Bachelors
-
పెళ్లికాని ప్రసాదుల పాట్లు.. వధువు కావాలంటూ పాదయాత్ర!
ఇంత వరకు రాజకీయనాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. అలాగే ఏదైన అన్యాయం జరిగితే నిరసన తెలిపేందుకు కూడా పాదయాత్రలు చేపడుతుంటారు. కానీ ఇక్కడ పెళ్లి కోసం పాదయాత్ర చేపట్టారు కొంతమంది యువకులు. ఈ వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మాండ్యలో అబ్బాయిలు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారంతా తమకు మంచి అమ్మాయి దొరకాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పెళ్లికాని బ్రహ్మచారులు. అందుకోసం సుమారు 200 మంది బ్రహ్మచారులు మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టానున్నారు. తమకు పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి దొరికేలా ఆ దేవతా ఆశీర్వదం పొందడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని చెబుతున్నారు ఆ బ్యాచిలర్స్. ఐతే గతంలో ఈ జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని, దీనికి ఇప్పుడూ ఆ యువకులంతా తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ఓ మహిళా రైతు నాయకురాలు చెబుతోంది. మైసూరుకి 40 కి.మీ దూరంలో ఉన్న మాండ్య జిల్లాలో వధువుల కొరత బాగా ఎక్కువగా ఉందని, ప్రధానంగా వ్యవసాయ సంబంధిత పనులు చేసే యవతకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 23 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. ఈ పాదయాత్రో 30 ఏళ్లు పైబడిన 200 మంది యువకులంతా పాల్గొంటారు. అంతేగాదు ఈ పాదయాత్రకు బ్రహ్మచారుల పాదయాత్ర(బ్యాచిలర్ యాత్ర) అని కూడా పేరు పెట్టేశారు. ఈ యాత్రను ప్రకటించి పది రోజుల్లోనే సుమారు 100 మంది దాక పెళ్లికాని యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ యాత్ర ఫిబ్రవరి 23న మద్దూరు తాలూకాలోని కేఎం దొడ్డి గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో పాదయాత్ర 105 కి.మీ మేర సాగి ఫిబ్రవరి 25న ఎం.ఎం.హిల్స్‌కు చేరుకుంటుందని, యాత్రికులకు భోజన వసతి కూడా కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లి కాని యువకులను ఈ సమస్య నుంచి బయటపడేలా చేయాలన్న ఉద్దేశంతోనే తమ వంతుగా ఇలా సాయం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. (చదవండి: ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్..ఏకంగా రూ. 20 లక్షల జరిమానా) -
అద్దె ఇల్లు ఖాళీ చేయించడానికి ఖతర్నాక్ ప్లాన్
కర్ణాటక,దొడ్డబళ్లాపురం: ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించడానికి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిన వ్యక్తికి ఉపాయం కాస్త బెడిసికొట్టి అతడే జైలుపాలైన సంఘటన రామనగరలో చోటుచేసుకుంది. రామనగరలోని ఎక్స్టెన్షన్ కాలనీలో నివసిస్తున్న మహమ్మద్ ఇక్బాల్ (76) అరెస్ట్ కాగా ఇతడి అల్లుడు పర్వేజ్ (35) పరారీలో ఉన్నాడు. వివరాలు... ఇక్బాల్ సోదరుడు జాకీర్ విదేశాల్లో ఉంటున్నాడు. రామనగరలోని ఎక్స్టెన్షన్ కాలనీలో జాకీర్‌కు ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఇద్దరు యువకులు అద్దెకు ఉంటున్నారు. అయితే ఆ ఇంటిపై కన్నేసిన ఇక్బాల్ అద్దె ఉంటున్న యువకులను ఖాళీ చేయించడానికి చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. గత కొన్ని నెలలుగా పలుసార్లు అటవీశాఖ అధికారులను కలిసి తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులు వన్యప్రాణుల మాంసం తెచ్చుకుంటున్నారని, సమాచారమిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండు రోజులక్రితం ఇక్బాల్ తన అల్లుడు పర్వేజ్‌తో కలిసి నెమలి మాంసం, జింక మాంసం, తీసుకువచ్చి అద్దె ఇంట్లో ఉంచారు. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. అధికారులు యువకులను విచారించి విషయం తెలుసు కున్నారు. అసలు సంగతి వెలుగు చూడడంతో పర్వేజ్ పరారయ్యాడు. అటవీశాఖ అధికారులు ఇక్బాల్‌ను అరెస్టు చేశారు. -
బ్యాచ్‌లర్స్‌కు వ్యక్తిగత రుణాలు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాచ్లర్స్, విద్యార్థులను టార్గెట్‌గా చేసే ఏ వ్యాపారమైనా సరే హిట్ అవుతుంది. కారణం.. ఈ సెగ్మెంట్లో జనాభా ఎక్కువగా ఉండటమే! ఇదే లక్ష్యంతో ఫిన్‌టెక్ స్టార్టప్ క్యుబెరా ముందుకు సాగింది. పెద్ద మొత్తంలో కాకుండా రూ.15 వేల నుంచి రూ.75 వేలను పర్సనల్ లోన్స్గా అందించాలని నిర్ణయించింది. ఆర్బీఎల్, కొటక్, ఇండస్ ఇండ్ వంటి బ్యాంక్‌లతో ఒప్పందం కూడా చేసేసుకుంది. మరిన్ని వివరాలు క్యుబెరా ఫౌండర్ అండ్ సీఈఓ ఆదిత్య కుమార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్. నాన్న బిజినెస్ కావటంతో జర్మనీలోనే 18 ఏళ్లు ఉన్నాం. లండన్‌లో ఏడేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌లో పనిచేశా. ఆ తర్వాత ఇండియాకొచ్చి ఉత్తర్ ప్రదేశ్, రాజస్తాన్‌లోని ఫైస్టార్ హోటల్స్ క్లార్క్స్ గ్రూప్స్‌లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా పనిచేశా. 2016 జనవరిలో రూ.1.5 కోట్ల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యుబెరాను ప్రారంభించా. పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, ఎక్కువ వేతనం ఉన్నవాళ్లకు, సిబిల్ స్కోర్ బాగున్నవాళ్లకు మాత్రమే బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) రుణాలు అందిస్తాయి. మరి, సిబిల్ స్కోర్ లేనివాళ్లకు, వేతనం తక్కువున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వీళ్లకు రుణం తిరిగి చెల్లించే స్థోమత ఉంటుంది కానీ, లోన్లే అందవు. వీళ్లను లక్ష్యంగా చేసుకొనే క్యుబెరాను ప్రారంభించాం. హైదరాబాద్‌లో రూ.10 కోట్లు.. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఉద్యోగులు, నిరుద్యోగులు రెండు కేటగిరీలకూ వ్యక్తిగత రుణాలు అందిస్తాం. రుణ పరిమితి రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు. రుణ గ్రహీత కేవైసీ, అడ్రస్ ప్రూఫ్, పాన్, బ్యాంక్ చెక్స్, అకౌంట్ వివరాలను సమర్పించాలి. దరఖాస్తును పూర్తి చేసిన 24 గంటల్లో రుణం అందిస్తాం. ఆర్బీఎల్, ఇండిస్ ఇండ్, కొటక్ బ్యాంక్‌లతో పాటూ ఐఐఎఫ్ఎల్ ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటివరకు 2 లక్షల రుణ దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 2,500 మందికి రూ.50 కోట్ల వ్యక్తిగత రుణాలు అందించాం. ఇందులో రూ.10 కోట్లు హైదరాబాద్‌లోనే అందించాం. ఏటా వడ్డీ రేటు 10.99 శాతం.. మా కస్టమర్లలో 23 శాతం వాటా బ్యాచ్లర్స్ ఉంటారు. వచ్చే 6 నెలల్లో మరో 4 బ్యాంక్‌లు, 3 ఎన్బీఎఫ్సీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రుణ చెల్లింపు కాల పరిమితి మూడేళ్లు. ఏటా 10.99 శాతం నుంచి 28 శాతం వడ్డీ రేటు ఉంటుంది. గతేడాది కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.6 కోట్ల రెవెన్యూ లక్ష్యించాం. ఎన్పీఏ 1 శాతంగా ఉంది. వచ్చే ఏడాది నాటికి రూ.100 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యించాం. ముంబై ఇన్వెస్టర్ నుంచి రూ.20 కోట్ల నిధులు ఈ ఏడాది ముగింపు నాటికి కోయంబత్తూరు, ఇండోర్, భూపాల్, చండీగఢ్, కోల్‌కతా, లక్నో ప్రాంతాలకు విస్తరించనున్నాం. ఆ తర్వాతే విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు చేరుకుంటాం. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది పూర్తి ఈ సంఖ్యను 150కి చేర్చుతాం. ప్రస్తుతం ముంబైకు చెందిన ఇన్వెస్టర్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు పూర్తి కావచ్చాయి. 2 నెలల్లో రూ.20 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని ఆదిత్య వివరించారు. -
బీజేపీలో బ్రహ్మచారులకే పదవులు
సాక్షి, లక్నో : భారతీయ జనతాపార్టీలో బ్రహ్మచారులకు అద్వితీయమైన భవిష్యత్ ఉందని చత్తీస్‌గఢ్ కార్మిక శాఖమంత్రి భయాలాల్ రాజ్వాడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు దీపక్ పటేల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీపక్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు ఇతర పార్టీ ముఖ్యలతో మాట్లాడుతూ.. మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక బ్రహ్మచారి, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సాహ్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివాహాలు కాలేదు.. వారంతా బ్రహ్మచారులే అని పేర్కొన్నారు. అంతేకకా మన పార్టీలో బ్రహ్మచారులకే రాజకీయ భవిష్యత్ ఉందని వ్యాఖ్యానించారు. ఈ దశలో కొందరు నేతలు.. రాజ్వాడే వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు మాత్రం అలా మాట్లాడడం తప్పు అని చెప్పారు. -
పెద్దనోట్ల రద్దు విషయంలో పొరపాటు అదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశాక ప్రజలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వధూవరుల కుటుంబ సభ్యులు కరెన్సీ కోసం ఇబ్బంది పడుతున్నారు. యోగాగురు బాబా రాందేవ్ ఈ విషయంపై స్పందిస్తూ.. 'బీజేపీలో చాలామంది అవివాహితులున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ అని వారు తెలుసుకోలేకపోయారు. పొరపాటు అదే' అని చమత్కరించారు. పెద్దనోట్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం 15 రోజులు లేదా నెల తర్వాత తీసుకుని ఉంటే పెళ్లిళ్లపై ప్రభావం పడేదికాదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కట్నం తీసుకోవడం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు సమస్యగా మారిందని రాందేవ్ చెప్పారు. ఇదీ ఓ మంచి పరిణామమని, కట్నం ఇవ్వాలని డిమాండ్ చేయలేరని అన్నారు. కాగా ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వివాహాలు చేస్తున్న కుటుంబ సభ్యులకు ఒకేసారి 2.5 లక్షల రూపాయల వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. -
నోట్ల రద్దు: బీజేపీలోని బ్రహ్మచారుల వల్లే!
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని అనేక కుటుంబాలు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వివాహాలు జరుపుతున్న కుటుంబాలు ఒకేసారి రూ. 2.5 లక్షల వరకు బ్యాంకుల నుంచి తీసుకోవచ్చునని ప్రకటించాయి. అయితే, పెళ్లిళ్ల సీజన్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం బీజేపీలోని బ్రహ్మచారులేనంటూ యోగా గురువు బాబా రాందేవ్ ఛలోక్తులు విసిరారు. ‘బీజేపీలో చాలామంది బ్రహ్మచారులే. అందుకే వారికి ఇది పెళ్లిళ్ల సీజన్ అని తెలియలేదు. అది వారి పొరపాటు’ అంటు జోక్ చేశారు. ‘15 లేదా నెలరోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే పెళ్లిళ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవి కావు. ఈ నిర్ణయం వల్ల ఒక మంచి కూడా జరిగింది. చాలామంది కట్నం అడగటం లేదు’ అని నవ్వుతూ పేర్కొన్నారు. -
వండినవి తీసుకొస్తారు...వంటవాళ్లూ వస్తారు!
రోజురోజుకూ మారుతున్న ఆన్లైన్ ఫుడ్ మార్కెట్ - తిండికే కాదు..టీ, స్నాక్స్‌కూ ఆన్లైన్లోనే ఆర్డర్ - 94 వేల కోట్లను దాటిన ఆన్లైన్ ఆహార మార్కెట్ - ఫుడ్ స్టార్టప్స్‌లోకి భారీగా వస్తున్న పెట్టబడులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజూ బయటికెళ్లి మెస్‌లోనో, హోటల్లోనో తినాలంటే బ్యాచిలర్స్కి బోర్. ఇంట్లో రోజూ వండే గృహిణులకు... సెలవురోజుల్లో మాత్రమే బయటికెళ్లి తినే అవకాశముంటుంది. అదీ బోరే. ఆఫీస్‌కి ఫుడ్ తెచ్చుకోలేని సమయంలో ప్రతిసారీ పక్కనున్న రెస్టారెంట్‌కెళ్లి తినాలంటే... అదీ బోరే. ఈ బోర్‌డమ్‌కి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేయండంటూ రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి ఫుడ్ స్టార్టప్‌లు. వేడి వేడి టీ నుంచి పరోటాలు, కూరలు, బిర్యానీల దాకా ఒకటేమిటి... అన్నిటినీ ఒక్క క్లిక్‌తో మీరున్న చోటికే తెస్తామంటున్నాయి ఈ కంపెనీలు. కొన్నాళ్ల కిందటివరకూ ఆన్‌లైన్‌ను ఆశ్రయించేవారంతా షాపింగ్, ట్రావెల్‌తో పాటు సినిమా టిక్కెట్లకే ప్రాధాన్యమిచ్చేవారు. ఈ జాబితాలోకిపుడు ఫుడ్ కూడా చేరింది. ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ వ్యాపారంలో విలువ ఎక్కువ ఉండే ట్రావెల్ది మొదటి స్థానం కాగా... ఫుడ్‌ది 3వ స్థానం. దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ రూ.94,755 కోట్లకు (15 బిలియన్ డాలర్లు) చేరిందనేది పరిశ్రమ వర్గాల మాట. అందుకే... గుర్తు పెట్టుకోలేనన్ని స్టార్టప్‌లు ఈ రంగంలోకి దిగుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డరంటే బిర్యానీ, పిజ్జా మాత్రమే. కానీ రకరకాల స్టార్టప్స్ ప్రవేశించాక.. టీ, టిఫిన్లు, సమోసా, సూప్స్, సలాడ్స్, పరాటా, జొన్న రొట్టెలు వంటివన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. అందుకేనేమో క్యాబ్స్ రెంటల్ విభాగంలో ఉన్న ఓలా... ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఓలా కెఫేను ప్రారంభించింది. ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కేఎఫ్‌సీ కూడా... రైల్వే టిక్కెట్లు విక్రయించే ఐఆర్సీటీసీతో జట్టుకట్టి ఈ-క్యాటరింగ్ సేవలు ప్రారంభించింది. ఆన్లైన్లో ఫుడ్ మార్కెట్‌కున్న డిమాండ్ చెప్పడానికి ఇవి చాలవూ!!. ఫుడ్‌లోనూ హైదరాబాద్ హవా... ఇతర రంగాల స్టార్టప్‌ల మాదిరిగానే దేశంలోని ఇతర ఫుడ్ స్టార్టప్స్‌కు హైదరాబాదీ ఫుడ్ స్టార్టప్స్ గట్టి పోటీనిస్తున్నాయి. మెనూలోను, సేవల్లోను మాత్రమే కాక... ఇతర కంపెనీల కొనుగోళ్లలోనూ ఇవి ముందుంటున్నాయి. ఓ బ్లూచిప్ కంపెనీ పెట్టిన రూ.50 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌కు చెందిన హలోకర్రీ... స్థానిక స్టార్టప్ కంపెనీ అయిన పరాటా పోస్ట్‌ను, టెక్నాలజీ కంపెనీ ఫైర్ 42ను కొనుగోలు చేసింది. హైదరాబాద్, బెంగళూరుల్లో సేవలందిస్తున్న హలోకర్రీ... ఢిల్లీ, గుర్గావ్, ముంబై, గుజరాత్, పుణెలకూ విస్తరిస్తున్నట్లు కంపెనీ సీఈఓ రాజు భూపతి చెప్పారు. జంక్‌ఫుడ్ కు దూరంగా ఉండే మెట్రోవాసుల కోసం ‘హార్ట్ అండ్ సోల్.కో.ఇన్’ స్థాపించారు హైదరాబాద్‌కు చెందిన ఆర్జున్. రాగి, జొన్నలతో పాటు స్థానికంగా లభించే సేంద్రీయ ఉత్పత్తులతో జొన్న రొట్టెలు, బిస్కెట్ల వంటి ఫుడ్ ఐటమ్స్‌ను విక్రయించడం దీని ప్రత్యేకత. ఇక హైదరాబాద్ కు చెందిన ‘సూప్స్ అండ్ సలాడ్స్’ కేవలం సలాడ్స్నే విక్రయిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తులతోనే సూప్స్, సలాడ్లను తయారు చేస్తామని.. కాలానుగుణంగా మెనూ మారుతుంటుందని దీని వ్యవస్థాపకురాలు సౌజన్య చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీకి రోజుకు 200 వరకు ఆర్డర్లొస్తున్నాయి. 2020కల్లా 42 లక్షల కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ 370 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో సంఘటిత ఆహారం మార్కెట్ విలువ 48 బిలియన్ డాలర్లు (రూ.3 లక్షల కోట్లు)గా ఉంటే.. ఇందులో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ మార్కెట్ విలువ రూ.94,755 కోట్లు(15 బిలియన్ డాలర్లు)గా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏటా ఫుడ్ డెలివరీ మార్కెట్ 30 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. 2020 నాటికి 42 లక్షల కోట్లకు చేరుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక వెల్లడించింది. టీ, స్నాక్స్ కూడా ఆన్లైన్లోనే.. ముంబైలో ప్రసిద్ధి చెందిన చాయ్‌వాలాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది ‘చోటు చాయ్‌వాలా.కామ్’. ఇందులో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తికి కార్యాలయానికైనా, ఇంటికైనా నిర్ణీత సమయానికి టీ, స్నాక్ డెలివరీ చేయటమే దీని ప్రత్యేకత. ‘‘ప్రస్తుతం ముంబైలో అతిపెద్ద మార్కెట్ ఏరియా అయిన బాంద్రాలో ప్రారంభించాం. నెలకు 500 ఆర్డర్లొస్తున్నాయి. వారానికి రూ.70 చెల్లిస్తే చాలు. ఐదు రోజులు క్రమం తప్పకుండా టీ చేతికొస్తుంది’’ అని సంస్థ సీఈఓ నితిన్ చెప్పారు. ఇక ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ-క్యాటరింగ్ సేవల కింద కేఎఫ్‌సీ మీల్‌కు ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుతానికి న్యూఢిల్లీ మీదుగా ప్రయాణించే 12 రైళ్లలో ప్రవేశపెట్టామని.. ఈ నెలాఖరులోగా విశాఖపట్నం, హైదరాబాద్ (కాచిగూడ),బెంగళూరు (యశ్వంత్‌పూర్) స్టేషన్ల నుంచి కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని కేఎఫ్ఎసీ ప్రకటించింది. ఇంటికొచ్చే షెఫ్... అర్ధరాత్రి మీల్స్ స్టార్టప్స్ ఫుడ్ ఆర్డర్ల వరకే పరిమితం కాలేదు. షెఫ్‌లే ఏకంగా ఇంటికొచ్చి వంట చేసి పెడుతున్నారు కూడా. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రెస్టోకిచ్ ఈ రకమైన సేవలందిస్తోంది. దీంతో పార్టీ సమయాల్లో ఇంట్లోని సభ్యులు వంటింటికే పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీని ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం పుణె, ముంబైల్లో సేవలందిస్తున్న రెస్టోకిచ్ను... ఏడాదిలోగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవాల్లో విస్తరించే యోచన ఉన్నట్లు సంస్థ ఫౌండర్ ముకుల్ తెలిపారు. ఇక ‘ది బూటీకాల్’ స్టార్టప్ది మరో ప్రత్యేకత. కేవలం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తుంది ఈ సంస్థ. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, లేట్ నైట్ పార్టీలకు వెళ్లేవారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్... బూటీకాల్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. -
బ్రహ్మచారులతో తస్మాత్ జాగ్రత్త!
ఇళ్లు అద్దెకు తీసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను విజయనగరం జిల్లా సాలూరులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, 6 తులాల బంగారం, సెల్ఫోన్లు, 3 లక్షల రూపాయల విలువైన రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో విద్యార్థులమని, ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నామంటూ అద్దెకు వచ్చే బ్రహ్మచారులతో జాగ్రత్తగా ఉండాలని సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి తెలిపారు. గుర్తింపు కార్డులు తీసుకోకుండా ఎవరికీ ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని ఆయన ఇళ్ల యజమానులకు సూచించారు. -
ఓ సరదా పందెం... వేల జీవితాలకు వెలుగు
పందేలు జీవితాలను పాడుచేస్తాయి కదా. కానీ, ఇక్కడ ఒక సరదా పందెం కొన్ని వందల జీవితాలకు వెలుగు నిచ్చింది. తమాషా ఏంటంటే.. అది ఇద్దరు తాగుబోతులు వేసుకున్న పందెం. ఆ పందెం మొదలైనప్పుడు ఆ విషయం అందులో పాల్గొన్నవారికి ఎవరికీ తెలియదు. ఏమిటా పందెం? ఎవరు వేశారది? విజయవంతంగా పందెం పూర్తి చేసిన పీటర్ ఆ సొమ్మును కంబోడియాలో వ్యభిచార కూపంలో దిగుతున్న అమాయకులైన ఆడపిల్లలను ఆదుకోవడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రీటు షైన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. ఐర్లాండ్‌లోని ఆర్మోయ్ పట్టణం అది. ఒక గదిలో ఇద్దరు బ్యాచిలర్స్ ఉన్నారు. పార్టీలు, సరదాలు, షికార్లు... అప్పుడప్పుడు చదువులు! ఇదీ వారి వ్యాపకం. ఓ రోజు రాత్రి వారిద్దరు పార్టీ చేసుకున్నారు. పూటుగా మందు తాగి... మాటలు పెరిగాయి. అందులో ఒకరు ‘ఈ జీవితం బోర్ కొట్టిందిరా... ఓ వారం దీన్నుంచి పూర్తిగా దూరంగా ఉండాల’న్నారు... వారిద్దరిలో ఒకడైన పీటర్ లినాగ్ (33) ‘నువ్వు వారం ఉంటావా? అయితే నేను ఏడాది పాటు అమ్మాయిలకు దూరంగా ఉంటాను’ అన్నాడు. మరో మిత్రుడు ‘‘కోతలు ఎందుకురా... నీ వల్ల కాదు’’ అన్నాడు. లేదు కచ్చితంగా ఉంటాను అన్నాడు పీటర్. ‘‘అయితే పందెం కడతా, నువ్వు ఏడాది ఉండలేవు’’ అన్నాడు మిత్రుడు. ఆ పందేనికి పీటర్ ఒప్పుకున్నాడు. ‘‘ఏడాది పాటు అమ్మాయిలకు దూరంగా ఉంటే నీకు నేను 2000 డాలర్లు ఇస్తాను’’ అన్నాడు మిత్రుడు. ‘‘పందెం ఓకే గానీ ఆ డబ్బు నేను చారిటీకి ఇస్తాను నీకు ఓకేనా?’’ అని పీటర్ ప్రతిపాదించాడు. ‘‘ఒరే నువ్వు మొదట పందెం గెలువు, అప్పుడు కదా. అయినా నువ్వు ఏమైనా చేసుకో ఆ డబ్బుతో’’ అని ఆ రోజు పార్టీ ముగించారు. పీటర్ ఎంత అమ్మాయిలతో తిరిగేవాడైనా పుస్తకాల పురుగు. కాస్త దాతృత్వం కూడా ఉన్న వ్యక్తి. వెంటనే తనకు పరిచయం ఉన్న ఓ ఫౌండేషన్ నిర్వహకుడికి ఫోన్ చేసి, ఈ విషయం చెప్పి ‘‘నేను మీ సంస్థకు డొనేట్ చేస్తాను’’ అన్నాడు. ఆయన నవ్వుతూనే ‘‘సరే, సంతోషం’’ అన్నాడు. అయితే ఈ పందేన్ని పీటర్ మనసులో పెట్టుకోకుండా ఫేస్బుక్లో షేర్ చేశాడు. ‘పందెంపై వెనక్కు తగ్గే ఆలోచనే రాకుండా ఈ పందెం అందరికీ చెబుతున్నాను’ అంటూ దాని గురించి ఫేస్బుక్లో పెట్టాడు. ఆ పందెం డబ్బులు దానం చేస్తాను అన్న విషయం కూడా ఆ పోస్టులో పెట్టాడు. దానికి ‘పీటీస్ ఛేస్టిటీ ఫర్ చారిటీ’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ పందెం కాలం 2013 జనవరి 1 నుంచి 2014 జనవరి ఒకటి వరకు. ఈ విచిత్రమైన పోస్టుకు మిత్రుల నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు నవ్వితే ఇంకొందరు రకరకాల సెటైర్లు వేశారు. కొందరు మిత్రులయితే ఏకంగా నేను కూడా పందెం కడుతున్నాను... నా వంతు 400 డాలర్లు, నా వంతు 600 డాలర్లు, నాది వెయ్యి డాలర్లు అంటూ మిత్రులు కామెంట్లలో మరిన్ని పందేలు కాశారు. అలా ఉబుసుపోక వేసుకున్న ఈ పందెం మిత్రుల సర్కిల్లో ప్రాచుర్యం పొంది.. ఇంకొందరు పందెం కట్టారు. దీంతో ఏడాది ముగిసే నాటికి అన్ని పందెం డబ్బులు కలిసి 50 వేల డాలర్లు అయ్యాయి. అంటే మన కరెన్సీ ప్రకారం 30 లక్షల రూపాయలు. విజయవంతంగా పందెం పూర్తి చేసిన పీటర్ ఆ సొమ్మును కంబోడియాలో వ్యభిచార కూపంలో దిగుతున్న అమాయకులైన ఆడపిల్లలను ఆదుకోవడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రీ టు షైన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. కంబోడియా కరెన్సీ ప్రకారం లెక్కేస్తే అది 20 కోట్ల రూపాయల సొమ్ము. ఉబుసుపోక వేసుకున్న ఒక పందెం ఒక మంచి పనికి ఇంత పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఎవరూ ఊహించలేదు. చిత్రమైన విషయం ఏంటంటే... అమ్మాయిలకు దూరంగా ఉండటానికి వేసుకున్న ఈ పందెం కొన్ని వేల మంది అమ్మాయిలకు ఆసరాగా నిలిచింది. వారికి చదువు, గూడు, గుడ్డ ఇచ్చింది. అంతేకాదు, పీటర్ జీవితం, ఆలోచనలు ఈ ఏడాదిలో పూర్తిగా మారిపోయాయి. అతను స్వయంగా కంబోడియా వెళ్లి వారికి ఎలా సాయం అందుతుందో చూశాడు. అంతేకాదు, భవిష్యత్తులో స్వంతంగా ఒక చారిటీ సంస్థను స్థాపించి... మరిన్ని నిధులు సేకరించి వీలైనంత మంది జీవితాలకు అండగా నిలుస్తానన్నారు. ఈ విచిత్రమైన పందెంతో సెలబ్రిటీగా మారిన పీటర్ ఇపుడు నేపాల్‌తో పాటు మరికొన్ని దేశాల్లో రకరకాల చారిటీలకు మద్దతుగా నిలుస్తుండడం మేలి మలుపు. -
బ్యాచిలర్ ఆఫ్ పాలిటిక్స్