Bhagiratha
-
భగీరథ, కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు: మంత్రి పొంగులేటి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్త గూడెం/నేలకొండపల్లి: గత ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళే శ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మార్కెట్ క మిటీ నూతన పాలక వర్గ ప్ర మాణస్వీకారం సోమ వారం సాయంత్రం జరగగా, ఆయ న పాల్గొని మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఎంఐయూడీలో అమృత్ స్కీంలో అవినీతికి పాల్పడ్డారని, సృజన్‌రెడ్డికి పనులు ఇచ్చారని కేటీఆర్ చెబుతుండగా.. ఈ విషయమై చర్చకు ఎక్కడైనా వస్తానని, ఆరోప ణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెబితే సమాధానం ఇవ్వలేదన్నారు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే కేటీఆర్ ఎవరో చెప్పిన విమర్శలు చేసే ముందుకు ఆలో చించాలని సూచించారు. పాలేరులో తనపై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి అని.. ఆయనకు బీఆర్ఎస్ హయాంలో సబ్ కాంట్రాక్టర్లు ఇప్పించారని తెలిపారు. ఇప్పుడు సృజన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదిగా చిత్రీకరించే పనిచేస్తు న్నారని చెప్పారు. సీఎంను దించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర చేస్తు న్నారని చెబుతు న్నారని.. కానీ కేటీఆర్ – హరీశ్ రావు మధ్యే అంతర్గత వివాదాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలిపేదవారి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. సర్కారు ఆలోచన లకు అనుగుణంగా అధి కా రులు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అలా కాకుండా సొంత ఆలోచనలను పాలనలో జొప్పించాలని చూస్తే ఏ స్థాయి అధికారుల పైనైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కనకయ్య, కలెక్టర్ పాటిల్, ఎస్పీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్ సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో ధరణిని అడ్డుపెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. -
భగీరథ యమధర్మరాజ సంవాదం
పూర్వం భగీరథ చక్రవర్తి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుండేవాడు. ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు అయిన భగీరథుడు నిత్యం తన రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులను జరిపించేవాడు. ఆయన రాజ్యం సర్వసుభిక్షంగా ఉండేది. రాజ్యంలోని ప్రజలెవరూ ధర్మం తప్పేవారు కాదు. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు ముల్లోకాలకూ వ్యాపించాయి. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు విని యమధర్మరాజు ఒకసారి ఆయనను స్వయంగా కలుసుకోవాలనుకున్నాడు. ఒకనాడు యమధర్మరాజు భగీరథుడి వద్దకు వచ్చాడు. భగీరథుడు ఎదురేగి యమధర్మరాజుకు స్వాగతం పలికాడు. ఘనంగా అతిథి సత్కారాలు చేశాడు. భగీరథుడి సేవలకు యమధర్మరాజు సంతృప్తి చెందాడు. ‘భగీరథా! నువ్వు చాలా ధర్మాత్ముడివి. నీ కీర్తి ముల్లోకాలకూ వ్యాపించింది. అది వినే నేను నిన్ను స్వయంగా కలుసుకోవాలని వచ్చాను. నీ జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయం’ అని ప్రశంసించాడు. ‘సమదర్శీ! నా మీద నీ అనుగ్రహానికి ఆనందభరితుణ్ణవుతున్నాను. అయితే, నాకు కొన్ని ధర్మసందేహాలు ఉన్నాయి. సకలలోక ధర్మాధర్మ విచక్షణాదక్షుడవైన నువ్వే నా సందేహాలను తీర్చగలవు. అవేమిటంటే, ధర్మాలంటే ఏవి? ధర్మాచరణ చేసేవారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయి? దయచేసి వివరించు’ అని వినయంగా అడిగాడు భగీరథుడు. ‘ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. ధర్మం గురించి సంపూర్ణంగా చెప్పాలంటే లక్ష సంవత్సరాలైనా సరిపోవు. అయినా నువ్వు అడిగావు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను విను. లోకంలో బ్రాహ్మణులకు, ఆధ్యాత్మికవేత్తలకు చేసే దానం అత్యుత్తమమైనది. స్వయంగా కూప తటాకాది జలాశయాలు తవ్వినా, ఇతరులను నియమించి తవ్వింపచేసినా వచ్చే పుణ్యఫలం అనంతం. బావులు, చెరువులు తవ్వే పనిలో స్వల్పమైన సాయం చేసినా గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు వీరభద్ర మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు: పూర్వం గౌడదేశాన్ని వీరభద్రుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడు మహాదానశీలి, ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు. వీరభద్రుడి భార్య చంపకమంజరి. వీరభద్రుడు ప్రతినిత్యం యజ్ఞయాగాదులు నిర్వర్తించేవాడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. వీరభద్రుడి రాజ్యంలో ప్రజలందరూ ధర్మబద్ధులై ఉండేవారు. అతడి మంత్రులందరూ విద్యావంతులు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన విజ్ఞులు కావడంతో పరిపాలన సజావుగా సాగేది. వీరభద్రుడి రాజ్యం భూతలస్వర్గంగా ప్రసిద్ధి పొందింది. ఒకనాడు వీరభద్రుడు తన మంత్రులు, పరివారంతో కలసి సమీప అరణ్యానికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేట కొనసాగించారు. మధ్యాహ్నవేళ వీరభద్రుడు సహా అతడి పరివారమంతా బాగా అలసట చెందారు. అందరికీ విపరీతమైన దాహం వేయసాగింది. సమీపంలో నీటిజాడ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అందరూ వెదకసాగారు. కొంత దూరం ముందుకు వెళ్లాక కొండ మీద ఒక చెరువు కనిపించింది. అక్కడకు వెళ్లి చూశారు. చెరువులో చుక్క నీరైనా లేదు. ‘అసలు ఇంత ఎత్తులో ఎవరు ఈ చెరువు తవ్వించారు? ఇందులో నీళ్లు ఎందుకు లేవు?’ అని స్వగతంగా అన్నాడు వీరభద్రుడు. అక్కడే ఉన్న వీరభద్రుడి మంత్రి బుద్ధిసాగరుడు చెరువును మరికొంత లోతుకు తవ్వమని భటులను పురమాయించాడు. మూడడుగులు తవ్వేసరికి చెరువులోకి నీళ్లూరాయి. చెరువు కొంతవరకు నీళ్లతో నిండింది. అందరూ ఆ చెరువులో నీళ్లు తాగి సేదదీరారు. ‘మహారాజా! ఈ చెరువు వానాకాలంలోనే నిండేలా ఎవరో తవ్వించారు. మరికొంత లోతుకు తవ్విస్తే సర్వకాలాల్లోనూ ఇందులో నీళ్లు నిలిచి ఉంటాయి. బాటసారులకు దాహార్తి తీర్చేలా ఈ చెరువు మరింత లోతుకు తవ్వించేందుకు అనుమతించండి’ అన్నాడు బుద్ధిసాగరుడు. అందుకు వీరభద్రుడు సరేననడంతో మంత్రి బుద్ధిసాగరుడు దగ్గర ఉండి భటులతో చెరువును మరింత లోతుగా తవ్వించాడు. దానికి పటిష్ఠంగా రాతిగోడలు నిర్మించారు. కొంతకాలానికి ఆయుష్షుతీరి బుద్ధిసాగరుడు, వీరభద్రుడు నా లోకానికి వచ్చారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల చిట్టాను పరిశీలించి, కొండ మీద తటకాన్ని తవ్వించిన వారి మహత్కార్యాన్ని నాకు చెప్పాడు. ధర్మవిమానంలో వారు స్వర్గానికి వెళ్లడానికి అర్హులని గ్రహించి, వారిని విమానంలో స్వర్గానికి పంపాను. స్వర్గానికి బయలుదేరే ముందు వారు నన్ను కొండ మీద ఆ చెరువు చరిత్ర చెప్పమని అడిగారు. ‘పూర్వం సైకతపర్వతం మీద ఈ చెరువు ఉన్నచోట ఒక లకుముకి పిట్ట తన ముక్కుతో రెండంగుళాలు తవ్వింది. కొంతకాలానికి ఒక వరాహం అక్కడకు వచ్చి, తన ముట్టెతో రెండు మూరలు తవ్వింది. దాంతో అందులోకి అప్పుడప్పుడు కొంత నీరు చేరసాగింది. చుట్టుపక్కల వన్యప్రాణులు అందులోని నీరుతాగుతూ దాహార్తి తీర్చుకునేవి. మూడేళ్లు గడిచాక ఒక ఏనుగుల గుంపు వచ్చి, దానిని మరింత లోతుగా తవ్వడంతో చిన్న చెరువుగా మారింది. అప్పటి నుంచి ఏటా వానాకాలంలో ఆ చెరువు పూర్తిగా నీటితో నిండసాగింది. మీరు వేసవి ప్రారంభంలో వేటకు వెళ్లడం వల్ల ఆ చెరువు ఎండిపోయి కనిపించింది. అంతకు ముందు అందులోకి నీరు ఇంకి ఉండటం వల్ల కొద్ది లోతు తవ్వగానే నీరు దొరికింది. వీరభద్రా! నీ మంత్రి సూచనతో నువ్వు ఆ చెరువును మరింత లోతుగా తవ్వించి, పటిష్ఠంగా గోడ నిర్మించి, ఏడాది పొడవునా నీరు నిలిచేలా చేశావు. ఈ పనిచేసినందుకు నువ్వు, నీ మంత్రి, నీ పరివారం అభినందనీయులు’ అని చెప్పి ధర్మవిమానంలో వారిని స్వర్గానికి సాగనంపాను. ‘భగీరథా! తటాకాలను తవ్వించిన వారికి సమస్తపాపాలూ నశించి, అనంత పుణ్యఫలం లభిస్తుంది’ అని చెప్పాడు యమధర్మరాజు. భగీరథుడు ప్రణమిల్లి, అతడికి సాదరంగా వీడ్కోలు పలికాడు. ఇవి చదవండి: హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి.. -
నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?
మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది. బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్లో నీటి కొరత ఉంది. అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది. -
భగీరథ మహర్షి జయంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ జి.రమణమ్మ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య హాజరయ్యారు. ఇది కూడా చదవండి: శింగనమల నియోజకవర్గానికి వరాల జల్లు -
‘శిఖర’ సమానం
రాంగోపాల్‌పేట్: కొండ అద్దమందు కొంచమై ఉండదా.. అన్నాడు వేమన. కానీ, వీరి ఆత్మబలమందు శిఖరమే కొంచమైంది! మంచు కొండలు కరిగిపోతున్నా.. ఇంచు కూడా వెనుకడుగు వేయలేదు. ఎత్తువెళ్లే కొద్దీ ఆక్సిజన్ దొరక్క ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ ఉన్నా ఆత్మవిశ్వాసమే శ్వాసగా.. హిమశిఖరం అధిరోహించారు. భాగీరథ–2 పర్వతాన్ని 18,000 అడుగుల మేర ఎక్కి ‘దివ్య’ మైన చరిత్ర సృష్టించారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని నిరూ పించారు. సాహసంలోనూ వారిది సహవాసమే. పర్వతారోహణను పూర్తిచేసుకుని మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకు న్నారు. వారికి గోపాలపురం పోలీసులు ఘనస్వాగతం పలికారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన తెలుగుతేజాలైన షేక్ అర్షద్(26), ఆర్యవర్ధన్(17)లపై ప్రత్యేక కథనం... కాలు లేదని కుంగి పోలేదు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇస్మాయిల్, మోసిమ్ల కుమారుడు షేక్ అర్షద్(26). 2004 సంవ త్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు మోకాలి పైవరకు పోయింది. అయినా కుంగిపోకుండా డిగ్రీ చేశాడు. ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ ప్యారా హ్యాండ్ సైక్లింగ్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాడు. సరూర్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల ఆర్య వర్ధన్ డిగ్రీ చదువుకున్నాడు. నాలుగేళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. ఆటోలో వస్తుండగా కింద పడ్డాడు. కుడికాలు నుజ్జు్జకావడంతో మోకాలి పైవరకు తీసేశారు. తండ్రి లేడు. తల్లి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆ ఆరుగురిలో ఇద్దరు మనవాళ్లే.. ఆదిత్య మెహతా ఫౌండేషన్ సహకారంతో బీఎస్ఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వెంచర్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో అర్షద్, ఆర్యవర్ధన్ నాలుగేళ్లు కలిసే శిక్షణ తీసుకున్నారు. వీరి కోసం ఖరీదైన కృత్రిమ కాలును తయారు చేయించారు. బీఎస్ఎఫ్ శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆరుగురు ప్యారాఅథ్లెట్స్ను పర్వతారోహణకు ఎంపిక చేయగా వారిలో వీరిద్దరు ఉన్నారు. ఈ ఆరుగురు ఆగస్టు 10న ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి పర్వతారోహణ ప్రారంభించారు. వీరిలో నలుగురు అథ్లెట్స్ 21,365 అడుగుల ఎత్తుండే భాగీరథ శిఖరాన్ని అదిరోహించారు. కానీ ఆర్యన్, అర్షద్‌లకు తీవ్రమైన ప్రతికూల వాతారణ పరిస్థితులు ఎదురుకావడంతో ఆగస్టు 27వ తేదీనాటికి భాగీరథ పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేర అధిరోహించారు. పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేరకు ఎక్కిన తెలుగు దివ్యాంగులుగా చరిత్ర సృష్టించారు. 16కి.మీ. ఒకేరోజు నడిచాం: అర్షద్ గతంలో నేను ఎప్పుడూ 3 కి.మీ.ల కంటే ఎక్కు వగా నడవలేదు. పర్వతారోహణలో ఒకేరోజు 16 కి.మీ. ఏకధాటిగా నడిచా. ప్రొస్తటిక్ లింబ్‌తో దీన్ని పూర్తి చేయగలిగాను. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయి. ఒక మృతదేహం కనిపించినా భయపడలేదు. పైకి వెళ్తుంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించేది. 13కేజీల బరువుతో: ఆర్యవర్ధన్ జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హిమపాతాలు, బండరాళ్లు, నదులు, మంచుపగుళ్లు, వడగళ్లు, భారీ వర్షాలు ఎన్నెన్నో అనుభవాలు ఎదుర య్యాయి. 12 నుంచి 13 కిలోల బరువున్న బ్యాగులు భుజానికి తగిలించుకుని ముందుకు సాగాం. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అది రోహించడానికి మానసికంగా సిద్ధమయ్యాను. 2020లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తాం 2020 సంవత్సరంలో 12 మంది ప్యారా అథ్లెట్స్‌కు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేదికు సిద్ధం చేస్తాం. దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారనేది నిరూపిస్తాం. – ఆదిత్య మెహతా, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
ఫలితమివ్వని భగీరథ ప్రయత్నం
రెండేళ్లలో 32 బోర్లు - ఒకదాంట్లోనే కొద్దిపాటి నీరు - పాలమూరు జిల్లా మరికల్ రైతు కష్టం మరికల్: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన రైతు దామోదర్‌రెడ్డికి నాలుగెకరాల పొలం ఉంది. ఆపర భగీరథుడిలా గడిచిన రెండేళ్లలో 31 బోర్లను డ్రిల్లింగ్ చేశాడు. కానీ, ఒక్క బోరులో కూడా చుక్కనీరు రాలేదు. దీంతో బోర్ల డ్రిల్లింగ్కు చేసిన అప్పులను తీర్చలేక నరకం అనుభవిస్తున్నాడు. తీరా విసుగెత్తి తన ఇంటి ఎదుట ఉన్న అర ఎకరాలో 32వ సారి బోరు వేశాడు. కొద్దిపాటి నీరు రావడంతో ఏడాది గా ఇంటిముందే తోటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు అందులోనూ నీరు రాకపోవడంతో తోట ఎండిపోతోంది. వేసవి కారణంగా ఉమ్మడి మరికల్ మండలంలో ఇప్పటికే అప్పంపల్లి, మాధ్వార్, కిష్టాపూర్, మరికల్, ధన్వాడ, గున్ముక్ల, ఎలిగండ్లల్లోని వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీం తో పంటలను కాపాడుకునేందుకు ఒక్కో రైతు 5 నుంచి పది వరకు బోర్లను వేశారు. పంటలకు చేసిన అప్పులు తీర్చలేక వ్యవసాయాన్నే వదులుకునే పరిస్థితులు ఏర్పడాయి. అప్పులే మిగిలాయి పంటలు పండించాలని ఆశతో 32 బోర్లను డ్రిల్లింగ్ చేశాను. కానీ ఒక బోరులో కూడా నీరు రాకపోవడంతో తనకు అప్పులే మిగి లాయి. 32 బోర్లకు రూ.6.40 లక్షలు ఖర్చు చేశాను. బోర్లు వేయడం మానుకున్నాను. – దామోదర్‌రెడ్డి, బాధిత రైతు, అప్పంపల్లి -
‘భగీరథ’ పనులు సకాలంలో పూర్తి చేయాలి
ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: నల్లా ద్వారా ఇంటింటికీ తాగు నీరందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. భగీరథ పనులపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో శనివారం గ్రామీణ నీటి సరఫరా ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. భగీరథ ద్వారా మంచినీటి సరఫరాను ఆయా గ్రామాల్లోని షెడ్యూల్ కులాలు, తెగల ప్రజలు ఉండే కాలనీల నుంచే ప్రారంభించాలని సూచించారు. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలను సమన్వయ పరిచాకే ఆయా గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ పనులను ప్రారంభించాలన్నారు. వేగంగా భగీరథ పనులు: ప్రశాంత్‌రెడ్డి మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు జరుగుతున్నంత వేగంగా దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదని తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేంద్రం కూడా భగీరథ పనుల వేగం, నాణ్యతను వివిధ వేదికలపై ప్రశంసిస్తోందని తెలిపారు. ఇంటేక్‌వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్లు, ఇంట్రా విలేజ్ పైప్ లైన్ పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.1,816 కోట్ల రుణం మంజూరు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. శ్రీశైలం– వికారాబాద్– చేవేళ్ల– తాండూరు–పరిగి, శ్రీశైలం–గుడిపల్లి సెగ్మెంట్ పనులకు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఎంవోయూ పత్రాలపై సీఎస్ ఎస్పీ సింగ్, బ్యాంక్ ప్రతినిధులు సంతకాలు చేశారు. -
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి
కామారెడ్డి రూరల్: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. శనివారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని బాబాగౌడ్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఓడడం, గెలవడం ప్రధానం కాదని.. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి స్మారకార్థం రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలు నిర్వహించడం అభినందనయమన్నారు. తన తండ్రి 48 సంవత్సరాల వయస్సులో కూడా క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారని, ఆయనతో పాటు తాను కూడా క్రికెట్ ఆడానని చెప్పారు. క్రీడాభివృద్ధికి కృషి: గంప గోవర్ధన్ రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. రాబోయే రోజుల్లో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్తులో గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం కల్పిస్తారని చెప్పారు. క్రీడలు ర్వహించిన నిట్టు వేణుగోపాల్‌రావును ప్రశాంత్‌రెడ్డి, గంప గోవర్ధన్ అభినందించారు. విజేతలు వీరే... వేముల సురేందర్‌రెడ్డి స్మారక వాలీబాల్ టోర్నీలో పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిజామాబాద్, హైదరాబాద్ జట్లు నిలిచాయి. మహిళా విభాగంలో నిజామాబాద్ విజేతగా నిలవగా, ద్వితీయ బహుమతి నల్గొండ, తృతీయ బహుమతిని హైదరాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకున్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లకు విప్ గోవర్ధన్ రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబోద్దిన్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, నిట్టు వేణుగోపాల్‌రావు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, ప్రతినిధులు, మల్లేశ్‌గౌడ్, అశోక్‌కుమార్, మోహన్‌కుమార్, లింగన్న, మనోజ్‌రెడ్డి, మసూద్‌అలీ, గోపిగౌడ్, పీడీలు, పీఈటీలు, క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలు తదితరులు పాల్గొన్నారు. -
వేముల ప్రశాంత్‌రెడ్డికి పలువురి పరామర్శ
వేల్పూర్ : మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిని నిజామాబాద్ ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోమవారం వేల్పూర్‌లో పరామర్శించారు. ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి శనివారం మరణించిన విషయం విదితమే. ఈ మేరకు వారి కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. వారి వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు రాములు, చిన్నారెడ్డి, మహిపాల్, రాములు, బాల్‌రాజ్, దయాకర్, భోజన్నయాదవ్ తదితరులు ఉన్నారు. అలాగే స్పీకర్ మధుసుధనాచారి కొడుకు క్రాంతితో పాటు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పలñ ్లగంగారెడ్డితోపాటు నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్,రమేశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించి సంతాపం తెలిపారు. -
‘భగీరథ’కు రూ.4వేల కోట్ల రుణం
* పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌తో నాబార్డు ప్రతినిధుల భేటీ * వచ్చే ఏడాది మరింత రుణసాయం అందిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు మరో రూ.4 వేల కోట్లు రుణంగా అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది. గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో నాబార్డు ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2016-17 సంవత్సరానికి గాను రూ.4 వేల కోట్ల రుణమిచ్చేందుకు మరింత రుణమిచ్చేందుకు అంగీకారం తెలిపారు. నాబార్డు ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. అందులో రెండో విడత సొమ్ము రూ.1,976.80 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఈ మొత్తంతోపాటు తాజాగా అంగీకరించిన రూ.4 వేల కోట్లలో తొలి విడతగా రూ.2,200 కోట్ల రుణాన్ని త్వరలోనే విడుదల చేస్తామని నాబార్డు ప్రతినిధులు హామీ ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలోనూ మరికొంత రుణసాయం అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ సెగ్మెంట్లలో జరుగుతున్న పనులు, భవిష్యత్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలను పరిశీంచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయమై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని నాబార్డు జనరల్ మేనేజర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, నాబార్డు ఉన్నతాధికారులు తులికా పంకజ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయ, భగీరథకు 24,200 కోట్లు
ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు భగీరథకు రూ.19,200 కోట్లు, కాకతీయకు రూ.5,000 కోట్లు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్లు ఇవ్వండి ఈ ప్రాజెక్టులతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల పెంపు కరువును అధిగమించొచ్చు.. ఇంటింటికీ తాగునీరు మంచి నిర్ణయం ఈ పథకాలకు ఆర్థిక సాయం అందించడం సహేతుకమని సూచన ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు త్వరలోనే కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పట్టు వదలకుండా చేసిన ప్రయత్నం ఫలించనుంది. కొత్త రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తర పథకాలకు రూ.24,200 కోట్లు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి రూ.19,200 కోట్లు, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు రాష్ట్రంలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు గత ఏడాది తరహాలో రూ.450 కోట్ల సాయం అందించాలని ప్రతిపాదించింది. అంతేకాదు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటికి ఆర్థిక సాయం అందించడం సహేతుకమని స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందే అవకాశముందని.. సిఫార్సు చేసిన స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరుగానైనా నిధులు రావొచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా విజ్ఞప్తులు.. భారీ వ్యయ అంచనాతో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్రం రెండేళ్లుగా విజ్ఞప్తులు చేస్తోంది. కొత్త రాష్ట్రం కావడంతో ప్రత్యేక అభివృద్ధి (స్పెషల్ డెవలప్మెంట్) ప్యాకేజీ కింద ఈ సాయం చేయాలని కోరింది. 2015-19 సంవత్సరాలకు రూ.30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 11న సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీకి వెళ్లినప్పుడూ సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా రాష్ట్రానికి వచ్చిన సందర్భం లోనూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందం... మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో సమీక్షిం చింది. ఆ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా ఈ పథకాల పురోగతిని వివరించింది. మిషన్ కాకతీయ ద్వారా ఐదేళ్లలో రూ.20 వేల కోట్లతో 46,351 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్నామని... రూ.5,000 కోట్లు ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఇక రూ.42 వేల కోట్ల అంచనాతో చేపట్టిన మిషన్ భగీరథతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ మంచి నీటిని అందించే ప్రణాళికను పంచాయతీరాజ్ విభాగం విశ్లేషించింది. ఈ పథకానికి రూ.19 వేల కోట్ల సాయం కోరింది. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన నీతి ఆయోగ్ బృందం తెలంగాణకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. సాయం అందించాల్సిందే..: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరముందని, ఇది సహేతుకమైన కారణమని నీతి ఆయోగ్ తమ సిఫార్సులో ప్రస్తావించింది. చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని.. వేసవి, కరువు పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించే వీలుందని ప్రస్తావించింది. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు తలపెట్టిన మిషన్ భగీరథకు నిధులివ్వడం సహేతుకమని, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. అయితే కేంద్రం నీతి ఆయోగ్ సూచించినన్ని నిధులు ఇవ్వకపోయినా.. కొంతమేరకైనా సాయం విడుదల చేసే అవకాశాలు మెరుగుపడ్డాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వెనుకబడిన జిల్లాలకు.. రాష్ట్రంలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత ఏడాది కేంద్రం ప్రత్యేక సహాయం (స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్) కింద రూ.450 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ జిల్లాలకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి కూడా నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌లకు లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించిన నీతి ఆయోగ్ ఈసారి కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరముందని ఆర్థిక శాఖకు సిఫార్సు చేసింది. తొలి ఏడాది వన్‌టైం అసిస్టెన్స్‌గా ఈ గ్రాంటును విడుదల చేసినా.. నీతి ఆయోగ్ సిఫార్సుతో ఈ ఏడాది కూడా ఈ నిధుల మంజూరుకు మార్గం సుగమమైంది. -
సంక్షేమం మా బాధ్యత
♦ మిషన్ కాకతీయ, భగీరథలతో సత్ఫలితాలు ♦ మూడు లక్షలకు చేరిన ఆసరా లబ్ధిదారులు ♦ అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ♦ అవతరణ వేడుకల్లో మంత్రి మహేందర్‌రెడ్డి అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివ రించారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ⇔ జిల్లాలో 33 మంది అమరుల కుటుంబాలకు గాను 25 మందికి ప్రస్తుతం ఉద్యోగాలిస్తున్నాం. మిగిలిన వారికీ ఇస్తాం. ⇔ 1,122 చెరువుల్లో పూడికతీత పనులు కోసం దాదాపు రూ.370 కోట్లు ఖర్చు చేశాం. ⇔ మిషన్ భగీరథ పనులను రూ.1,960 కోట్లతో ప్రారంభించాం. ⇔ జిల్లాలో తొలివిడతలో 6,850 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశాం. ⇔ 11.44 లక్షల కుటుంబాలు రూపాయికే కిలో బియ్యం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ⇔ మహిళా సంఘాల సభ్యులకు రూ.406 కోట్ల లింకు రుణాలు ఇచ్చాం. ⇔ పంటరుణాల కింద రైతులకు రూ.730 కోట్లు పంపిణీ చేశాం. ⇔ ఉపాధి హామీ పథకం కింద 117 లక్షల పనిదినాలు కల్పించాం. ⇔ రోడ్ల కోసం రూ.1,020 కోట్లు ఖర్చు చేశాం. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తించింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ గౌరవిస్తున్నాం. - మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని.. వారి త్యాగాలకు ప్రతికగా అమరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 33 మంది అమరుల కుటుంబాలకు గాను 25 మందికి ప్రస్తుతం ఉద్యోగాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా వారికికూడా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. చెరువులు, కుంటలు జలాలతో కలకలలాడించేందుకు తలపెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం వేగవంతంగా సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నదని.. ఈ కాలంలో జిల్లాలో 1,122 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే సాగినికపైగా పనులు పూర్తయ్యాయని.. దాదాపు రూ.370 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి శుద్ధనీరు.. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లాలో రూ.1,960 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఈనెలాఖరు నాటికి మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్లోని 104 అవాసాల్లోని ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు వివరించారు. ప్రతి కుటుంబానికీ గూడు ప్రభుత్వ బాధ్యతని, జిల్లాలో తొలివిడత కింద 6,850 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించామని.. త్వరలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. రూపాయికే కిలో బియ్యం కార్యక్రమం కింద జిల్లాలో 11.44లక్షల కుటుంబాలకు తిండిగింజలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు భరోసా... మహిళలను ఆర్థికంగా బలపర్చేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తున్నామని మంత్రి మహేందర్‌రెడ్డి వివరించారు. గతేడాది జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.406 కోట్ల లింకు రుణాలు అందించామన్నారు. పంటరుణాల కింద రైతులకు రూ.730 కోట్లు పంపిణీ చేశామని, ఉపాధి హామీ పథకం కింద 117 లక్షల పనిదినాలు కూలీలకు కల్పించామన్నారు. పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేయగా.. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.800 కోట్లు వెచ్చించామన్నారు. ప్రసంగం అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి మంత్రి నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ కోసం
నేడు గవర్నర్ నరసింహన్ రాక జనగామ నియోజకవర్గంలో పర్యటన వరంగల్ : గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ బుధవారం జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను పరిశీలించనున్నారు. మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పనులను పరిశీలించిన అనంతరం గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 12.10 గంటలకు కొమురవెల్లి క్రాస్ మీదుగా రోడ్డు మార్గంలో జిల్లాలోకి వస్తారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల మండలంలో ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్) పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కొమురవెల్లి క్రాస్ మీదుగా తపాస్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న పైపులైను పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మెదక్ జిల్లా మీదుగా హైదరాబాద్‌కు వెళ్తారు. గవర్నర్ నరసింహన్ గత వేసవిలో జిల్లాలో పర్యటించి మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పుడు మిషన్ భగీరథ పనుల పరిశీలన కోసం వస్తున్నారు. ఐదు సెగ్మెంట్లుగా పనులు ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలోని మొత్తం ఆవాసాలకు తాగునీటిని అందించేందుకు ఐదు సెగ్మెంట్లుగా పనులు చేపడుతున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా బోర్డు(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)- మెట్రో వరంగల్, పాలేరు, ఎల్ఎండీ-పరకాల-వరంగల్, గోదావరి-మంగపేట, ఎల్లంపల్లి-మంథని-భూపాలపల్లి సెగ్మెంట్లుగా మిషన్ భగీరథ పనులను విభజించారు. మొదటి దశలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ - మెట్రో వరంగల్ సెగ్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ ఈ సెగ్మెంట్లోని పనులను పరిశీలించనున్నారు.