balaji temple
-
పూజారిని మాటల్లో పెట్టి బండి కొట్టేసిన బుడ్డోడు
-
12 ఏళ్లుగా.. రూ.12 కోట్లతో..
దుబ్బాక టౌన్: కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రూ.12 కోట్ల నిధులతో 12 ఏళ్లపాటు నిర్మాణం జరిగి అద్భుతంగా రూపుదిద్దుకుంది. 2009 నవంబర్ 1న చినజీయర్ స్వామి చేతుల మీదుగా భూమి పూజ పనులు ప్రారంభించారు. రెండు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో మొదటి అంతస్తులో స్వామి వారి మూలవిరాట్టు, కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమ వైపు గోదాదేవి ఆలయాలు నిర్మించారు. విశ్వక్సేనుడు, పంచముఖ ఆంజనేయస్వామి, గరుత్మంతుని ఉపాలయాలను నిర్మించారు. ధ్వజస్తంభపు కలపను నల్లమల అడవుల నుంచి, మూల విరాట్ విగ్రహాలు తమిళనాడులోని మహాబలిపురంలో, ఉత్సవ విగ్రహాలను కుంభకోణంలో తయారు చేయించారు. ఈ ఆలయంకోసం రూ. 4.25 కోట్లు ప్రభుత్వం కేటాయించగా, రూ. 7.75 కోట్లు విరాళాల ద్వారా సేకరించారు. చినజీయర్ చేతులమీదుగా.. 20న ఉదయం 10.28 నిమిషాలకు త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ఆలయం ప్రారం¿ోత్సవం, విగ్రహాలకు ప్రాణప్రతిష్ట జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ఆలయ శాశ్వత చైర్మన్ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావులు కుటుంబసమేతంగా హాజరుకానున్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
దేవాలయాల్లో దొంగలుపడ్డారు
శ్రీకాకుళం, పాతపట్నం: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటేశ్వర ఆలయం, మంజునాథ ఆలయాల్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. ఎస్ఐ ఎం.హరికృష్ణ, ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర ఆలయప్రధాన ద్వారం గుండా దొంగలు ప్రవేశించి, ఆలయం ముందు రెండు తాళాలను, ముఖద్వారం వద్ద ఒకటి, హుండి తాళం పగలకొట్టి నగదును చోరీ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రధాన అర్చకుడు చామర్తి జగన్నాథ ఆచార్యులు వచ్చేసరికి ఆలయ ముఖద్వారం తలుపు తెరిచి ఉండడంతో వెంటనే ఆలయ ఇన్చార్జి ఈవో వి.వి.సూర్యనారాయణకు చెప్పారు. ఈవో పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి క్యూస్‌టీం ఎస్ఐ మురళీ, ఎ.ఎస్ఐ సుజాత ఆధ్వర్యంలో హుండీని, ఆలయం తలుపులను పరిశీలించారు. మూడు తాళాలను ఇనుప రాడ్‌తో తొలగించినట్లు, ఒక తాళం మిషన్‌తో కట్ చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. హుండీలోని చిల్లర ఉంచి, నోట్లు మాత్రమే దొంగలు పట్టుకెళ్లారు. 60రోజు క్రింతం హుండీ లెక్కించామని, ప్రస్తుతం మూడు వేలు వరకు ఉండవచ్చని ఈవో చెప్పారు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే ప్రహారాజాపాలెంలోని మంజునాథ ఆలయంలో దొంగలు తాళాలు పగల గొట్టి హుండీ చోరి చేశారని ఆలయ అర్చకుడు సతీష్ చెప్పారు. 70 రోజు ల కిందట హుండీ లెక్కించామని పేర్కొన్నారు. -
బాలాజీ సన్నిధిలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల
అప్పనపల్లి(మామిడికుదురు) : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’, ‘బ్రహ్మోత్సవం, ముకుంద వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆదివారం అప్పనపల్లి శ్రీబాల బాలాజీస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులతో పాటు అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. ఉభయ దేవేరులతో కొలువు తీరిన స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాంత్ స్వామి వారి పాత గుడికి కూడా వెళ్లారు. ఆయనకు ధర్మకర్తలు బోనం బాబు, సుందరనీడి వీరబాబు స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత వరకు నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించానని, ఏటా సంక్రాంతి పండుగకు ఈ ప్రాంతానికి రావడం తనకు అలవాటని చెప్పారు. కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం వీక్షించడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. సంక్రాంతి పండుగ తరువాత కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు రావడం తనకు సెంటిమెంట్‌గా వస్తోందన్నారు. అదే సంప్రదాయంతో ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన వెంట తులా ఆదినారాయణ, అడబాల తాతకాపు, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
2014లో వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు
తిరుమల: 2014 ఏడాదిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు వచ్చిందని బుధవారం తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడాది శ్రీవారిని 2 కోట్ల 26 లక్షల 12 వేల 628 మంది దర్శించుకున్నారని వెల్లడించారు. కోటి 15 లక్షల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. దాదాపు 9 కోట్ల లడ్డూలు విక్రయించామని టీటీడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం: టీటీడీ
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. శీఘ్ర దర్శనం నాలుగు గంటల సమయం, కాలినడక వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 3 గంటల సమయం పడుతోందన్నారు. ప్రస్తుతం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. -
గోవిందా..గోవిందా..!
సాక్షి, ముంబై: వర్లీలోని బాలాజీ మందిరం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు మందిర కార్యవర్గం ఘనస్వాగతం పలికింది. కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మూలమూర్తి మంత్రహోమం, బలిహరణం, ఎదరుకోళ్ల ఉత్సవ ంతోపాటు పూర్ణకుంభ స్వాగత కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రవచనాల కార్యక్రమంలో చినజీయర్ స్వామి భక్తులకు ఉపదేశాలు చేశారు. మూడు రోజులు జరగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజున విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్సంగ్రహణం, అంకుర్చాణం, ధ్వజారోహణం తదితరాలతోపాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజు సాయంత్రం నిత్యహోమం, నిత్యపూర్ణాహుతి, సామూహిక విష్ణుసహస్రనామ విశేష ద్వాదశ షోడషోపచార ఆరాధన జరిగింది. గోవిందుని నామస్మరణతో... వర్లీ బీడీడీ చాల్ పరిసరాలు గోవిందుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. 84, 85 బిల్డింగ్ పరిసరాల్లో ఉన్న బాలాజీ దేవస్థానంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరిలో తెలుగు వారేకాకుండా మరాఠీ, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఉన్నారు. గోవిందా.. గోవిందా.., ఏడు కొండలవాడా వెంకటరమణా గోవిందా... గోవిందా.. అన్న నామస్మరణతో భక్తిమయ వాతావరణం నెలకొంది. వర్షంలో కూడా.... ఈ కార్యక్రమాల సందర్భంగా శనివారం 12 గంటల ప్రాంతంలో వర్షం వచ్చినప్పటికీ భక్తులు మాత్రం ఎక్కడికీ కదల్లేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దేవుణ్ని దర్శించుకునేవారు కూడా వస్తూనే ఉండడం కనిపించింది. ఈ సందర్భంగా ఆలయం ముందు రోడ్డును పూర్తిగా రాకపోకలకు మూసివేసి ఆరు బయటే టెంట్ వేశారు. అక్కడే భారీ సంఖ్యలో మహిళలతోపాటు పిల్లలు పెద్దలు కూర్చుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆ సమయంలో వర్షం కారణంగా టెంట్ నుంచి వర్షం నీరు కిందికి జారిపడుతున్నా కదలకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు శ్రీవారి ఊరేగింపు... శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో చివరి రోజు అనగా ఆదివారం శ్రీవారి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. అంతకుముందే కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు సంఘాలతోపాటు ఇతర సంఘాలు, సామాజిక సంస్థలు, ఇతర భక్త సమాజాలన్నీ ఎంతో సహకరిస్తున్నాయని దేవస్థానం అధ్యక్షుడు పొట్టబత్తిని కృష్ణహరి, ఉపాధ్యక్షుడు సిరిమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజా రేడేకర్, కోషాధికారి మ్యాన నాగేష్‌లు తెలిపారు. -
బాలాజీ మందిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
పుణే సిటీ, న్యూస్‌లైన్: ఘోర్పడి ప్రాంతంలోని బాలాజీ మందిరాన్ని బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ బాపట్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోపాల్ చింతల్, దిలీప్ కవడే, కంటోన్మెంట్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ మంత్రి, బాలాజీ మం దిర మాజీ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌రెడ్డి, కె.చెం చయ్య, కార్యవర్గ సభ్యులు సుబ్బారాయుడు పాల్గొన్నారు.