Book Stahl
-
నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో అల్బెర్టో మాంగ్యుయెల్ని కలవడం ఎవరికైనా చాలా సంతోషాన్నిచ్చే సంగతి. అల్బెర్టో అనేక విధాలుగా గొప్పవాడు. ఇతడు చిన్నప్పుడు పాకెట్ మనీ కోసం ఒక బుక్స్టాల్లో పని చేస్తుంటే ప్రఖ్యాత రచయిత బోర్హెస్ వచ్చి (అప్పటికి పుస్తకాలు చదివీ చదివీ ఆయన చూపు పోయింది) అబ్బాయ్... అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి పుస్తకాలు చదివి వినిపించవచ్చు కదా అని అడిగాడట. అల్బెర్టో చాలాసార్లు బోర్హెస్ ఇంటికెళ్లి ఆ పని చేసి వచ్చాడు. ఆ సంగతి విని అసూయపడని వాడు లేదు. బోర్సెస్ని చూడటమే పెద్ద విషయం. ఆయనతో గడపడం ఇంకా. అర్జెంటీనాలో పుట్టి పెరిగిన అల్బెర్టో వ్యాసకర్త, రచయిత అనే విషయం కన్నా ఆయన పుస్తకాల సేకర్త అన్న విషయమే ఎక్కువమందిని ఆయన వైపు లాగుతుంది. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్‌లో ఒక మారుమూల పల్లెలో తన ముప్పై నలభై వేల పుస్తకాల నడుమ హాయిగా చదువుకుంటూ జీవితం గడుపుతున్నాడు. ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకం ‘ది హిస్టరీ ఆఫ్ బుక్ రీడింగ్’ చాలా విలువైనది. ప్రతి ఉత్తమ సాహిత్యాభిలాషీ చదవదగ్గది. ఆయన ఈ ఫెస్టివల్లో చాలా విలువైన విషయాలు చెప్పాడు. వాటిలో కొన్ని... ‘ఎవరికీ పుస్తకం ఇవ్వకండి. అంతగా అయితే కొత్తది కొని కానుకగా ఇవ్వండి. మీ పుస్తకం ఇచ్చారంటే మీరు ఎదుటివ్యక్తిని దొంగతనానికి పురిగొల్పుతున్నట్టే. ఆ పుస్తకం మరి తిరిగి రాదు. నా దృష్టిలో సాహిత్య చరిత్ర అంటే అది రచయితలు నిర్మించిన చరిత్ర కాదు. పాఠకులు నిర్మించిన చరిత్ర. పాఠకులు తమకు ఏ పుస్తకాలు కావాలనుకున్నారో వాటినే నిలబెట్టుకున్నారు. ఆ పుస్తకాలే చరిత్రగా మిగిలాయి. మనం ఎంత ప్రయత్నించినా పాఠకులు కోరనిదే పుస్తకాన్ని నిలబెట్టుకోలేము. ఒక మనిషి తన ఇంట్లో పర్సనల్ లైబ్రరీని తయారు చేసుకున్నాడంటే అతడు దాదాపుగా తన ఆత్మకథ రాస్తున్నట్టే లెక్క. ఆ పుస్తకాల్లో ఏవో కొన్ని స్లిప్పులు దాస్తాడు. రసీదులు దాస్తాడు. ఎవరెవరివో ఫోన్ నంబర్లు నోట్ చేస్తాడు. ఫొటోలు... ఇవన్నీ జ్ఞాపకాలుగా మారి ఒక ఆత్మకథను రచించినంత పని చేస్తాయి. ఇంకా ఏమంటానంటే మీ లైబ్రరీయే మీ ముఖచిత్రం. అంటే మీ పుస్తకాలను చూసి మీ వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు. నేను ఎవరి ఇంటికైనా వెళితే ఆ పెద్దమనిషి పుస్తకాల ర్యాక్‌లో ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారి పుస్తకాలు కనిపించాయనుకోండి... అతడు స్నేహశీలి అని అర్థం చేసుకుంటాను. పాలోకోయిలో పుస్తకాలు కనిపించాయనుకోండి... ఇక మాట్లాడటం అనవసరం అని నిశ్చయించుకుంటాను. (పాలోకోయిలో అధమస్థాయి రచయిత అని అల్బెర్టో ఉద్దేశం). నేను చిన్నప్పటి నుంచి చాలా చదివాను. అలా అని నాకు పేరుంది. పుస్తకాలను చదివినవారిని మాత్రమే నేను గౌరవిస్తాను. ఇంటికి ఆహ్వానిస్తాను. ఏ రాత్రయినా చక్కటి విందు ఏర్పాటు చేయాలంటే నేను ఆహ్వానించదలుచుకునే గొప్ప గొప్ప చదువరులు- ఒకడు బోర్హెస్... రెండు (కవి) రూమీ... మూడు వర్జీనియా వూల్ఫ్. పుస్తకాలంటే ఏం పుస్తకాలు? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి చదివి మనం దేనిని మన మెదళ్లలోకి పంపుతున్నామో అప్రమత్తంగా ఉండాలి. ఏది మంచి ఏది చెడు ఇది తెలుసుకునే ఇంగితాన్ని ఇచ్చే పని మనం పుస్తకాలతో చేయాలి. అక్షరాలతో చేయాలి. మతం, జ్ఞానం, అధికారం కంటే మంచి చెడుల విచక్షణ తెలుసుకుని మంచివైపు నిలబడటం నేర్పడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రపంచంలో చాలా హింస తగ్గుతుంది. మనం కొంచెం నాగరికులం అవుతాం. సరిగ్గా జీవించగలుగుతాం’ -
ఏసీబీకి చిక్కిన సహాయ కార్మిక శాఖాధికారి
అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: మృతి చెందిన కూలీల కుటుంబాలకు సకాలంలో బీమా సొమ్ము అందించి ఆదుకోవలసింది పోయి... ఆ సొమ్ములో కొంత ముట్టజెబితేనే సంతకం చేస్తానని వేధించిన నర్సీపట్నం సహాయ కార్మిక శాఖాధికారి పాపం పండింది. కార్మిక సంఘం నేత నుంచి లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ పట్టుకుంది. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం సీతన్న అగ్రహారానికి చెందిన కార్మిక సంఘం నేత పాము అప్పలనాయుడు భవన నిర్మాణ కార్మికులకు రూ.110 చొప్పు న బీమా కట్టించాడు. వీరిలో బంగారు గంగునాయుడు, మొల్లి నర్సింగరావు, వియ్యపు నూకలక్ష్మి 7 నెలల వ్యవధిలో మృతి చెందారు. ముగ్గురు కార్మికులు సహజంగా మరణించడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి రూ.30 వేలు చెల్లించాలని కార్మిక శాఖకు అప్పలనాయుడు దరఖాస్తు చేసుకున్నాడు. అక్క డి సహాయ కార్మిక శాఖాధికారి కె.వి. ఎన్.ఎస్.రాజు ఒక్కొక్క మృతునికి సంబంధించి రూ.10 వేల చొప్పున ముట్టజెబితే తప్ప ఫైల్ మీద సంతకం చేసేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో అప్పలనాయడు విశాఖలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ డీఎస్పీ ఎం. నర్సింహారావును ఆదివారం కలిసి విషయం తెలిపాడు. అధికారుల సూచనల మేరకు బుధవారం రూ.20 వేలు ఇస్తానని సహాయ కార్మిక శాఖాధికారి కె.వి.ఎన్.ఎస్.రాజుకు చెప్పాడు. స్వగ్రామం పెందుర్తి వెళ్తూ మార్గమధ్యంలో అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని బుక్ స్టాల్ వద్ద ఉంటానని, అక్కడికి సొమ్ము తెచ్చివ్వాలని రాజు సూచించాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు గణేష్, రమణమూర్తి, రామకృష్ణ, అప్పలనాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ నరసింహారావు అందజేసిన రూ.20 వేలను అప్పలనాయుడు కాంప్లెక్స్‌లోని బుక్‌స్టాల్ వద్ద ఉన్న నర్సీపట్నం సహాయ కార్మిక శాఖాధికారి కె.వి.ఎన్.ఎస్.రాజుకు అందజేశారు. ఆయన నోట్లను లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాంప్లెక్స్ ట్రాఫిక్ మేనేజర్ కార్యాలయంలో నిందితుడిని డీఎస్పీ నరసింహారావు విచారించారు.