ట్రైబ్యునల్ అధికారాలు రిటైర్డ్ జడ్జికి అప్పగింత !
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో భూవివాదాలు, నిర్మాణ సమస్యలకు సంబంధించి బిల్లింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్టు సీఆర్డీఏ ముసాయిదా బిల్లు 2014లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అందుకుగానూ ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలో చైర్మన్ సహా ఆరుగులు సభ్యులు ఉంటారు.
అయితే కమిటీ సభ్యులలో రిటైర్డ్ జడ్డిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ట్రైబ్యునల్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌లను ఏర్పాటు చేసే అధికారం రిటైర్డ్ జడ్జికి అప్పగించే యోచనలో ఉంది. కాగా, ప్రతిబెంచ్లో కనీసం ఇద్దరు సభ్యులు, ఒకరు న్యాయ సభ్యుడు, మరొకరు సాంకేతిక సభ్యుడు చైర్మన్, సభ్యులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది.