డెమాస్కస్ : బరి తెగించి తమపై ఎవరు దాడులకు పాల్పడినా తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా, తగిన బుద్ధి చెప్తామని సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అసాద్ హెచ్చరించారు. సిరియాపై దాడిచేయాలని కోరుకుంటున్న శక్తులకు రసాయన ఆయుధాలు ఒక సాకు మాత్రమేనన్నారు. సిరియన్లు శాంతియుత స్వేచ్ఛా జీవితం గడపడం ఇష్టంలేని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
రసాయన ఆయుధాలు ఉపయోగించింది తిరుగుబాటు సైన్యమేనని అసద్ స్పష్టం చేశారు. దూకుడుగా వ్యవహరించి సిరియాపై సైనిక దాడి చేస్తే.. అది సాహసమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాము రసాయన ఆయుధాలు ప్రయోగించామని చెప్పేందుకు ఏ సాక్ష్యాధారాలున్నాయో చూపాలని అసద్ సవాల్ విసిరారు. ఓ వైపు.. ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం తనిఖీ నివేదికలు ఇంకా ఇవ్వకుండానే.. తీర్పులు ఇచ్చేస్తున్న శక్తుల ఉద్దేశాలు వేరని వ్యాఖ్యానించారు.