black connection
-
ఇంకా సర్వే దశ దాటలేదు!
నత్తనడకన ‘వాటర్‌గ్రిడ్’ కొన్ని జిల్లాల్లో లైన్ సర్వేకు ఖ రారు కాని టెండర్లు కొన్ని సెగ్మెంట్లలో ముందుకు రాని కాంట్రాక్టర్లు వచ్చినవారితోనే పనిచేయిస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ఓ వైపు ప్రభుత్వం దూకుడుగా ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు గ్రిడ్‌కు సంబంధించిన పనులేమో క్షేత్రస్థాయిలో నత్తనడకన జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ప్రాజెక్టు (వాటర్‌గ్రిడ్) తొలిదశకు సంబంధించిన లైన్ సర్వే ప్రక్రియ మొదలై ఆర్నెల్లు గడుస్తున్నా.. ఇంతవరకు కొన్ని జిల్లాల్లో లైన్ సర్వే కొలిక్కిరాలేదు. కొన్ని సెగ్మెంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాక లైన్ సర్వే చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అర్హతగల కాంట్రాక్టర్లు ముందుకురాని సెగ్మెంట్లలో అధికారులు వారికి.. నచ్చిన వాళ్లతోనే సర్వే పనులు చేయించాలని యోచిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే వాటర్‌గ్రిడ్ లైన్సర్వేలో ‘లైడార్’వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. ప్రస్తుతం జిల్లాల్లో లైన్ సర్వే పనులన్నీ సంప్రదాయ విధానంలోనే జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకనే.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 45 వేల కిలోమీటర్ల సెకండరీ పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఈ పైప్‌లైన్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లైన్ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆయా మార్గాల్లో ఎత్తుపల్లాలు, పొడవు, వెడల్పు..తదితర సర్వే అంశాల అధారంగానే నిర్మాణ పనులను నిర్వహిస్తారు. లైన్ సర్వే పూర్తికాకుంటే ప్రాజెక్టు అంచనాల రూపకల్పన, పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభించేందుకు వీలుకాదు. ఈ నేపథ్యంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం గతేడాది అక్టోబర్‌లోనే లైన్ సర్వే కోసం టెండర్ల(ఈవోఐ)ను పిలిచింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 58 ఏజెన్సీలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఇందులో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు 35 ఏజెన్సీలు మాత్రమే అర్హత(ఫైనాన్షియల్, టెక్నికల్) సాధించాయి. అయితే.. ఏజెన్సీలు తమ టెండర్లలో పేర్కొన్న ధరల్లో అతితక్కువ ధర(కిలోమీటరుకు రూ.3,500)నే సర్కారు ఖరారు చేసింది. దీంతో లైన్ సర్వే పనులు చేపట్టేందుకు కేవలం 18 ఏజెన్సీలే ముందుకు వచ్చాయి. ఇలా వచ్చిన ఏజెన్సీలతోనే ఆయా జిల్లాల్లోని సెగ్మెంట్లలో పనులు చేపట్టారు. అయితే.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో సర్వే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆయా సెగ్మెంట్లలో సర్వే పనులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కానందునే అర్హత కలిగిన కంపెనీలు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదని సమాచారం. దీంతో మరలా టెండర్లు పిలిచేందుకు ఇష్టపడని అధికారులు తమకు నచ్చిన ఏజెన్సీలతోనే పనులు చేయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ‘లైడార్’పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం తెలంగాణ వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ‘లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్)’ టెక్నాలజీని వినియోగించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలిసింది. లైడార్ టెక్నాలజీకి బదులుగా సంప్రదాయ (టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్) పద్ధతులనే అవలంబించాలని నిర్ణయించినట్లు సమాచారం. లేజర్ కిరణాలతో రిమోట్ సెన్సింగ్(లైడార్) ద్వారా భూ ఉపరితలాన్ని సర్వే చేసే ప్రక్రియకు, సంప్రదాయ విధానం కంటే అధికంగా ఖర్చవుతుండడమే ఇందుకు కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి కావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అధునాతన పద్ధతులతోనే సాధ్యమని, సంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్దేశిత సమయంలో లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. -
‘గ్రేటర్’లో అదనం
‘సర్వే’లో మరికొన్ని అంశాలు వెబ్సైట్లో నమూనా ఫారం భవనం వివరాలు.. పెంపుడు కుక్కల సమాచారమూ తెలపాల్సిందే నల్లా కనెక్షన్ వివరాలూ ఇవ్వాలి బీపీఎస్ కుటుంబాలు మరింత జాగ్రత్తగా ఉండాలి ‘సాక్షి’తో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న ఇంటింటి సర్వేలో భాగంగా గ్రేటర్ ప్రజలు అదనంగా మరికొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నగరంలో నెల కొన్న పరిస్థితుల దృష్ట్యా ఆస్తిపన్ను, నల్లా కనెక్షన్ వంటి అంశాలు సైతం తెలిసేందుకు వీలుగా గ్రేటర్ అధికారులు వాటిని పొందుపరుస్తున్నారు. తద్వారా అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లు.. ఆస్తిపన్ను చెల్లించనివారు.. తదితర వివరాలు సైతం తెలియనున్నాయి. వీటితో పాటు నివాస గృహానికి అనుమతి పొంది, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల గుట్టూ రట్టు కానుంది. అక్రమాలకు కళ్లెం వేయడంతో పాటు నిజంగా అర్హులైన వారికి మరింత సమర్థంగా సంక్షేమ పథకాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. త్వరలో సర్వే జరుగనున్న నేపథ్యంలో నగర ప్రజలు అందించాల్సిన అదనపు వివరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జీహెచ్ఎంసీ ఏర్పాట్లు తదితర అంశాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెబ్సైట్లో సర్వే ఫారం సమగ్ర సర్వే ఫారంలో ఏయే అంశాలున్నాయి? వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు ఎలా? అప్పటికప్పుడు అవసరమైన సమాచారం తెచ్చేదెలా? వంటి ప్రశ్నలు నగర ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు సర్వే ఫారాన్ని జీహెచ్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. దీంతో పాటు కరపత్రాల ద్వారానూ తగిన సమచారం అందిస్తామన్నారు. సర్వేపై ప్రజలకెలాంటి సందేహాలు ఉన్నా... నివృత్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కాల్ సెంటర్ ద్వారా సాయం సర్వే ప్రశ్నావళికి సంబంధించి ప్రజల సందేహా ల నివృత్తికి జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ సిబ్బం దికి అవసరమైన శిక్షణ ఇస్తామని కమిషనర్ చె ప్పారు. తద్వారా ప్రజల సందేహాలకు వారు సమాధానాలు చెబుతారన్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ 040-21 11 11 11కు ఫోన్‌చేసి ప్రజలు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని చెప్పారు. ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. బీపీఎల్ కుటుంబాలూ.. తస్మాత్ జాగ్రత్త గ్రేటర్‌లోని బీపీఎల్ కుటుంబాల వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. లేదా ప్రస్తుతం పొందుతున్న పథకాల నుంచి తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకే సరైన వివరాలు అందజేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా తమ వివరాలను అందజేయాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివన్నీ జిరాక్స్‌లు తీయించుకొని ఉండటం మేలు. వీటితో పాటు బ్యాంకు/పోస్టాఫీసు ఖాతాలు ఉంటే వాటి నెంబర్లు తెలియజేయాలి. గ్యాస్ కనెక్షన్లు, దీపం పథకం ప్రయోజనం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంది. అంతేకాదు..భవిష్యత్‌లో జీహెచ్ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాలు అమలు చేయబోయే సంక్షేమ పథకాలన్నింటికీ వీటితో పోల్చి చూస్తారు. ఎక్కడి వారు అక్కడే ఎక్కడ ఉంటున్న వారు అక్కడే తమ వివరాలు నమోదు చేయించాలి. ఉదాహరణకు నగరంలోఉండేవారు ఇక్కడే పేర్లు నమోదు చేయిస్తే.. భవిష్యత్‌లో అమలయ్యే సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు పొం దాలనుకునేవారు (ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నవారు) అక్కడే తమ వివరాలివ్వాలి. తద్వారా అక్కడ పథకాలు పొం దే వీలుంటుంది. నగరంలో ఉంటున్న తమకు గ్రామాల్లో భూములు ఉన్నాయంటున్న వారు..ఎక్కడ నివాసం ఉంటా రో..పథకాలను వినియోగించుకోవాలనుకుంటారోఅక్కడే వివరాలు అందజేయాలి. తప్పనిసరిగా విధులకు వెళ్లాల్సిన వారు.. ఇంట్లో ఉండటం వీలుపడని వారికి (ఆస్పత్రుల్లో చికిత్సలో ఉన్నవారు.. ఇంటర్వ్యూలకు ఇతర ప్రదేశాలకు వె ళ్లినవారు తదితరులు) సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తే ఫారంలోని ‘రిమార్కులు’ కాలమ్‌లో వాటిని పొందుపరుస్తారు. భార్య లేక భర్త నగరంలో ఉండి.. మిగతా వారు ఇతర ప్రదేశం(వేరే జిల్లా,గ్రామం)లో ఉంటే అక్కడే నమోదు చేయించుకుంటే మంచిదని కమిషనర్ తెలిపారు. నగరంలో తాత్కాలిక నివాసం ఉండేవారు వారి స్వగ్రామాల్లో వివరాలు నమోదు చేయిస్తేనే స్థానికంగా సంక్షేమ పథకాలకు అర్హులవుతారన్నారు. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబీకులు తెలియజేయవచ్చు. గ్రేటర్ ప్రజలు అదనంగా పొందుపరచాల్సిన అంశాలివీ... 1. భవనం/ఇల్లు ఆస్తిపన్నుకు సంబంధించిన(పీటీఐఎన్) నెంబరు. 2. జలమండలి నుంచి నల్లా కనెక్షన్ ఉందా? ఉంటే క్యాన్ నెంబరు. 3. భవనంలో ఎన్ని అంతస్తులున్నాయి? 4. నివాస భవనమా.. వాణిజ్య భవనమా? 5. కొన్ని అంతస్తుల్లో నివాసాలుండి.. కొన్ని అంతస్తుల్లో వాణిజ్యం జరుగుతోందా? 6. కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల వివరాలు.