Bopal
-
బలపరీక్షపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభలో రేపే(శుక్రవారం) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సింగిల్ పాయింట్ ఎజెండాతో బలపరీక్ష జరపాలని స్పీకర్‌ను ఆదేశించింది. అదేవిధంగా బలపరీక్ష నిర్వహణను వీడియో తీయాలని పేర్కొంది. బలపరీక్ష సమయంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, నిబంధనలు ఉల్లంఘించకుండా అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచనలు ఇచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేతులు పైకి ఎత్తడం ద్వారా బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష పక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇటీవల 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో బీజేపీ గూటికి చేరడంతో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ‘బలపరీక్షపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. శుక్రవారం జరపబోయే బలపరీక్షలో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుంది. ఎందుకంటే కమల్‌నాథ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు’ అని శివరాజ్‌సింగ్ అన్నారు. -
అయోధ్య తీర్పు; విగ్రహావిష్కరణ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దివంగత మాజీ కేంద్రమంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. భోపాల్ లోని రద్దీగా ఉండే ఓ రోడ్డు జంక్షన్లో అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో అక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ అజాద్ విగ్రహం ఉండేది. ఆ ప్రదేశంలోనే అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘అజాద్ విగ్రహం గతంలో ఎక్కడ ఉండేదో తిరిగి అక్కడే ప్రతిష్టించాల’ని ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘దేశమాత ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ అజాద్ విగ్రహం తొలగించడం ఆయనను అవమానించడమే. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. అజాద్ విగ్రహాన్ని తొలగించిన చోటనే పునః ప్రతిష్టించాలి. లేదంటే దేశం వారిని ఎన్నటికీ క్షమించదు’ అని చౌహన్ అన్నారు. ‘ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ చేసే పనుల్లో భాగంగా మూడేళ్ల క్రితమే అజాద్ విగ్రహాన్ని తీసి మరో ప్రదేశంలో నెలకొల్పార’ని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పౌరసంఘాల అధికారులు తనను ఎప్పుడూ సంప్రదించలేదని బీజేపీ నేత, భోపాల్ మేయర్ అలోక్ శర్మ స్పష్టం చేశారు. దీనిపై బీఎంసీ కమిషనర్ బి.విజయ్ దత్తా వాదన మరోలా ఉంది. అర్జున్ సింగ్ విగ్రహం ఏర్పాటు గురించి కాంగ్రెస్‌నేతలు, బీఎంసీ అధికారులు మేయర్‌ను కలిశామని, అయితే ఆ విషయాన్ని మాత్రం మేయర్ వెల్లడించడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈనెల 11న అర్జున్‌సింగ్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. -
భార్యల పోషణ కోసం మోసం; నిందితుల అరెస్ట్
భోపాల్: స్థానిక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఎర వేసి మహిళలను మోసం చేసిన నిందితులను ఎట్టకేలకు మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎయిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు అప్పగించారు. ఎస్టీఎస్ పోలీసులు కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు చేసి మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితుల ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఎస్టీఎఫ్ ఏడీజీ అశోక్ అవస్థీ వివరాల ప్రకారం.. ఈ ముఠా భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నర్సుగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు సుమారు 50 మంది మహిళలను మోసం చేసినట్లు తెలిపారు. పట్టుబడిని ప్రధాన నిందితుడు దిల్షాద్ ఖాన్ జబల్పూర్ వాసి కాగా, సహచరుడు అలోక్ కుమార్ భోపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దిల్షాద్ ఖాన్‌కు ఐదుగురు భార్యలు ఉన్నారని, భార్యలతో కుటుంబ పోషణ భారంగా మారటంతో ఇలాంటి మోసాలు పాల్పడుతున్నాడని వెల్లడించారు. నిందితుడు దిల్షాన్.. తన భార్యల్లో ఒకరు జబల్పూర్లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారని, అలోక్ కుమార్ భార్య ప్రభుత్వ హాస్టల్లో సూపరింటెండెంట్‌గా పని చేస్తుందని పోలీసులకు వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలకు ప్రత్యక్షంగా ఈ కేసుతో సంబంధం లేకున్నా.. పరోక్ష పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుపుతామని అశోక్ అవస్థీ వెల్లడించారు. అదేవిధంగా ఈ ముఠా చేతిలో మోసపోయిన నగర, గ్రామీణ మహిళల వివరాలను తెలుకోవడానికి ఎస్టీఎఫ్ బృందం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. -
మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!
భోపాల్: శివపురి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. వైద్యం కోసం వచ్చిన రోగిపై ఆస్పత్రి సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. ఆస్పత్రిలో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకోకుండా.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది వైఖరిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘స్థానిక శివపురి జిల్లా ఆస్పత్రిలో రోగి మృతదేహం కంటిని చీమలు కుట్టేస్తున్నాఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడం దారుణం. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం మానవత్వానికి సిగ్గుచేటు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆస్పత్రి అధికారులను ఆదేశిస్తున్నాను. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని’ కమల్‌నాథ్ ట్విట్ చేశారు. తీవ్రమైన క్షయ వ్యాధితో బాధపడుతున్న బాల్‌చంద్ర లోధి (50) మంగళవారం ఉదయం శివపురి జిల్లా ఆస్పత్రి చేరారు. ఆస్పత్రిలో చేరిన ఐదు గంటల లోపు ఆ రోగి మృతి చెందారు. దీంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న సదరు రోగులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహన్ని తీయటం పట్ల నిర్లక్ష్యం వహించారు. అయితే మృతదేహాన్ని మార్చరీకి తరలించకుండా అదే వార్డులో ఓ మూలగా పడేశారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా రోగి మృత దేహాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ మృతదేహంపై చీమలు పాకుతూ.. కళ్లను పీకే ప్రయత్నం చేశాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మృతుడి (బాల్‌చంద్ర లోధి) భార్య ఆ చీమలను పారదోలింది. ఈ సంఘటన మొత్తాన్ని రికార్డు చేసిన కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇటువంటి హృదయవిదారకమైన ఘటన చోటుచేసువడానికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై సీఎం కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఓ సర్జర్తో సహా అయిదుగురు మెడికోలపై సస్పెన్షన్ వేటు పడింది. -
టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం
భోపాల్: వివాదాస్పద బీజేపీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. అయితే ఈసారి విపక్షనేతలపై కాకుండా తన సొంత నియోజకవర్గ పార్టీ కార్యకర్తలపైనే. వర్షాకాలం కావడంతో.. సాద్వీ ప్రాతినిథ్యం వహిస్తున్న భోపాల్ పరిసర ప్రాంతాల్లో అపరిశ్రుభంగా మారాయి. అయితే ఆ ప్రాంత డ్రైనేజీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. తమ ప్రాంతంలో ఓసారి స్వచ్ఛభారత్ చేపట్టండని ఆమెకి విజ్ఞప్తి చేశారు. దీంతో వారిపై ప్రజ్ఞా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ డ్రైనేజీలు శుభ్రం చేయడానికి ఎన్నికకాలేదని ఘాటుగా సమాధానమిచ్చారు. ‘మీ మురికివాడలను శుభ్రం చేయడానికి నేనేం పారిశుధ్య కార్మికురాలిని కాదు. డ్రైనేజీ, టాయిలెట్లను పరిశుభ్రం చేయడానికి కాదు నేను పార్లమెంట్‌కు ఎన్నికయింది. నేను స్థానిక ప్రజాప్రతినిధులను సమస్వయం చేసి పని చేయచేయిస్తాను’ అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు, కార్మికులకు, స్థానిక ఎమ్మెల్యేలకు తాను కేవలం ఆదేశాలు జారీ చేస్తానని, వారితో పనిచేయించుకోండని ప్రజ్ఞా ఉచిత సలహా ఇచ్చారు. ఎంపీ సమాధానంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అంటూ.. గంటల కొద్ది ప్రసంగాలు ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. దీనిలో ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర్ర ప్రభుత్వాలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చినా అది ఏమాత్రం అమలుకావడంలేదు. ప్రజ్ఞా సమాధానంపై స్థానిక కాంగ్రెస్ నేత తారీక్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. ఇది ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. దీనిపై ప్రధాని మోదీ వెంటనే కల్పించుకుని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వివాదాస్పద నేతగా పేరొందిన సాద్వీ ప్రజ్ఞా.. ఎన్నికల సమయంలో ఎన్నోసార్లు నోరుజారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. -
భోపాల్‌లో సిటీ బెగ్గర్లు
హైదరాబాద్‌కు చెందిన కొందరు మహిళలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బెగ్గింగ్ పేరిట చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. వీరు అమాయకులైన చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు తేలింది. మరోవైపు చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భోపాల్‌లో అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి చెందిన అధికారులు చైల్డ్ లైన్ సహాయంతో దాడులు నిర్వహించి 21 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 44 మంది చిన్నారులను కాపాడారు. చిక్కిన మహిళల్లో హైదరాబాద్‌తో పాటు కాన్పూర్‌కు చెందిన వారూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా వెనుక చిన్నారుల కిడ్నాప్, అక్రమ రవాణా వంటి వ్యవహారాలు ఉండొచ్చనే అనుమానంతో ఆ మహిళలపై భోపాల్‌లోని బజ్రియ ఠాణాలో కేసులు నమోదు చేశారు. భిక్షాటన చేస్తూ చిక్కిన 21 మంది మహిళలను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన అధికారులు చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ మాఫియా వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ సీఐడీ ఆధీనంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన అధికారులు కాన్పూర్, హైదరాబాద్‌లో దర్యాప్తు చేపట్టారు. సాక్షి, సిటీబ్యూరో: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ బెగ్గింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి (సీడబ్ల్యూసీ) చెందిన అధికారులు చైల్డ్ లైన్ సహాయంతో నగరంలో దాడులు నిర్వహించి 21 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ భిక్షాటన చేస్తున్న 44 మంది చిన్నారులను కాపాడారు. సీడబ్ల్యూసీకి చిక్కిన మహిళల్లో హైదరాబాద్‌తో పాటు కాన్పూర్‌కు చెందిన వారూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా వెనుక చిన్నారుల కిడ్నాప్, అక్రమ రవాణా వంటి వ్యవహారాలు ఉండవచ్చుననే అనుమానంతో ఆ మహిళలపై భోపాల్‌లోని బజ్రియ ఠాణాలో కేసులు నమోదు చేశారు. భిక్షాటన చేస్తూ చిక్కిన 21 మంది మహిళలను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన అధికారులు చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ మాఫియా వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ సీఐడీ ఆధీనంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన అధికారులు కాన్పూర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ దర్యాప్తు చేపట్టారు. బిచ్చగాళ్లు పెరిగిపోవడంతో... భోపాల్‌లో నగరంలో ఇటీవల బిచ్చగాళ్ళ తాకిడి ఎక్కువైనట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మహిళా భిక్షగత్తెల చేతుల్లో చిన్నారులను గమనించిన అక్కడి సీడబ్ల్యూసీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో గత నెల మూడో వారంలో వరుస దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 21 మంది మహిళలను అదుపులోకి తీసుకుని, 44 మంది చిన్నారులకు కాపాడారు. సదరు మహిళల వ్యవహార శైలి ఆద్యంతం అనుమానాస్పదంగా ఉండటంతో సీడబ్ల్యూసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు వారి వ్యవహారశైలి భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు బుర్ఖాలు ధరించి, చేతుల్లో లేదా వీల్‌చైర్‌పై చిన్నారులతో భిక్షాటన చేస్తుండగా పలకరిస్తే తెలుగులో మాట్లాడుతున్నారు. తాము ఓ వర్గానికి చెందిన వారమని చెబుతున్నప్పటికీ.. పేర్లు, మెడలో ధరించిన మంగళసూత్రాలు, కాళ్లకు ఉన్న మట్టెలు మరో వర్గానికి చెందిన వారిగా సూచిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అవసరం లేకపోయినా.. ఈ మహిళల్లో కొందరికి భిక్షాటన చేయాల్సిన అవసరం లేదని బజ్రియ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు భర్తలతో వేరు పడగా, మరికొందరు దూరంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడూ కలుస్తూనే ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరి సంతానం అనేక మిషనరీ స్కూళ్లల్లో చదువుకుంటుండగా, మరికొందరు మహిళలు భిక్షాటనతోనే సొంతంగా ఇళ్లు సైతం సమకూర్చుకున్నట్లు వెల్లడైంది. ఓ మహిళకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండగా, పిల్లలు హిమాయత్‌నగర్‌లోని ప్రముఖ మిషనరీ స్కూల్లో చదువుకుంటున్నట్లు తేలింది. రెస్క్యూ చేసిన చిన్నారుల్లో కొందరు ఇంగ్లిష్ సైతం మాట్లాడుతున్నట్లు పోలీçసులు పేర్కొన్నారు. వీరిలో ఓ మహిళ నగరంలోని ఓ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తున్నట్లు తేలింది. సెలవుల్లో మాత్రం వివిధ నగరాలకు వెళ్లి బిక్షమెత్తుకుంటానని తెలిపింది. తమ వెంట ఉన్న చిన్నారులు తమ పిల్లలే అంటూ వారు చెబుతున్నా పోలీసులు మాత్రం నమ్మట్లేదు. అదే నిజమైనా సొంత పిల్లలతో భిక్షాటన చేయించడమూ నేరం అయినందున వీరిని రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి కొన్ని ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి అసలైనవా? కాదా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రంగంలోకి దిగిన సీఐడీ సిట్... ఈ బెగ్గింగ్ మాఫియా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్ పోలీసు విభాగం కేసును బజ్రియ పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీకి బదిలీ చేసింది. కేసును భోపాల్‌తో పాటు కాన్పూర్, హైదరాబాద్‌ల్లోనూ దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సిట్ ఏర్పాటు చేసింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలు కాన్పూర్, హైదరాబాద్ చేరుకుని ఆరా తీస్తున్నాయి. రెస్క్యూ చేసిన చిన్నారుల్లో ఎవరైనా భిక్షాటన చేస్తున్న మహిళల పిల్లలే ఉన్నారా? అనే అంశాన్ని నిర్థారించడంపై దృష్టి సారించారు. ఇందుకుగాను వీరి సంబంధీకుల్ని సంప్రదించడంతో పాటు చిన్నారులు, మహిళలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అక్కడి కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రాథమికంగా ఈ కేసులో ఐపీసీలోని 363 (చిన్నారులను భిక్షాటనకు వినియోగించడం), 367 (చిన్నారులను కిడ్నాప్ చేయడం) సెక్షన్లతో పాటు జేజే యాక్ట్ లోని సెక్షన్ 76ను చేర్చారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా మరికొన్ని చేర్చడం, ఉన్న వాటితో మార్పులు చేయనున్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న సిట్ బృందం వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
భోపాల్‌లో సీఆర్పీఎఫ్ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన
-
10 నుంచి ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు
గుత్తి: మధ్యప్రదేశ్ రాజధాని బోపాల్‌లో డిసెంబర్10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సునీత, రేణుక, శ్రీదేవి, నిర్మల పిలుపునిచ్చారు. పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీలో శనివారం ఐద్వా జెండాను ఆవిష్కరించారు. మహసభలకు సంబంధించిన జీపు జాతా డిసెంబర్ 5న గుత్తికి వస్తోందన్నారు. -
భోపాల్ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ బయలుదేరి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. గురువారం భోపాల్‌లో జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. -
ఎన్నికలపై ఆసక్తి చూపని హిజ్రాలు
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి 2002 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓ హిజ్రా పోటీ చేసి గెలుపొందారు. షబ్నమ్ మోసీ శాసనసభకు ఎన్నికవడం ఆమె సామాజిక వర్గానికి ఏమంత స్ఫూర్తిదాయకం కాలేదు. ఎన్నికల్లో పోటీ, గెలుపు, ఓటముల సంగతి పక్కనపెడితే అసలు ఓటరుగా నమోదు కావడానికే వారు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఎన్నికల ప్రకటన తరువాత ఢిల్లీ రాజకీయ పార్టీల హడావుడులతో వేడెక్కింది. అయితే హిజ్రా సామాజిక వర్గం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 541 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 1.60 కోట్ల మంది ఉన్న ఢిల్లీ జనాభాలో హిజ్రాలు, లెస్బియన్లు ఘననీయంగానే ఉన్నారు. అయితే కేవలం కొద్ది మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సమాజం వెలివేతకు గురైన వీరిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అయితే అవి పెద్దగా ఫలవంతం కాలేదు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకొంటే తమ గురించి బహిర్గతమౌతుందని భయపడుతున్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. వీరిలో చాలా మంది తమను తాము స్త్రీ లేదా పురుషులుగా నమోదు చేసుకుంటున్నారు తప్పనిసరిగా తమ లింగాన్ని పేర్కొనడానికి జంకుతున్నారని మరో అధికారి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ఇతరులు అనే ప్రత్యేక వర్గంలో వీరిని నమో దు చేయాలని పేర్కొంది. ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఎక్కువ మంది తూర్పు ఢిల్లీకి చెందిన వారు. ఇదే విషయాన్ని 50 ఏళ్ల షబ్నమ్ మోసీని ప్రశ్నించగా భోపాల్ నుంచి ఫోన్లో మాట్లాడుతూ ‘‘వీరిలో కొంతమంది బాగా శ్రీమంతుల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అందుకే కుటుంబ పరువు బయటపడుతుందనే శంకతో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే తాను మాత్రం ఈసారి మళ్లీ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తాను’’ అని తెలి పింది. మోసీ తరువాత కమ్లా బువా 2009లో భోపాల్ నగర మేయర్‌గా గెలుపొందింది. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని కదలించి ఎన్నిల్లో భాగస్వాములను చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఆ ప్రయత్నాలేవి పెద్దగా ఫలించలేదు. ‘‘వీరిని సమాజంలో భాగంగా గుర్తించడానికి చాలా మంది సంసిద్ధంగా లేరు. సమాజంలోనే వీరి పట్ల అవగాహాన పెరగాల్సి ఉంది. చాలా మంది హిజ్రాలు లేదా లెస్బియన్లు బాగా వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి కి అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కు పొందడం ద్వారా తమ హక్కులను సాధిం చుకోవడానికి మార్గం ఏర్పడుతుంది’’ అని స్పెస్ అనే స్వచ్ఛంద సంస్థ సీనియర్ సభ్యులు అంజన్ జోషి తెలిపారు.