హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ బయలుదేరి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. గురువారం భోపాల్‌లో జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
భోపాల్ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్
Published Wed, May 27 2015 9:18 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement