baimsa
-
అధికారంలోకి రాగానే బైంసా ను దత్తత తీసుకుంటాం : బండి సంజయ్
-
ప్రాణదాతలుగా బైంసా యువకులు
సాక్షి, భైంసాటౌన్(ముథోల్): పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆపత్కాలంలో రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమైనా వెంటనే స్పందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఎందరికో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతూ ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ‘బ్లడ్ డోనర్స్’ పేరటి వాట్సాప్ గ్రూపు ప్రారంభించారు. 300 మంది సభ్యులున్న ఈ గ్రూపులో రక్తం కావాలి అనే సందేశమిస్తే చాలు.. క్షణాల్లో స్పందిస్తూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపు సభ్యుల్లో ఎక్కువ మంది నాలుగు, ఐదుసార్లు రక్తదానం చేసినవారే ఉన్నారు. ఒక్కరితో మొదలై.. భైంసా పట్టణానికి చెందిన దొడ్లోల్ల సురేశ్ స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ముథోల్ నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల నుంచి గర్భిణులు, క్షతగాత్రులు, ఇతర రోగులు భైంసాలోని ఏరియాస్పత్రికి వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో గర్భిణులు, ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి రక్తం అవసరం ఉండడం, స్థానికంగా బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో, రక్తదాతల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. దీంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి రక్తం తీసుకురావాల్సి వచ్చేది. ఒకానొక సమయంలో సకాలంలో రక్తం అందక చనిపోయినవారున్నారు. ఇదంతా సురేశ్‌ను కదిలించింది. ఒకసారి ఒక గర్భిణికి అత్యవసరంగా ‘0’ పాజిటివ్ రక్తం అవసరం ఉండడంతో, సురేశ్ తానే స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేశాడు. తను ఒక్కడు మాత్రమే కాకుండా తనలాంటి వారితో రక్తదానం కోసం అత్యవసర సమయాల్లో స్పందించేలా వాట్సాప్ గ్రూపు తయారు చేశాడు. ఆ గ్రూపునకు తనే అడ్మిన్‌గా ఉండి తనలాంటి రక్తదానం చేసేవారిని అందులో సభ్యులుగా చేర్చాడు. ఫలితంగా ప్రస్తుతం దాదాపు 300ల మంది సభ్యులతో ఆ గ్రూపు కొనసాగుతోంది. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమున్నా.. క్షణాల్లో గ్రూపు సభ్యులు స్పందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. రక్తకణాలు ఇచ్చా.. నేను భైంసా ఏరియాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తున్నాను. రెండేళ్ల క్రితం ఒక వ్యక్తి తీవ్రరక్త స్రావంతో ఆస్పత్రికి వచ్చాడు. అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉండడంతో, నేను వెంటనే రక్తదానం చేసేందుకు ముందుకొచ్చాను. స్థానికంగా బ్లడ్ బ్యాంక్ లేక చాలామంది ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినా అందులో నిల్వలు ఉండడం లేదు. ఒకసారి నా స్నేహితుడికి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు రక్తకణాలు దానంగా ఇచ్చాను. అది మరిచిపోలేని సందర్భం. – సురేశ్, బ్లడ్‌డోనర్స్ గ్రూప్ అడ్మిన్, భైంసా ఎంతో ఆనందంగా ఉంటుంది నాది ‘ఓ’ నెగిటివ్ బ్లడ్ గ్రూపు. నేను ఇప్పటి వరకు మూడుసార్లు రక్తదానం చేశాను. ఒక సందర్భంలో గర్భిణికి, మరో సందర్భంలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి.. ఇంకా ఇతర సందర్భంలో రక్తదానం చేశాను. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి సహాయ పడడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. – రాజు, భైంసా గర్భిణికి రక్తం తక్కువగా ఉండటంతో.. నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. నేను బ్లడ్ డోనర్స్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాను. ఒకసారి భైంసా ఏరియాస్పత్రికి రాత్రి సమయంలో ఓ గర్భిణిని తీసుకొచ్చారు. ఆపరేషన్ చేయాలంటే ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని సూచించారు. దీంతో ఎవరో బ్లడ్ డోనర్స్ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేశాను. – – సూర్యకిరణ్, భైంసా మూడుసార్లు రక్తదానం చేశా నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. నేను ఇప్పటివరకు మూడుసార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం ద్వారా ఆపద సమయంలో సహాయపడడం ఎంతో ఆనందంగా ఉంటుంది. బ్లడ్ డోనర్స్ గ్రూపులో రక్తం అవసరం అనగానే వెంటనే ఫోన్ చేసి స్పందిస్తాను. రక్తదానం చేయాలని నాతోటి మిత్రులకు కూడా చెబుతాను. – నరేశ్ -
కూలీ కొడుకు.. కేవీ డైరెక్టర్
వారిది రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం.. పనికోసం మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. తల్లిదండ్రుల బాధలను కళ్లారాచూసిన కొడుకు... కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అటువంటి ఓ ఆదర్శవంతమైన ఓ వ్యక్తి గురించి ఇవాళ తెలుసుకుందాం. భైంసా టౌన్ : సిరిమల సాంబన్నది మహారాష్ట్రలోని బుర్బుశి గ్రామం. తల్లి లక్ష్మీబాయి, తండ్రి దిగంబర్. ఇరువురూ వ్యవసాయ కూలీలే. వీరికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు కూతుళ్లు కాగా, సిరిమల సాంబన్న ఒక్కడే కొడుకు. బతుకుదెరువు కోసం పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే లక్ష్మిబాయి, దిగంబర్‌లు కుభీర్‌కు వలస వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. సాంబన్న విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. పదో తరగతి వరకు కుభీర్‌లోని జిల్లాపరిషత్ పాఠశాలలో చదువుకున్న సాంబన్న భైంసా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు. అనంతరం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతుండగా, 1987లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొలువు సాధించారు. కుభీర్ మండలంలో మొట్టమొదటి పోస్టింగ్ వచ్చింది. అయితే ఎప్పటికైనా ఇంకా ఉన్నత కొలువు సాధించాలని భావించిన సాంబన్న కొద్దిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1988లో కేంద్రీయ విద్యాలయంలో టీజీటీగా ఎంపికయ్యారు. ఏడాదిపాటు రామగుండంలో విధులు నిర్వర్తించారు. మళ్లీ 1989లో నవోదయ విద్యాలయంలో పీజీటీగా ఉద్యోగం వచ్చింది. నిజాంసాగర్లోని నవోదయ విద్యాలయంలో విధులు నిర్వర్తించారు. ఆ తరువాత 1994లో ఒడిశాలోని భువనేశ్వర్‌కు పదోన్నతిపై వెళ్లారు. 2003లో పంజాబ్‌లో భటిండాలో ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం గ్వాలియర్‌లోని జోనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
100 మీటర్ల లోపు ఏ ఫోనూ వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఏ వ్యక్తి కూడా సెల్ ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, చుట్టుపక్కల కూడా ఇలాంటి పరికరాలేవీ ఉపయోగించడానికి వీల్లేదని తెలిపింది. ఉల్లంఘించిన వారి నుంచి వాటిని జప్తు చేసి పోలింగ్ ముగిశాక, ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మాత్రమే తిరిగి ఇస్తామని పేర్కొంది. ఈ ఆదేశాలు శాంతిభద్రతలు పర్యవేక్షించే అధికారి, పోలింగ్‌బూత్‌లు, కౌంటింగ్ సెంటర్ల వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి వర్తించవని గురువారం విడుదల చేసిన ఉత్తర్వులో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల లోపు అభ్యర్థుల ఎన్నికల బూత్‌లు పెట్టరాదని, అభ్యర్థులు ఇలాంటి ఒక్కో బూత్‌లో ఒక టార్పాలిన్‌లో గొడుగు కింద ఒక బల్ల, రెండు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, దీనికి టెంట్ వేయరాదని స్పష్టం చేశారు. ఒక్కో బూత్‌లో అభ్యర్థికి సంబంధించిన ఒక్క బ్యానర్‌ను మాత్రమే ప్రదర్శించాలని తెలిపారు. ఇలాంటి బూత్‌లలో ప్రజలు గుమికూడరాదని, ఓటేశాక ఎవరూ ఈ బూత్‌ల వద్దకు రావొద్దని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘనలపై ఏ అధికారి అయినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు విధుల నిర్వహణలో వైఫల్యానికి చట్టప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆగస్టు తొలివారంలో మున్సిపోల్స్ పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం తెస్తున్న కొత్త మునిసిపల్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మునిసిపల్ బిల్లులకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించామని వెల్లడించారు. కొత్త మునిసిపల్ చట్టాల ఆమోదంకోసం ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 18న బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి వాటి ప్రతులను శాసన సభ్యులకు అందచేయనున్నారు. బిల్లులను చదివి అవగతం చేసుకోవడానికి సభ్యులకు అవసరమైన సమయం ఇచ్చేందుకు ఆ వెంటనే సభను మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. 19న బిల్లులపై చర్చించి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను కేవలం మునిసిపల్ బిల్లులను ఆమోదించేందుకు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తోంది. పశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బైంసా మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన కేసులో గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. చట్ట నిబంధనల మేరకు వార్డుల విభజన చేయాలని, అప్పటివరకూ బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించరాదని జస్టిస్ పి.నవీన్‌రావు ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండానే ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ కపిల్ షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సీహెచ్ నరేశ్‌రెడ్డి వినిపిస్తూ బైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ జబీర్ అహ్మద్‌కు అనుకూలంగా మున్సిపల్ కమిషనర్ చర్యలు ఉన్నాయన్నారు. వాదనల విన్న న్యాయమూర్తి బైంసా ఎన్నికలు నిర్వహించరాదన్న మధ్యంతర ఆదేశాల తోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
భైంసాలో స్వైన్‌ప్లూ ప్రత్యేక వార్డు
భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూ నివారణ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. బాసర కు చెందిన హర్ష(19) అనే యువతి గురువారం స్వైన్‌ప్లూతో మృతి చెందడంతో అధికారులు వేగంగా స్పందించి చర్యలు చేపట్టారు. తెలంగాఱలో స్వైన్‌ప్లూ విజృంభిస్తుండటంతో జిల్లాలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.