Biocon Ltd
-
బీర్లు తయారు చేయడంలో ఫెయిల్.. ఇప్పుడు బిలియనీర్ అయ్యింది!
బీర్లు తయారు చేయడం మగళవాళ్ల పని, ఇక్కడ ఆడవాళ్లు నెగ్గుకురాలేరంటూ అడుగడుగునా నిరుత్సాహపరిచింది సమాజం. ఉద్యోగాలు చేయడం వరకు ఓకే కానీ ఆడవాళ్లు కంపెనీలను స్థాపించి వాటిని సజావుగా నిర్వహించలేరంటూ అనుమానపు చూపులు చూసింది లోకం. అయితే చుట్టుముట్టిన నిరుత్సాహాన్ని, నెత్తినెక్కి నాట్యం చేస్తున్న అనుమానాలను పటాపంచలు చేసింది కిరణ్ మజుందార్ షా. కాదన్న చోటే 4.4 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి షాహెన్షా అయ్యింది. ఆమె ఆస్తుల విలువనే రూ.27 వేల కోట్లకు పైమాట. బ్రూయింగ్ కోర్సు ఆది నుంచి కిరన్ మజుందార్షాది భిన్నమైన వ్యక్తిత్వం. నలుగురు నడిచే దారిని కిరణ్ ఎంచుకోలేదు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న వెంటనే మద్యం తయారీకి సంబంధించి బ్రూయింగ్ టెక్నాలజీ కోర్సు చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడంతా నిరూత్సపరచడంతో ఆ కోర్సు చదివేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. మెల్బోర్న్ యూనివర్సిటీ నుంచి 1975లో బ్రూయింగ్ కోర్సులో ఏకైక విద్యార్థినిగా ఉంటూ మగవాళ్లందరినీ పక్కకు నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. బీర్ల తయారీలో ఆడవాళ్లేంటి? ఆస్ట్రేలియాలో బ్రూయింగ్ కోర్సులో పట్టా పుచ్చుకుని ఇండియా వచ్చిన కిరణ్ మజుందార్ మొదట కోలకత్తాలోని జూపిటర్ బ్రూవరీస్లో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత బరోడాలో పని చేసింది. మూడో ప్రయత్నంగా బెంగళూరుకు చేరుకుంది. అయితే ఇక్కడ మరోసారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి అమెకు ప్రతికూలత ఎదురైంది. బ్రూయింగ్ ఇండస్ట్రీలో మహిళలు ఏంటీ అవ్వా..! అంటూ ముక్కున వేలేసుకున్నారు. చేతిలో మాస్టర్స్ పట్టా... పెద్ద పెద్ద సంస్థల్లో అనుభవం ఉన్నా మాస్టర్ బ్రూవర్‌గా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి స్థానిక కంపెనీలు ముందుకు రాలేదు. బయోకాన్‌కి బీజం ఇండియాలో మాస్టర్ బ్రూవర్ అయ్యేందుకు అవకాశాలు లేకపోవడంతో తిరిగి విదేశాల వైపు చూసింది కిరణ్ మజుందార్ షా. మద్యం తయారీలో ప్రసిద్ధి చెందిన స్కాట్లాండ్లో ఈ తరహా అవకాశాలు ఉన్నట్టుగా తెలియడంతో అటువైపుగా ఆలోచనలు చేసింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌కి చెందిన బయోకాన్ బయోకెమికల్స్ లిమిటెడ్ యజమాని కార్క్‌తో పరిచయం అయ్యింది. అప్పటికే బయోకాన్ సంస్థ బ్రూవింగ్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వ్యాపారానికి అవసరమైన ఎంజైములు ఉత్పత్తి చేస్తోంది. ఎప్పటి నుంచో బయోకాన్‌ను ఇండియాకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు కార్క్. ఆయనకు కిరన్ మజుందార్ షా ఓ ఆశా కిరణంలా కనిపించింది. లోన్లు ఇవ్వలేం కిరణ్ మజుందార్ నేతృత్వంలో ఇండియాలో 1978లో బయోకాన్ ప్రారంభమైంది. అయితే అప్పటికీ కిరణ్ మజుందార్‌షా ముప్పైవ పడిలోనే ఉండటంతో.. చిన్న వయసు, పెద్దగా అనుభవం లేదు, పైగా ఎంజైముల వ్యాపారమంటా అంటూ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. విదేశీయుల నుంచి సపోర్ట్ ఉన్నా స్థానికంగా మద్దతు ఆమెకు కష్టమైనంది. దీంతో పెట్టుబడి చాలక కారు షెడ్డులోనే ఎంజైములు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో నమ్మకం కుదిరి పెట్టుబడులు వచ్చాయి. ఊపిరులూదిన బొప్పాయి మొదటి సారి ఫండింగ్ లభించకగానే కారు షెడ్డు నుంచి మూడు వేల గజాల స్థలంలోకి బయోకాన్ షిఫ్ట్ అయ్యింది. ఈ సమయం బొప్పాయి నుంచి కొత్త రకం ఎంజైమ్‌ను కనుగొంది కిరణ్. ఆ తర్వాత కాలంలో బీరును శుద్ధి చేయడంలో ఈ ఎంజైమ్ కీలకంగా మారింది. అంతే ఒక్కసారిగా బయోకాన్ బాలారిష్టాలు తొలగిపోయాయి. ఈ ఎంజైమ్‌ను స్థానికంగానే కాకుండా అమెరికా, యూరప్ వంటి విదేశాలకు కూడా ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. పెర్ఫెక్ట్ ప్లానింగ్ తొలి ఏడాది వచ్చిన లాభాలను చూసి మురిసిపోలేదు కిరణ్. ఎంతో ముందు చూపుతో వ్యవహారించి బెంగళూరు సమీపంలో 20 ఎకరాల స్థలం కొనుగోలు చేసి బయోకాన్‌ను అక్కడికి తరలించింది. అంతేకాదు బయోకాన్ కంపెనీని బయోకాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా మార్చింది. ఆ తర్వాత ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభించింది. ఇక అడ్కి నుంచి బయోకాన్ అంచెలంచెలుగా ఎదిగింది. ఒకానొక దశలో దేశంలోనే అత్యంత సంపన్న బిజినెస్ ఉమన్‌గా గుర్తింపు పొందారు కిరణ్ మజుందార్‌షా. ప్రస్తుతం ఆమె సంపద విలువ రూ. 27వేల కోట్లు. బయోకాన్ మార్కెట్ క్యాప్ 4.4 బిలియన్ డాలర్లు అడ్డంకులు అధిగమిస్తేనే మిగిలిన విద్యార్థినులకు భిన్నంగా ఎంజైమ్స్ టెక్నాలజీని ఎంచుకుంది. తాను సాధించిన డిగ్రీకి తగ్గట్టుగా బీర్ల తయారు చేయడం ఆమె లక్ష్యం. కానీ ట్రైనింగ్ నుంచే ఆమెను నిరుత్సాహ పరిచింది తోటి సమాజం. మహిళలు ఎక్కడైనా బీర్ల తయారీ చేస్తారా ? అది మగవాళ్ల ప్రొఫెషన్ ఇక్కడ ఆడవాళ్లు నెగ్గుకురాలేరంటూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. బీర్లు తయారు చేయడంలో విఫలమైనా.. అదే ఎంజైములతో కొత్త వ్యాపారం ప్రారంభించి ఈ రోజు సక్సెస్ఫుల్ వుమన్‌గా ఆమె నిలిచారు. -
సీఎం జగన్ ఆ మాటే నా 'ఇకిగయ్': గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటుతోనే మంత్రిగా తనకు సార్థకత అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. బుధవారం రోజున టెక్ మహీంద్రా ఫౌండేషన్, బయోకాన్ లిమిటెడ్, స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి మేకపాటి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్య, వైద్య, నైపుణ్య రంగంలో వసతుల కల్పనలో సీఎం రాజీపడరు. మనిషిని మనీషిగా మార్చేది చదువు అని నమ్మిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఈ మధ్య తీరిక చేసుకుని జీవితకాల సంతోషమయ జీవితానికి రహస్యం 'ఇకిగయ్' అనే జపనీస్ పుస్తకం చదివా. ప్రతి పుట్టుకకు కారణం అనేది పుస్తకంలోని అంతరార్థం. ముఖ్యమంత్రి నిర్దేశించిన స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే నా 'ఇకిగయ్'. (రాష్ట్రంలో బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ) నైపుణ్యరంగ పోటీలో మన రాష్ట్రం ప్రత్యేకం. సముద్రమంత లక్ష్యంలో నాతో పాటు నావలో ప్రయాణిస్తున్న నైపుణ్యశాఖ అధికారుల కృషి మాటల్లో చెప్పలేనిది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు. విశాఖలో లాజిస్టిక్స్ సెక్టార్లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. లైఫ్ సైన్సెస్ డొమైన్లో నాలెడ్జ్ పార్టనర్‌గా బయోకాన్ వ్యవహరించనుంది. 12 స్కిల్ కాలేజీల్లో ఆటోమేషన్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెక్టార్లో స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు స్నైడర్ ఎలక్ట్రిక్ అంగీకారం తెలిపింది' అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఎంవోయూ కార్యక్రమానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐ.టీ శాఖ సలహాదారు విద్యాసాగర్ రెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ ఎంఎం నాయక్, సీడాప్ సీఈవో ఎం మహేశ్వర్‌రెడ్డి, న్యాక్ అడిషనల్ డీజీ కెవి నాగరాజ, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వి. హనుమనాయక్, డాక్టర్ బి. నాగేశ్వరరావు, ప్రొఫెసర్ డి.వి. రామకోటిరెడ్డితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. (కైనటిక్ గ్రీన్ ప్రతినిధులతో మేకపాటి భేటీ) -
బయోకాన్- ఎన్టీపీసీ- ఎస్కార్ట్స్.. స్పీడ్
మార్కెట్లు తీవ్ర ఆటుపోట్ల మధ్య లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో ఫార్మా దిగ్గజం బయోకాన్, పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బయోకాన్ లిమిటెడ్ మైలాన్ ఎన్‌వీతో భాగస్వామ్యంలో రూపొందించిన ఇన్సులిన్ ఇంజక్షన్‌ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించడంతో బయోకాన్ లిమిటెడ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 395 వద్ద ట్రేడవుతోంది. సెమ్గ్లీ బ్రాండుతో ఇన్సులిన్ గ్లార్గిన్ ఇంజక్షన్‌ను ప్రవేశపెట్టినట్లు బయోకాన్ తాజాగా పేర్కొంది. అధిక బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు వీటిని వినియోగించవచ్చని తెలియజేసింది. యూఎస్‌లో వీటిని 3ఎంఎల్ డోసేజీలో ఐదు ఇంజక్షన్ల సెట్‌ను 148 డాలర్లకు, 10 ఎంఎల్ ఇంజక్షన్‌ను 99 డాలర్లకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. తద్వారా యూఎస్‌లో అత్యంత చౌకగా ఇన్సులిన్ ఇంజక్షన్‌ను అందిస్తున్నట్లు వివరించింది. ఎన్టీపీసీ లిమిటెడ్ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వాటాదారుల అనుమతి కోరనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీ పేర్కొంది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా బాండ్ల జారీ చేసే అంశంపై ఈ నెల 24న చేపట్టనున్న వార్షిక సమావేశంలో బోర్డు నిర్ణయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. ఎస్కార్ట్స్ లిమిటెడ్ గత నెల(ఆగస్ట్)లో ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 80 శాతం దూసుకెళ్లి 7,268 యూనిట్లను తాకినట్లు ఎస్కార్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. కంపెనీ చరిత్రలోనే ఆగస్ట్‌లో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారని పేర్కొంది. వీటిలో ఎగుమతులు రెట్టింపై 518 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. రుతుపవనాలు, పెరిగిన ఖరీఫ్ పంటల సాగు, రిటైల్ ఫైనాన్స్ వంటి అంశాలు ఇందుకు దోహదం చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 1,154కు చేరింది. ప్రస్తుతం 2.2 శాతం లాభంతో రూ. 1,111 వద్ద ట్రేడవుతోంది. -
కోవిడ్-19కు ఔషధం- బయోకాన్ జూమ్
కోవిడ్-19 సోకినవారి చికిత్సకు వినియోగించగల ఔషధానికి దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి అనుమతి లభించినట్లు ఫార్మా దిగ్గజం బయోకాన్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఈ ఔషధాన్ని కరోనా వైరస్ సోకిన రోగుల చికిత్సలో వినియోగించవచ్చని తెలియజేసింది. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ. 8,000కాగా.. ఇకపై వీటిని దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ సోకడంతో స్వల్పంగా లేదా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు వీటిని వినియోగించవచ్చని వివరించింది. 25 ఎంజీ డోసేజీలో కోవిడ్-19 కారణంగా ఓమాదిరి లేదా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న రోగుల చికిత్సకు వినియోగించగల ఐటోలిజుమాబ్ ఔషధాన్నిమార్కెట్లో ప్రవేశ పెట్టనున్నట్లు బయోకాన్ తాజాగా పేర్కొంది. ఐటోలిజుమాబ్ ఇంజక్షన్‌ను 25 ఎంజీ/5ఎంఎల్ డోసేజీలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో బయోకాన్ షేరుకి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతంఎన్ఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 435ను సైతం అధిగమించింది. పరీక్షల తదుపరి అత్యవసర ప్రాతిపదికన సైటోకైన్ విడుదల సమస్య(ఏఆర్డీఎస్)లో చికిత్సకోసం దేశీయంగా ఐటోలిజుమాబ్ ఔషధాన్ని వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి పొందినట్లు బయోకాన్ తెలియజేసింది. బెంగళూరులోని బయోకాన్ పార్క్‌లో గల ప్లాంటులో ఐటోలిజుమాబ్ సొల్యూషన్‌ను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ముంబై, న్యూఢిల్లీలోని పలు ఆసుపత్రులలో ఈ ఔషధ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ఏఆర్డీఎస్ పేషంట్లలో సీఆర్ఎస్ను నియంత్రించడంలో ఈ ఔషధం ఫలితాలు సాధించినట్లు వివరించింది. తద్వారా సైటోకైన్ సమస్య ద్వారా సవాళ్లు ఎదుర్కొంటున్న పేషంట్లకు ఈ ఔషధ వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేసింది. అత్యధిక శాతం పేషంట్లకు నాలుగు డోసేజీలు అవసరమవుతాయని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ పేర్కొన్నారు. ఈ నాలుగు ఇంట్రావీనస్ ఇంజక్షన్ల విలువ రూ. 32,000గా తెలియజేశారు. దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. -
బయోకాన్ సైటోసార్బ్ చికిత్సకు ఓకే
కోవిడ్-19 సోకిన రోగులలో సైటోసార్బ్ చికిత్సకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ(DCGI) నుంచి బయోకాన్ బయోలాజిక్స్కు అనుమతి లభించింది. దేశీ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్‌ను ఇది అనుబంధ సంస్థకాగా.. అత్యవసర వినియోగం కింద సైటోసార్బ్ థెరపీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో 18ఏళ్ల వయసుపైబడిన రోగులలో శ్వాసకోస సంబంధ తీవ్ర సమస్యలు తలెత్తినప్పుడు సైటోసార్బ్ డివైస్‌ను వినియోగించేందుకు వీలు కలిగినట్లు వివరించింది. ఐసీయూలో చికిత్సచేసే రోగులలో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్‌ను ఇది తగ్గిస్తుందని తెలియజేసింది. కాగా.. ఇటలీ, చైనా, జర్మనీలలో 750 మందికిపైగా కోవిడ్-19 వ్యాధిగ్రస్తులకు సైటోసార్బ్‌ను వినియోగించినట్లు బయోకాన్ పేర్కొంది. కోవిడ్-19 రోగులలో సీఆర్ఎస్ పరిస్థితి తలెత్తినప్పుడు ఇతర అవయవాలు దెబ్బతినే వీలుంది. ఈ సమయంలో సైటోసార్బ్ చికిత్స ద్వారా సైటోకైన్ను నియంత్రించడం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటివి చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. తద్వారా ప్రమాదాలను తగ్గించడం లేదా నివారించేందుకు వీలుంటుందని వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బయోకాన్ షేరు 1.2 శాతం క్షీణించి రూ. 355 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 363 వద్ద గరిష్టాన్నీ, రూ. 351 వద్ద కనిష్టాన్నీ తాకింది. -
మోడీ @100...సెన్సెక్స్@27,000
నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన మొదలై 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 27,000 పాయింట్లను అధిగమించింది. జీడీపీ జోష్, కరెంట్ ఖాతా లోటు కట్టడి, మోడీ సంస్కరణలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు... వెరసి వరుసగా 8వ రోజు సెన్సెక్స్ లాభాలు అందుకుంది. సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్టంగా 27,083కు చేరి చివరికి 152 పాయింట్ల లాభంతో 27,019 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఒక దశలో 8,102ను తాకింది. ట్రేడింగ్ ముగిసేసరికి 55 పాయింట్ల లాభంతో 8,083 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, సెన్సెక్స్ 26,000 పాయింట్ల నుంచి 27,000కు చేరడానికి 40 ట్రేడింగ్ రోజులు తీసుకుంది. అంటే జూలై 7న 26,000ను తాకగా, సెప్టెంబర్ 2న 27,000ను దాటింది. ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రెండున్నరేళ్ల తరువాత జీడీపీ 5.7% వృద్ధిని సాధించగా, కరెంట్ ఖాతా లోటు 4.8% నుంచి 1.7%కు పడిపోవడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 34 బిలియన్ డాలర్లను ఇండియాలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు జపాన్ ప్రకటించడం మరింత బలాన్నిచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, మోడీ పాలనలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో సెన్సెక్స్ 9 శాతం పెరగడం గమనార్హం. ఎఫ్ఐఐల జోరు..: సోమవారం రూ. 554 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 673 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కాగా, ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు వినియోగించే జనరిక్ ఔషధాన్ని జర్మనీ, స్వీడన్లలో విక్రయించేందుకు అనుమతి పొందిన సిప్లా 5.2% ఎగసింది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4-2% మధ్య పుంజుకోగా, సెసాస్టెరిలైట్, టాటా పవర్, హిందాల్కో, విప్రో 2-1% మధ్య నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 1,738 లాభపడగా, 1,250 తిరోగమించాయి. తమ గ్రూప్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు జపాన్ బ్యాంక్ ఇంటర్నేషనల్(జేబీఐసీ)తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న జీఎంఆర్ షేరు 3.5% బలపడి రూ. 26.65 వద్ద ముగిసింది. ఏడాది గరిష్టానికి 323 షేర్లు రోజురోజుకీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్కెట్ల బాటలో పలు షేర్లు సైతం లాభాలతో పరుగుతీస్తున్నాయి. ఇప్పటికే పలు స్టాక్స్ ఏడాది గరిష్టాలను తాకగా, తాజాగా ఈ జాబితాలో 323 కంపెనీలు చేరాయి. వీటిలో ఏసీసీ, భారతీ ఎయిర్టెల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, లుపిన్, ఐవోసీ, ఎంఅండ్ఎం, మారుతీ, టెక్ మహీంద్రా వంటి దిగ్గజాలుండటం విశేషం!