Automobile news
-
ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి
ఎంజి మోటార్ ఇండియా ఇటీవల తన కామెట్ (Comet) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచ్ సమయంలో కంపెనీ కేవలం ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడించింది, కాగా ఇప్పుడు వేరియంట్స్, వాటి ధరలను కూడా అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు: ఎంజి కామెట్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి పేస్ (Pace), ప్లే (Play), ప్లస్ (Plus). ఈ మూడు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 7.98 లక్షలు, రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెల చివర నాటికి మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే మొదటి బుక్ చేసుకున్న 5000 మందికి మాత్రమే ప్రారంభ ధరలు వర్తిస్తాయి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. (ఇదీ చూడండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన ఎంజి కామెట్ చూడటానికి చిన్నదిగా ఉన్నపటికీ మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. రెండు వింగ్ మిర్రర్స్ కనెక్టెడ్ క్రోమ్ స్రిప్ కలిగి ముందు వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బాస్ కలిగి, సైడ్ ప్రొఫైల్ 12 ఇంచెస్ వీల్స్ తో ఉంటుంది. రియర్ ఫ్రొఫైల్ లో కూడా వెడల్పు అంతటా వ్యాపించి ఉండే లైట్ బార్ చూడవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ముందు భాగంలో ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి లోపల వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. ముందు ప్యాసింజర్ సీటులో వన్ టచ్ టంబుల్ అండ్ ఫోల్డ్ ఫీచర్స్ లభిస్తాయి. అయితే రియర్ సీట్లు 50:50 స్ప్లిట్ పొందుతాయి. అంతే కాకుండా ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చూడండి: భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?) బ్యాటరీ అండ్ రేంజ్: ఎంజి కామెట్ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ కోసం IP67 రేటింగ్ పొందుతుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. ఇది 42 bhp పవర్ అండ్ 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కామెట్ 3.3 కిలోవాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్‌తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. -
నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యమ చురుగ్గా ఉంటారు. ఆయన పెట్టే పోస్ట్‌లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. భారత జట్టు ఇటీవల థామస్ కప్‌ని గెలిచి బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి డబుల్స్ జోడీ జట్టు విజయంతో కీలకపాత్ర పోషించింది. చారిత్రక విక్టరీని లిఖించిన భారత జట్టును ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్ర ట్విటర్లో పోస్ట్ పెట్టారు. దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు తాను ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్యూవీ 700 కారు బుక్ చేశానని, కాస్త తొందరగా డెలివరీ చేయాలని అభ్యర్థించాడు. దీనికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ‘ఛాంపియన్ల ఎంపికగా మారిన ఎస్యూవీ 700ని వీలైనంత త్వరగా మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నా భార్య కోసం నేను కూడా ఒకటి ఆర్డర్ చేసాను. నేను ఇప్పటికే క్యూలోనే ఉన్నాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (క్లిక్: ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్.. ఎందుకంటే?) కరోనా సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా చిప్సెట్ల కొరత ఏర్పడటంతో కార్ల తయారీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్త కార్లు తయారు చేయడానికి కంపెనీలకు చాలా సమయం పడుతోంది. దీంతో బుకింగ్‌లు ఉన్నప్పటికీ కార్లను డెలివరీ చేయలేక కంపెనీలు సతమతమవుతున్నాయి. అటు వినియోగదారులు కూడా కొత్త కార్ల కోసం సుదీర్ఘ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. (క్లిక్: ఆర్డర్లు ఉన్నాయి.. కానీ టైమ్‌కి డెలివరీ చేయలేం!) -
రైడ్‌కు రెడీ...మారుతీ సెలెరియో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర మార్కెట్లోకి సెలెరియో కారును శుక్రవారం మారుతి సుజుకి విడుదల చేసింది. వేగాన్నిబట్టి కారు సొంతంగా గేర్లు మార్చుకునేలా ఆటో గేర్ షిఫ్ట్‌ను ఇందులో పొందుపరిచారు. ప్యాసింజర్ కార్లలో దేశంలో తొలిసారిగా ఆటో గేర్ షిఫ్ట్‌ను సెలెరియోలో అమర్చారు. భారత్‌లో కొత్త విభాగాన్ని ఇది సృష్టిస్తుందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సి.వి.రామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ ఓంకార్ నాథ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ వాహనాల ఖరీదు ఎక్కువగా ఉంటుందని, మైలేజీ రాదన్న అపవాదు ఉండడం వల్లే వీటి వ్యాప్తి అతి తక్కువగా ఉందని చెప్పారు. సెలెరియో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేసిక్ వేరియంట్‌తో పోలిస్తే ఆటో గేర్ షిఫ్ట్ బేసిక్ వేరియంట్ రూ.41 వేలు మాత్రమే ఖరీదు ఎక్కువ. ఇక మైలేజీ రెండు వేరియంట్లూ లీటరు పెట్రోలుకు 23.1 కిలోమీటర్లని వివరించారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో నాలుగు, ఆటో గేర్‌లో రెండు వేరియంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ ఎక్స్ షోరూంలో కారు ధర మాన్యువల్ ట్రాన్స్మిషన్ రూ.4.02 లక్షల నుంచి రూ.5.10 లక్షల వరకు ఉంది. ఆటో గేర్ షిఫ్ట్ ధర రూ.4.43-4.73 లక్షలు. త్వరలో కొత్త భద్రతా ప్రమాణాలు... దేశంలో ప్రయాణికుల వాహనాలు ఇక మరింత భద్రంగా రూపొందనున్నాయని రామన్ చెప్పారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మూడు నెలల్లో కనీస భద్రతా ప్రమాణాలను ప్రకటించనుందని పేర్కొన్నారు. 800.. ఇక ఓ జ్ఞాపకం దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత మధ్య తరగతి ప్రజలను మురిపించిన మారుతీ 800 కారు ఇక మధుర జ్జాపకంగా మిగిలిపోనుంది. మధ్య తరగతి ప్రజల కలల కారుగా ప్రఖ్యాతి గాంచిన ‘800’ ఉత్పత్తిని మారుతీ ఆపేసింది. గత నెల 18 నుంచి ఈ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశామని కంపెనీ ఈడీ రామన్ శుక్రవారం చెప్పారు. కార్ల ఉత్పత్తిని ఆపేసినా, నిబంధనల ప్రకారం ఈ కార్ల విడిభాగాలు మరో 8-10 ఏళ్ల పాటు అందుబాటులో ఉంచుతామని వివరించారు. సెలెరియో హ్యాచ్‌బాక్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్ నుంచి ఉపసంహరించిన కారు మోడళ్ల విడిభాగాలను గతంలో 8-10 ఏళ్లపాటు అందుబాటులో ఉంచామని, ఎం800 కారు విషయంలో కూడా దీనినే అనుసరిస్తామని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్సహా మొత్తం 13 నగరాల్లో 2010, ఏప్రిల్ నుంచే ఈ కార్ల విక్రయాలను కంపెనీ ఆపేసింది.