Authorities fail
-
విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్
KK Demise: KK Sweating Badly At Concert Video Goes Viral: ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మృతిపై పోలీసులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత ఆయన గుండెపోటుతో కన్నుమూశారనే ప్రకటన మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అయితే.. కేకే చివరిసారిగా ప్రదర్శన ఇచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. కోల్‌కతా నజ్రుల్ మంచాలోని గురుదాస్ కాలేజ్ వద్ద జరిగిన కాన్సెర్ట్‌లో పాల్గొన్నారు కేకే. అయితే ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బందికి లోనయ్యారు. వేదిక క్లోజ్డ్ హాల్. ఫ్యాన్, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో విపరీతమైన చెమటలు పోసి ఇబ్బందిపడ్డారు. ఒకానొక టైంలో భరించలేక కిందకు దిగి నిర్వాహకులకు స్వయంగా ఆయనే ఇబ్బందిపై ఫిర్యాదు కూడా చేశారు. అయినా నిర్వాహకులు సరిగా స్పందించలేదు. దీంతో ఇబ్బంది పడుతూనే ఆయన గంటపాటు ప్రదర్శన పూర్తి చేశారు. ఆ తర్వాత హోటల్ ఒబెరాయ్ గ్రాండ్‌కు చేరుకుని ఛాతీలో భారంగా ఉందని తన సిబ్బందికి తెలిపారాయన. అలా చెబుతూనే కుప్పకూలిన ఆయన్ని.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండె పోటుతోనే మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అసహజ మరణం కిందే కేసు నమోదు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని సీఎంఆర్ఐ ఆస్పత్రిలో ఉంచారు. శవ పరీక్ష పూర్తి అయితేనే ఆయన మృతికి గల అసలు కారణం తెలిసేది. చదవండి: ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ ఇదిలా ఉంటే కేకే చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన కేకే అభిమానులు ఆయన మరణానికి నిర్వహకుల నిర్లక్ష్యమే కారణంగా ఎత్తిచూపుతున్నారు. 'అక్కడ ఏసీ లేదు. వేడి, డీహైడ్రేషన్ వల్లే స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయి' అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. 'ఆ కాన్సెర్ట్‌లో పాల్గొనకపోతే కేకే బతికి ఉండేవాడు. కేవలం ఆయన తన అభిమానుల కోసమే ప్రదర్శన ఇచ్చారు. నిర్వాహణ లోపం కారణంగా మనం ఒక రత్నాన్ని కోల్పోయాం' అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. AC wasn't working at Nazrul Mancha. he performed their and complained abt it bcoz he was sweating so badly..it wasnt an open auditorium. watch it closely u can see the way he was sweating, closed auditorium, over crowded, Legend had to go due to authority's negligence. Not KK pic.twitter.com/EgwLD7f2hW — WE जय (@Omnipresent090) May 31, 2022 -
వదల బొమ్మాళీ!
సాక్షి, మధురవాడ(విశాఖపట్టణం) : అక్రమార్కులు తీరులో మార్పు రావడం లేదు. భూ దందాలకు అలవాటు పడిపోయిన వీరు ఎంతటి పనికైనా వెనుకాడడం లేదు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఏవిధంగానైనా చేజిక్కించుకోవాలని అర్రులు చాస్తున్నారు. దీనికి జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ అప్ బ్రిడ్జి సమీపంలోని కృష్ణానగర్ రోడ్డును అనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాండే నిదర్శనం. దీని సమీపంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమినే తప్పుడు పద్ధతుల్లో అమ్మేశారు. తాజాగా దానిని ఆనుకుని మరికొంత భూమిలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తీసేసి కూడా ఆక్రమణకు సిద్ధమవుతున్నారు. సాక్షిలో ప్రచురితమైన కథనం ఇదీ పరిస్థితి : సర్వే నెంబరు. 168–164 మధ్య ఉన్న రోడ్డు, గెడ్డకు చెందిన కోటి రూపాయలు విలువ చేసే సుమారు 300 గజాల స్థలంలో 2016లో ఓ వ్యక్తి ఫెన్సింగ్, ప్రహరీ కట్టి ఆక్రమణకు ప్రయత్నం చేశాడు. దీనిపై 2016 జూన్ 25న అరకోటి స్థలం కబ్జా అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చేసి ఇక్కడ రెండు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా అధికారులు వేసిన ఫెన్సింగ్ తొలగించి ఆక్రమణకు ప్రయత్నం చేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు దీనిని రెండో సారి కూడా రెవెన్యూ అధికారులు కూల్చేశారు. అయితే రెండు రోజుల కిందట ఇక్కడ ఏర్పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా పీకేసి పక్కన పడేశారు. చర్యలు లేక పోవడం వల్లే బరితెగింపు ఇక్కడ 2016లో ఆక్రమణకు ప్రయత్నం చేసినప్పుడు ఆక్రమణ తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. తాజా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా కూడా ఫెన్సింగ్ తొలగించారు తప్పా చర్యలు చేపట్టలేదు. దీంతో ఇప్పుడు హెచ్చరిక బోర్డునే పీకేశారు. కనీసం ఉన్నత స్థాయి అధికారులు అయినా స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.దీనిపై మధురవాడ వీఆర్వో కె. అప్పారావు విరవణ కోరగా ఇది ప్రభుత్వ స్థలమేనని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూలగొట్టామని హెచ్చరిక బోర్డు పీకి పడేసిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని చెప్పారు. -
ఇసుకాసురులు
సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కోనసాగుతోంది. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా, వాహనాలు స్వాధీనం చేసుకున్నా, ఇసుక నిల్వలు సీజ్ చేసినా, రీచ్‌ల చుట్టూ కందకాలు తవ్వించినా తదితర చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా మాత్రం సాగుతోంది. ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు, ముద్డాడపేట, పాతపొన్నాడ ప్రాంతాల్లో నాగావళి నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. తమ్మినాయుడుపేట, పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట, పాతపొన్నాడ తదిలర రీచ్‌లపై 24 గంటలు పర్యవేక్షణ సైతం ఉంది. అయినా ఇసుక రావాణా అగడం లేదు. ట్రాక్టర్లు ద్వారా ఇసుక తరలించి జాతీయ రహదారికి అనుకొని, చిలకపాలెం, అల్లినగరం, ఎస్.ఎస్.ఆర్.పురం, కుశాలపురం, నవభారత్ జంక్షన్, కింతలిమిల్లు వంటి ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా నిల్వచేస్తున్నారు. అనంతరం రాత్రిళ్లు లారీల్లో తగరపువలస, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. అనుకూల పరిస్థితులు చూసుకొని అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిఘా బృందాలు కొన్నిసార్లు దాడులు చేస్తున్నారు. విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్, మైన్స్ తదితర ప్రభుత్వ శాఖలు ఇసుక నిల్వలు, వాహనాలు సీజ్, అక్రమ రవాణా, జాతీయ రహదారిపై నిఘా వంటివి కొనసాగు తున్నాయి. అయినా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా సాగిస్తుండడం గమనార్హం. కొన్నిసార్లు నిఘా బృందాలు సైతం మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. లావేరు మండలం బుడుమూరు ఊటగెడ్డ నుంచి సైతం ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇది ఆలా ఉండగా రణస్థలం మండలంలోని కొచ్చర్ల, దోణుపేట, కొవ్వాడ, ఎచ్చెర్ల మండలం కుప్పిలి, బుడగుట్లపాలెం తదితర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకతో కలిపి కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఆయా ఇసుకను విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులపై కఠిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ ఉంటేనే నియంత్రణ సాధ్యమని పలువురు చెబుతున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుక పోగులు వేసి, నది ఇసుక కల్తీ చేయడం సైతం చోటు చేసుకుంటుంది. ఇలా ఇసుక పోగులు కొన్ని ప్రాంతాల్లో నిల్వ చేసి అక్రమంగా రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ నిర్మూలనపై ప్రభుత్వం ప్రస్తుతం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు. ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఇసుక అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతోంది. రీచ్‌లను నిరంతరం పరిశీలిస్తున్నాం. చిలకపాలెంలో తనిఖీ కేంద్రం సైతం ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతోంది. జాతీయ రహదారిపై పట్టుబడ్డ ఇసుక వాహనాలను సీజ్ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు చేస్తాం. ఇసుక అక్రమ రవాణే పూర్తి నియంత్రణే లక్ష్యం. –ఎంవీ రమణ, ఆర్డీవో, శ్రీకాకుళం -
‘రియల్’ మాయ
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి) : మండల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. అయినా సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదో తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి మమ అనిపిస్తున్నారు. వీటిని అదుపు చేయడానికి పటిష్ట ప్రణాళిక చేపట్టకపోవడంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా అక్రమ వెంచర్లను కట్టడి చేయడానికి హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో మినహా మిగతా వాటిల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇటీవల ఆదేశాలు సైతం జారీ చేసింది. ఆ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో మళ్లీ యధావిధిగా అక్రమ వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూ మూడు ప్లాట్లు, ఆరు వెంచర్లుగా లాభాలు ఆర్జిస్తున్నారు. జోన్లతో సమస్య.... కందుకూరు మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటంతో పాటు అధిక ప్రాంతాలు కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి. దీంతో హెచ్ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతి సాధ్యం కాదు. దీంతో పాత తేదీల్లో అనుమతులు తీసుకుని జీపీ లేఅవుట్లకు తెరలేపారు. రహదారులు, డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా, పార్కు స్థలం వంటివి వదలకుండానే ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వం హెచ్ఎండీఏ, డీటీసీపీ మినహా మిగతా లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీచేసినా రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా గతంలో 2015 ఆగస్టు నెల వరకు కటాఫ్ తేదీ నిర్ణయించి ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. ఆ తేదీ ముందు రిజిస్ట్రేషన్లు అయి ఉన్న ప్లాట్లను కొనుగోలు చేస్తే ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత చేసిన వెంచర్లలో కొనుగోలు చేస్తే అక్రమంగానే నిర్ధారిస్తారు అధికారులు. ఫాంల్యాండ్ పేరుతో.... కాగా లేఅవుట్లు చేస్తే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడం, కూల్చివేతలు చేపట్టడంతో ఫాం ల్యాండ్ పేరుతో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంల్యాండ్ లేఅవుట్‌కు ఎవరి నుంచి అనుమతి అవసరం లేకపోవడంతో చాలా గ్రామాల పరిధిలో ప్రస్తుతం ఇవే తరహా లేఅవుట్లు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు రియల్ వ్యాపారులు. ఫాంల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేసినా రహదారులు వంటి వాటిని అభివృద్ధి చేయకూడదు. కాని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి అందంగా తీర్చిదిద్ది ఫాంల్యాండ్ వెంచర్లలో గుంటలుగా విభజించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. తూతూ మంత్రంగా కూల్చివేతలు... కాగా హెచ్ఎండీఏ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి కూల్చివేతలు చేసి మమ అనిపిస్తున్నారు. పటిష్టంగా మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, హెచ్ఎండీఏ శాఖలు సమన్వయంతో అక్రమ లేఅవుట్లను నివారించాలని పలువురు కోరుతున్నారు. -
కోనసీమలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్ష
అట్రాసిటీ చట్టాల అమలులో అధికారులు విఫలం ఆర్డీవో, డీఎస్పీలపై కమిషన్ చైర్మన్ శివాజీ ఆగ్రహం అమలాపురం : ‘ఒక ఎస్సీ ఎంపీ.. ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న కోనసీమలో ఎస్సీ, ఎస్టీ చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం బాధాకరం. కోనసీమలో నేటికీ కులవివక్ష కొనసాగుతోంది. చట్టాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారుల గైర్హాజరుపై అసహనం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయం నుంచి సమాచారం పంపినా పలుశాఖల అధికారులు హాజరు కాకపోవడంపై శివాజీ అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీఓ గణేష్‌కుమార్ వివరణపై పెదవి విరిచారు. సమావేశంలో భాగంగా డివిజన్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కారమైనవెన్ని, ఎంతమందికి ఇళ్ల స్థలాలిచ్చారు వంటి అంశాలను ఆరా తీశారు. అమలాపురం మన్నా కాలనీలో రహదారి సమస్యపైనా, రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఎస్సీ కుటుంబం సాంఘిక బహిష్కారం తదితర సమస్యల ప్రగతిపైనా, వివిధ శాఖల్లో పెండింగ్ సమస్యలపై ఆయన ప్రశ్నించారు. ఆర్డీవో., డీఎస్పీలపై ఆగ్రహం అట్రాసిటీ కేసుల్లో పురోగతి లేకపోవడంపై ఆర్డీవో గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, అమలాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌లపై శివాజీ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ అధికారులను సస్పెండ్ చేయిస్తా అంటూ హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ను మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల హక్కులపై మీకు క్లారిటీ లేదన్నారు. ఫిర్యాదులపై మీరు స్పందిస్తారా లేదా కమిషనే స్వయంగా పరిష్కరించే ఏర్పాటు చేయమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలపై శివాజీకి వినతిపత్రాలు సమర్పించారు.