సిహగ్కు ఎన్ఎండీసీ
♦ సీఎండీగా అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహ రిస్తున్న భారతీ ఎస్. సిహగ్ తాజాగా ప్రభుత్వ రంగ అతిపెద్ద ఐరన్ ఓర్ కంపెనీ ఎన్ఎండీసీ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్)గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎన్ఎండీసీ బీఎస్ఈకి నివేదిస్తూ వెల్లడిం చింది. భారతీ సిహగ్ ఈ పదవిలో మూడు నెలలపాటు లేదా కొత్తవారిని నియమించే వరకు లేదా ప్రభుత్వపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (వీటిల్లో ఏది ముందైతే అది) కొనసాగుతారని ఎన్ఎండీసీ పేర్కొంది.
ఇది వరకు ఎన్ఎండీసీ చైర్మన్‌గా వ్యవహరించిన నరేంద్ర కొఠారి డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఎస్ఈబీ) ఎన్ఎండీసీ చైర్మన్ పదవికి గోపాల్ సింగ్ పేరు సిఫార్సు చేసింది. కానీ దానిపై కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ నియామకాల కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గోపాల్ సింగ్ ప్రస్తుతం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.