Bihar toppers scam
-
టాపర్ అరెస్ట్.. ఆశ్చర్యకర నిజాలు బహిర్గతం
పాట్నా: గతేడాది తరహాలోనే మరోసారి బిహార్ రాష్ట్రంలో టాపర్ల కుంభకోణం మరోసారి కలకలం రేపింది. ఇటీవల విడుదలలైన ప్లస్ టు ఫలితాలలో ఆర్ట్స్ లో స్టేట్ టాపర్ గా నిలిచిన గణేష్ కుమర్ ను పాట్నా పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి, కోత్వాలి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల విచారణలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. ప్లస్ టు ఫలితాలు విడుదలయ్యాక అదృశ్యమైన గణేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పాట్నా ఎస్ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. టెన్త్, ప్లస్ టు పరీక్షలకు రెండోసారి హాజరయ్యేందుకు గణేష్ తన వయసు, ఇతర వివరాలను తప్పుగా నమోదు చేశాడని బిహార్ పరీక్షల బోర్డు చైర్మన్ ఆనంద్ కిషోర్ వెల్లడించారు. అతడి సర్టిఫికేట్లను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పుట్టినతేదీ, పేరు మార్చేశాడు వాస్తవానికి అందరూ అనుకున్నట్లుగా ఆర్ట్స్ టాపర్ వయసు 24 ఏళ్లు కాదని, అసలు వయసు 41 ఏళ్ల పైమాటే. గణేష్ టెన్త్, ప్లస్ టు పరీక్షలు రెండుసార్లు రాశాడు. గణేష్ కుమార్ అసలు పేరు గణేష్ రామ్. అతడు పుట్టిన తేదీ నవంబర్ 7, 1975 కాగా, 1990లో అవిభాజ్య బిహార్ (ఇప్పటి ఝార్ఖండ్) లోని గిరిధ్ జిల్లా సురియా.. సీఆర్ ఎస్ఆర్ పాఠశాలలో గణేష్ రామ్ పేరుతో 1990లో టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. అనంతరం ప్లస్ టూ పరీక్షలకు హాజరయ్యాడు. 2015లో సమస్తిపూర్ లోని సంజయ్ గాంధీ ఉన్నత పాఠశాల విద్యార్థిగా గణేష్ కుమార్ పేరుతో టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. గణేష్ పుట్టినతేదీ జూన్ 2, 1993గా స్కూలు రికార్డులో ఉన్నట్లు గుర్తించినట్లు బీఎస్ఈబీ చైర్మన్ ఆనంద్ కిషోర్ చెప్పారు. చిన్న ప్రశ్నలకు నోరు తెరవలేదు సమస్తిపూర్ లోని జగదీప్ నారాయణ్ కాలేజీ్ విద్యార్థిగా ఈ ఏడాది ఆర్ట్స్ పరీక్షలు రాసిన గణేష్ హిస్టరీ, సోషియాలజీలలో 80 మార్కులు, హిందీలో 92, సైకాలజీలో 59, లాంగ్వేజ్ పేపర్లో 78, మ్యూజిక్(ప్రాక్టికల్స్) లో 70 మార్కులకు గానూ 65, థియరీలో 30కి 18 మార్కులు స్కోరు చేశాడు. అయితే అత్యధిక స్కోరు సాధించిన సబ్జెక్ట్స్ నుంచి చిన్న చిన్న ప్రశ్నలకు కూడా గణేష్ జవాబివ్వక పోవటంతో ఓ నిర్ధారణకొచ్చారు. గణేష్ రెండోసారి టెన్త్, ఇంటర్ చదివిన విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేశామని, టాపర్ చీటింగ్ పై వివరణ ఇచ్చేందుకు మూడు రోజుల గడువు ఇచ్చారు. సరైన వివరణ ఇవ్వని పక్షంలో విద్యాసంస్థల గుర్తింపు రద్దుచేస్తామని బీఎస్ఈబీ చైర్మన్ హెచ్చరించారు. గణేష్ సొంతంగానే పరీక్ష రాశాడని, ఇందులో ఆన్సర్ షీట్లలో ఉన్నది టాపర్ చేతిరాతని తేల్చారు. ఏదో విధంగా స్టేట్ టాపర్ కావాలని భావించి గణేష్ ఈ మోసానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది ఫలితాలలో గతేడాది టాపర్స్ స్కామ్ ప్రభావం కనిపించింది. ఈ ఏడాది 12వ తరగతి (ఇంటర్) పరీక్షలలో కేవలం 36 శాతం మాత్రమే ఉత్తీర్ణులైన విషయం తెలిసిందే. అన్ని అంశాల్లోను చాలా కఠినంగా వ్యవహరించామని, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అవినీతికి ఆస్కారం లేకుండా చూసుకున్నామని ఆనంద్ కిషోర్ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించారు. -
బిహార్‌లో మరో టాపర్స్ స్కామ్!
-
బిహార్‌లో మరో టాపర్స్ స్కామ్!
పాట్నా: గతేడాది తరహాలోనే మరోసారి బిహార్ రాష్ట్రంలో టాపర్ల కుంభకోణం వెలుగుచూసింది. ప్లస్ టు ఫలితాలు విడుదలైన రోజు నుంచి టాపర్‌గా నిలిచిన గణేష్ కుమార్ కనిపించకుండా పోయాడు. ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల వయసులో గణేష్ కుమార్ ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాపర్స్ స్కామ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. తన కూతురు టాపర్‌గా నిలవాలని ఆశపడి అడ్డదారి తొక్కినందుకు గతేడాది బిహార్ ప్లస్ టూ టాపర్ రుబీ రాయ్ తండ్రి అవదేశ్ రాయ్ ని భగవాన్ పూర్ లో గతంలోనే అరెస్ట్ చేసి విచారించారు. బిహార్ బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని, వంటలు ఎలా చేయాలో నేర్చుకోవచ్చునని పేర్కొనడంతో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది. ఒక్క అక్షరం ముక్క రాకున్నా తమ పిల్లలు స్టేట్ టాపర్లుగా నిలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.20 లక్షలు ముట్టజెప్పినట్లు బీఎస్ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ స్వయంగా అంగీకరించారు. టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా మరికొందరు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయి ఇంటివద్దే ఉండిపోయారు. భక్త కవి తులసీదాస్‌పై వ్యాసం రాయాలని చెప్పగా.. టాపర్ రుబీ రాయ్ మాత్రం 'తులసీదాస్ జీ ప్రణామ్' అంటూ కేవలం రెండు పదాలతో వ్యాసం ముగించిడం గమనార్హం. తాజాగా బిహార్ ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంతో గతేడాది తరహాలోనే మరో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది. -
'బలి చేశారు.. నేనేంటో నిరూపించుకుంటా'
పాట్నా: తానేంటో నిరూపించుకుంటానని మాస్ కాపీయింగ్‌కు పాల్పడి స్టేట్ టాపర్ గా వచ్చి అనంతరం అరెస్టయినబిహార్ స్కూల్ బోర్డు ఆర్ట్స్ టాపర్ రూబీ రాయ్ చెప్పింది. తాను న్యాయవాదిని అవుతానని, లేదంటే ఒక అధికారిగా మారతానని చెప్పింది. బిహార్ స్కూల్ బోర్డు పరీక్షల్లో ఆర్ట్స్ విభాగంలో పరీక్షలు రాసిన రూబీ టాపర్ గా వచ్చింది. అయితే, ఓ మీడియా చేసిన ఇంటర్వ్యూలో పొలిటికల్ సైన్స్ వంటల గురించి చెబుతుందని చెప్పి అవాక్కయ్యేలా చేసింది. అనంతరం చేసిన విచారణలో రూబీతో సహా కొందరు విద్యార్థులు భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ పాల్పడ్డారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థినిని మరికొందరిని అరెస్టు చేసిన అధికారులు ఏడు వారాలపాటు జైలులో ఉంచారు. రిమాండ్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన సందర్భంగా రూబీ మీడియాతో మాట్లాడుతూ 'నా జీవితంలో జరిగిన ఈ సంఘటన నా ఆలోచన విధానాన్ని మార్చింది. నేను ఇక చదువులపై శ్రద్ధపెడతాను. న్యాయవాదిగానో అధికారిగానో మారతాను. ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా ముగిసిన గతం. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నన్ను నేను నిరూపించుకునేందుకు బాగా కష్టపడాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఇప్పుడు ఏం జరిగిందో అది మర్చిపోతాను. నేను అమాయకురాలిని. ఎవరో చేసిన కుట్రకు నేను బలయ్యాను. నన్ను ఎందుకు డిటెండ్ చేశారో.. రిమాండ్ కు ఎందుకు పంపించారో నాకు తెలియదు. స్కాంకు పాల్పడినవారికి నాకు ఏం సంబంధం లేదు' అని ఆ విద్యార్థిని చెప్పింది. -
వ్యాసం రాయమంటే.. తను ఏం రాసిందో తెలుసా?
పట్నా: ఎవరైనా వ్యాసం రాయమంటే.. ఏం చేస్తారు. ఇచ్చిన అంశంపై తమకు తెలిసిన పదో పదిహెనో పంక్తులు రాస్తారు. కానీ భక్త కవి తులసి దాస్‌పై వ్యాసం రాయమని కోరినప్పుడు బిహార్ ఇంటర్ బోర్డు టాపర్ రుబీ రాయ్ మాత్రం రెండంటే రెండు పదాలు రాసింది. ‘తులసీ దాస్ జీ ప్రణామ్’ అంటు రెండు పదాలు రాసి వ్యాసం ముగించింది. బిహార్‌ను కుదిపేస్తున్న 12వ తరగతి టాపర్ కుంభకోణంపై విచారణలో భాగంగా రుబీరాయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేయడానికి ముందు ఆమె మరోసారి నిపుణుల ఎదుట పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షలో భాగంగా నిపుణులు ఆమెను భక్త కవి తులసీదాస్‌పై వ్యాసం రాయాల్సిందిగా కోరారు. అయితే, రుబీరాయ్ మాత్రం తాను రెండేళ్లు ఎంతో కష్టపడి చదివానని, కానీ, తనకిప్పుడు ఏమీ గుర్తులేదని నిపుణులకు తెలిపింది. హ్యుమానిటిస్ గ్రూప్‌లో ఆమెకు వచ్చిన మార్కులు అక్రమార్గంలో వచ్చినవేనని నిపుణుల బృందం నిర్ధారించిందని, దీంతో ఆమె ఫలితాలను రద్దు చేశామని బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) చైర్మన్ ఆనంద్ కిషోర్ తెలిపారు. బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. కనీస అవగాహన కూడా లేని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల అసలు బండారం బట్టబయలైంది. దీంతో వివిధ కోర్సుల్లో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్టు రుజువుకావడంతో పలువురి ర్యాంకులను రద్దుచేసింది. ఈ టాపర్స్ కుంభకోణంపై సిట్ దర్యాప్తు నిర్వహిస్తోంది. -
బిహార్ టాపర్ రుబిరాయ్ అరెస్టు
పట్నా: బిహార్‌ను కుదిపేసిన ఇంటర్ బోర్డు టాపర్ల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది. 12వ తరగతి (ఇంటర్) బోర్డు ఫలితాల్లో నంబర్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టుచేశారు. బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. కనీస అవగాహన కూడా లేని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల అసలు బండారం బట్టబయలైంది. దీంతో వివిధ కోర్సుల్లో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు డుమ్మా కొట్టడంతో రుబీ రాయ్ తాజాగా మరోసారి పరీక్షలకు హాజరైంది. మౌఖిక పరీక్షలు పూర్తయిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఆమెను అదుపులోకి తీసుకుంది. బిహార్‌లో పరీక్షలంటేనే మాస్ కాపీయింగ్ కు మారుపేరు. ఈ నేపథ్యంలో టాపర్లతో ఓ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో వారి బండారం బయటపడింది. మారుపేర్లతో పరీక్షలు రాయించడమో లేక ఎగ్జామినర్లతో కుమ్మక్కవ్వడం వల్లనో వీరు టాప్ ర్యాంకులు సాధించినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాపర్ కుంభకోణంపై బిహార్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.