Azim Premji Foundation
-
ఒకపుడు కాలేజీ డ్రాపవుట్, మరిపుడు రోజుకు రూ. 27 కోట్లు దానం
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు, అజీమ్ ప్రేమ్‌జీ జూలై 24న తన 77వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు, ఆసియాలోని అగ్రశ్రేణి దాతృత్వవేత్తలలో ఒకరుగా పేరుగాంచిన అజీం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కూరగాయల ఉత్పత్తులు, ప్రధానంగా కూరగాయల నూనె కంపెనీగా ప్రారంభమైంది విప్రో ప్రస్థానం. 1966లో తన తండ్రి మరణించిన తర్వాత ప్రేమ్‌జీ కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టారు. కాలేజీ డ్రాపౌట్ నుంచి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలలో విప్రో లిమిటెడ్‌ను చైర్మన్‌గా మారడం దాకా, అజీమ్ ప్రేమ్‌జీ వ్యవస్థాపక ప్రయాణం స్ఫూర్తిదాయకం. జూలై 24, 1945న ముంబైలో పుట్టిన అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ తన కుటుంబ వ్యాపారాన్ని (వనస్పతి నూనెను ఉత్పత్తి చేసే కంపెనీ) ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ పరిశ్రమలలో ఒకటిగా మార్చిన ఘనత సొంతం చేసుకున్నారు. కాలేజీ డ్రాపవుట్: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదువుతుండగా, తండ్రి మహమ్మద్ హషీమ్ ప్రేమ్‌జీ మరణించడంతో చదువుకు స్వస్తి చెప్పి 1966లో వ్యాపార బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ప్రేమ్‌జీ వయసు కేవలం 21 ఏళ్లే పాకిస్థాన్ ఆహ్వానం తిరస్కరణ: 1947లో ఇండియా-పాకిస్థాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ నేత మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్‌కు మారమని ప్రేమ్‌జీ తండ్రికి ఆహ్వానం పంపారట. అయితే అందుకు నిరాకరించిన ముహమ్మద్ ప్రేమ్‌జీ దేశంలోనే ఉండాలని నిర్ణయించు కున్నారు. ప్రేమ్‌జీకి ఎప్పుడూ విలాసాల పట్ల మోజు లేదు. ఖరీదైన కార్లు అంతకన్నా లేవు. ఇప్పటికీ ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణాన్ని ఇష్ట పడతారట. వ్యాపార పర్యటనల సమయంలో కంపెనీ గెస్ట్ హౌస్‌లకే ప్రాధాన్యం. అంతేకాదు కంపెనీ క్యాంటీన్ ఆహారాన్నే ప్రిఫర్ చేసేవారు. విప్రో ఆవిర్బావం 1979లో ఐబీఎం ఇండియానుంచి నిష్క్రమించిన తర్వాత ఐటీ రంగంలోకి ప్రవేశించింది విప్రో. అనంతరం బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాలతో టాప్ కంపెనీగా ఎదిగింది. తన తాత 'నిజాయితీ' సూత్రమే తన విజయానికి కారణమని అజీమ్ ఎపుడూ చెబుతూ ఉంటారు. 30 ఏళ్ల తరువాత డిగ్రీ పూర్తి చేసిన అజీంజీ స్టాన్‌ఫోర్డ్‌లో గ్రాడ్యుయేషన్ వదిలిపెట్టిన ఆయన డిస్టెంట్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేయడం విశేషం. కాగా 2021నాటి లెక్కల ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా సామాజిక ప్రయోజనాల కోసం 1.3 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. జీవితంలో మొత్తం దాదాపు 10వేల కోట్లను దానం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2021లో కూడా ప్రేమ్‌జీ రూ.9,713 కోట్ల విలువైన విరాళాలతో అగ్రస్థానాన్ని నిలిచారు. అంటే రోజుకు 27 కోట్ల మేర దానం చేశారు. పద్మ పురస్కారాలు విప్రో 75 ఏళ్ల వ్యాపార ప్రయాణం గురించి రాసిన ‘ద స్టోరీ ఆఫ్ విప్రో’ (The Story of Wipro)’పుస్తకాన్ని అజీమ్ ప్రేమ్‌జీ గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. అజీమ్ ప్రేమ్‌జీ యాస్మీన్ ప్రేమ్‌జీని వివాహం చేసుకోగా, ఇద్దరుపిల్లు రిషద్ ప్రేమ్‌జీ , తారిఖ్ ప్రేమ్‌జీ ఉన్నారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషికిగాను అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. 2005లో "పద్మ భూషణ్ అవార్డు", 2011లో, "పద్మ విభూషణ్" లభించింది. ఇది కూడా చదవండి: ITR Filling Benefits: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? -
కరోనా: అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఔదార్యం!
బెంగళూరు: మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో ప్రజలకు అండగా ఉండేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. మహమ్మారిపై పోరాడేందుకు విప్రో లిమిటెట్, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లతో కలిసి రూ. 1125 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మూడు సంస్థలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేటాయించిన ఈ భారీ మొత్తం తాము చేపట్టే సామాజిక కార్యక్రమాల కోసం (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఖర్చుపెట్టే నిధులకు అదనం అని వెల్లడించింది. అంటువ్యాధి ప్రబలకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొంది.(కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..) కాగా రూ. 1125 కోట్లలో ఎక్కువ మొత్తం అజీమ్ ఫౌండేషన్ నుంచే సమీకరించినట్లు తెలుస్తోంది. విప్రో లిమిటెడ్ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ రూ. 25 కోట్లు అందించగా.. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు కరోనాపై పోరుకు కేటాయించినట్లు సమాచారం. ఇక విప్రో కంపెనీల వ్యవస్థాపకుడు, ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ 2019 మార్చిలో సామాజిక సేవ నిమిత్తం తన సంపదలో 52,750 కోట్ల రూపాయలు(ఆయన షేర్లలో 34 శాతానికి సమానం) వెచ్చించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులను అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. -
సేంద్రియ ఎరువులకు రాయితీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈఓ ఆనంద్ విశ్వనాథన్, ఇతర ప్రతినిధులు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ప్రకృతి వ్యవసాయం గురించి సీఎం వైఎస్ జగన్‌తో చర్చించారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి తాము సహాయం అందిస్తామని అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. ఐదేళ్లలో రూ. 100 కోట్లమేర సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని, అవసరమైన సాకేంతిక సహకారం అందిస్తామని చెప్పారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి విధివిధానాలు, పద్దతులు మరింత సమర్థవంతంగా రూపొందించాల్సి అవసరం ఉందంటూ సీఎం వైఎస్ జగన్ తన అభిప్రాయాలను వారికి తెలిపారు. సేంద్రియ ఎరువులను రాయితీపై అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సీఎం వారికి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పలు చర్యలు తీసుకున్నామని వారికి వివరించారు. భవిష్యత్తులో పూర్తి నాణ్యత కలిగిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ప్రభుత్వ లేబరేటరీల్లో పరీక్షించిన తర్వాతే గ్రామాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ట్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడానికి, మార్కెట్ స్థిరీకరణకు పలు ప్రణాళికలతో మందుకు వెళ్తున్నామని వారికి తెలియజేశారు. -
సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం
సాక్షి, ముంబై : విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వంతో మరోసారి సంచలనంగా మారారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన ఆయన ఫౌండేషన్ తరుపున భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.52,750 కోట్ల(7.5 బిలియన్ డాలర్లు) విలువైన విప్రో షేర్లను విరాళంగా ఇస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఫౌండేషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో దాతృత్వంలో ప్రపంచ కుబేరులు, దాతలు బిల్ గేట్స్, వారెన్ బఫెట్‌కు పోటీగా విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దూసుకొచ్చారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించిన అజీమ్ ప్రేమ్‌జీ ఏకంగా (34శాతం విప్రో షేర్లు) రూ.52,750 కోట్లు విరాళాన్ని ప్రకటించడం విశేషం. దేశంలో సమానమైన, సుస్థిరమైన మానవ సమాజం అభివృద్ధికి దోహదపడేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వ కార్యకలాపాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యారంగంపై దృష్టిపెడుతుంది. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థలకు చేయూతనిస్తుందని విప్రో ప్రకటించింది. తాజా ప్రకటనతో ఇప్పటివరకు ఆయన ఇచ్చిన విరాళాలు రూ.1,45,000 (67శాతం వాటా) కోట్లకు చేరింది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి తోడుగా ఉత్తరభారతంలో మరో యూనివర్శిటీని స్థాపించాలని కూడా యోచిస్తోంది. రాబోయే కాలంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. కాగా ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన, సమానమైన విద్య అందేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తుంది. తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. -
విప్రోలో సగం వాటాలు ట్రస్టుకు విరాళం
ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ దాతృత్వం బెంగళూరు : ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ.. విప్రోలో తనకున్న వాటాల్లో దాదాపు సగభాగాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే సుమారు 21 శాతం వాటాలను ట్రస్టుకు ఇచ్చిన ప్రేమ్‌జీ తాజాగా అదనంగా మరో 18 శాతం వాటాలను విరాళమిచ్చారు. దీంతో అజీం ప్రేమ్‌జీ ట్రస్టుకు మొత్తం 39 శాతం వాటాలు (విలువ సుమారు రూ. 53,284 కోట్లు) ఇచ్చినట్లయింది. వ్యక్తిగతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో తాను కూడా పాలుపంచుకోవాలనే తలంపుతో గడిచిన పదిహేనేళ్లుగా విప్రోలో తనకున్న వాటాల్లో కొద్ది కొద్దిగా ట్రస్టుకు బదలాయిస్తూ వస్తున్నట్లు ప్రేమ్‌జీ.. విప్రో వార్షిక నివేదికలో షేర్హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, అజీం ప్రేమ్‌జీ ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ఈ ట్రస్టు తోడ్పాటు అందిస్తుందన్నారు.