Aurangazeb
-
ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ!
మహారాష్ట్ర: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగజేబు సమాధిని సందర్శించడాన్ని తప్పుబట్టారు. దీన్ని సమర్ధించినందుకు శివసేన(UBT) అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన సందర్బంగా ఔరంగజేబు చాలా కాలం దేశాన్ని పరిపాలించారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. హిట్లర్ కూడా జర్మనీ దేశాన్ని చాలాకాలం పాలించాడు. అంతమాత్రాన అక్కడివారికి హిట్లర్ దేవుడు అవుతాడా? ఈ సందర్బంగా అంబేద్కర్ చర్యను మీరెలా సమర్ధిస్తారని ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. మీరిద్దరూ పొత్తు పెట్టుకున్న కారణంగానే అసలేం మాట్లాడటం లేదా? అనడిగారు. అసలు పరాయి దేశం నుంచి వచ్చిన ఔరంగజేబు మన నాయకుడెలా అవుతాడు? ఛత్రపతి శివాజీ ఒక్కడే మన నాయకుడని ఆయన అన్నారు. మన దేశంలో ఉన్న ముస్లింలు ఔరంగజేబు వారసులు కారని.. వారసలు ఆ మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా అంగీకరించరని అన్నారు. వారు సైతం ఛత్రపతి శివాజీనే తమ నాయకుడిగా చెప్పుకుంటారన్నారు. ఒకప్పుడు బాల్ థాక్రే కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలతో చెట్లు కలపాల్సిన పరిస్థితి వస్తే తాను పార్టీని శాశ్వతంగా మూసివేస్తానన్న మాటను గుర్తుచేసి మీ తీరు మాత్రం భిన్నంగానూ మీ నాన్న గారికి వ్యతిరేకంగానూ ఉందన్నారు. ఇక బీహార్‌లో ఈ నెలలో జరగనున్న విపక్ష ఐక్య కూటమి సమావేశం గురించి ప్రస్తావించగా పనికిరాని వంద పాదులు ఏకమైనా ఒక మర్రిచెట్టుకు సమానం కావన్నారు. గతంలో మోదీ వ్యతిరేకంగా ఇంతకంటే పెద్ద కూటమే వచ్చింది. అప్పుడే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
గాడ్సే భరతమాత ముద్దుబిడ్డ.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కొల్హాపూర్ అల్లర్ల తర్వాత అక్కడ పరిస్థితి సద్దుమణిగేలా ఉన్నా కానీ రాజకీయ నేతలు మాత్రం ఆ చిచ్చును ఆరనీయడం లేదు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన "గాడ్సే వారసులు" వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో గాంధీని చంపిన నాథూరాం గాడ్సే భరతమాత ముద్దుబిడ్డే అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. టిప్పు సుల్తాన్, ఔరంగజేబులకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల నేపథ్యంలో కొల్హాపూర్ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనతో ఉంటే అవేమీ పట్టని రాజకీయ నాయకులు మాత్రం పరస్పర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి తెరతీశారు. కొల్హాపూర్ అల్లర్ల తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ "ఔరంగజేబు వారసులు" అంటూ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఔరంగజేబు వారసుల గురించి అంతా తెలిసిన మీకు గాడ్సే, ఆప్టేల వారసులు గురించి కూడా తెలిసి ఉండాలని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ నాథూరాం గాడ్సేను భరతమాత ముద్దుబిడ్డగా వర్ణించారు. మంత్రి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గాడ్సే గాంధీ హంతకుడయితే గాడ్సే కూడా భరతమాత ముద్దుబిడ్డే కదా. ఆయన భారత దేశంలోనే పుట్టాడు. బాబర్, ఔరంగజేబుల మాదిరిగా పరాయి దేశం నుండి వచ్చినవాడు కాదు. బాబర్ వారసులుగా పిలవబడటానికి ఇష్టపడేవారు ఎప్పటికీ భరతమాత బిడ్డలు కాలేరని అన్నారు. #WATCH | Chhattisgarh: If Godse is Gandhi's killer, he is also the nation's son. He was born in India, and he was not an invader like Aurangzeb & Babar. Whosoever feels happy to be called the son of Babar, that person can't be the son of Bharat Mata: Union Minister Giriraj Singh pic.twitter.com/7GIS3z7noM — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2023 ఇది కూడా చదవండి: రాసి పెట్టుకోండి.. బీజేపీ ఓడిపోతుంది.. -
వారి బాధను పంచుకుందామనే వచ్చా
శ్రీనగర్ : దేశ రక్షణలో ప్రాణాలొదిలిన ఆర్మీ జవాన్లను జాతి ఎన్నటికీ మరచిపోదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇండియన్ ఆర్మీ 44వ రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్న ఔరంగజేబును అపహరించిన హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్రవాదులు గురువారం అతన్ని కాల్చి చంపిన విషయం తెలిసిందే. పూంచ్ జిల్లాలోని శాలినీ గ్రామంలో ఔరంగాజేబు కుంటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. ‘చెట్టంత ఎదిగిన కొడుకును కోల్పోయిన కుటుంబం బాధను పంచుకుందామని వచ్చాను. సైనికుల సేవలను యావత్ భారత జాతి సదా స్మరించుకుంటుంది. ఔరంగజేబు పేరు శాశ్వతంగా నిలిచిఉంటుంద’ని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. బాధిత కుటుంబానికి కేంద్రం సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. నిర్మలా సీతారామన్ వెంట ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, శరన్‌జీత్ సింగ్, కల్నల్ ఎన్ఎన్ జోషి ఉన్నారు. ఔరంగజేబు కుటుంబానికి ఆర్మీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రావత్ అన్నారు. దేశంలో ఉగ్రమూకల ఆగడాలకు నూకలు దగ్గర పడ్డాయని అన్నారు. రంజాన్ పండుగ జరుపుకుందామని డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరిన ఔరంగజేబును గురువారం కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు కాల్చి చంపారు. గతంలో ఆర్మీ జరిపిన ఎన్కౌంటర్లకు సంబంధించిన వివరాలు తెలపాలనీ, చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన వీడియో వైరల్‌గా మారింది. కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సవిూర్ టైగర్‌ను మట్టుబెట్టడంలో ఔరంగజేబు కీలక పాత్రపోషించారు. -
మా బతుకులు దేశం కోసమే, కానీ...
శ్రీనగర్: ఓవైపు దేశం మొత్తం రంజాన్ సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఫూంచ్(జమ్ము కశ్మీర్)లో మహ్మద్ హనీఫ్ కుటుంబం మాత్రం శోకసంద్రంలో కూరుకుపోయింది. కన్నకొడుకు ఔరంగజేబ్ ఉగ్రవాదుల చేతిలో దారుణంగా హత్యకు గురికావటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్టెడు దుఖంలోనూ.. ఉగ్రచర్యలను ఉపేక్షిస్తూ కూర్చోవటం సరికాదని ఆయన భారత సైన్యానికి సూచిస్తున్నారు. ‘కశ్మీర్లో కొందరు పాక్ జెండాలు ఎందుకు అవనతం చేస్తున్నారు? భారత జెండాలు ఎందుకు కనిపించటం లేదు?.. పరిస్థితులు ఎందుకింత దారుణంగా తయారయ్యాయి. నా కొడుకు దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. ఇప్పుడు నేను, నా మిగతా కొడుకులం కూడా ఈ గడ్డ తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఓ ఆర్మీ అధికారి వద్ద హనీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘విధి నిర్వహణలో ప్రాణాలైన అర్పిస్తానని ప్రతీ జవాన్ ప్రమాణం చేస్తారు. నా కొడుకు ఆ ప్రామిస్‌ను నిలుపుకున్నాడు. ప్రాణ త్యాగంతో విగత జీవిగా నా వద్దకు చేరాడు. సైన్యం అంటేనే దేశం కోసం ప్రాణాలివ్వటం. ఏదో రోజూ ప్రాణాలు పోతాయన్నది నాకూ తెలుసు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడిచారు. కానీ, ఇది చూసి మిగతా వాళ్లు.. వాళ్ల వాళ్ల పిల్లలను పంపటం ఆపేస్తే ఏంటి గతి? సైనికులుగా ఎవరు మారతారు? దేశం తరపున ఎవరు పోరాడతారు? దుందుడుకు నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అవసరమైతే మళ్లీ పోరాటంలోకి నేను దిగుతా. నా కుటుంబం, మా బతుకులు దేశానికే అంకితం చేస్తాం. కానీ, మన ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మిలిటెంట్లను ఏరిపడేయాలి. జై హింద్’ అని హనీఫ్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. ఆర్మీ మాజీ ఉద్యోగి అయిన హనీఫ్ నాలుగో తనయుడు ఔరంగజేబ్. సోఫియాన్‌లోని షాదిమార్గ్ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ 44 దళంలో రైఫిల్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్ సెలవుపై ఇంటికి వెళ్తున్న సమయంలో గురువారం ఉగ్రవాదులు అపహరించి మరీ కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం ఉదయం బుల్లెట్లతో చిధ్రమైన అతని మృతదేహాన్ని సైన్యం స్వాధీనపరుచుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శనివారం ఔరంగజేబ్ అంత్యక్రియలు నిర్వహించగా.. వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ వీర జవాన్‌కు నివాళులర్పించారు. ఇంకా 32 గంటలే... కాగా, తన కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హనీఫ్.. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి 72 గంటల డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. ‘నా కొడుకు మరణంపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నా. ఈ గడ్డపై పుట్టిన బిడ్డను చంపి 40గంటలు దాటింది. మరో 32 గంటలే మిగిలి ఉంది. ఆలోగా వాళ్లను చంపకపోతే.. ప్రతీకార చర్యకు మేమే రంగంలోకి దిగుతాం’... అని ఔరంగజేబ్ తండ్రి హనీఫ్ తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ నేతలపైనా, వేర్పాటువాదులపైనా ఆయన మండిపడ్డారు. ఔరంగజేబ్ ఫోటో, వీడియోలు.. గురువారం ఉదయం ఔరంగజేబ్‌ను అపహరించాక ఉగ్రవాదులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
అనగనగా మక్కా
మక్కా మసీద్.. భాగ్యనగర చరిత్రలో ఓ కలికితురాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మసీదుల్లో ఒకటి. ఈ మహా కట్టడం మరో ఘనతను సాధించింది. దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసి 400 ఏళ్లవుతోంది. 1617 డిసెంబర్లో పునాది రాయి పడి.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 77 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి నిర్మాణం రూపుదిద్దుకుంది. ముగ్గురు కుతుబ్‌షాహీ పాలకుల హయాంలోనూ పూర్తికాని ఈ నిర్మాణం.. రాజ్యంపై దండెత్తి ధ్వంసానికి పాల్పడిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పూర్తి చేయడం విశేషం. షాద్‌నగర్‌లోని ఓ కొండ రాళ్లను ఈ నిర్మాణంలో వినియోగించారు. మరికొన్నింటిని మక్కా నుంచి తెప్పించారు. అందుకే ‘మక్కా మసీద్’గా ప్రాచుర్యం పొందింది. ఈ మహాసౌధంపై ఆసక్తికర అంశాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 1591లో మహ్మద్ కులీకుతుబ్ షా చార్మినార్ నిర్మించి హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాడు. చార్మినార్‌కు సమీపంలో 1597లో జామియా మసీద్ నిర్మించాడు. నగరంలో తొలిæ మసీద్ ఇదే. క్రమేణా జనాభా పెరగడంతో ప్రార్థనలకు మసీద్ సరిపోలేదు. విషయం తెలుసుకున్న కులీకుతుబ్ షా మరో మసీద్ నిర్మించాలని 1610లో ఆదేశించారు. అయితే నివేదిక ఇచ్చేలోపే 1612లో ఆయన మృతిచెందాడు. అనంతరం ఆయన అల్లుడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా సంస్థాన బాధ్యతలు తీసుకున్నాడు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అతిపెద్ద మసీద్ నిర్మించాలని తాను సహా మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరితో కమిటీ ఏర్పాటు చేశాడు. 1617లో శంకుస్థాపన.. సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా 1617 డిసెంబర్లో మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణం భిన్నంగా ఉంటుంది. దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల్లో దాదాపు మట్టిని వినియోగించారు. కానీ మక్కా మసీద్ నిర్మాణంలో మట్టిని వాడలేదు. నగర సమీపంలోని కొండల రాళ్లను పరీక్షించి, షాద్‌నగర్ కొండ రాళ్లను వినియోగించాలని నిర్ణయించారు. వీటి రంగు కాస్త ఎరుపుగా, పటిష్టంగా ఉన్నాయని వాడారు. నిర్మాణం మొత్తం ఒకే కొండ రాళ్లతో చేయాలని ఆవే రాళ్లను వినియోగించారు. అందుకే మసీద్ రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది. మొఘల్‌ల దాడులతో జాప్యం... సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా హయాంలో నిర్మాణం పూర్తి కాలేదు. కుతుబ్ షా తర్వాత 1626లో ఆయన కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా చిన్న వయసులోనే సంస్థాన బాధ్యతలు చేపట్టాడు. ఈయన కాలంలో మొగల్ పాలకుల దాడులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ మసీద్ నిర్మాణ పనులు జరిగాయని చరిత్రకారులు పేర్కొన్నారు. అబ్దుల్లా మరణానంతరం 1672లో అబుల్ హసన్ తానేషా హయాంలో నిర్మాణ పనులు ఎక్కువగా జరగలేదు. 1689లో కుతుబ్ షాహీల సంస్థానం మొఘల్‌ల వశమైంది. మొఘల్లహయాంలో పూర్తి.. దేశంలోనే అతిపెద్ద మినార్లు మక్కా మసీద్‌కు నిర్మించాలని తొలుత ప్లాన్ చేశారు. కానీ మినార్ల నిర్మాణం చేపట్టలేదు. 1694లో ఔరంగజేబు మిగిలిన పనులు చేయించి, నమాజ్‌లకు అనుమతించాడు. ఇలా మక్కా మసీద్ నిర్మాణానికి 77ఏళ్లు పట్టింది. కుతుబ్‌షాహీ ముగ్గురు పాలకుల హయాంలోనూ ఈ మహాసౌధం నిర్మాణం పూర్తి కాలేదు. ఆ పేరెలా వచ్చింది? మక్కా మసీద్‌కు బైతుల్ అతీక్ అనే పేరు పెట్టాలని మొదట నిర్ణయించారు. అయితే సౌదీ అరేబియాలోని మక్కా నగరం నుంచి రాళ్లను తీసుకొచ్చి నిర్మాణంలో వినియోగించారు. అందుకే మక్కా మసీద్ అనే పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఆసఫ్జాహీ ప్రథమ పాలకుడు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ మృతదేహాన్ని మసీద్ దక్షిణ భాగంలో ఖననం చేశారు. ఇదే పరంపరలో ఆసఫ్జాహీ ఆరో పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ వరకు అక్కడే ఖననం చేశారు. రాళ్లెత్తిన కూలీలెవరు? మసీద్ నిర్మాణానికి కొండను పగలగొట్టి పెద్ద పెద్ద రాళ్లను ఏనుగులకు కట్టి తీసుకొచ్చారు. చిన్న రాళ్లను ఎడ్లబండ్లపై తెచ్చారు. దేశవిదేశాల్లోని శిల్పకారులను పిలిపించారు. దాదాపు 8వేల మంది కూలీలు (మూడు తరాల మనుషులు) మసీద్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతమున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని కూలీలు మసీద్ నిర్మాణానికి రాళ్లు మోశారు. -
ఔరంగజేబు కంటే కేసీఆర్ పెద్ద నియంత: టీపీసీసీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగజేబు కంటే పెద్ద నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్కు అధికారం కాం గ్రెస్ వేసిన భిక్షేనని.. కాంగ్రెస్ తెలంగాణ కోసం చేసిన త్యాగం వల్లే ఈ రోజు వారు పదవులు అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో దయాకర్ మీడియాతో మాట్లాడారు. ‘‘తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు కూడా తన రాజ్యానికి చెందిన ప్రజలను ప్రేమించాడు.. గౌరవిం చాడు. కానీ కేసీఆర్‌కు ప్రజలంటే కూడా లెక్కలేదు. ఒకే రోజు సమగ్ర సర్వే పేరుతో నియంతలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల జాతీయత, ప్రాంతీయత ఒక్కరోజులో తేల్చేస్తారా? ఆరోజు లేకుంటే మేం లెక్కలో లేనట్లేనా? ఇది ఫాసిస్టు విధానం కాదా? కనీసం 2, 3 రోజుల సమయం కూడా ఇవ్వరా? తెలంగాణ ఇంతకుముందు ఈ దేశంలో లేదా? లేక కొత్త దేశంగా ఆవిర్భవించిందా? తెలంగాణలో ఇంతకుముందు విధానాలు, నిబంధనలేమీ లేన ట్లుగా మాట్లాడుతున్నారు’’ అని పేర్కొన్నారు. రాష్ట్రానికి చేరిన సద్భావనాయాత్ర తీవ్రవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ నెల 9న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ప్రారంభమైన రాజీవ్‌గాంధీ జ్యోతి సద్భావనా యాత్ర గురువారం రాష్ట్రానికి చేరుకుంది. యాత్రలో భాగంగా గాంధీభవన్‌కు చేరుకున్న సుమారు 200 మంది నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు షబ్బీర్‌అలీ, తదితరులు ఘన స్వాగతం పలికారు. గాంధీభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ చిత్రపటం ముందు సద్భావనా జ్యోతిని ఉంచి నివాళులు అర్పించారు. తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర ఏపీ, కర్ణాటక, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా మీదుగా రాజీవ్ జయంతి రోజైన ఈ నెల 20న ఢిల్లీకి చేరుకుంటుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ జ్యోతిని అందుకుని న్యూఢిల్లీలోని వీర్‌భూమి వద్ద నివాళులు అర్పిస్తారు.