Bhagwad Gita
-
భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం
గీతా జయంతి ప్రత్యేకం.. సర్వధర్మములను విడనాడి నన్నే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపముల నుండి విడిపించెదను. నీవు శోకింప తగదు! — అధ్యాయం 18: శ్లో 66 మహర్షి వ్యాసులవారు రచించిన భగవద్గీతకు పరమహంస యోగానంద చేసిన విస్తారమైన అనువాదము, వివరణలో ఆ మహా యోగివర్యులు కృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునునికి చేసిన వాగ్దానానాన్ని ఈ విధంగా అనువదించారు; “నీవు అహంకార జనితాలైన కర్తవ్యాలను విస్మరించి, నేను నిర్దేశించిన దివ్య కర్తవ్యాలను నిర్వహిస్తూ, నాలోనే ఆనందిస్తే, విముక్తిని పొందుతావు.” ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ‘ఒక యోగి ఆత్మ కథ’ రచయిత, ఒక శతాబ్ది కంటే ఎక్కువ కాలం క్రితమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించిన పరమహంస యోగానంద ఈ విశ్వంలోని మొత్తం సమాచారం గీతలోని 700 శ్లోకాల్లో నిబిడీకృతమై ఉన్నదనీ, “భగవంతుని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, వారి ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఆ భాగం పైన గీత తన కాంతిని ప్రసరిస్తుందనీ” వివరించారు. యోగానందగారు గీతా వ్యాఖ్యానం పై తమ పనిని తన గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరి, శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు మరియు శ్రీకృష్ణ భగవానుడు గీతలో రెండుసార్లు ప్రస్తావించిన పవిత్ర క్రియాయోగ ప్రక్రియను పునరుజ్జీవింపచేసిన మహావతార్ బాబాజీ తమ అంతర్దృష్టితో చేసిన మార్గదర్శకత్వంలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభించారు. యోగానంద ఈ విధంగా విశదపరిచారు; “ఒక దైవ సాక్షాత్కారం పొందిన గురువు సహాయంతో, సహజావబోధాజనిత అంతర్దృష్టితో కూడిన గ్రహణశక్తి అనే ఆడకత్తెరను ఉపయోగించడం ద్వారా భాష ,నిగూఢత అనే గట్టి పెంకును పగలగొట్టి, ధార్మిక బోధలలోని లోపలి సారమైన సత్యాన్ని అందుకోవడం ఎలాగో మనం నేర్చుకోగలుగుతాము.“ 1952 లో జరిగిన తమ మహా సమాధికి కొద్ది నెలల ముందు గీతలోని లోతైన అధ్యాత్మిక భావాల అంతిమ సమీక్ష మరియు వివరణ కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలోని ఒక చిన్న ఆశ్రమంలో ఏకాంతవాసంలో గురుదేవులు చేపట్టారు. “ఆ గదిలోని స్పందనలు (యోగానంద ఈ రచనా వ్యాసంగం చేపట్టిన గదిలో) నమ్మశక్యం కాకుండా ఉన్నాయి; ఆ గదిలోకి వెళ్తుంటే భగవంతుడిలోకి ప్రవేశిస్తున్నట్లే ఉండేది.” అని అక్కడి సన్న్యాసి ఒకరు గుర్తుచేసుకొన్నారు. యోగానంద బృహత్కృషి కేవలం గీతను తన స్వంత భావాల ప్రకారం, మేధస్సుతో మెలితిప్పి అర్థం చేప్పి వివరించడంలో కాకుండా, శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన నిజమైన సంభాషణను మహర్షి వ్యాసులవారికి తమ ‘బ్రహ్మానంద స్థితిలోని వివిధ స్థాయిలలో’ ఏవిధంగా వెల్లడి అయిందో దానిని ప్రపంచానికి వివరించడంలో ఉంది. అలా ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ సర్వవ్యాప్త పరమాత్మ (శ్రీకృష్ణుడు) కు, అర్జునుడి రూపంలోని ఒక ఆదర్శ భక్తుడి ఆత్మకు మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. గ్రహించగలిగిన భక్తుడికి మొట్టమొదటి అధ్యాయం నుండే కురుక్షేత్ర యుద్ధం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ప్రతి వ్యక్తిలోనూ — ఆత్మతో సంబంధం కలిగిన స్వచ్చమైన విచక్షణాయుత మేధస్సు (పాండు పుత్రులు) కు,అహంకారం అనే మాయకు లోనైన ఇంద్రియబద్ధమైన గుడ్డి మనస్సు (గ్రుడ్డి వాడైన ధృతరాష్ట్రుడు, అతడి కుటిల సంతానం) కు మధ్య — జరుగుతున్న ఆధ్యాత్మిక,మానసిక యుద్ధాన్ని వివరించడానికి పోలికగా ఊపయోగిస్తున్నారని స్పష్టమౌతుంది. కృష్ణుడి (గురువు లేక జాగృతమైన ఆత్మ చైతన్యం, లేక ధ్యాన జనిత సహజావబోధం) సహాయంతో యుద్ధం చేయాలి; భౌతికంగా, మానసికంగా, అధ్యాత్మికంగా ‘రాజ్యాన్ని అహంకారం నుండి, మరియు దుష్ట మానసిక ప్రవృత్తులనే దాని సైన్యం నుండి తిరిగి స్వాధీనపరచుకోవడం,’ తద్ద్వారా సర్వసమర్థ ఆత్మ సామ్రాజ్యాన్ని స్థాపించడం. కృష్ణుడు శోకతప్తుడైన అర్జునునికి నిశ్చయమైన ఓదార్పును అందించినట్టే, యోగానంద ప్రతి నిజమైన అధ్యాత్మిక అన్వేషకుడిలో ఉన్న అర్జునునికి తన అపూర్వమైన పలుకులతో ఈ విధంగా సలహా ఇచ్చారు. ”ప్రతి వ్యక్తీ తన కురుక్షేత్ర యుద్ధాన్ని తానే పోరాడి గెలవాలి. ఇది కేవలం గెలవ తగిన పోరు మాత్రమే కాదు, ఈ విశ్వానికి నిర్దేశింపబడిన దివ్య న్యాయాన్ని అనుసరించి, జీవాత్మకు పరమాత్మతో ఉన్న శాశ్వత సంబంధాన్ననుసరించి, ముందో తరువాతో తప్పక గెలవాల్సిన యుద్ధమిది.” గాడ్ టాక్స్ విత్ అర్జున‘, క్రియాయోగం గురించిన మరింత సమాచారంకోసం:yssofindia.org -
నింగిలోకి ప్రధాని మోదీ ఫొటో
న్యూఢిల్లీ: భగవద్గీత పుస్తకం, ప్రధాని మోదీ చిత్రపటం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను ఈ దఫా నింగిలోకి తీసుకుపోయేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. వీటిలోని ఒక శాటిలైట్‌లో మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫిబ్రవరి 28న పీఎస్ఎల్వీ సీ–51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా–1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 శాటిలైట్లను ప్రయోగించనుంది. వీటిలో ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్, సతీశ్ ధావన్(ఎస్డీ శాట్)ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్ (శ్రీపెరంబుదూర్), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్(నాగ్‌పుర్), శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు. వీటిలో సతీష్‌ధావన్ శాటిలైట్‌లో మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’∙పదాలు, భగవద్గీత కాపీ, 25000 మంది పౌరుల పేర్ల జాబితాను తీసుకెళ్లనున్నట్లు స్పేస్ కిడ్జ్ సీఈవో డాక్టర్ శ్రీమతి కేసన్ తెలిపారు. అంతరిక్షంలోకి పేర్లను పంపేందుకు అడిగిన వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు. వీరందరికీ బోర్డింగ్ పాస్‌లు ఇచ్చామన్నారు. ప్యానెల్ దిగువన ఇరువైపులా ఇస్రో చైర్మన్ శివన్, సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ పేర్లను చెక్కినట్లు తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. ఇదే తరహాలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నామని డాక్టర్ శ్రీమతి వెల్లడించారు. పీఎస్ఎల్వీ సీ–51 వాహకనౌకను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. -
ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలిసులు మళ్లీ వీడియో వైరల్
-
మరో నకిలీ వీడియో హల్చల్!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భగవద్గీత పంచుతున్న ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలీసులంటూ ఓ వీడియో ఆన్లైన్ గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ‘వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ’ గ్రూప్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో షేర్ చేస్తోంది. ఇదే వీడియో ఇంతకుముందు 2018, ఏప్రిల్ నెలలో వైరల్ అయింది. గోవాలో ఇస్కాన్ సభ్యులపై క్రైస్తవులు దాడి చేసినప్పటి వీడియో అంటూ నాడు ప్రచారం అయింది. వాస్తవానికి ఈ వీడియో 2008, నవంబర్ 26వ తేదీన ‘హెరాల్డ్గోవా డాట్ ఇన్’ వచ్చిన వార్తకు సంబంధించినది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినందున ఆ సైట్లో వీడియో దొరకలేదుగానీ ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వార్త, దానికి సంబంధించిన ఫొటో వెలుగు చూసింది. ఆన్లైన్లో నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు వెతికి పట్టుకునే ‘ఆల్ట్ న్యూస్’ దీన్నీ వెతికి పట్టుకుంది. కాషాయ వస్త్రాలు ధరించిన ఓ రష్యా బృందం పెద్ద పెట్టున డోలక్, హార్మోనియంను వాయిస్తూ హరేరామా, హరేకృష్ణ అని పాడుకుంటూ వెళుతుండగా, చాలా సేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి త్వరత్వరగా రోడ్డు పక్కగా వెళ్లాల్సిందిగా ఆ రష్యా బృందాన్ని ఆదేశించారు. దాంతో ఆ బృందం సభ్యులు పోలీసులతో కొట్లాటకు దిగారు. దానికి సంబంధించిన వీడియోనే. ఆ వీడియోలో కనిపిస్తున్నది నల్లగా ఉండే అచ్చమైన గోవా పోలీసులని స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకుండా ఉండేందుకు పోలీసుల ముఖాలను కాస్త మార్ఫింగ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో మే 12, మే 19న జరగనున్న మరో రెండు విడతల పోలింగ్‌లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లున్నారు. నాడు ఈ సంఘటన జరిగినప్పుడు గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. -
రాజస్ధాన్ పోటీ పరీకల్లో భగవద్గీత ప్రశ్నలు
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2018 (ఆర్ఏఎస్) పరీక్షకు సంబంధించి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ పేపర్లో భగవద్గీత సారాంశానికి సంబంధించిన పాఠాలను సిలబస్ లో చేర్చారు. రాజస్ధాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్షలకు చెందిన జనరల్ స్టడీస్ చేసిన మార్పుల్లో భాగంగా ఈ అంశాలను సిలబస్‌లో చేర్చింది. నీతి శాస్త్ర పేరుతో గీత బోధనలను ప్రత్యేకంగా చేర్చారు. భగవద్గీతతో పాటు మహాత్మ గాంధీ జీవితానికి సంబంధించిన పాఠాలు, దేశ ప్రముఖులు, సాంఘిక సంస్కర్తలు, కార్యనిర్వాహక అధికారుల చరిత్రలనూ పాఠ్యాంశాలుగా చేర్చారు. నిర్వహణ, పాలనా విభాగాల్లో భగవద్గీత పాత్ర పేరిట సబ్-యూనిట్‌ను జోడిస్తూ ఆర్ఏఎస్ 2018 పరీక్ష సిలబస్‌ను సవరించారు. దీంతో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన 18 అధ్యాయాల నుంచి పలు ప్రశ్నలు ఆర్ఏఎస్ 2018 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎదురవనున్నాయి. బీజేపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని కాషాయీకరిస్తోందని విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
ఫుడాన్ యూనివర్శిటీలో గీతా పఠనం
-
ఫుడాన్ యూనివర్శిటీలో గీతా పఠనం
షాంఘై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడోరోజు పర్యటనలో భాగంగా చైనాలోని షాంఘై పట్టణంలో ఉన్న ఫుదాన్ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. రెండు యూనివర్సిటీల విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. విదేశాల్లో యూనివర్సిటీల విద్యార్థులను కలవడం చాలా అరుదుగా నాయకులకు లభిస్తుందని అలాంటి అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత్-చైనా సత్సంబంధాలతో భవిష్యత్తరాలకు చాలా మేలు జరుగుతుందన్నారు. మోదీ ప్రసంగం ముగియగానే మోదీ, మోదీ అంటూ ఫుదాన్ యూనివర్సిటీలో నినాదాలు మార్మోగాయి. మరోవైపు మోదీని చూసేందుకు ఫుదాన్ వర్సిటీకి ఎన్నారైలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మోదీతో పలువురు ఎన్నారైలు సెల్ఫీలు దిగారు. ప్రపంచానికి రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయని ఒకటి ఉగ్రవాదం, రెండోది గ్లోబల్ వార్మింగ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి గాంధేయ మార్గమే మంచిదని భావిస్తున్నామన్నారు. అలాగే గ్లోబల్ వార్మింగ్‌కు కూడా గాంధీయే మార్గమే సరైందన్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీలోని చారిత్రాత్మకమైన సెంటర్ ఫర్ గాంధీయన్ అండ్ ఇండియన్ స్టడీస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతిపితి గాంధీ మహాత్ముని సిద్దాంతాలు, ఆచరణ ప్రపంచంలో వున్న మానవులందరికీ ఆదర్శం కావాలన్నారు. ఆయన విశ్వమానవుడని, యుగపురుషుడని ప్రధాని కొనియాడారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చైనా విద్యార్థులు భగవద్గీతను శ్లోకాలను పఠించారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి విశ్వరూప్ ట్విట్ చేశారు.