Ayyanna patrhudu
-
దిగజారుడు రాజకీయాలు చేస్తున్న టీడీపీ
-
రేగుల్లంక వంతెన పూర్తయ్యేనా?
సాక్షి, అవనిగడ్డ: ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న రేగుల్లంక వంతెన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు ప్రజాప్రతినిధులు, అ«ధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార పార్టీ నేతే అడ్డంకులు కలిగిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి. వంతెన పనులు ప్రారంభించకుంటే ఆందోళన బాట పడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఆది నుంచి వివాదాలే... పులిగడ్డ రేగుల్లంకలో కాలిబాట వంతెన, సీసీ రహదారులు నిర్మించేందుకు రూ.1.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2016 నవంబర్‌లో మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది ఏప్రిల్‌లో సీసీ రహదారి పనులు చేపట్టగా నాసిరకమైన మెటీరియల్ వాడటంపై స్థానికులు అభ్యంతరం చెప్పడంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సిమెంట్ రోడ్లు నిర్మించగా, వంతెన పనులు మాత్రం నిలిచిపోయాయి. ఉపసభాపతి హెచ్చరించినా... వారం క్రితం గాంధీ క్షేత్రంలో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశంలో రేగుల్లంక వంతెన నిర్మాణ విషయమై శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పంచాయతీరాజ్ డీఈ రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనా కాంట్రాక్టర్‌తో పనులు చేయించలేకపోతున్నారని మండిపడ్డారు. పత్రికల్లో కథనాలు వచ్చినా మీలో చలనం రాలేదని ఆగ్రహించారు. అయినా ఇంతవరకూ పనులు ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది. మీరే సమస్య పరిష్కరించుకోవాలి... స్థానికులు పంచాయతీరాజ్ ఏఈ గోపాలరావు దగ్గరకు సోమవారం వెళ్లి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. మీరు దగ్గరుండి ఆక్రమణదారుడిని తొలగింపజేస్తే పనులు చేస్తామని ఏఈ చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోగా పంచాయతీరాజ్ డీఈ రమేష్, ఏఈ గోపాలరావుని పిలిపించి వంతెన నిర్మాణ విషయమై మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు దోవారి శేషు, బత్తుల శ్రీను మాట్లాడుతూ వంతెన నిర్మాణం గురించి ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
యనమల ఆధిపత్యాన్ని సహించని మంత్రి
అయ్యన్న అడ్డుచక్రం! యనమల ఆధిపత్యాన్ని సహించని జిల్లా మంత్రి సమావేశాలే నిర్వహించని ఇన్చార్జి మంత్రి ఇసుక దందా, అధికారుల బదిలీల్లో ఆధిపత్య పోరే కారణం ఒకరేమో జిల్లా మంత్రి... మరొకరు జిల్లా ఇన్చార్జి మంత్రి... ఇద్దరూ టీడీపీలో అత్యంత సీనియర్లే... ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో కలసి పనిచేసినవారే. పైగా ఇరుగుపొరుగు జిల్లాలవారే. అయితే మాత్రం ...! ‘ఎక్కడైనా బావగానీ.. వంగ తోట కాడ కాదు’ అన్నట్లుగా తయారైంది వారి పరిస్థితి. జిల్లాపై పెత్తనం చెలాయించాలని ఇన్చార్జి మంత్రి చూస్తుంటే... అసలు మీ పెత్తనం ఏమిటని జిల్లా మంత్రి అడ్డుపడుతున్నారు. ఎందుకంటే అటు ఇన్చార్జి మంత్రి, ఇటు జిల్లా మంత్రి ఇద్దరూ కన్నేసింది ఒకే వ్యవహారంపై. అక్రమంగా కోట్లు కురిపిస్తున్న ఇసుక దందాతోపాటు ఉన్నతాధికారుల నియామక వ్యవహారం మీద ఇద్దరూ తమ మాటే చెల్లాలని పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిదంటే.. ఇన్చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్క అధికారిక సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా అతన్ని కట్టడి చేశారు. వీరిలో ఒకరు జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కాగా.. మరొకరు ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు. వీరిద్దరి ఆధిపత్య పోరుకు వేదిక.. విశాఖ జిల్లా.. విశాఖపట్నం: విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇసుక ర్యాంపుల వ్యవహారం మంత్రులు అయ్యన్న, యనమల మధ్య చిచ్చుపెట్టింది. మంత్రి యనమల కుటుంబ సభ్యులు జిల్లా సరిహద్దు దాటి విశాఖ జిల్లాలోకి వచ్చి మరీ భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే పాయకారావుపేట నియోజకవర్గంలో ఇసుక దందాపై యనమల కుటుంబ సభ్యుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీరి పెత్తనమేమిటంటూ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. వారి దందాను అడ్డుకుని ఆధిపత్యం సాధించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య చిన్నగా విభేదాలు ప్రారంబమయ్యాయి. అంతలోనే ఏడాది క్రితం విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా యనమల రామకృష్ణుడును సీఎం నియమించారు. ఇది అయ్యన్నకు ఏమాత్రం రుచించలేదు. మరోవైపు యనమల కూడా దూకుడుగా వ్యవహరించి జిల్లా వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకోవాలని భావించారు. జిల్లాలో ఉన్నతాధికారుల నియామకంలో యనమల కల్పించుకోవడాన్ని కూడా అయ్యన్న సమ్మతించలేదు. జిల్లాలో వివాదాస్పదమైన ఆర్డీవో, డీఆర్వో నియామకాల్లో మంత్రి యనమల తనదైన పంథాలో వ్యవహరించడాన్ని అయ్యన్న అడ్డుకున్నారు. తాజాగా తాండవ నదిలో ఇసుక ర్యాంపులు దక్కించుకునేందుకు మంత్రులు పోటీపడుతున్నారు. అందుకోసం పంతాలకు పోతున్నారు. అడుగడుగునా అడ్డుకట్ట ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాపై పట్టు సాధించేందుకు యనమలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అయ్యన్న పాత్రుడు భీష్మించుకున్నారు. అందుకే జిల్లాలో యనమల ఇంతవరకు ఎలాంటి అధికారిక సమావేశాన్ని నిర్వహించలేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా డీఆర్సీ సమావేశంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలను నిర్వహించాలని యనమల భావించారు. ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అయ్యన్నకు తెలియజేశారు. దీనిపై ఆయనసానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ‘ఇప్పుడేమీ సమావేశాలు వద్దు. తరువాత నేను చెబుతా’ అని ముక్తసరిగా తేల్చేశారు. దాంతో ఇన్చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా యనమల రామకృష్ణుడు ఇంతవరకు జిల్లాలో అధికారికంగా ఎలాంటి సమావేశాన్ని నిర్వహించలేకపోయారు. సీఎం చంద్రబాబు వస్తే ఆ పర్యటనలో పాల్గొనడం మినహా అధికారికంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారనే అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘నా పుట్టలో వేలు పెడితే కుట్టనా’ అన్నట్లుగా మంత్రి అయ్యన్న వ్యవహరిస్తున్నారు. -
'అధికారంలోకి తెచ్చిన వారికి మంచి పోస్టింగులు'
-
టీడీపీని అధికారంలోకి తెచ్చిన వారికి మంచి పోస్టింగులు: మంత్రి అయ్యన్న
వివిధ జిల్లాల్లో జరిగిన తెలుగుదేశం మినీ మహానాడుల్లో మంత్రులు గాడి తప్పి మాట్లాడారు. తమ రాజకీయ కోణాన్ని బయటపెట్టి అందర్నీ భయపెట్టారు. సాక్షి, విశాఖపట్నం: కార్యకర్తల కోసం పనిచేసేవారిని తెచ్చుకునేందుకే తమ ప్రభుత్వం బదిలీలు చేపట్టిందని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో సహకరించిన అధికారులకు మంచి పోస్టింగ్లిస్తామని, కార్యకర్తల కోసం పనిచేసే వారిని ఏరికోరి తెచ్చుకుంటామన్నారు. విశాఖపట్నంలోని అంకోసా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల బదిలీలన్నీ తమ సౌలభ్యం కోసమేనని, పరిపాలనా సౌలభ్యం కోసం కాదన్నారు. అధికారంలోకొచ్చాక కార్యకర్తల కోసం పనిచేసుకోకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. ‘మా పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. అక్రమ కేసులు బనాయిస్తే జైలుకెళ్లారు. వారికోసం పనులు చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. పత్రికలు రాస్తే రాసుకోనీయండి..మా పని మాదే..పత్రికల పని పత్రికలదే. ఆ రాతల్ని పట్టించుకోనవసరం లేదు’ అని అన్నారు. కార్యకర్తలు చెప్పింది చేయాలి: అచ్చెన్న శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెబితే అధికారులు అదే చేయాలని కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004కు ముందు ప్రభుత్వంతో సమానంగా పార్టీని నడపనందునే ఓటమిపాలయ్యామన్నారు.ప్రతీ సంక్షేమ పథకంపై కార్యకర్తల ముద్ర ఉండేలా చూస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో జరిపిస్తానన్నారు. కార్యకర్తలను గౌరవించాలి: గంటా కడప రూరల్ : టీడీపీ కార్యకర్తలు న్యాయసమ్మతంగా చెప్పింది అధికారులు చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కడప మినీ మహానాడులో మాట్లాడారు. కార్యకర్తలు కార్యాలయాలకొస్తే గౌరవంతో చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.