Hizras
-
టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై హిజ్రాల ఆగ్రహం
-
హిజ్రాలపై టీడీపీ నేత ఆటవిక దాడులు
► సంపాదనంతా తనకే ఇవ్వాలని హిజ్రాలకు రూల్ ► మాట వినకపోతే చిత్ర హింసలే ► యువకులకు చీరలు కట్టించి నకిలీ హిజ్రాలుగా మార్పు ► రూ.కోట్లకు పడగలెత్తిన అధికార పార్టీ నేత సూరాడ ఎల్లాజీ ► యువకుడి ఫిర్యాదుతో ఎల్లాజీ అరెస్టు సాక్షి, విశాఖపట్నం/అల్లిపురం: హిజ్రాలకు ‘నేత’ అయ్యాడు. రోజూ సంపాదించిన సొమ్మంతా తనకే అప్పగించేలా వారిని దారిలోకి తెచ్చుకున్నాడు. రూ.కోట్లకు అధిపతిగా మారాడు. చివరకు పాపం పండి కటకటాల వెనక్కి చేరాడు. హిజ్రాల నాయకుడిగా వ్యవహస్తూ అరాచక శక్తిగా మారిన అతడి పేరు సూరాడ ఎల్లాజీ. విశాఖపట్నంలో 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడు. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు అనుంగు శిష్యుడు. ప్రధాన అనుచరుడు. దశాబ్దానికి పైగా విశాఖ కేంద్రంగా హిజ్రాలకు రారాజుగా వెలుగొందుతూ ఎల్లాజీ వారితో ఎన్నో ఆగడాలు చేయించేవాడు. అడిగినంత సొమ్ము తెచ్చివ్వకపోతే నరకం చూపేవాడు. ఒక్కొక్కరు రోజుకు కనీసం రూ.300 నుంచి రూ.వెయ్యి వరకు తెచ్చి ఇచ్చేలా రూల్ పెట్టాడు. ఇందులో కొంచెం తగ్గినా ఘోరంగా హింసించేవాడు. అందమైన యువకులను ముగ్గులోకి దించి వారికి చీరలు, డ్రెస్సులు వేసి ఫొటోలు తీయించేవాడు. నకిలీ హిజ్రాలుగా మార్చేవాడు. హిజ్రాలుగా కొనసాగకపోతే ఆ ఫొటోలను వారి తల్లిదండ్రులకు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలా తన సామ్రాజ్యంలో 300 మందిని చేర్చుకున్నాడు. తనకు లొంగిన హిజ్రాలతో దౌర్జన్యాలు చేయించేవాడు. రెండేళ్ల క్రితం ఎల్లాజీ అధీనంలో ఉన్న అనూష అనే హిజ్రా హత్యకు గురైంది. కిషోర్ అనే వ్యక్తితో అనూష విజయవాడకు వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని ఎల్లాజీ ఆమెను గాలించి పట్టుకుని, హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో అది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పాపం పండిందిలా... ఇటీవల భూపేష్‌నగర్‌కు చెందిన గణేష్ అనే యువకుడు తనకు ఎల్లాజీ మత్తు మందులు ఇచ్చి, హిజ్రాగా వేషం వేసి ఫొటోలు తీసి తన భార్యకు పంపడంతో ఆమె తనను వదిలి వెళ్లిపోయిందంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎల్లాజీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్లాజీపై గతంలో ఉన్న అనూష హత్య కేసును నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ తిరగతోడారు. అనూష అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్పు చేశారు. ఎల్లాజీ ప్రస్తుతం సెంట్రల్ జైలులో ఉన్నాడు. జైలులో ఉండి కూడా బెదిరిస్తున్నాడు ఎల్లాజీ జైలుకెళ్లడంతో ఇన్నాళ్లూ అతడి కబంధ హస్తాల్లో చిక్కుకున్న హిజ్రాలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. రోజూ పలువురు హిజ్రాలు వివిధ పోలీస్స్టేషన్లలో ఎల్లాజీ ఆగడాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు ఎల్లాజీ జైలు ఉండి కూడా తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని 50 మంది హిజ్రాలు ఆదివారం టూటౌన్ సీఐ జీవీ రమణకు ఫిర్యాదు చేశారు. అతడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఎల్లాజీకి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ బహిరంగంగా అండగా నిలుస్తున్నారు. ఎల్లాజీని టీడీపీ నుంచి బహిష్కరించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే లెక్కచేయడం లేదు. ఎల్లాజీయే వార్డు అధ్యక్షుడిగా కొనసాగుతారని ప్రకటించారు. -
ముర్గీమాతాకు పూజలు
రామగుండం : మండలంలోని అక్బర్‌నగర్‌లో నివాసముండే హిజ్రా అర్చన ఆదివారం రాత్రి ముర్గీమాతాకు ప్రత్యేకSపూజలు చేశారు. ప్రతీ హిజ్రా ఏడాదిలో ఒకసారి మాతాను కొలుచుకునే సంప్రదాయం ఉంటుందని తెలిపారు. ముర్గీమాతను కొలిస్తే తమ బతుకుల్లో వెలుగులు కనిపిస్తాయని నమ్మకమని పేర్కొన్నారు. పూజ అనంతరం ముర్గీమాతను కొలిచే హిజ్రాను ముస్తాబుచేసి వేదికపై కూర్చోబెట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హిజ్రాలు కట్నకానుకలు సమర్పించారు. అనంతరం విందు భోజనం ఆరగించి, సాంస్కృతిక కార్యక్రమాలతో గడిపారు. -
హిజ్రాలే టార్గెట్... దాడులు, హత్య
హైదరాబాద్‌సిటీ (మలేసియా టౌన్షిప్): హిజ్రాల కారణంగానే భార్య ఇంటినుంచి వెళ్లిపోయిందనే కోపంతో హిజ్రాలను వేధించడం, దాడులు చేయడమే కాకుండా హత్యకు పాల్పడిన నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 16వ తేదీన హిజ్రా ప్రవల్లికను హత్య చేశారు. ఈ కేసును కేపీహెచ్‌బీ పోలీసులు ఛేదించారు. హత్య వివరాలను కూకట్పల్లి ఏసీపీ గురువారం వివరించారు. వివరాల్లోకి వెళితే అనంతరంపురం జిల్లా రాప్తాడు గ్రామానికి చెందిన కుర్మ వెంకటేశ్వర్లు అలియాస్ చిన్నా, అలియాస్ వెంకటేష్ (24) అనిత అనే అమ్మాయిని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కూకట్పల్లి మూసాపేటలో నివసించేవాడు. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లుకు దివ్య అనే హిజ్రాతో సేహ్నం ఏర్పడింది. విషయం తెలిసిన భార్య అతన్ని అసహ్యించుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య దూరం కావడానికి హిజ్రాలే కారణమని వారిపై పగ పెంచుకున్నాడు. నిరంతరం వారిని వేధించి, దాడులు చేసేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 16వ తేదిన వెంకటేశ్వర్లు, అతని స్నేహితులు కొడుమూరి రాముడు(25), రాయపర్తి రాజశేఖర్‌రెడ్డి (28), కాకర్ల తిరుమలేశ్వర్‌రెడ్డి (32)లతో కలిసి కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద ఉన్న కుమ్మరి సురేష్ అలియాస్ ప్రవల్లిక అనే హిజ్రాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.టాటా సుమోలో ఎల్లమ్మబండలో గల జేఎన్ఎన్యూఆర్ఎం నివాసాల వద్దకు తీసుకువెళ్లారు. వెళ్లిన వెంటనే వెంకటేశ్వర్లు ప్రవళికను తన వద్ద ఉన్న డబ్బును సెల్‌ఫోన్ ఇవ్వమని బెదిరించాడు. నువ్వు నాకు తెలుసునని ప్రవల్లిక అనడంతో బండారం బయటపడుతుందని వెంకటేశ్వర్లు, రాముడులు రాతితో తలపై బలంగా మోదారు. దీంతో హిజ్రా తీవ్రగాయాల పాలై అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. ఆమెవద్ద గల రూ. 1600, సెల్‌ఫోన్‌ను తీసుకొని వెంకటేశ్వర్లు, అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం కేపీహెచ్‌బీకాలనీలోని రాజశేఖర్‌రెడ్డి నివాసంలో వెంకటేశ్వర్లు, తిరుమలేశ్వర్రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు పోలీసులు ముందు నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌రెడ్డి, తిరుమలేశ్వర్రెడ్డిలను రిమాండ్‌కు తరలించారు. రెండో నిందితుడు కొడుమూరి రాముడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే హిజ్రా ప్రవల్లికను నిజామాబాద్ జిల్లా దారుపల్లి మండలం, అనుసాన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సురేష్ (25)గా గుర్తించారు. సురేష్ ఎంబీఏ పూర్తిచేసి బేగంపేటలో నివాసం ఉంటూ ప్రవల్లిక పేరుతో కూకట్పల్లి ప్రాంతంలో రాత్రివేళలో హిజ్రా వేషంలో తిరిగేవాడని పోలీసులు తెలిపారు. -
థర్డ్ వాయిస్
లోకంలో అంతా ఆడా, మగా మాత్రమే ఉండాలా? అటూ ఇటూ కాని మూడో ప్రకృతి వునుషులకు చోటే లేదా? ఆడా, మగా కాని హిజ్రా.. ట్రాన్స్‌జెండర్.. ఎవరైనా కానీ, వాళ్లకూ బతికే హక్కు ఉంది. ఆత్మగౌరవమూ ఉంది. తవు హక్కుల కోసం తెలంగాణ హిజ్రా, ట్రాన్స్‌జెండర్ సమితి ఈ నెల 10న స్వాభిమాన్ సభ ఏర్పాటు చేయనుంది. స్వాభిమాన్ సభ కార్యాచరణను ఖరారు చేసేందుకు బుధవారం వీళ్లంతా భేటీ అయ్యారు. సమావేశమయ్యాక కాసేపు కష్టసుఖాలను కలబోసుకున్నారు. ‘ఈ మున్నీ.. దాని పన్నెండేళ్ల వయుసులో నా దగ్గరకొచ్చింది. అప్పటి నుంచి దానికి అమ్మా నాన్నా, అత్త అన్నీ నేనే’ అంది మీనా. ‘మీది ఈ ఊరేనా?’ అడిగింది పక్కనే ఉన్న రుక్మిణి. ‘ఈ ఊరే’ చెప్పింది మున్నీ. ‘మీ అవ్మూ నాన్నలకు తెలిసే వచ్చావా?’ అనే మాటను రుక్మిణి పూర్తిచేసే లోపే ‘వాళ్లకు తెలిస్తే వెళ్లనిస్తారే?’ అక్కడున్న మీనా, రోషిణి, రచన ముక్తకంఠంతో అరిచినట్లే అన్నారు. ‘గన్నవరం నుంచి నేనూ అదే వయుసులో ఇక్కడికొచ్చాను. గుర్తుందా మమ్మీ’ అంటూ మీనాకు గుర్తుచేసింది రుక్మిణి. ‘ఊ’ అంది మీనా కాస్త బాధగా. ‘నాకు పన్నెండేళ్లొచ్చేదాకా తెలియుదు.. నేను అబ్బాయి రూపంలో ఉన్న అమ్మాయినని.. నా వూట, నడక చూసి స్కూల్లో ఎంత ఎగతాళి చేసేవారో.. ఎక్కడికెళ్లినా కొజ్జా అనే తప్ప నా సొంత పేరుతో పిలిచేవారే కాదు. అవన్నీ భరించలేకే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయి హైదరాబాద్ వచ్చేశా’ బాధ పంచుకుని, వునసు తేలిక చేసుకుంది రుక్మిణి. ‘నాదీ అదే పరిస్థితి..’ ఊరడింపుగా రుక్మిణి భుజం తట్టింది రోషిణి. ‘మనలాంటోళ్లకు ముంబైలో రెస్పెక్ట్ ఉంటది’ అని ఒక ఫ్రెండ్ చెప్పిన మాట విని, ఆ ఫ్రెండ్‌తో ముంబై వెళ్లి సర్జరీ చేయించుకున్నా. ఆరేళ్ల తర్వాత ఇంటిమీద బెంగ మొదలైంది. అవ్ముకు ఫోన్ చేశా.. అమ్మ రమ్మంది. వెళ్లిన. అన్నయ్యు వాళ్లు గొడవపెట్టారు. హైదరాబాద్ వచ్చిన’ తన గాథ చెప్పుకుంది రోషిణి. ‘వాళ్లు నిన్ను కాదనుకున్నా, నువ్వు వాళ్లను కాదనుకోలేదు కదా.. చెల్లి పెళ్లి చేసినవ్. అవ్మూ నాన్నను చూసుకుంటున్నవ్.. ఏ బాధ్యత వురిచినవని?’ ఊరడించింది మీనా. ‘రచన ఏం వూట్లడ్త లేదు’ మీనా పలకరింపు. ‘ఏం వూట్లాడాలే.. ఎవరి కథ అయినా అంతే. మీరంతా ఏం చేస్తున్నారో, డబుల్ పీజీ చేసి నేనూ అదే చేస్తున్నా.. అమ్మ లేదు. ఉన్న నాన్న బాధ్యత నాదే. అక్క, చెల్లి పెళ్లిళ్లపోయి అత్తగారిళ్లలో ఉన్నారు. ఇద్దరూ నాన్న ఆస్తిని సమానంగా పంచుకున్నారు. బాధ్యతను మాత్రం నాకు వదిలారు. నన్ను అర్థం చేసుకున్నది ఒక్క నాన్నే. ఆయున బయటకు వెళ్లినప్పుడల్లా ‘నీ కొడుకేంటీ.. పోనీటెరయిల్ కట్టుకుంటాడు.. కుర్తా పైజామా వేసుకుంటాడు.. ఆడాళ్లలా వూట్లాడతాడు’ అని ఇబ్బంది పెడతారు జనం. ఆ బాధ, కోపం ఇంటికొచ్చి నా మీద తీర్చుకుంటాడాయున. ఊహ తెలిసినప్పటి నుంచి అలవాటైపోరుుంది కాబట్టి ఆయున వునసు నేను అర్థం చేసుకుంటాను’ అంటూ తన బాధను పంచుకుంది రచన. ‘ఇంట్లో వాళ్లంటే జన్మనిచ్చారు కాబట్టి వాళ్లకు బాధ ఉండొచ్చు.. బయట వాళ్లకేం బుద్ధి ఇంతలా ఇన్సల్ట్ చేస్తారు?’ మున్నీ ఆవేదన. ‘మనమేం అడుగుతున్నం.. వున వూనాన వునల్ని బతకనిస్తే చాలనే కదా.. మనుషుల్లెక్క గుర్తిస్తే చాలనే కదా..’ మీనా ఆక్రోశం. సమానమైన గుర్తింపు వుహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో హిజ్రా, ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు ఉంది. మిగిలిన పౌరులతో సవూనంగా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వాళ్ల కోసం ఒక సంక్షేవు వుండలి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి సౌకర్యాలు కావాలని మేం డిమాండ్ చేస్తున్నాం. స్కూళ్లు, కాలేజీల్లోనే కాదు, ఓటరు ఐడీలోనూ ఐచ్ఛికమైన పేరు నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. పదో తేదీన ఇలాంటి డిమాండ్లతోనే కేటీఆర్‌కు మెమొరాండం ఇవ్వనున్నాం. అలాగే స్కూళ్లలోనూ. ఇవన్నీ కల్పిస్తేనే మిగిలిన పౌరసమాజంతో సవూనంగా వీళ్లకు గుర్తింపు వస్తుంది. - కార్తీక్, పోస్ట్ డాక్టొరల్ స్కాలర్, హిజ్రా, ట్రాన్స్‌జెండర్ సమితి మెంబర్ - సరస్వతి రమ -
విశాఖలో నేడు హిజ్రాల అందాల పోటీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ సాగరతీరం గురువారం సాయంత్రం హిజ్రాల అందచందాల ప్రదర్శనకు వేదికగా నిలవనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘ట్రాన్స్ క్వీన్’ పేరిట ట్రాన్స్‌జెండర్ (హిజ్రాలు) అందాల పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి. 25 మంది హిజ్రాలు వీటిలో పాల్గొంటున్నారు. నాంది సర్వీస్ సొసైటీ, మూన్‌పవర్ ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను సొసైటీ అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీ, సినీ నటి పూర్ణిమ, ప్రముఖ కొరియోగ్రాఫర్ అమిత్ పాండే బుధవారం విశాఖలో మీడియాకు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు వంద ఎంట్రీలు రాగా, 25 మంది హిజ్రాలను ఎంపిక చేశామని ఎల్లాజీ తెలిపారు. వీరికి గురువారం సాయంత్రం 5 గంటలకు సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ పోటీలకు హీరోయిన్ కామ్న జెఠ్మలానీ, నేపథ్య గాయకుడు రేవంత్, సారు శిల్ప, రింగ్ డ్యాన్సర్ అంబికా, సినీ ఆర్టిస్ట్ చందుతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పా రు. న్యాయనిర్ణేతలుగా ఫొటోగ్రాఫర్ అగర్వాల్, సినీ నటి పూర్ణిమ, లెబెన్‌షిల్ఫే డెరైక్టర్ సరస్వతీదేవి వ్యవహరిస్తారని తెలిపారు. కాగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,400 మంది హిజ్రాల సంక్షేమం కోసం తమ సొసైటీ పని చేస్తున్నట్టు ఎల్లాజీ చెప్పారు. -
ఎన్నికలపై ఆసక్తి చూపని హిజ్రాలు
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి 2002 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓ హిజ్రా పోటీ చేసి గెలుపొందారు. షబ్నమ్ మోసీ శాసనసభకు ఎన్నికవడం ఆమె సామాజిక వర్గానికి ఏమంత స్ఫూర్తిదాయకం కాలేదు. ఎన్నికల్లో పోటీ, గెలుపు, ఓటముల సంగతి పక్కనపెడితే అసలు ఓటరుగా నమోదు కావడానికే వారు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఎన్నికల ప్రకటన తరువాత ఢిల్లీ రాజకీయ పార్టీల హడావుడులతో వేడెక్కింది. అయితే హిజ్రా సామాజిక వర్గం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 541 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 1.60 కోట్ల మంది ఉన్న ఢిల్లీ జనాభాలో హిజ్రాలు, లెస్బియన్లు ఘననీయంగానే ఉన్నారు. అయితే కేవలం కొద్ది మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సమాజం వెలివేతకు గురైన వీరిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అయితే అవి పెద్దగా ఫలవంతం కాలేదు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకొంటే తమ గురించి బహిర్గతమౌతుందని భయపడుతున్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. వీరిలో చాలా మంది తమను తాము స్త్రీ లేదా పురుషులుగా నమోదు చేసుకుంటున్నారు తప్పనిసరిగా తమ లింగాన్ని పేర్కొనడానికి జంకుతున్నారని మరో అధికారి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ఇతరులు అనే ప్రత్యేక వర్గంలో వీరిని నమో దు చేయాలని పేర్కొంది. ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఎక్కువ మంది తూర్పు ఢిల్లీకి చెందిన వారు. ఇదే విషయాన్ని 50 ఏళ్ల షబ్నమ్ మోసీని ప్రశ్నించగా భోపాల్ నుంచి ఫోన్లో మాట్లాడుతూ ‘‘వీరిలో కొంతమంది బాగా శ్రీమంతుల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అందుకే కుటుంబ పరువు బయటపడుతుందనే శంకతో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే తాను మాత్రం ఈసారి మళ్లీ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తాను’’ అని తెలి పింది. మోసీ తరువాత కమ్లా బువా 2009లో భోపాల్ నగర మేయర్‌గా గెలుపొందింది. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని కదలించి ఎన్నిల్లో భాగస్వాములను చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఆ ప్రయత్నాలేవి పెద్దగా ఫలించలేదు. ‘‘వీరిని సమాజంలో భాగంగా గుర్తించడానికి చాలా మంది సంసిద్ధంగా లేరు. సమాజంలోనే వీరి పట్ల అవగాహాన పెరగాల్సి ఉంది. చాలా మంది హిజ్రాలు లేదా లెస్బియన్లు బాగా వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి కి అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కు పొందడం ద్వారా తమ హక్కులను సాధిం చుకోవడానికి మార్గం ఏర్పడుతుంది’’ అని స్పెస్ అనే స్వచ్ఛంద సంస్థ సీనియర్ సభ్యులు అంజన్ జోషి తెలిపారు.