‘భగీరథ’కు రూ.4వేల కోట్ల రుణం | Panchayati Raj Department meeting withNABARD Representatives | Sakshi
Sakshi News home page

‘భగీరథ’కు రూ.4వేల కోట్ల రుణం

Published Fri, Jun 10 2016 1:13 AM | Last Updated on Fri, Oct 19 2018 7:14 PM

Panchayati Raj Department meeting withNABARD Representatives

* పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌తో నాబార్డు ప్రతినిధుల భేటీ
* వచ్చే ఏడాది మరింత రుణసాయం అందిస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు మరో రూ.4 వేల కోట్లు రుణంగా అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది. గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో నాబార్డు ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2016-17 సంవత్సరానికి గాను రూ.4 వేల కోట్ల రుణమిచ్చేందుకు మరింత రుణమిచ్చేందుకు అంగీకారం తెలిపారు.

నాబార్డు ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. అందులో రెండో విడత సొమ్ము రూ.1,976.80 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఈ మొత్తంతోపాటు తాజాగా అంగీకరించిన రూ.4 వేల కోట్లలో తొలి విడతగా రూ.2,200 కోట్ల రుణాన్ని త్వరలోనే విడుదల చేస్తామని నాబార్డు ప్రతినిధులు హామీ ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలోనూ మరికొంత రుణసాయం అందిస్తామని చెప్పారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ సెగ్మెంట్లలో జరుగుతున్న పనులు, భవిష్యత్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలను పరిశీంచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయమై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని నాబార్డు జనరల్ మేనేజర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, నాబార్డు ఉన్నతాధికారులు తులికా పంకజ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement