biggest scam
-
ఎలక్టోరల్ బాండ్లు.. అతిపెద్ద కుంభకోణం
బెంగళూరు: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేదాకా అధికార బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ వేల కోట్ల రూపాయలు నొక్కేసిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. నేను తినను, ఇతరులను తిననివ్వనంటూ ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు బీజేపీకి ఇంత సొమ్ము ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, అవినీతికి పాల్పడిన బడా వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమరి్పంచుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం ఆరోపించారు. దర్యాప్తు సంస్థల భయంతో బీజేపీకి లొంగిపోయారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంపై ప్రజాక్షేత్రంలో వెళ్లి పోరాటం సాగిస్తామని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రో కో చోటుచేసుకుందని, అవకతవకలు జరిగాయని అన్నారు. ఇదొక వసూళ్ల రాకెట్: రాహుల్ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పథకం కింద వసూలు చేసిన సొమ్మును వివిధ రాష్ట్రాల్లో పారీ్టలను చీల్చడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ దుర్వినియోగం చేసిందని రాహుల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మినహా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన కాంట్రాక్టులకు, ఎలక్టోరల్ బాండ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. -
మెండిబకాయిలు యూపీఏ నిర్వాకమే
-
డీమోనిటైజేషన్ అతిపెద్ద స్కామ్: చిదంబరం
♦ 2016–17లో వృద్ధి 6.5% లోపే ♦ వచ్చే రెండేళ్లూ ఇదే స్థాయిలో ♦ ఆర్థిక రంగంపై రూ.1.15 లక్షల కోట్ల ప్రభావం ఉంటుందని అభిప్రాయం ముంబై: డీమోనిటైజేషన్ను 2016వ సంవత్సరపు అతిపెద్ద స్కామ్‌గా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 6 నుంచి 6.5 శాతంగానే ఉంటుందని, కేంద్ర గణాంక విభాగం (సీఎస్‌వో), ఆర్బీఐ వేసిన అంచనాల కంటే ఇది ఒక శాతం తక్కువ అని ఆయన అన్నారు. ఈ ఏడాది జీడీపీ రూ.150 లక్షల కోట్లు కాగా, ఇందులో ఒక శాతం అంటే రూ.1.15 లక్షల కోట్ల మేర ప్రభావం ఉంటుందని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైకి వచ్చిన చిదంబరం ఆదివారం విలేకరులతో మాట్లాడారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతంగానే ఉంటుందని, 2018–19లోనూ ఇదే విధంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘2016–17లో నమోదైన వృద్ధి రేటు కంటే 2017–18లో అధిక వృద్ధి సాధ్యం కాదు. ప్రపంచ ఆర్థిక రంగం ఇకపై అంత అనుకూలంగా ఉండబోదు. ఊహించడానికి సాధ్యం కాని వ్యక్తి వైట్‌హౌస్‌లో కూర్చున్నాడు’’ అని చిదంబరం పేర్కొన్నారు. తెలివితక్కువ నిర్ణయం ప్రధాని పేరును ప్రస్తావించకుండా ... ‘‘ఎవరో ఒకరు ఆయనపై ఒక ఆలోచనను రుద్దారు, దాంతో ఆయన టెలివిజన్ ముందుకు వచ్చి డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని ప్రకటించారు’’ అని చిదంబరం అన్నారు. డీమోనిటైజేషన్ను తెలివితక్కువ నిర్ణయమని ప్రభుత్వం చాలా ముందుగానే తెలుసుకుంటుందన్నారు. 2016 సంవత్సరపు అతిపెద్ద స్కామ్‌గా డీమోనిటైజేషన్ను అభివర్ణించిన ఆయన దీన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. పాత నోట్లను వెనక్కి తీసుకుని కొత్త నోట్లను ముద్రించడం వల్ల అవినీతిని లేదా నల్లధనాన్ని లేదా నకిలీ నోట్లకు అంతం పలకలేరని అభిప్రాయపడ్డారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో తిరిగి నోట్లను ప్రవేశపెట్టే కార్యక్రమం (రీమోనిటైజేషన్) జూన్ వరకు కొనసాగుతుందన్నారు. రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీని వెనక్కి తీసుకున్న తర్వాత ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీ రూ.9.5 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్పారు. రూ.150 లక్షల కోట్ల విలువగల ఆర్థిక వ్యవస్థలో రూ.9.5 లక్షల కోట్ల నగదు సరిపోదని, మరింత మొత్తంలో నోట్లను ముద్రించాల్సి ఉంటుందన్నారు. జూన్ నాటికి ఈ మొత్తం అందుబాటులోకి రావచ్చన్నారు. ఒక చక్రంతో ఎలా నడుస్తుంది? ‘‘వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ వినియోగం నాలుగు చోదకాలు. 18 నెలలుగా ప్రైవేటు పెట్టుబడులు దాదాపుగా ఏమీ లేవు. ప్రైవేటు వినియోగం చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండగా డీమోనిటైజేషన్ దాన్ని దెబ్బతీసింది. గత మూడేళ్ల నుంచీ ఎగుమతులు తక్కువగానే ఉన్నాయి. ఇక ప్రభుత్వ వ్యయం మాత్రం సాధ్యం అవుతుంది. ఈ ఒక్క టైర్‌లోనే గాలి ఉంది. కానీ, ఒక్క చక్రంతోనే కారు ఎలా నడుస్తుంది. కనుక ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది’’ అని చిదంబరం చెప్పారు. హైదరాబాద్, మొరాదాబాద్, కోయంబత్తూర్, జలంధర్, ఆగ్రా, కాన్పూర్‌లో 75 శాతం చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు పెద్ద నోట్ల రద్దు వల్ల మూతబడ్డాయన్నారు. ఇవి ఏడాదిన్నరలోపు తెరుచుకోవడం సాధ్యం కాదని, దీంతో వృద్ధిపై ప్రభావం మరింత కాలం ఉంటుందన్నారు. -
నోట్ల రద్దు పెద్ద స్కామ్: కాంగ్రెస్
-
నోట్ల రద్దు పెద్ద స్కామ్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు దేశ రాజకీయ చరిత్రలో పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 8 వరకు జరిగిన ఆర్ఎస్ఎస్, బీజేపీ ఖాతాల లావాదేవీల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇటీవల భారీ మొత్తంలో పట్టుబడిన నగదు బీజేపీదేనని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ఆరోపించారు. ఘజియాబాద్ లో రూ. 3 కోట్లతో దొరికిన ఇద్దరు వ్యక్తులను విడిపించేందుకు బీజేపీ నాయకుడు అశోక్ మోంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారని చెప్పారు. తాను అమిత్ షా తరపున వచ్చానని, పట్టుబడ్డిన డబ్బు బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి లక్నో బీజేపీ ఆఫీసుకు చేరాల్సివుందని మోంగా చెప్పినట్టు సూర్జివాలా తెలిపారు. ఛాయ్ కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా కొనుక్కోవాలని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ కార్యాలయానికి పెద్ద మొత్తంలో నగదు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. మీకు నగదు లావాదేవీలు వర్తించవా అని అడిగారు. -
నోట్ల రద్దు ఓ భారీ కుంభకోణం. ఎలాగంటే..
న్యూఢిల్లీ: ‘నోట్ల రద్దు నిర్ణయాన్ని నల్లధనంపై పోరాటంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పటికే తన దగ్గరున్న జాబితాలోని నల్లకుబేరులపై ఎలాంటి చర్యలు తీసుకుంది? రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేసి కొత్తగా రూ.2000 నోట్లు తీసుకురావడం వల్ల నల్లధనం ఎలా అంతం అవుతుంది? చెలామణిలో ఉన్న 80 శాతం కరెన్సీని ఒక్కసారే రద్దు చేస్తే దేశంలోని 40 శాతం మంది పేదలు, కూలీలు, చిరువ్యాపారులు ఎలా బతకాలి? మనుగడలో ఉన్న కరెన్సీ రద్దు కావడంతో అసంఘటిత రంగం(అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్)పై ఆధారపడి జీవిస్తోన్న దాదాపు 30 కోట్ల మంది నవంబర్ 9 నుంచి ఉన్నపళంగా పని కోల్పోయారు. గత పది రోజుల నుంచి వాళ్లంతా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు నల్లధనంపై పోరాటం చేయాల్సిందే. దానిని అందరూ సమర్థించాల్సిందే. కానీ దొరికిన దొంగల్ని వదిలేసి ప్రజల మీద పడటం, కనీసం వెసులుబాటుకు కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురిచేయడం చేయడం దుర్మార్గం. నిజానికి ఈ నోట్ల రద్దు వ్యవహారం స్వాతంత్ర్య భారత చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం. ఎలాగంటే.. ఇవ్వాళ బ్యాంకుల్లో ఏం జరుగుతోందో చూస్తున్నాం. పేద, మధ్యతరగతి ప్రజలంతా క్యూ లైన్లలో నిలబడి తమ దగ్గరున్న డబ్బునంతా బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. అందులో అతికొద్ది మొత్తాన్నే విత్ డ్రాయల్ రూపంలో తిరిగి తీసుకోవచ్చు. ముందుగా ఏం జరుగుతుందటే బ్యాంకుల బొజ్జలు పుష్టిగా నిండుతాయి. తర్వాత బ్యాంకులు తమ దగ్గరున్న భారీ మొత్తాలను బడా బాబులకు భారీ అప్పులిచ్చే వెసులుబాటు లభిస్తుంది. ముందు అనుకున్న ప్రకారం ఏ అంబానీకో, అదానీకో లేదా విజయ్ మాల్యాలాంటి దిగ్గజాలకు కోటానుకోట్లు అప్పులు దొరుకుతాయి. ఆ డబ్బుతో వారు తమ వ్యాపారాలను, పరిశ్రమలను విస్తరిస్తారని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ విచిత్రమేంటంటే.. ప్రతి బ్యాంకులో డీఫాల్టర్ల(అప్పు ఎగవేతదారుల) జాబితా ఉండేది ఇలాంటి బడా బాబులే. అంటే, ఏ కారణాలు చెప్పి బ్యాంకులు బడా బాబులకు అప్పులు ఇస్తున్నారో, అవి నూటికి నూరుశాతం తప్పుడు కారణాలుగా తేలుతున్నాయి. కొందరు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు నిజాయితీగా అప్పు చెల్లిస్తారు. కానీ అప్పు ఎగ్గొట్లే విజయ్ మాల్యా లాంటి వాళ్లను ప్రభుత్వం విమానం ఎక్కించి విదేశాలకు పంపిస్తుంది. బ్యాంకులు కేంద్రంగా ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఈ రకమైన జూదం ఆడటం సమంజసమేనా? నిన్నటికి నిన్న ఎస్బీఐ వసూలు కాని రూ.7016 కోట్ల బకాయిలను మాఫీ చేసింది. అలా విజయ్ మాల్యా సహా 63 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు మేలు చేసింది. అదేమని ప్రశ్నిస్తే బకాయిలు రద్దు కాలేదు.. అడ్వాన్స్ అండర్ కలెక్షన్ ఎకౌంట్ (ఏయూసీఏ)కు బదిలీ చేశాం అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. బ్యాంకింగ్ నిపుణులు ఎవ్వరినైనా అడగండి.. ఈ ఏయూసీఏలు ‘చెత్తబుట్టల్లాంటివ’ని సందేహించకుండా చెబుతారు. ఇక ముందు కూడా బ్యాంకులు ఇలానే చేయబోతున్నాయి. ప్రజల సొమ్మును నేతల సిఫార్సుల ద్వారా బడా బాబులకు పంచిపెట్టనున్నాయి. ఆ మేరకు లాభించిన సొమ్మునే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారు. అందుకే అంటున్నాం.. నోట్ల రద్దును సమర్థించడం నూటికి నూరుశాతం దేశద్రోహమని. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సభలు, ప్రచారం కోసం బీజేపీ కళ్లుచెదిరే రీతిలో చేసిన ఖర్చును భరించిన పారిశ్రామిక వేత్తల కోసమే ఈ నోట్ల రద్దును తెరపైకి తెచ్చారు. ఇవ్వాళ మాల్యా, రేపు ఇంకొకాయన.. అలా బడా బాబుల రుణాలు మొత్తం రద్దవుతాయి. కుటుంబాన్ని నడపటానికి అవసరమైన డబ్బు కోసం మహిళలు, పేదలు మాత్రం బ్యాంకుల ముందు బిచ్చగాళ్లలా నిలబడాలి! ఇలా చేస్తున్నందుకు ప్రభుత్వాలు సిగ్గుపడాలి. గడిచిన 10 రోజుల్లో బ్యాంకుల ముందు లైన్లలో నిలబడి 50 మందికి పైగా చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు కావా? అన్నింటికీ లెక్కలుండాలంటున్న మోదీకి.. బీజేపీ నిధుల వివరాలను బయటపెట్టే దమ్ముందా? మోదీని గుడ్డిగా ఆరాధించేవాళ్లు.. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై దేశద్రోహులుగా, నల్లధనం సమర్థకులుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వారు(ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారు) నిజంగా నేరాలకు పాల్పడిఉంటే చర్యలు తీసుకోవడానికి భయమెందుకు? ఎంక్వైరీలు చేయించరెందుకు? కేంద్రం తలుచుకుంటే కేసులకు కొదువా?. మోదీ మంచి పనులు చేసినప్పుడు మేం సమర్థించాం. తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం’ నవంబర్ 20లోగా నోట్ల ర్దదు నిర్ణయాన్ని ఉపసంహరించకుని, కుదేలైన పేదల జీవితాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశమింది. పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీతో కలిసి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న ఆయన.. యావత్ ప్రజానీకం తమ వెంట ఉందన్నారు. గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే ఏం చెయ్యాలనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. నోట్ల రద్దుపై పోరాటాన్ని కొందరు ముఖ్యమంత్రులు, కొన్ని పార్టీలు సమర్థించకపోవడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామిక పోరాటాలు నేతలు కేంద్రంగా జరగవని, ప్రజల కోసం, ప్రజలే చేస్తారని కేజ్రీవాల్ అన్నారు.