attack on RTC driver
-
టీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. కొత్తకోణం
సాక్షి, విజయవాడ: నగరంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన నలుగురు యువకులపై ఇప్పటికే పలు పాత కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌పై దాడి చేసిన నిందితులైన సాజిద్, దుర్గా రాజేశ్‌పై దోపిడీ కేసులు ఉన్నాయి. అదేవిధంగా మరో ఇద్దరు నిందితులపై దొంగతనం కేసులు ఉండగా.. రాజేష్‌పై పేకాట కేసులు కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి.. రూ. 25వేలతో పరారైనట్టు పోలీసులు తేల్చారు. ఈ మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత శనివారం అర్ధరాత్రి విజయవాడ భవానీపురంలో అల్లరిమూకలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ బైక్‌లకు దారి ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై కొందరు దాడికి పాల్పడ్డారు. బైకులపై బస్సును వెంబడించిన 50 మందికి పైగా యువకులు గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్‌ను చితకబాదడంతో పాటు, కండక్టర్ వద్ద నుంచి 25 వేల రూపాయలు లాకెళ్లారు. ఈ చర్యతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బస్సు డ్రైవర్‌పై దాడి ఘటనలో మరో కోణం!
సాక్షి, విజయవాడ : గొల్లపుడి సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి ఘటనలో మరో కోణం వెలుగు చూసింది. బస్సు డ్రైవర్ ర్యాష్‌గా డ్రైవ్ చేసినట్టు అతనిపై దాడికి పాల్పడిన యువకులు ఆరోపిస్తున్నారు. బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ముగ్గురు యువకులు గాయపడినట్టు వారు చెబుతున్నారు. మరోవైపు సైడ్ ఇవ్వకపోవడంతో విద్యార్థులే తమపై దాడి చేసారని బస్సు డ్రైవర్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువకులతోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి పడి గాయపడ్డ మహేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘బస్సు ముందు రెండు బైక్‌లు అటు ఇటుగా వెళ్తుండటంతో అసహనానికి లోనైన బస్సు డైవర్ చిన్నపాటి ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో మా బైక్‌పై వెళ్తున్న ముగ్గురం కిందపడిపోవడంతో మాకు గాయాలయ్యాయి. అయితే అంతకు ముందు బైక్‌లపై వెళ్లినవారితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము గాయపడ్డ విషయాన్ని పట్టించుకోని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చారు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడికి దిగార’ని తెలిపారు. యువకులు, ఆర్టీసీ డ్రైవర్ ఇరువర్గాలపై కేసు నమోదు చదవండి : విజయవాడలో రెచ్చిపోయిన పోకిరీలు -
విజయవాడలో రెచ్చిపోయిన పోకిరీలు
సాక్షి, విజయవాడ : నగరంలోని భవానీపురంలో అర్దరాత్రి అల్లరిమూకలు బీభత్సం సృష్టించాయి. తమ బైక్‌లకు దారి ఇవ్వలేదని ఆర్టీసీ బస్సుపై పోకిరీలు దాడికి పాల్పడ్డారు. బైకులపై బస్సును వెంబడించిన 50 మందికి పైగా యువకులు గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్‌ను చితకబాదడంతో పాటు, కండక్టర్ వద్ద నుంచి 25 వేల రూపాయలు లాకెళ్లారు. ఈ చర్యతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. బస్సులోని ప్రమాణికులు తీసిన వీడియోల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోకిరీల దాడిలో గాయపడ్డ డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సర్పంచ్ కు ప్రయాణికుల దేహశుద్ధి
నిజామాబాద్: తనకు దారి ఇవ్వలేదన్న కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన సర్పంచ్ కు బస్సులోని ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతి రెడ్డికి ఆర్మూర్ లో ఆర్టీసీ డ్రైవర్ ఆయనకు దారి ఇవ్వలేదు. అయితే ఆవేశానికి లోనైన తిరుపతి రెడ్డి సైడ్ ఇవ్వలేదంటూ బస్సును నిలిపివేయించాడు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్ పై చేయిచేసుకున్నాడు. ప్రయాణికులు వెంటనే స్పందించి సర్పంచ్ కు దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.