bankruptcy court
-
ఆర్‌కాం సంచలన నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. దివాళా పిటిషన్ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) కంపెనీ షేర్లకు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి. సుమారు రూ.40వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్‌కామ్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్‌కామ్ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది. దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్‌కామ్ షేరు 48 శాతం పతనమైంది. ఒక దశలో54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. దీంతోపాటు అడాగ్ గ్రూప్‌లోని రిలయన్స్ కేపిటల్ (12.5శాతం), రిలయన్స్ పవర్ (13శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్, రిలయన్స్ నావల్ తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. -
రొటొమ్యాక్ సంస్థలు మూత..?
ముంబై : రొటొమ్యాక్ సంస్థలు మూత పడబోతున్నాయి. బ్యాంకులకు దాదాపు రూ.4000 కోట్లు బకాయి పడిన రెండు రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన సమయం ముగియడంతో, ప్రస్తుతం ఆ కంపెనీలను దివాలా కోర్టు వేలం వేయబోతుంది. రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలు 90 రోజుల అదనపు సమయం కోరగా.. మరింత సమయం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయి. ముందస్తు ఇచ్చిన డెడ్‌లైన్ మార్చి 19తో ముగియబోతుంది. దీంతో విక్రమ్ కొఠారికి చెందిన రొటొమ్యాక్ ఎక్స్‌పోర్ట్స్, రొటొమ్యాక్ గ్లోబల్ సంస్థలను దివాలా కోర్టు వేలం వేయబోతున్నట్టు తెలిసింది. మరో రెజుల్యూషన్ ప్లాన్ లేకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడైంది. రొటొమ్యాక్ కంపెనీల రెజుల్యూషన్ ప్రొఫిషనల్ అనిల్ గోయల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బ్యాంకులు ముందస్తు ఇచ్చిన గడువును పొడగించడానికి తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం తుది గడువు పొడిగింపుపై ఓటింగ్ కోసం సమావేశమైన క్రెడిటార్ల కమిటీ, ఈ సందర్భంగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కొన్ని రోజుల క్రితమే రుణాల డిఫాల్ట్ కేసులో రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్ కొఠారిలను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరు విచారణకు సహకరించకపోవడంతోనే, అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలకు రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.4000 కోట్లు బకాయి పడిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. బ్యాంకు ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొఠారిపై సీబీఐ తొలుత ఈ కేసు నమోదుచేసింది. రొటొమ్యాక్ సంస్థలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 754.77 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 456.63 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 771.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 458.95 కోట్లు, అలహాబాద్ బ్యాంకు రూ. 330.68 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 49.82 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 97.47 కోట్ల రుణాలిచ్చాయి. -
కంపెనీలకు యాక్సిస్ బ్యాంకు హెచ్చరిక
సాక్షి, ముంబై : బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొట్టి, ఏం పట్టనట్టు కాలయాపన చేస్తున్న సంస్థలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉక్కుపాదం మోపుతోంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆ సంస్థలపై కఠిన చర్యలకు బ్యాంకులు కూడా సిద్ధమయ్యాయి. బ్యాంకులకు భారీగా బాకీపడిన కంపెనీల అదనపు జాబితాను ఆర్బీఐ రూపొందించిందని, వీటిపై బ్యాంకులు దృష్టిసారించాలని యాక్సిస్ బ్యాంకు చెప్పింది. డిసెంబర్ 13 వరకు వారు తమ సమస్యాత్మక రుణాలను పరిష్కారం చేసుకోకపోతే, దివాలా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని డిఫాల్టర్ సంస్థలను యాక్సిస్ బ్యాంకు హెచ్చరించింది. అయితే ఆ కంపెనీల జాబితాను మాత్రం యాక్సిస్ బ్యాంకు విడుదల చేయలేదు. ఎన్ని కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయో కూడా బహిర్గతం చేయలేదు. తొలిసారి ఆర్బీఐ జారీచేసిన ఆదేశాల్లో, డిసెంబర్ మధ్య వరకు కంపెనీలు తమ రుణాల సమస్యను పరిష్కరించుకోవాలని, లేదంటే దివాలా కోర్టుకు తరలించాలని బ్యాంకులకు పేర్కొంది. ఈ జాబితాలో కనీసం 20 బాకీపడిన కంపెనీలుండగా... వాటిలో 12 అతిపెద్ద డిఫాల్టడ్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం రెండో విడత జాబితాను కూడా ఆర్బీఐ రూపొందించిందని తెలిసింది. వీటిలో 26 వరకు సంస్థలున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులకు అందిస్తున్న కొత్త అధికారాల కింద ఈ సంస్థలు గడువు లోపు బకాయిలను పరిష్కరించుకోకపోతే దివాలా కోర్టుకు తరలించాలని ఆదేశించింది. ఆర్బీఐ జాబితాలోని 12 కంపెనీల రుణాల్లో యాక్సిస్ బ్యాంకు అవుట్‌స్టాండింగ్ లోన్స్ 1843 కోట్లు. నాన్-ఫండ్ అవుట్‌స్టాండింగ్ లోన్స్ 649 కోట్లు.