Bee Farming
-
TS Election 2023: పార్టీ బీఫాంలతో.. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో కొత్త గుబులు!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వివిధ రాజకీయ పార్టీల ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ ఇదివరకే అభ్యర్థులను ప్రకటించింది. కొద్దిరోజుల్లో పార్టీ బీఫాంలు అందజేయనుండగా వారిలో గుబులు మొదలైంది. కాగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. దసరాలోపు అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు ఫుల్స్టాప్ పెడతాయా? లేదా.. మరింత జాప్యం చేస్తాయా? అని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఎప్పుడో? ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్యాల సుహాసినీరెడ్డి పోటీ పడుతున్నారు. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ టికెట్ ఆశిస్తున్నారు. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా పలువురు ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దసరా లోపే జాబితా ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీల్లో సర్వేల ఆధారంగా అభ్యర్థుల వడపోత జరగనుంది. ఆ తర్వాత మిగలిన పేర్లు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయా పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఇదీ పరిస్థితి.. కాంగ్రెస్ టికెట్ విషయంలో నియోజకవర్గాల వారీగా కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ నుంచి శ్యామ్‌నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బోథ్ నుంచి ఇంకా ఎవరిపేరు తెరపైకి రాలేదు. అయితే ఆ పార్టీ నుంచి అభ్యర్థుల జాబితా ఖరారైనప్పుడే ఈ ఉత్కంఠకు తెరపడే పరిస్థితి ఉంది. మహిళా అభ్యర్థుల ఆశలు.. కాంగ్రెస్ నుంచి గండ్రత్ సుజాత, బీజేపీ నుంచి చిట్యాల సుహాసినీరెడ్డి ఆయా పార్టీల అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు ఆమోదం పొందిన తర్వాత అది అమలుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మహిళా ఆశావహులపై పార్టీల పరిశీలన ఎలా ఉంటుందనే విషయంలో వారు ఆశలు పెట్టుకున్నారు. పార్టీలు అవకాశం కల్పిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మహిళా నేతలు ఆసక్తి కనబర్చుతున్నారు. -
చదివింది బీటెక్ ... చేస్తుంది వ్యవసాయం ఆదర్శంగా యువరైతు
-
తేనెటీగల పెంపకంలో సాంకేతిక సహకారం... కిలో తేనె కోటి రూపాయలు...
-
తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. 5 రకాల రుచుల్లో తేనె
బీటెక్, డిగ్రీ లేదంటే ఎంబీఏ, కుదిరితే ఎంటెక్ పూర్తిచేసి ఏదో ఓ కంపెనీలో ప్లేస్మెంట్ సంపాదించాలి. లేదంటే పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రభుత్వ కొలువు కొట్టాలి. ఇదీ ప్రస్తుతం యువత ఆలోచన ధోరణి. వ్యవసాయం, కొత్త వ్యాపారం చేయాలని వందలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా వినూత్నంగా ఆలోచించిన వారిలో వరంగల్ మట్టెవాడకు చెందిన మాడిశెట్టి హర్షవర్ధన్ ఒకరు. రిస్క్‌తో కూడిన తేనె ఉత్పత్తి పంటను ఎంచుకుని రాణిస్తున్నాడు. హర్షవర్ధన్ పై సాక్షి ప్రత్యేక కథనం. తల్లిపై ప్రేమతో.. హర్షవర్ధన్ స్కేటింగ్ కోచ్. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్ఎల్బీ చేస్తున్నాడు. అతడి తల్లి ప్రతిభ పింగళి కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్. అందరి యువకుల మాదిరిగానే ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. కానీ తల్లిపై ప్రేమ కొత్త ఆలోచనకు తెరలేపింది. కరోనా వేవ్‌లో హర్షవర్ధన్ తల్లి ప్రతిభకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రతి రోజూ ఉదయం నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. మార్కెట్లో తెచ్చిన తేనె స్వచ్ఛతపై హర్షవర్ధన్‌కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో స్వచ్ఛమైన తేనె గురించి యూట్యూబ్‌లో అన్వేషించాడు. ఎక్కడ లభిస్తుంది.. ఎలా ఉత్పత్తి చేస్తారని వెతికాడు. చివరికి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ సంస్థలో తేనెటీగల పెంపకం, ఉత్పత్తిపై ఐదు రోజుల శిక్షణ తీసుకున్నాడు. చేనులో ఏర్పాటు చేసిన తేనెటీగల బాక్సులు మొదట రెండు బాక్సులతో.. శిక్షణ అనంతరం హైదరాబాద్‌లోనే తేనెటీగలు పెంచే బాక్సులను ఒక్కో బాక్స్ రూ.12వేలతో రెండింటిని కొనుగోలు చేశాడు. ఎఫీస్ మెలిఫెరా అనే ఇటాలియన్ తేనెటీగలు ఒక్కో బాక్సులో 50 వేల నుంచి లక్ష వరకు నివాసం ఉంటాయి. ఆ బాక్సులను మట్టెవాడలో తాను శిక్షణ ఇచ్చే స్కేటింగ్ రింక్ వద్ద చెట్లపై ఉంచాడు. సుమారు 45 రోజుల్లో పంట చేతికొచ్చింది. రెండు బాక్సుల నుంచి తేనె వేరు చేయడం సాధ్యం కాదని మరో 10 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వరంగల్ శివారు స్తంభంపెల్లిలో స్థానిక రైతు సాయంతో పొలంలో ఉంచాడు. దీంతో మొదటిసారి 11 కేజీల స్వచ్ఛమైన తేనే వచ్చింది. సెకండ్ లాక్డౌన్ సమయంలో తేనెను బంధువులు, స్నేహితులకు అందజేశాడు. ఆ తర్వాత ధైర్యం చేసి 100 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వర్ధన్నపేట శివారులో పంట చేన్ల వద్ద ఉంచి తేనెటీగల పెంపకాన్ని కొనసాగించాడు. మంచి లాభం వచ్చింది. దీంతో 200 బాక్సులు తెప్పించి కోరుట్ల, అమ్మవారిపేటలోని పొద్దుతిరుగుడు, ఆవాల పంటల వద్ద ఉంచాడు. అవి జన్యుమార్పిడి పంటలు కావడంతో 50 బాక్సుల్లోని తేనేటీగలు మృత్యువాత పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాడు. తేనెటీగల బాక్సుల వద్ద హర్షవర్ధన్ 450 బాక్సుల్లో.. ఐదు రకాల తేనె.. నష్టపోయిన అనంతరం నిపుణుల వద్ద హర్షవర్ధన్ మరింత శిక్షణ తీసుకున్నాడు. ఏడాదిన్నర కాలంలో తేనె ఉత్పత్తిపై మంచి అనుభవం సంపాధించాడు. పూర్తి పరిజ్ఞానంతో తేనెలో సైతం వివిధ రకాల రుచులు ఉంటాయని తెలుసుకుని సిద్దిపేట, నల్గొండ శివారు గ్రామాల్లో పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, అల్లనేరేడు, ఓమ, తులసి పంటల రైతులతో మాట్లాడి పొలాల్లో 162 బాక్సులను ఉంచాడు. ఈసారి ఆ బాక్సుల నుంచి 200 కేజీల తేనె దిగుమతిగా వచ్చింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో 450 బాక్సుల ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నాడు. హర్షవర్ధన్ వద్ద ప్రస్తుతం ఆవాలు, నువ్వులు, ఓమ, అల్లనేరేడు, తులసి రుచులలో తేనె వేర్వేరుగా లభిస్తోంది. ప్రత్యేక స్టోర్.. కార్పొరేట్ కంపెనీల మాదిరిగా పబ్లిసిటి చేసుకోలేని హర్షవర్ధన్ ప్రస్తుతం హనుమకొండలోని డీఐజీ బంగ్లా ఎదురుగా షెటర్ అద్దెకు తీసుకుని ‘హర్ష నేచురల్ హనీ’ పేరుతో స్టోర్ ఏర్పాటు చేశాడు. మొదట్లో మార్కెటింగ్ కోసం ఇబ్బందిపడినా ప్రస్తుతం ఆన్లైన్, పరిచయాల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాడు. రుణం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి తేనెటీగల పెంపకం ఖర్చు, రిస్క్‌తో కూడుకున్నది. వ్యయప్రయసలకు ఓర్చి తేనె ఉత్పత్తి చేస్తున్న తనలాంటి వారికి ప్రభుత్వం రాయితీపై రుణంతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. – మాడిశెట్టి హర్షవర్ధన్ -
ఎకరా భూమి..రూ.3.68 లక్షల ఆదాయం
సాక్షి, నల్లగొండ(నేరేడుచర్ల): ఆలోచన ఉంటే ఆదాయ మార్గాలు అనేకం అంటున్నారు.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధి శాంతినగర్‌కు చెందిన బాణావత్ రాజేశ్వరి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఆదాయం పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఈ సాధారణ గృహిణి. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈమె భర్త పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా కుమారుడు హైదరాబాద్‌లో ఉన్నత విద్య (బీటెక్) అభ్యసిస్తున్నాడు. కాలక్షేపానికి మల్లెపూల సాగు రాజేశ్వరి–శ్రీనివాస్ దంపతులకు శాంతినగర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో కొంత ఇంటి నిర్మాణానికి పోగా ఎకరా భూమి ఉంది. కుమారుడు హైదరాబాద్‌లో చదువుతుండడంతో పాటు భర్త ఉద్యోగానికి వెళ్తుండడంతో రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉండేది. కాలక్షేపం కోసం రాజేశ్వరి కొన్నేళ్ల క్రితం తమకున్న ఎకరా భూమిలో మల్లెపూల సాగు చేపట్టింది. తైవాన్ జామతో ఏడాదికి రూ.80వేలు అయితే, రాజేశ్వరి అనుకున్న మేరకు ఆదాయం రాకపొవడంతో నాలుగేళ్ల క్రితం మల్లెతోటను తొలగించింది. వాటి స్థానంలో బెంగుళూరు నుంచి తైవాన్ జామ మొక్కలను తీసుకవచ్చి పెంచారు. జామతోట కాపునకు వచ్చి సంవత్సరానికి రెండు కాపుల్లో 80వేల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. అంతరపంటగా ఖర్జూర కాగా, రాజేశ్వరి ఒక్క జామతోటపైనే ఆధారపడకుండా అంతర పంటగా వివిధ రకాలకు చెందిన 100 వరకు ఖర్జూరా మొక్కలు పెంచుతోంది. వీటిలో బరిహి, ఖనిజా, మెట్జోల్, సీసీ, సగాయి. ఆజ్యా, ఆమ్రా వంటి రకాలైన ఖర్జూర మొక్కలను నాలుగేళ్లుగా పెంచుతున్నారు. పంట మరో ఏడాదిలో చేతికి వస్తుంది. మరి కొంతకాలం గడిస్తే వివిధ రకాల ఖర్జూరాలతో ఏడాదికి రూ.5 నుంచి 10లక్షల ఆదాయం వస్తుందని రాజేశ్వరి అంచనా వేస్తున్నారు. తేనెటీగల పెంపకంతో.. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కేవీకేలో తెనే టీగల పెంపకంపై రాజేశ్వరి గత ఏడాది శిక్షణ తీసుకున్నారు. అనంతరం జామ, ఖర్జూర తోటలో అంతర పంటగా తేనే టీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజేశ్వరీ తన ఆలోచనను భర్త శ్రీనివాస్‌కు తెలియజేసింది. ఆయన రాజేశ్వరీ సహాయ సహకారాలతో పాటు ప్రోత్సాహాన్ని అందించారు. తేనెటీగల పెంపకానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఒక్కోదానికి 15వేల రూపాయలను వెచ్చించి 14 పెట్టెలను తీసుకవచ్చి పెంచుతున్నారు. తేనె టీగలు బయటకు వెళ్లి పూలలోని మకరందాన్ని ఆస్వాధించేందుకు పెట్టెలు కింది భాగంలో కొంత ఖాళీ స్థలాన్ని వదిలారు. పెట్టెలలోని తేనె టీగలను నియంత్రించేందుకు రాణీ ఈగ ఉంటుంది. తేనె టీగలు ఒక్కసారి పెంపకం మొదలు పెడితే ఒక్కో తేనె టీగ రెండు వేల వరకు గుడ్లు పెడతాయని రాజేశ్వరీ వివరించింది. ఆ గుడ్లు పిల్లలుగా మారి ఎటు వంటి పెట్టుబడి లేకుండా ఫలితాలు ఇస్తాయంటోంది. తేనె టీగల పెంపకం ద్వారా నెలకు 40 కేజీల తేనే ఉత్పత్తి అవుతుందని, కిలో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు.ప్రస్తుతం జామపై ఏడాదికి రూ.80 వేల ఆదాయంతో పాటు తేనెపై రూ.24 వేల ఆదాయం వస్తుంది.ఖర్జూర పంట చేతికి వస్తే ఆదాయం మూడింతలకు పైగా పెగుతుందని రాజేశ్వరి పేర్కొంటోంది. మంచి లాభాలు గడిస్తున్నా కాలక్షేపానికి తొలుత మల్లెపూల సాగు చేపట్టా. ఆ తర్వాత జామ, ఖర్జూర, తేనెటీగల పెంపకంతో మంచి లాభాలు గడిస్తున్నా. తాము పెంచుతున్న తేనె టీగల ద్వారా ఉత్పత్తి అవుతున్న తేనెను పరిసర ప్రాంతాల ప్రజలు తోట దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెంటింగ్ చేయడం కూడా సులువుగా ఉంది. ఖర్జూరా పంట చేతికొస్తే ఆదాయం మూడింతలు పెరగనుంది. – బాణావత్ రాజేశ్వరి, నేరేడుచర్ల -
తేనె పట్టుంచుకోండి!
అనుక్షణం శ్రమించే అన్నదాతకు దీటుగా అవిశ్రాంతంగా రెక్కలను ముక్కలు చేసుకునే జీవి ఏదైనా ఈ భూతలమ్మీద ఉన్నదీ అంటే అది తేనెటీగ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. తెల్లారింది మొదలు ప్రతి పువ్వునూ ముద్దాడే తేనెటీగ మకరందాన్ని, పుప్పొడినీ విసుగూ విరామం లేకుండా పోగేసి.. రైతు మాదిరిగా అమూల్యమైన అమృతాహారాన్ని (తేనెను) నిండుమనసుతో మన దోసిట్లో పోస్తుంది. అంతేకాదు.. పనిలో పనిగా పంట మొక్కల్లో, ఔషధ మొక్కల్లో పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తుంది. జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని జీవవంతం చేస్తుంటుంది. అయితే, పొలం అంతా ఏదో ఒకే రకం పంటల(మోనోకల్చర్)ను మాత్రమే సాగు చేస్తూ, అతి ప్రమాదకర రసాయనిక పురుగుమందులు (నియోనికుటినాయిడ్స్) వాడుతూ తేనెటీగల మనుగడను దెబ్బతీస్తున్నాం. ప్రకృతి, వ్యవసాయం పదికాలాల పాటు పచ్చగా పరిఢవిల్లాలంటే.. తేనెటీగలను కంటి రెప్పల్లా కాపాడుకోవాలి. ఇందుకు మనందరం దీక్షగా పనిగట్టుకోవాలని అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం (మే 20) పిలుపు ఇస్తోంది.. అందిపుచ్చుకుందాం రండి.. తేనెటీగల పెంపకం ఎలా? ఆధునిక పద్ధతుల్లో పెట్టెలను అమర్చి, వాటిలో తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పంటల్లో దిగుబడి పెంచేందుకు తేనెటీగలు ఉపయోగపడతాయి. నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేసి మంచి ఆదాయం పొందవచ్చు. తేనెతోపాటు మైనం, రాయల్ జెల్లీ (రాజాహారం), పుప్పొడి తదితర ఉప ఉత్పత్తులను పొందవచ్చు. తేనెటీగల పెంపకం ద్వారా గ్రామీణులు, ముఖ్యంగా మహిళలు, గ్రామాల్లోనే ఉపాధి పొందవచ్చు. శిక్షణ ఎవరిస్తారు? కేంద్ర లఘు పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో రాష్ట్ర స్థాయి తేనెటీగల పెంపకం విస్తరణ కేంద్రం ఉంది. రెండు పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంటారు. ఈ కేంద్రం ఆవరణలో 5 రోజుల పాటు తేనెటీగల పెంపకంలో రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. రుసుము రూ. 1,500. 18 ఏళ్లు వయసు నిండిన వారెవరైనా అర్హులే. ప్రతి నెలా ఒక బ్యాచ్‌కు ఈ విధంగా శిక్షణ ఇస్తుంటారు. దీనితోపాటు.. హనీ మిషన్ ప్రోగ్రామ్ కింద కెవిఐసి సిబ్బంది ఎంపిక చేసిన గ్రామాలకు తరలివెళ్లి అక్కడి వారికి తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 200 మందికి తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇచ్చారు. ఇందులో 128 మందికి పదేసి చొప్పున తేనెటీగల పెట్టెలను సైతం అందించామని టీ వీ రావు (94410 51039) ‘సాక్షి’తో చెప్పారు. విజయరాయ్లోని కెవిఐసి తేనెటీగల పెంపకం శిక్షణ కేంద్రంలో ఆయన జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. 4 జాతులకు చెందిన ఐరోపా తేనెటీగలను మన దేశంలో పెంచుతున్నారు. వీటిని ఆధునిక పద్ధతుల్లో పెంచడంలో మెలకువలను నేర్పడంతోపాటు నాణ్యమైన తేనె సేకరణ, ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తున్నామని రావు వివరించారు. ఒక్కో పెట్టెలో 50 వేల నుంచి పది లక్షల వరకు తేనెటీగలు ఉంటాయి. ఒక్కో పెట్టె ద్వారా 20–30 రోజుల్లో 5–10 కిలోల తేనె దిగుబడి వస్తుంది. ముచ్చటగా మూడో ఏడాది! అంటన్ జన్స... ఆధునిక తేనెటీగల పెంపకం పితామహుడు. ఆయన పుట్టిన రోజు అయిన మే 20వ తేదీన వరల్డ్ బీస్ డే జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 2018 నుంచి అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. ఇది మూడో ఏడాది. స్లొవేనియా దేశస్థుడైన అంటన్ జన్సకు తేనెటీగలే పంచప్రాణాలు. క్రీ. శ. 1734 మే 20న జన్మించిన ఆయనే తొలి తేనెటీగల పెంపకందారుడు. చిత్రలేఖనంలో నిష్ణాతుడైనప్పటికీ తేనెటీగల పెంపక శాస్త్ర అధ్యాపకుడిగా సేవలందించాడు. 1771లో తేనెటీగలపై తొలి గ్రంథాన్ని రచించాడు. తేనెటీగల్లో 20 వేల జాతులున్నాయి. అయితే, ఐరోపాకు చెందిన 4 జాతుల తేనెటీగలను భారత్ సహా అనేక దేశాల్లో విరివిగా పెంచుతున్నారు. పంటల దిగుబడి పెంచుకోవడం ఎలా? పండ్ల తోటలు / వార్షిక పంటలు పూతకు వచ్చే దశలో తెనెటీగల పెట్టెలను పొలాలకు దగ్గరలో సుమారు 30 రోజులపాటు ఉంచితే.. ఆయా పంటల్లో పరపరాగ సంపర్కం బాగా జరిగి, దిగుబడి పెరుగుతుంది. తేనెటీగల పెంపకం దారులకు పెట్టెకు కొంత మొత్తం అద్దెగా చెల్లించి రైతులు తమ పొలాల వద్ద తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేయించుకుంటూ ఉంటారు. ఎకరానికి 3 నుంచి 5 పెట్టెలు అవసరం ఉంటుంది. పూత సీజన్ (సాధారణంగా 40 రోజులు) గడిచిన తర్వాత తేనెటీగలు సహా తమ పెట్టెలను తేనెటీగల పెంపకందారులు మరో ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. ఇటువంటి తేనె రైతులు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఉన్నారు. పూత లేని కాలాల్లో తేనెటీగలు ఆకలితో చనిపోకుండా పంచదార ద్రావణాన్ని ఆహారంగా ఇస్తూ కాపాడుకుంటూ ఉంటారు. సాధారణ తేనెటీగలు 50 రోజులు బతుకుతాయి. రాణి ఈగ 1–3 సంవత్సరాలు బతుకుతుంది. తేనెలూరే సంగతులు ► మనం ఆహారంగా తిసుకునే తిండి/నూనె గింజలు, పండ్లను అందించే ప్రతి నాలుగు రకాల పంటలు/తోటల్లో మూడు రకాలు పరాపరాగ సంపర్కం కోసం (ఎంతో కొంతవరకైనా) తేనెటీగలు, ఈగలు, సీతాకోకచిలుకలు తదితర ఎగిరే చిరు జీవులపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో తేనెటీగల పాత్ర 90% ఉంటుంది. ► ప్రపంచవ్యాప్తంగా 87 రకాల ఆహార పంటలు/తోటలు తెనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం చెంది చక్కని పంట దిగుబడులను అందిస్తున్నాయి. సాగు భూమి విస్తీర్ణపరంగా చూస్తే ఇది 35 శాతం. ► పంటలపై ఈ ఎగిరే చిరు జీవుల ప్రభావం ఎంత అనేది ఆయా ప్రాంతాల్లో వాటి సంఖ్యను బట్టి, వైవిధ్యాన్ని బట్టి ఉంటుంది. ► ఇవి మనకు అందించే ఆహారోత్పత్తులు ఆరోగ్యదాయకమైనవి, పౌష్టిక విలువలు కలిగినవీను. ► అమూల్య సేవలందించే ఈ చిరు జీవుల మనుగడకు రసాయనిక సాంద్ర వ్యవసాయం, ఒకే రకం పంటలు సాగు చేయడం ముప్పుగా పరిణమించాయి. ► అనేక రకాల పంటలతో, వ్యవసాయక జీవవైవిధ్యంతో తులతూగే రసాయన రహిత పంట పొలాలు మనుషుల మనుగడకు, భూసారం పెంపునకు, పర్యావరణ పరిరక్షణతో పాటు తేనెటీగలకూ జీవనావసరమే. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తేనెటీగల పరిరక్షణకు దోహదపడతాయి. ► తేనెటీగలు 20,000 జాతులు. అడవుల్లో ఎక్కువ జాతులు ఉంటాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకల జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. (మూలం : ఆహార, వ్యవసాయ సంస్థ– ఎఫ్.ఏ.ఓ. ) ఏయే పంటలకు ఉపయోగం? తేనెటీగల ద్వారా కొన్ని రకాల పంటల్లో పరపరాగ సంపర్కం మెరుగ్గా జరుగుతుంది. దాదాపు 75 శాతం పంటల్లో ఎంతో కొంత స్థాయిలో పరపరాగ సంపర్కానికి తేనెటీగలు దోహదపడుతున్నాయి. ప్రకృతిసిద్ధంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో తేనెటీగల పెంపకందారుల నుంచి తేనెటీగల పెట్టెలను తెప్పించి పొలాల దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం వస్తున్నది. కొబ్బరి, నిమ్మ, బత్తాయి, జామ, పుచ్చ, గుమ్మడి, దానిమ్మ, జీడిమామిడి వంటి ఉద్యాన తోటలు.. పొద్దుతిరుగుడు, నువ్వులు, గడ్డి నువ్వులు / వెర్రి నువ్వులు, ఆవాలు వంటి నూనె గింజల పంటలు.. ధనియాలు, వాము వంటి సుగంధ ద్రవ్య పంటలతోపాటు కందులు వంటి పప్పు జాతి పంటల్లో తేనెటీగల ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చని విజయరాయి లోని కెవిఐసి తేనెటీగల శిక్షణా కేంద్రం జూనియర్ ఎగ్జిక్యూటివ్ టీ వీ రావు (94410 51039) ‘సాక్షి’తో చెప్పారు. నిజామాబాద్ ప్రాంతంలో ఆవాలు సాగు చేసే రైతులు ప్రతి ఏటా తేనెటీగల పెట్టెలను అద్దెకు తీసుకొని తమ పొలాల్లో పెట్టించుకుంటూ దిగుబడి పెంపొందించుకుంటున్నారు. 40 రోజుల పూత కాలానికి గాను పెట్టెకు రూ. 1,500 వరకు అద్దె చెల్లిస్తున్నారని రావు వివరించారు. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తేనెటీగల ‘చంద్రారెడ్డి’
రాజాపురం(పాల్వంచ రూరల్) : వ్యవసాయ కుటుంబమే అయినా సాగుపై అవగాహన లేదు.. అయినా సేంద్రియ సాగుపై మక్కువ పెంచుకున్నాడు.. తనకున్న భూమిలో పూల మొక్కలు.. కూరగాయలు పండించడం.. చేపల పెంపకం చేపట్టాడు.. దిగుబడి రాకున్నా నిరాశ చెందలేదు.. మలి ప్రయత్నంలో రకరకాల చేపల పెంపకంతోపాటు తేనెటీగల పెంపకం నిర్వహిస్తున్నాడు. ఒక దశకు వచ్చిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. తేనె ద్వారా మంచి లాభాలు గడిస్తున్నాడు ఖమ్మం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కందుల చంద్రారెడ్డి. అనంతపురం నుంచి తెచ్చిన నైజీరియా తేనెటీగల ట్రేలను తెచ్చి ఇంటి పరిసరాల్లో వాటిని పెంచుతున్నాడు. విషయం తెలిసిన పలువురు రైతులు వాటి పెంపకం గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. తేనెటీగల్లో నాలుగు రకాలు కొండ, పుట్ట, నైజీరియా, ముసురు తేనెటీగలు. నైజీరియా తేనెటీగల పెంపకం వల్ల ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ. పెంపకం కూడా తేలికగా ఉంటుందని అనుభవం కలిగిన పలువురు రైతులు అంటున్నారు. బాక్స్‌లో ఉండే నైజీరియా తేనెటీగలను ఇంటి పరిసరాల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బాక్స్(ట్రే)లో రాణి ఈగతోపాటు వంద మగ ఈగలు ఉంటాయి. వాటికి తోడు రెండు లక్షల చిన్న చిన్న ఈగలు ఉంటాయి. ఈగలకు ఆహారంగా రోజు బాక్సుల్లో పంచదారతో కలిపిన ద్రావకం పోస్తే సరిపోతుంది. పొప్పడి పూలు పూచే సమయంలో నవంబర్ నుంచి జనవరి నెలల్లో ఈగలు వాటిని తిని.. తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి.30 బాక్సుల్లో తేనెటీగలను పెంచుకున్న రైతుకు ఒక్కో బాక్స్ ద్వారా నెలకు 3 నుంచి 5 కేజీల తేనె దిగుబడి వస్తుంది. రెండు నెలల్లో రైతు పెంచిన తేనెటీగల ద్వారా 90 కేజీల తేనె దిగుబడి వస్తుంది. తేనె తీసే పద్ధతులు బాక్స్‌లో ఉండే తేనె బయటకు తీసేందుకు కొన్ని పద్ధతులున్నాయి. బాక్స్‌లోని తేనెను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి తీయాలి. దీనికోసం ముఖానికి మాస్కులు ధరించి మరో చేతిలో పొగ పట్టుకుని తేనెటీగల బాక్సును తెరవాలి. అందులో ఉన్న తేనెతుట్టెను బయటకు తీసి ఒక యంత్రంలో వేయాలి. అప్పుడు ఈగలు కుట్టకుండా తేనెతుట్టె నుంచి తేనె బయటకు వస్తుంది. మార్కెట్లో మంచి గిరాకీ తేనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కల్తీ లేని నైజీరియా తేనెటీగల ద్వారా లభించే తేనె కేజీ రూ.450 నుంచి రూ.500 చొప్పున ధర పలుకుతోంది.