ఎన్నికలపై ఆసక్తి చూపని హిజ్రాలు
Published Sat, Oct 12 2013 2:28 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి 2002 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓ హిజ్రా పోటీ చేసి గెలుపొందారు. షబ్నమ్ మోసీ శాసనసభకు ఎన్నికవడం ఆమె సామాజిక వర్గానికి ఏమంత స్ఫూర్తిదాయకం కాలేదు. ఎన్నికల్లో పోటీ, గెలుపు, ఓటముల సంగతి పక్కనపెడితే అసలు ఓటరుగా నమోదు కావడానికే వారు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఎన్నికల ప్రకటన తరువాత ఢిల్లీ రాజకీయ పార్టీల హడావుడులతో వేడెక్కింది. అయితే హిజ్రా సామాజిక వర్గం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 541 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 1.60 కోట్ల మంది ఉన్న ఢిల్లీ జనాభాలో హిజ్రాలు, లెస్బియన్లు ఘననీయంగానే ఉన్నారు. అయితే కేవలం కొద్ది మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సమాజం వెలివేతకు గురైన వీరిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అయితే అవి పెద్దగా ఫలవంతం కాలేదు.
ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకొంటే తమ గురించి బహిర్గతమౌతుందని భయపడుతున్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. వీరిలో చాలా మంది తమను తాము స్త్రీ లేదా పురుషులుగా నమోదు చేసుకుంటున్నారు తప్పనిసరిగా తమ లింగాన్ని పేర్కొనడానికి జంకుతున్నారని మరో అధికారి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ఇతరులు అనే ప్రత్యేక వర్గంలో వీరిని నమో దు చేయాలని పేర్కొంది. ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఎక్కువ మంది తూర్పు ఢిల్లీకి చెందిన వారు.
ఇదే విషయాన్ని 50 ఏళ్ల షబ్నమ్ మోసీని ప్రశ్నించగా భోపాల్ నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ ‘‘వీరిలో కొంతమంది బాగా శ్రీమంతుల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అందుకే కుటుంబ పరువు బయటపడుతుందనే శంకతో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే తాను మాత్రం ఈసారి మళ్లీ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తాను’’ అని తెలి పింది. మోసీ తరువాత కమ్లా బువా 2009లో భోపాల్ నగర మేయర్‌గా గెలుపొందింది. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని కదలించి ఎన్నిల్లో భాగస్వాములను చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఆ ప్రయత్నాలేవి పెద్దగా ఫలించలేదు. ‘‘వీరిని సమాజంలో భాగంగా గుర్తించడానికి చాలా మంది సంసిద్ధంగా లేరు. సమాజంలోనే వీరి పట్ల అవగాహాన పెరగాల్సి ఉంది. చాలా మంది హిజ్రాలు లేదా లెస్బియన్లు బాగా వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి కి అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కు పొందడం ద్వారా తమ హక్కులను సాధిం చుకోవడానికి మార్గం ఏర్పడుతుంది’’ అని స్పెస్ అనే స్వచ్ఛంద సంస్థ సీనియర్ సభ్యులు అంజన్ జోషి తెలిపారు.
Advertisement
Advertisement