Bashar Assad
-
బషర్ అసద్‌పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్‌కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్‌పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
దాడికి దిగితే యుద్ధమే
కైరో: అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక దాడికి దిగితే యుద్ధం తప్పదని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మంగళవారం హెచ్చరించారు. దాడికి దిగితే తీవ్ర పరిణామాలుంటాయని ఫ్రెంచి పత్రిక ‘లె ఫిరాగో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసద్ ఈ మేరకు స్పష్టంచేశారు. సిరియా పౌరులపై అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందనే ఆరోపణలతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు సిరియాపై సైనిక దాడి జరపడంపై మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో అసద్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. మరోవైపు సిరియాపై దాడికి అమెరికన్ కాంగ్రెస్ మద్దతు కోరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ మెక్కెయిన్, లిండ్సే గ్రాహంలు మద్దతుపలికారు. అదేవిధంగా అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ మంగళవారం‘స్పారో’ క్షిపణి పరీక్ష నిర్వహించడమూ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచింది. ఇదిలాఉండగా, ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకుండా సిరియాపై సైనికదాడిలో తాము పాల్గొనబోమని జర్మనీ స్పష్టం చేసింది. కాగా.. సిరియాపై సైనిక దాడి జరిపే అంశంలో భారత్ మద్దతు ఉందని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సంక్షోభం పరిష్కారానికి సైనిక చర్యకు దిగరాదని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. -
దాడులకు పాల్పడితే బుద్ధి చెబుతాం: అసద్
డెమాస్కస్ : బరి తెగించి తమపై ఎవరు దాడులకు పాల్పడినా తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా, తగిన బుద్ధి చెప్తామని సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అసాద్ హెచ్చరించారు. సిరియాపై దాడిచేయాలని కోరుకుంటున్న శక్తులకు రసాయన ఆయుధాలు ఒక సాకు మాత్రమేనన్నారు. సిరియన్లు శాంతియుత స్వేచ్ఛా జీవితం గడపడం ఇష్టంలేని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. రసాయన ఆయుధాలు ఉపయోగించింది తిరుగుబాటు సైన్యమేనని అసద్ స్పష్టం చేశారు. దూకుడుగా వ్యవహరించి సిరియాపై సైనిక దాడి చేస్తే.. అది సాహసమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాము రసాయన ఆయుధాలు ప్రయోగించామని చెప్పేందుకు ఏ సాక్ష్యాధారాలున్నాయో చూపాలని అసద్ సవాల్ విసిరారు. ఓ వైపు.. ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం తనిఖీ నివేదికలు ఇంకా ఇవ్వకుండానే.. తీర్పులు ఇచ్చేస్తున్న శక్తుల ఉద్దేశాలు వేరని వ్యాఖ్యానించారు.