boats owners
-
ప్రకాశం బ్యారేజ్ కి కొట్టుకొచ్చిన బోట్లు టీడీపీవే
-
నీటిలో ఆటలు.. ‘టూరిజం’ కళ్లకు గంతలు.!
సాక్షి, విశాఖపట్నం :అనుమతులు లేవు. అయినా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లగా పైగా సాగరతీరంలో స్పీడ్ బోట్లు నడిపించేశారు. స్కూబా డైవింగ్ చేయించేశారు. అయినా టూరిజం శాఖ అధికారులకు గానీ, సిబ్బందికి గానీ ఈ విషయం తెలీదంట. వాటర్ స్పోర్ట్స్ పేరుతో ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇప్పటికే స్పీడ్ బోట్ల నిర్వహణ ఒప్పందాన్ని కుదర్చుకున్న ఓ సంస్థ అండతోనే టూరిజం కళ్లుగప్పి నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటర్‌స్పోర్ట్స్‌లో నడుస్తున్న దందా గురించి ఆలస్యంగా తెలుసుకున్న టూరిజం శాఖ ఉన్నతాధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాటర్ స్పోర్ట్స్‌కు కేంద్రబిందువుగా రుషికొండ తీరం మారింది. ప్రతిరోజూ వంద మందికి పైగా పర్యాటకులు స్పీడ్‌బోట్స్, స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రెండు సంస్థలకు మాత్రమే అప్పగించింది. వీటితో పాటు టూరిజం శాఖకు చెందిన స్పీడ్ బోట్స్ కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వాటర్‌స్పోర్ట్స్ నిర్వహణ ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా స్పీడ్ బోట్స్, స్కూబాడైవింగ్ ఇలా ఇష్టం వచ్చినట్లు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆర్జించాడు. కానీ పర్యాటక శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. తెలిసినా తెలియనట్లు.. ఈ గుర్తింపు లేని వాటర్‌స్పోర్ట్స్ వ్యవహారాన్ని ఏపీటీడీసీ డివిజనల్ స్థాయి అధికారులు, సిబ్బంది మూడేళ్ల క్రితమే గుర్తించారు. అయినా తమకేమీ తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు ఒక సంస్థ పర్యాటక శాఖ నుంచి అనుమతులు తీసుకుంది. సదరు సంస్థకు చెందిన వ్యక్తి ద్వారా రుషికొండ బీచ్‌లోకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనుమతిలేని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. చెల్లింపులు సైతం సదరు సంస్థకే అందజేస్తున్నారని వాటిలో కొంత భాగం డివిజనల్ కార్యాలయానికి చెందిన కొందరికి ముడుపులు ఇస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా ఉన్నతాధికారుల దృష్టికి.. ఇటీవల పర్యాటక శాఖ ఉన్నతాధికారులు రుషికొండలో జరుగుతున్న వాటర్‌స్పోర్ట్స్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. మరో సంస్థ స్కూబా డైవింగ్ నిర్వహించేందుకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇవన్నీ బయటపడ్డాయి. దీంతో సదరు యూపీకి చెందిన వ్యక్తిని టూరిజం ఉన్నతాధికారులు ప్రశ్నించగా ఇప్పుడెందుకు అడుగుతున్నారు.? ఎప్పటినుంచో ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న సంస్థపై కేసు పెట్టాలని డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా తెర వెనుక ఉండి ప్రోత్సహించి తమ లాభాలే తప్ప పర్యాటక శాఖకు రూపాయి కూడా రాకుండా వ్యవహరించిన టూరిజం శాఖ సిబ్బందిని మాత్రం వెనకేసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా
సాక్షి, అమరావతి: రెండునెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం వచ్చేనెల రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేటనిషేధ భృతి) పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో తడ మొదలు ఇచ్ఛాపురం వరకు 974 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్రతీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలున్నాయి. వీటిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న బోట్లు డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేటనిషేధ భృతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధకాలం ముగియకుండానే బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తూ గంగపుత్రులకు అండగా నిలుస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందించగా, గడిచిన 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం 4.14 లక్షల మందికి రూ.414.49 కోట్ల భృతిని అందించింది. అదేరీతిలో ఈ ఏడాది కూడా మే రెండో వారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అర్హుల గుర్తింపునకు బృందాలు ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మత్స్య సహాయకునితో పాటు వలంటీర్, సాగరమిత్రలతో ఏర్పాటు చేసిన బృందాలతో ఈ నెల 17వ తేదీన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. ఆరోజు తీరంలో లంగరేసిన బోట్లను ఈ బృందాలు పరిశీలించి వివరాలు నమోదు చేస్తాయి. గుర్తింపు సమయంలో బోటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్సు, ఆధార్, రైస్‌కార్డుతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 18వ తేదీ గ్రామ సచివాలయ డిపార్టుమెంట్ రూపొందించే సాప్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ డేటా ఆధారంగా ఆరుదశల వెరిఫికేషన్ తర్వాత అర్హుల జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హత పొందిన వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత ఉంటే జాబితాల్లో చేర్చి తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. అర్హులు వీరే.. ♦ 18 మీటర్లకుపైన పొడవు ఉండే మెకనైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా 10 మంది, 18 మీటర్ల లోపులో ఉండే మోటరైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా ఎనిమిదిమంది, ఇతర మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురు, సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లకు యజమానితో సహా ముగ్గురు చొప్పున అర్హులు. ♦ వయసు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో 1.44 లక్షలలోపు ఉండాలి. ♦ సంక్షేమ పథకాలు పొందినవారు, మత్స్యకార పింఛన్ పొందుతున్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. ♦ అర్బన్ ప్రాంతాల్లో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. -
నిబంధనలు పాటిస్తేనే అనుమతి
బోట్ యజమానులతో కలెక్టర్ అరుణ్‌కుమార్ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : నిబంధనలు పాటించని టూరిజం బోట్లను గోదావరిలోకి అనుమతించబోమని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల గోదావరిలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన టూరిజం, ఇరిగేషన్, పోలీసు శాఖల అధికారులతో పాటు బోట్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బోట్ యజమానులు నిబంధనలు పాటించాలన్నారు. 2012లో రూపొందించిన నిబంధనలతో పాటు కొత్తగా మరికొన్ని నిర్దేశిస్తున్నట్టు వివరించారు. గోదావరిలో ప్రయాణించే 24 టూరిజం బోట్లలో 30 శాతం మాత్రమే ఏ–గ్రేడ్ కలిగి ఉన్నాయని, మిగిలినవి బీ, సీ గ్రేడ్లలో ఉన్నాయని పేర్కొన్నారు. బోట్లకు లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రక్షణ చర్యలుగా లైఫ్ జాకెట్లు, అగ్ని మాపక, మెడికల్ కిట్లు, డబుల్ ఇంజన్, వైర్లెస్ సెట్ ఏర్పాటు చేయాలని బోట్ యజమానులను నిర్దేశించారు. వచ్చే నెల నుంచి సీజన్ వచ్చే నెల నుంచి గోదావరిలో టూరిజం సీజన్ ప్రారంభమవుతుందని, ఈలోగా బోటు యజమానులు నిబంధనల ప్రకారం బోట్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చే సమయంలోను, రెన్యువల్ చేసే సమయంలోను ఇరిగేషన్ అధికారులు జాగ్రత్త వహించాలని చెప్పారు. బోటు డ్రైవర్ ఫొటోను టూరిజం బోట్లకు అతికించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బోట్లకు అనుమతి ఇచ్చేందుకు టూరిజం, ఇరిగేషన్, పోలీసు, అటవీ శాఖలతో సింగిల్ విండో విధానం అమలు చేస్తామని వెల్లడించారు. గోదావరిలో రెండు, మూడు రోజుల్లో డ్రెడ్జింగ్ ప్రారంభమవుతుందని, దీనివల్ల రిజర్వాయర్ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. డెప్త్ ఇండికేటర్ ఉండాలి ప్రతి బోటుకు డెప్త్ ఇండికేటర్ ఉండాలని ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఇంజన్ ఉన్న బోట్‌కు రెండో ఇంజన్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. బోట్ నిర్మించే సమయంలో దశలవారీగా కమిటీని ఏర్పాటు చేసుకుని, పరిశీలించుకోవాలన్నారు. డ్రైవర్లు మత్స్యశాఖ, పోర్ట్, నేషనల్ వాటర్ స్పోర్ట్స్–గోవా వారి నుంచి లైసెన్సు పొందాలన్నారు. కాగా స్థానిక ఇన్సూరెన్స్ కంపెనీలు బోట్లకు బీమా చేసేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లకు గోదావరిలో ప్రయాణంపై శిక్షణ ఇప్పించాలని బోట్ యజమానులు కలెక్టర్‌ను కోరారు. అఖండ గోదావరి ప్రాజెక్టు సీఈఓ భీమశంకరం, రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ, ఇరిగేషన్ ఈఈ, డీఎఫ్ఓ పాల్గొన్నారు.