bhim aap
-
పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ సంస్థలకు రూపే డెబిట్ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంచారు. రూపే కార్డు, భీమ్ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లపై, ఈ కామర్స్ సైట్లపై రూపే డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది. -
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్.. ‘‘క్యూఆర్’ కోడ్‌తో పేమెంట్ చేస్తున్నారా?!
ఈ రోజుల్లో ఏదైనా వస్తువు కొనాలంటే వెంట డబ్బులు ఉండనక్కర్లేదు. డెబిట్ కార్డ్ కూడా అవసరం లేదు. స్మార్ట్ ఫోన్.. అందులో డిజిటల్ చెల్లింపుల ఎంపిక ఉంటే చాలు. దీంట్లో భాగంగానే ‘క్యూఆర్’ కోడ్ వచ్చాక మన జీవితం మరింత సులభం అయిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ పద్ధతి వల్ల మోసాల బారినపడుతున్నవారూ ఉన్నారు. అందుకే డిజిటల్ పేమెంట్స్ చేసేవారు తప్పనిసరిగా ‘క్యూ ఆర్’ కోడ్ గురించి తెలుసుకోవాల్సిందే! నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం వేగంగా దూసుకుపోతోంది. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నగదు చెల్లించడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా మన జీవితం మరింత సులభతరంగా మారిపోయింది. క్షణాల్లో చెల్లింపులు నెఫ్ట్ లేదా ఆర్టిజిఎస్ లావాదేవీలను పూర్తి చేయడానికి యుపిఐ అనేది స్వల్పకాలిక చెల్లింపు పద్ధతి. ఆర్థిక లావాదేవీని జరపడానికి .. క్యూఆర్ కోడ్ స్కాన్, నగదు మొత్తం, అంకెల పిన్ చేస్తే చాలు లావాదేవీ సెకన్లలో పూర్తవుతుంది. క్యూఆర్ కోడ్లను ఉపయోగించే యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ లు ప్రధానమైనవి. తర్వాత జాబితాలో భీమ్ యాప్, మొబిక్విక్, పేజ్యాప్, రేజర్‌పే మొదలైనవి ఉన్నాయి. క్విక్ రెస్పాన్స్ అనే క్యూఆర్ కోడ్ బార్కోడ్ డేటాతో ఎన్కోడ్ చేసే స్కాన్. బాధితుల డబ్బు దొంగిలించడానికి మోసగాళ్లు వారి సొంత క్యూఆర్ కోడ్లను సృష్టిస్తారు. లేదా బాధితుల నుండి వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా రాబడతారు. లింక్స్ ద్వారా ఎర సాధారణంగా బయట షాపింగ్ చేసే సమయంలో ఈ సమస్య తలెత్తదు. ఆన్లైన్ బిజినెస్‌లో భాగంగా తమ వస్తువును విక్రయించడానికి చేసే పోస్టులో మోసగాళ్లు క్యూఆర్ కోడ్ కూడా రూపొందిస్తారు. ఈ లింక్‌ను వాట్సప్ లేదా ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీనికి ఆకర్షితులై లింక్ ఓపెన్ చేశాక, నగదు చెల్లింపులకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని బాధితుడిని కోరుతారు. బాధితులు తమ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. డబ్బులు జమ చేస్తామని నమ్మించి, మోసగాళ్లు బాధితుల ఖాతాల నుంచి డబ్బును దొంగిలిస్తారు. ఫోన్ చేసి.. రాబట్టే ప్రక్రియ ఒక సైబర్ నేరస్థుడు మీకు ఫోన్ చేసి ఫలానా బహుమతి గెలుచుకున్నారని నమ్మబలుకుతాడు. ఆ బహుమతిని పొందడానికి తాను పంపిన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని కోరుతాడు. మీకు తెలిసిన లేదా నమ్మకం కలిగించే వ్యక్తిగా వ్యవహరిస్తాడు. దీని నుంచి వారు మీ డేటాను పొందవచ్చు. చాలా నేరాలు ఫిషింగ్ కాల్స్, ఎసెమ్మెస్/ఇ–మెయిల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా జరుగుతాయి. స్కామర్లు ఇప్పుడు వారి మోడస్ ఆపరెండీని క్యూఆర్ కోడ్లకు కూడా మార్చారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ►మోసగాళ్లు మోసం చేయడానికి కొత్త, సృజనాత్మక మార్గాలను ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. వాటిలో క్యూఆర్ కోడ్ ఒకటి. స్కామర్లు మీకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఇ–మెయిల్ లేదా సోషల్ మీడియాలో సందేశాన్ని పంపుతారు. క్యూఆర్ కోడ్‌తో మీరు డబ్బును తిరిగి పొందవచ్చుని పేర్కొంటారు. ►మనం చూసిన క్యూఆర్ కోడ్ చట్టబద్ధమైనదిగా అనిపిస్తుంది. ఆకర్షణీయమైన ప్రకటనలుగా వాట్సప్, సోషల్ మీడియా సందేశాలు ఉంటాయి. ఉదా: క్యూఆర్ కోడ్ చిత్రంతో పాటు మీరు రూ. 5,00,000 గెలుచుకున్నందుకు అభినందనలు అని ఉందనుకోండి. ఆ మెసేజ్‌కు ఆకర్షితుడైన బాధితుడు కోడ్‌ని స్కాన్ చేసి, మొత్తాన్ని నమోదు చేసి, తన బ్యాంకు అకౌంట్‌కు బదిలీచేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఖాతాలోకి నగదును స్వీకరించడానికి పిన్ ఉంటుంది. తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని బాధితులు నమ్ముతారు. కానీ డబ్బును స్వీకరించడానికి బదులుగా మన ఖాతా నుండి నగదు వేరే అకౌంట్‌కు బదిలీ అవుతుంది. తప్పుడు క్యూఆర్ కోడ్స్ ఫిషింగ్ ఇ–మెయిల్లు, టెక్ట్స్ లేదా సోషల్ మీడియా పోస్ట్‌లలో తప్పుడు క్యూఆర్కోడ్లను ఉపయోగించడం మరొక పద్ధతి. తప్పుడు కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత, వినియోగదారులు వాస్తవికంగా కనిపించే పేజీలతో వెబ్సైట్లకు మళ్లించబడతారు, అక్కడ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం అందించడం ద్వారా బాధితుడు అకౌంట్ లాగిన్ అయ్యేలా చూడచ్చు. సురక్షితమైన చెల్లింపులకు... అంతటా క్యూఆర్ కోడ్ చెల్లింపులు జరుగుతున్నాయి. మీరు బాధ్యతాయుతంగా ఈ లావాదేవీలు జరిపినప్పుడు మీ బ్యాంకు ఖాతా నగదు సురక్షితంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ తో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే అవి యంత్రాల ద్వారా మాత్రమే చదవబడతాయి. మీరు స్నేహితుడికి కొంత డబ్బును బదిలీచేయాలనుకుంటే ఉదాహరణకు.. డబ్బును పంపే ముందు మీరు వారి ఖాతా నంబర్, మొత్తం, ఇతర సమాచారాన్ని ధృవీకరించాలి. క్యూఆర్ కోడ్‌తో ఆ అవసరం లేదు. అందుకని.. తెలియని కోడ్‌ను స్కాన్ చేయకూడదు. ►డబ్బు చెల్లించడానికే క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. వివరాలు తెలియజేయడానికి కాదు. డబ్బును స్వీకరించడానికి బదులుగా, మీకు మొత్తం క్రెడిట్ చేయబడుతుంది స్కాన్ చేయమని అడిగితే అది స్కామ్ కావచ్చని గ్రహించండి. మీ వ్యక్తిగత ఖాతా వివరాలు మోసగాళ్లచే దొంగిలించబడుతున్నాయని తెలుసుకోండి. వివరాల ఆధారంగా మీ బ్యాంక్ ఖాతా నుండి స్కామర్లు ఎక్కువ మొత్తం నగదు దొంగిలించవచ్చు. ►మీ బ్యాంక్ పంపిన ఈ–మెసేజ్‌లు, మెయిల్ల గురించి విచారించడానికి నేరుగా బ్యాంక్‌ను సంప్రదించండి. అంతేకాని, మీ బ్యాంక్ ద్వారా పంపబడినట్లు భావిస్తున్న క్యూఆర్ కోడ్‌తో స్పామ్ లేదా అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించకండి. ►మీరు నమ్మని క్యూఆర్ కోడ్‌ని మీరు చూసినట్లయితే, మీరు అందించే సేవ లేదా ఉత్పత్తి గురించిన మరింత సమాచారాన్ని మాన్యువల్‌గా చూసేందుకు ప్రయత్నించండి. ►క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని మిమ్మల్ని అడిగే స్పామర్లకు ‘నో‘ చెప్పడానికి భయపడకండి. మీకు కష్టంగా అనిపిస్తే, వాటిని బ్లాక్ చేసి సంబంధిత వెబ్సైట్ లేదా బ్యాంక్ లేదా సోషల్ మీడియాకు తెలియజేయండి. ►మీరు క్యూఆర్ కోడ్ స్కామ్‌కి బాధితులుగా మారితే వెంటనే చేయాల్సింది... cybercrime.gov.in/uploadmedia/MHA-CitizenManualReportOtherCyberCrime-v10.pdfలో ఫిర్యాదును నమోదు చేయండి. లేదా ఫిర్యాదు చేయడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. ►హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయవచ్చు, ఇది సంబంధిత రాష్ట్ర పోలీసు అధికారిచే నిర్వహించబడుతుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని ఫోన్.. ఆధార్ వివరాలు చెప్పినందుకు! -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త, ఆధార్ నెంబర్‌తో మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు ఆధార్ కార్డ్ నెంబర్‌తో భీమ్ యూపీఐ ద్వారా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా మనదేశంలో ఆన్లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కాలేజీ ఫీజుల నుంచి కిరాణా స్టోర్లలో కొనుగోలు చేసే నిత్యవసర సరుకుల పేమెంట్స్ వరకు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అయితే ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల ఫోన్లకు మాత్రమే ఉంది. ఉదాహరణకు, స్మార్ట్‌ఫోన్ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) అడ్రస్‌లేని వారికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కష్టంగా మారింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి, 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ)ని ఉపయోగించే వ్యక్తులు ఫోన్ లేదా, యూపీఐ అడ్రస్ లేని వారికి ఆధార్ నెంబర్ని ఉపయోగించి డబ్బు పంపవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (uidai) వెల్లడించింది. భీమ్ అనేది యూపీఐ (Unified Payment Interface-UPI) ఆధారిత యాప్. ఇందులో మొబైల్ నంబర్, పేరుతో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే యూఐడీఏఐ ప్రకారం.. ఇకపై భీమ్ యాప్‌లో లబ్ధి దారుల అడ్రస్ విభాగంగాలో ఆధార్ నెంబర్‌ను ఉపయోగించి మనీని సెండ్ చేయొచ్చు. భీమ్‌లోని లబ్ధిదారుల చిరునామాలో ఆధార్ నంబర్ని ఉపయోగించి డబ్బు పంపే ఆప్షన్ కనిపిస్తుంది. భీమ్‌లో ఆధార్ నంబర్ని ఉపయోగించి డబ్బు ఎలా పంపాలి? ►భీమ్‌లో ఆధార్ నంబర్ని ఉపయోగించి లబ్ధిదారుని 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. ►దీని తర్వాత, సిస్టమ్ ఆధార్ లింకింగ్, లబ్ధిదారుల చిరునామాను ధృవీకరిస్తుంది. యూఐడీఏఐ అందించిన సమాచారం ప్రకారం వినియోగదారుడు నగదును పంపొచ్చు. అలా పంపిన నగదు లబ్ధి దారుడి అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది ►అలాగే, చెల్లింపులను స్వీకరించడానికి ఆధార్ పే పీఓఎస్ని ఉపయోగించే వ్యాపారులకు డిజిటల్ చెల్లింపు చేయడానికి ఆధార్ నంబర్,వేలిముద్రను ఉపయోగించాలి. ►ఒకవేళ, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉండి, ఆ అకౌంట్లకు ఆధార్‌తో లింక్ చేయబడితే, అటువంటి పరిస్థితిలో అన్ని అకౌంట్లను డబ్బుల్ని సెండ్ చేయొచ్చని యూఐడీఏఐ తెలిపింది. చదవండి: గూగుల్ అదిరిపోయే ఫీచర్, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..! -
భీమ్ యూపీఐతో ఫాస్టాగ్ రీచార్జ్
న్యూఢిల్లీ: నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. టోల్ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసేలా ‘ఫాస్టాగ్’ అమల్లోకి రావడం తెలిసిందే. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంటుకు అనుసంధానించే ఫాస్టాగ్ ట్యాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్ చేశాక.. వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది. -
నగదు రహిత సేవలు భలే!
నెహ్రూనగర్(గుంటూరు): డిజిటల్ లావాదేవీలపై యువతను ఆకర్షించేందుకు వివిధ సంస్థలు, యాప్‌లు రకరకాల ఆఫర్లు, అవార్డులు, రివార్డులు ప్రకటిస్తున్నాయి. భీమ్, పేటీఎం, ఫ్రీచార్జి, మొబిక్విక్, ఫోన్‌పే, తేజ్ సహా అన్ని బ్యాంకులకు సొంత యాప్‌లు ఉన్నాయి. ఆయా సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండటంతో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసులు నగదు రహిత లావాదేవీలపై మొగ్గు చూపుతున్నారు. వర్చువల్ ఐడీ ఉంటే చాలు : యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్) విధానం ద్వారా షాపింగ్ మాల్స్‌లో బిల్లులు, ట్యాక్సీ చెల్లింపులు, రైలు, సినిమా టికెట్లు, ఆన్లైన్ షాపింగ్ బిల్లులు, మొబైల్ రీచార్జ్‌లు, గ్యాస్, కరెంట్ బిల్లులు ఇలా అన్ని రకాల చెల్లింపులకు డెబిట్/క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఏదైనా దుకాణంలో బిల్లు చెల్లించాలనుకుంటే మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానించిన మీ వర్చువల్ ఐడీని చూపితే చాలు. దుకాణాదారులు వర్చువల్ ఐడీని ఎంటర్ చేయగానే ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. మనం పాస్వార్డ్ను నమోదు చేయగానే, క్షణాల్లో దుకాణాదారుడి ఖాతాలో నగదు జమ అవుతుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసి క్యాష్ ఆన్లైన్ ఎంపిక చేసుకున్నా సందర్భంలో, వస్తువు డెలివరీ తీసుకుంటున్న సమయంలో నగదుకు బదులుగా యూపీఐ యాప్‌లో ఆ సంస్థ వర్చువల్ ఐడీ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వివిధ బ్యాంకులు, సంస్థలు తమ యాప్‌ల ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. వస్తువులు కొనుగోలు చేసినా, బిల్లులు చెల్లించినా 10 నుంచి 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి. బయట ఎమ్మార్మీ ధరలకు కొనుగోలు చేసే బదులు ఆన్లైన్ యాప్‌ల ద్వారా కొనుగోలు చేస్తే 20శాతం వరకు వినియోగదారులకు లాభం కలుగుతుంది. దీంతో భవిష్యత్తు అంతా డిజిటల్ లావాదేవీలదేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రివార్డు పాయింట్లు ఫోన్‌పే, ఫ్రీచార్జ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర యాప్‌లు తమ కొనగోలుదారులకు రివార్డు పాయింట్లను కేటాయిస్తున్నాయి. నిర్ణీత సంఖ్యకు చేరగానే కొంత నగదు వెనక్కి రావడం లేదా కొద్ది మొత్తం ఉచితంగా కొనుగోలు చేయడం వంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా రీచార్జీకి సంబంధించిన లావాదేవీలకు ఈ రివార్డు పాయింట్ల ద్వారా జరుగుతున్నాయి. సెంటర్ ఫర్ డిజిటల్ ఫైనాన్షియల్ అధ్యయనం ప్రకారం బ్యాంకు ఖాతా ఉన్న 68 శాతం మంది నగదు రహితానికే మొగ్గు చూపుతున్నారని అని తెలియజేస్తుంది. ఇందులో స్మార్ట్ ఫోన్ ఉండి, ఆన్లైన్ వినియోగిస్తున్న వారు 52 శాతంగా ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారు అత్యధికంగా 81శాతం మంది నగదు రహిత లావాదేవీలపై మొగ్గుచూపుతున్నారు. కొన్ని ఫోన్లలో కల్పించే సౌకర్యాలతో కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా మన ఫోన్లో బ్యాంకు ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేస్తే, కొనుగోలు చేసే దగ్గర ఉండే పీవోఎస్ యంత్రం దగ్గర దాన్ని చూపిస్తే సరిపోతుంది. మనం నిర్దేశించే పాస్వార్డు లేదా వేలిముద్రలు తప్పనిసరి కావడంతో ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. దీంతో భారత్ క్యూఆర్ కోడ్ సాయంతో వివిధ బ్యాంకులు అందిస్తున్న యూపీఐ, భీమ్ యాప్ ద్వారా కూడా నగదు చెల్లించవచ్చు. ఏ విధమైన రుసుం లేకుండా తక్షణ నగదు బదిలీ సేవలు అందించే పీవోఎస్ యంత్రాల అవసరం లేకపోవడంతో వ్యాపారులకు ఉపయోగపడుతుంది. -
భీమ్ యస్ పే
ప్రైవేట్ రంగంలోని ‘యస్ బ్యాంక్’ వినియోగదారుల కోసం ‘భీమ్ యస్ పే’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఒక స్మార్ట్ పేమెంట్ యాప్. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇒ భీమ్ యస్ పే యాప్‌ను ఉపయోగించాలనుకుంటే మీరు యస్ బ్యాంక్ కస్టమరే కానక్కర్లేదు. ⇒ యూపీఐ: డబ్బుల్ని పంపొచ్చు. పొందొచ్చు. అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చూడొచ్చు. గత లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. – ⇒ వర్చువల్ కార్డ్: యస్ పే యూజర్లు ఉచిత వర్చువల్ కార్డును పొందొచ్చు. దీని సాయంతో ఈ–కామర్స్ సైట్లలో చెల్లింపులు చేయవచ్చు. ⇒ భారత్ క్యూఆర్ ఫీచర్ అందుబాటులో ఉంది. ⇒ యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్: యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను లింక్ చేసుకొని, అకౌంట్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. అంటే కార్డ్ బిల్లులు చెల్లించొచ్చు. స్టేట్మెంట్లు పొందొచ్చు. కార్డ్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. ⇒ యస్ బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల ఖాతాల నుంచి డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వాలెట్‌లోకి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ⇒ డీటీహెచ్‌తోపాటు ప్రి–పెయిడ్ మొబైల్ రీచార్జ్‌లను నిర్వహించుకోవచ్చు. ఇతర బిల్లులు చెల్లించొచ్చు. ⇒ ప్రతి ట్రాన్సాక్షన్‌పై రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
త్వరలో ఆధార్ పే....
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకూ ఉన్న పేమెంట్ విధానాలకు వినూత్నంగా మరో పేమెంట్ వ్యవస్థను రూపొందించబోతోంది. భీమ్ యాప్ ఆవిష్కరణలో ప్రధాని మోదీ ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థ రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే మన ఆధార్ సంఖ్యతో లావాదేవీలు నిర్వహించవచ్చు. కేవలం వేలిముద్రల ఆధారంగా ట్రాన్సక్షన్స్ చేయవచ్చు. ఆధార్ ఆధారిత చెల్లింపులకు స్మార్ట్‌ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. మన ఆధారకార్డు నంబరు తో బ్యాంకు ఖాతా లింక్ అయిఉంటే చాలు.. ఆటోమేటిక్ గా లావాదేవీలు నిర్వహించవచ్చు. ప్రస్తుతానికి ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, ఐసీఐసీఐ లాంటి ప్రముఖ సంస్థలు సపోర్టు చేయనున్నాయి. మార్చి 31 నాటికి అన్ని బ్యాంకులు ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థని సపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. మరో వారం రోజుల్లో ఈ వ్యవస్థ కార్యరూపం దాల్చనుంది.