాలా శాఖకు ఆన్లైన్ ద్వారా చేరతాయి. ఆ వివరాలను బట్టి పోస్టల్ సిబ్బంది వచ్చి ఎప్పటికప్పుడు ఏటీఎంలకు వెళ్లి వాటిని సేకరిస్తారు. వినియోగదారులు చెల్లించే స్పీడ్ పోస్టు చార్జీల్లో కొంత మొత్తం కమిషన్ రూపంలో ఎస్బీఐకి చేరుతుంది. తపాలా శాఖ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ సుధాకర్ ఈ కొత్త ఆలోచన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
ఏటీఎమ్‌లే ఇక కంప్లైంట్ స్టేషన్లు!
-
ఏటీఎంలను టార్గెట్ చేస్తున్న దొంగలు