
సాక్షి, విజయవాడ : గొల్లపుడి సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి ఘటనలో మరో కోణం వెలుగు చూసింది. బస్సు డ్రైవర్ ర్యాష్‌గా డ్రైవ్ చేసినట్టు అతనిపై దాడికి పాల్పడిన యువకులు ఆరోపిస్తున్నారు. బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ముగ్గురు యువకులు గాయపడినట్టు వారు చెబుతున్నారు. మరోవైపు సైడ్ ఇవ్వకపోవడంతో విద్యార్థులే తమపై దాడి చేసారని బస్సు డ్రైవర్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువకులతోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనలో బైక్‌పై నుంచి పడి గాయపడ్డ మహేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘బస్సు ముందు రెండు బైక్‌లు అటు ఇటుగా వెళ్తుండటంతో అసహనానికి లోనైన బస్సు డైవర్ చిన్నపాటి ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో మా బైక్‌పై వెళ్తున్న ముగ్గురం కిందపడిపోవడంతో మాకు గాయాలయ్యాయి. అయితే అంతకు ముందు బైక్‌లపై వెళ్లినవారితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము గాయపడ్డ విషయాన్ని పట్టించుకోని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చారు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడికి దిగార’ని తెలిపారు.
యువకులు, ఆర్టీసీ డ్రైవర్ ఇరువర్గాలపై కేసు నమోదు
చదవండి : విజయవాడలో రెచ్చిపోయిన పోకిరీలు
Comments
Please login to add a commentAdd a comment