Auto bandh
-
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్! ఆ రెండు రోజులు ఆటోలు బంద్
సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్: ఆటో చార్జీలు పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్లను ఆదుకొనేందుకు చార్జీలు పెంచాలని, కొత్తగా మరో 20 వేల పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్ యూనియన్స్ జేఏసీ నేతలు బి.వెంకటేశం, సత్తిరెడ్డి, మల్లేష్ గౌడ్, మారయ్య, అమానుల్లాఖాన్ తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో భవిష్యత్ కార్యాచరణపై ఆటో, క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. నగరంలో 8 ఏళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో ఆటోడ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కరోనా, లాక్డౌన్ కారణంగా క్యాబ్, ఆటోలకు డిమాండ్ తగ్గిపోయిందని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆటో మీటర్ చార్జీలు కనీసం రూ.40.., కిలో మీటర్‌కు రూ. 25 చొప్పున పెంచాలని కోరారు. సీఎన్జీతో నడిచే 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్య పించన్లు, ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఏపీలో ఇస్తున్నట్లుగా ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇవ్వాలని అన్నారు. ఇతర జిల్లాల్లోని ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగకుండా నిషేధం విధించాలన్నారు. (చదవండి: కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు) -
10న ఆటోలు బంద్: ఆటోడ్రైవర్స్ జేఏసీ
సుల్తాన్ బజార్: దిశ హత్య కేసు నేపథ్యంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు డిమాండ్ చేస్తూ ఈనెల 10న ‘షరాబ్ హటావో–తెలంగాణ బచావో’అనే నినాదంతో ఒక్క రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆటోడ్రైవర్స్ జేఏసీ వెల్లడించింది. ఈమేరకు ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరులతో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ మాట్లాడారు. మద్యపాన నిషేధం లేకపోవడం వల్లే మద్యం మత్తులో దుండగులు దిశను హత్య చేశారని, నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాలు, సామాజిక నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యం తాగడమేనన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఏటా రూ. 500 ఎంవీ ట్యాక్స్ మాఫీ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని, అదే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఆటోకు రూ. 10 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్
హైదరాబాద్‌లో సుమారు 1.20 లక్షల ఆటోలు ఆగిపోయే అవకాశం ఇందులో 25 వేల స్కూల్ ఆటోలు గ్రేటర్ పరిధిలో 1520 లక్షల మందికి ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ చలానాలు రూ.1,000కి పెంచు తూ గత సంవత్సరం జారీ చేసిన జీవో 108ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాల జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆటో బంద్‌కు పిలుపునిచ్చిం ది. 16 ఆటో సంఘాల నేతృత్వంలో ఈ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ ప్రతినిధులు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), ఎ.సత్తిరెడ్డి (ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల సమాఖ్య), నరేందర్ (ఐఎఫ్టీయూ) గురువారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆటో కనీస చార్జి రూ.16 నుంచి రూ.25 చేయాలని, ఆపైన ప్రతి కి.మీ.కి రూ.15కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) బంద్‌కు దూరంగా ఉంది. ఆర్టీసీ అదనపు బస్సులు! ఆటో సమ్మె అనివార్యమైతే 100 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సికింద్రాబాద్-ఆఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్-వీఎస్టీ, రామ్‌నగర్-కోఠి, రామంతాపూర్-లక్డీకాపూల్, చార్మినార్-ఆఫ్జల్‌గంజ్, సనత్‌నగర్-లక్డీకాపూల్ వంటి రూట్లలో ఇవి అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు తెలిపారు. -
రవాణా కమిషనర్ హామీతో బంద్ విరమణ
సాక్షి,సిటీబ్యూరో: రెండురోజులపాటు నిలిచిపోయిన ఆటోలు ఎట్టకేలకు గురువారం సాయంత్రం రోడ్డెక్కాయి. వీరమోత మోగిస్తున్న చలానా రూ.1000 తగ్గించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆటోసంఘాలు కలిసి చేస్తున్న సమ్మెను విరమించారు. దీంతో నానాఇబ్బందులకు గురైన ప్రయాణికులు సమ్మె విరమణతో ఊపిరిపీల్చుకున్నారు. గురువారం సాయంత్రం రవాణాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆటోసంఘాల జేఏసీ ఆటోబంద్ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చలానా మొత్తాన్ని తగ్గించేందుకు సర్కారు సానుకూలంగా ఉందని,రవాణాశాఖ కమిషనర్ అనంతరాము,ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాత వారిపై నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఐఎఫ్టీయూ నాయకుడు నరేందర్ ‘సాక్షి’తో వెల్లడించారు. అయితే ఈ విరమణ తాత్కాలికం మాత్రమేనని, రవాణా మంత్రి బొత్సతో తాము త్వరలో జరుపనున్న చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జేఏసీ నాయకులు ప్రకటించారు. చలానా తగ్గింపు సంతృప్తికరంగా లేకపోతే తిరిగి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. జీవో రద్దు చేసే వరకు ఉద్యమం.. కవాడిగూడ: అధిక చలాన్లను మోపే 108 జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే 13 ఆటోయూనియన్ల ఆధ్వర్యంలో జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సీఐటీయూ కార్యదర్శి ఈశ్వర్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 13 ఆటోసంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో గురువారం జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ,ఐఎఫ్టీయూ, టీఏడీజేఏసీ, సీఐ టీయూ, టీఎన్టీయూసీ, బీఎంఎస్, ఏపీఏడీఎస్, టీఏటీయూ, టీఏడీయూ, టీటీయూసీ, జీహెచ్‌ఏడీసీ, ఆటోఓనర్స్ అసోసియేషన్, పేదప్రజల పార్టీ తరఫున ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ నగరంలో 1.20 లక్షలు ఉన్న ఆటోలకు సరైన స్టాండ్లను ఏర్పాటు చేయలేని సర్కారు ఒకేసారి చలానా మొత్తాన్ని విధించే హక్కులేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో బతికే పరిస్థితి లేకుండా చేసిన ప్రభుత్వం..అధిక చలానాతో అప్పులపాల్జేస్తోందని ధ్వజమెత్తారు. అంతకుముందు రాంనగర్ చౌరస్తాలో ఐఎఫ్టీయూ,సీఐటీయూల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి 108 జీవో ప్రతులను తగులబెట్టారు. -
రవాణా కమిషనర్ హామీతో బంద్ విరమణ
సాక్షి,సిటీబ్యూరో: రెండురోజులపాటు నిలిచిపోయిన ఆటోలు ఎట్టకేలకు గురువారం సాయంత్రం రోడ్డెక్కాయి. వీరమోత మోగిస్తున్న చలానా రూ.1000 తగ్గించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆటోసంఘాలు కలిసి చేస్తున్న సమ్మెను విరమించారు. దీంతో నానాఇబ్బందులకు గురైన ప్రయాణికులు సమ్మె విరమణతో ఊపిరిపీల్చుకున్నారు. గురువారం సాయంత్రం రవాణాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆటోసంఘాల జేఏసీ ఆటోబంద్ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చలానా మొత్తాన్ని తగ్గించేందుకు సర్కారు సానుకూలంగా ఉందని,రవాణాశాఖ కమిషనర్ అనంతరాము,ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాత వారిపై నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఐఎఫ్టీయూ నాయకుడు నరేందర్ ‘సాక్షి’తో వెల్లడించారు. అయితే ఈ విరమణ తాత్కాలికం మాత్రమేనని, రవాణా మంత్రి బొత్సతో తాము త్వరలో జరుపనున్న చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జేఏసీ నాయకులు ప్రకటించారు. చలానా తగ్గింపు సంతృప్తికరంగా లేకపోతే తిరిగి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. జీవో రద్దు చేసే వరకు ఉద్యమం.. కవాడిగూడ: అధిక చలాన్లను మోపే 108 జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే 13 ఆటోయూనియన్ల ఆధ్వర్యంలో జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సీఐటీయూ కార్యదర్శి ఈశ్వర్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 13 ఆటోసంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో గురువారం జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ,ఐఎఫ్టీయూ, టీఏడీజేఏసీ, సీఐ టీయూ, టీఎన్టీయూసీ, బీఎంఎస్, ఏపీఏడీఎస్, టీఏటీయూ, టీఏడీయూ, టీటీయూసీ, జీహెచ్‌ఏడీసీ, ఆటోఓనర్స్ అసోసియేషన్, పేదప్రజల పార్టీ తరఫున ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ నగరంలో 1.20 లక్షలు ఉన్న ఆటోలకు సరైన స్టాండ్లను ఏర్పాటు చేయలేని సర్కారు ఒకేసారి చలానా మొత్తాన్ని విధించే హక్కులేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో బతికే పరిస్థితి లేకుండా చేసిన ప్రభుత్వం..అధిక చలానాతో అప్పులపాల్జేస్తోందని ధ్వజమెత్తారు. అంతకుముందు రాంనగర్ చౌరస్తాలో ఐఎఫ్టీయూ,సీఐటీయూల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి 108 జీవో ప్రతులను తగులబెట్టారు.