boycott elections
-
Manipur: శిబిరాల నుంచే ఓటు
ఇంఫాల్: గత ఏడాదంతా జాతుల వైరంతో అట్టుడికిపోయిన మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంతో మోతెక్కిపోయే రాష్ట్రాలకు భిన్న వాతావరణం మణిపూర్‌లో నెలకొంది. మెయితీ, కుకీ తెగల గొడవలతో 50,000 మందికిపైగా స్థానికులు సహాయక, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న భావన వారిలో గూడుకట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలపైనా వ్యతిరేక భావన నెలకొంది. దాంతో మరో రెండు వారాల్లో పోలింగ్ ఉన్నా ఎన్నికల హడావుడే కనిపించలేదు. ‘‘మణిపూర్‌లో 2,955 పోలింగ్ స్టేషన్లలో సగం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం 94 స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నాం. 24,000 మంది శిబిరాల నుంచే ఓటేయనున్నారు’’ అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసీర్ ప్రదీప్ కుమార్ ఝా అన్నారు. ఓటర్లతో మాట్లాడి ఎన్నికలపై సదాభిప్రాయం పెంచి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది మే మూడో తేదీన లోయ ప్రాంతాల్లో ఉండే మెజారిటీ జనాభా మైతేయ్‌లకు రాష్ట్రంలో ఎస్టీ హోదా డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన గిరిజనుల సంఘీభావ ర్యాలీ తర్వాత హింస ప్రజ్వరిల్లింది. మైతేయ్, కుకీల విద్వేషకాండలో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ప్రాణభయంతో సొంతూరిని వదిలి పారిపోయి ఐదు లోయ జిల్లాలు, మూడు కొండ జిల్లాల్లోని శిబిరాల్లో దాక్కున్నారు. ఘర్షణలు పూర్తిగా సద్దుమణకముందే రాష్ట్రంలో ఎన్నికలు అవసరమా? అంటూ వేలాది మంది బాధితులు, కొన్ని పౌర సంఘాలు ప్రశి్నస్తూ ఎన్నికల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చాయి. ‘‘గత లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లో చక్కటి పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఓటర్ల నమ్మకానికి అద్దంపడుతోంది. ఈసారి గణనీయమైన పోలింగ్‌కు కృషిచేస్తాం’’ అని ప్రదీప్ ఝా అన్నారు. -
ఓటర్లకు కోపమొస్తే.. పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తిచూడని గ్రామస్తులు!
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రమంతటా ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఒక గ్రామం మాత్రం ఎన్నికలను బహిష్కరించింది. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఏడు పర్యాయాలు తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , ప్రభుత్వాలు, అధికారుల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం నుంచి ఒక్క గ్రామస్థుడు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్ బూత్ వెలవెలబోయింది. అక్కడి అధికారులు తప్ప ఓటర్లలెవరూ కనిపించలేదు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
రోడ్డు వేస్తేనే.. ఓట్లు వేస్తాం.. లేదంటే ఎన్నికల బహిష్కరనే
నిర్మల్: తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని మండలంలోని గంగాపూర్, రానిగూడ, కొర్రతండా జీపీల పరిధిలోని 12 గ్రామాల ప్రజలు నిర్ణయించారు. ఆయా గ్రామాల నుంచి కడెం వరకు పాదయాత్రగా వచ్చేందుకు ప్రజలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంగాపూర్ గ్రామ సమీపంలోని వాగు వద్ద నిరసన తెలిపారు. నాయకులు, ప్రభుత్వాలు మారుతున్నా తమ ఊళ్ల రాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లోకి అధికారులను, నాయకులను కూడా రానివ్వమని హెచ్చరించారు. మూడు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పాఠశాలల ఉపాధ్యాయులు ఇక నుంచి విధులకు రావొద్దని తెలిపారు. నిరసనలో గంగాపూర్, రానిగూడ, కొర్రతండా సర్పంచులు శాంత, భీంబాయి, సదర్లాల్, నాయకులు చంద్రహాస్, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అడవి బిడ్డల తిరుగుబాటు
-
ఎకరా భూమి ఇప్పించేవారికే మా మద్దతు
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: శాసనసభ ఎన్నికలకు సంబంధించి ప్రతిసారి ఆ గ్రామం ప్రత్యేకంగా కనపడుతోంది. గతంలో ఎన్నికలను బాయ్‌కాట్ చేయడంతో స్వయంగా అధికారులే ఎన్నికలను జరిపారు. ఈ సారి కూడా తమకు న్యాయం చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎన్నికల అధికారులు తొలగించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని శ్రీపురంధరపురం గ్రామానికి 1970లో శ్రీహరికోట (షార్) నుంచి 200 గ్రామాలు పునరావాసం కింద వచ్చాయి. ఆ సమయంలో వీరి భూములు, నివాసాలు మొత్తం తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా శ్రీపురంధర పురంలో స్థలాలను, భూములను కేటాయిస్తామని తెలిపింది. అయితే వారికి భూముల విషయంలో న్యాయం జరగలేదని ఇప్పటి వరకు వారు పోరాడుతూనే ఉన్నారు. ఎన్నికలు గ్రామంలో వద్దని.. 2012 ఉప ఎన్నికల్లో శ్రీపురంధపురం గ్రామస్తులు ఎన్నికలను బాయ్‌కాట్ చేశారు. తమకు అన్యాయం జరిగిందని , అందుకే ఎన్నికలు తమ గ్రామంలో వద్దని చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి న్యాయం చేస్తామని, ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఏమీ చేయలేమని చెప్పారు. గ్రామస్తులకు సర్దిచెప్పి ఎన్నికలు నిర్వహించారు. న్యాయం చేసిన వారికే మద్దతు తమకు ప్రతిసారి ఎన్నికల సమయంలో వాగ్దానం తప్ప న్యాయం జరగలేదని గ్రామస్తులు అంటున్నారు. ఈ మేరకు తాము ఓట్లను అమ్ముకోమని, జీఓ నంబరు 1024 ప్రకారం తమకు రావాల్సిన ఎకరా భూమి ఇప్పించదలచిన వారికే మా మద్దతు అని గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలిసి దానిని తొలగించారు. అయితే గ్రామస్తులు మాత్రం తమకు న్యాయం చేసిన వారికే అండగా ఉంటామని అంటున్నారు. -
కాంగ్రెస్ ‘ఎమ్మెల్సీ’ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ తరఫున గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కలు సోమవారం ప్రక టించారు. సంఖ్యాపరంగా తమకు ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మంగళవారం జరిగే పోలింగ్‌కు దూరం గా ఉండాలని, ఎవరూ ఓటేయొద్దని భట్టి విక్రమార్క విప్ జారీ చేశారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. సీఎం తీరుపై హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించింది. ఆ ఐదుగురు ఏం చేస్తారు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ను బహిష్కరించాలని కాంగ్రెస్ విప్ జారీ చేసిన నేపథ్యంలో.. టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయిన ఆ ఐదుగురు ఎమ్మె ల్యేలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తు తం కాంగ్రెస్ పక్షాన ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే.. మిగిలిన ఎమ్మెల్యేలు పోలింగ్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫలితంలో మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు ఓటేయకపోయినా ఐదుగురు అధికార పక్ష ఎమ్మెల్యేల విజయం దాదాపు ఖాయమే. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు కేసీఆర్ బాటలో పయనిస్తామని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రకటించిన వారు కూడా అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరనున్న ఎమ్మెల్యేలు ఓటేసిన పక్షంలో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించినట్టవుతుంది. తద్వారా చట్టపరమైన చర్యలకు ఊతమిచ్చినట్టవుతుంది. దీంతో ఈ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు రాకపోవచ్చనే తెలుస్తోంది. కానీ, కేసీఆర్ తన∙బలాన్ని చాటు కునేందుకు, ఆసక్తికర నిర్ణయాలు తీసుకునేందుకు ముందు వరుసలో ఉంటారనేది బహిరంగ రహస్య మే. దీంతో తన పక్షానికి వస్తున్నట్టు ప్రకటించిన వారిని కూడా పోలింగ్‌లో పాల్గొనాలని ఆదేశాలిచ్చి నా ఆశ్చర్యం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు ప్రకటించిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడు తూ.. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని, అవసరమైతే పోలింగ్‌లో పాల్గొనేందుకు కూడా వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం. -
ఎన్నికలను బహిష్కరించిన ‘కొయ్యలగూడెం’
చౌటుప్పల్ (మునుగోడు) : చేనేత వస్త్రాల తయారీకి పెట్టిన పేరుగా నిలిచిన మండలంలోని కొయ్యలగూడెం గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా కులమతాలు, వర్గ విభేదాలకు తావు ఇవ్వకుండా ఏకతాటిపై నిలిచారు. అందరు కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుపడ్డారు. గతేడాది జరిగిన నూతన గ్రామపంచాయతీల విభజన సమయంలో కొయ్యలగూడెం గ్రామానికి అ న్యాయం జరిగిందని.. గ్రామపంచాయతీ ఎన్ని కలను బహిష్కరించాలని ఈనెల 7న నిర్ణయిం చారు. ఏ ఒక్కరూ కూడా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రభుత్వానికి తమ నిరసనను తెలి యపర్చాలని తీర్మాణించారు. అధికారులు నచ్చజెప్పినా తలొగ్గకుండా పంతాన్ని నెరవేర్చుకున్నారు. చౌటుప్పల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యలగూడెంలో ఆ గ్రామంతో పాటు ఎల్లంబావి, జ్యోతినగర్, గజ్జెలోనిబావి గ్రామాలు ఉండేవి. పంచాయితీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా 4600 జనాభా, 2837 మంది ఓటర్లు ఉండేవారు. గతేడాది ఈ గ్రామపంచాయతీ నుంచి ఎల్లంబావి, జ్యోతినగర్‌ను వేరు చేశారు. 1287 మంది జనాభా, 976 మంది ఓటర్లతో కలిపి నూతనంగా ఎల్లంబావి పేరిట గ్రామపంచాయతీని ఏర్పాటైంది. ముందుగా అధికారులు చేసిన మార్కింగ్ ప్రకారంగా కాకుండా అకస్మాత్తుగా మరో మార్కింగ్‌తో విభజించి గెజిట్‌ను పూర్తిచేశారు. ఇక అప్పటి నుంచి గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయం గురించి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయో తప్ప ఫలితం మాత్రం దక్కలేదు. విభజనతో ఆగమైన కొయ్యలగూడెం.. విభజనతో కొయ్యలగూడెం గ్రామం పూర్వపు తన ఆనవాళ్లను కోల్పోయింది. గతేడాది మార్చిలో జరిగిన ప్రక్రియలో ఎల్లంబావికి 13–57, 701–705, 438, 441, 473, 708 సర్వే నంబర్లే కేటాయించాలి. కానీ ఆ తర్వాత జరిగిన తతంగంతో అధనంగా 10, 694, 695, 696, 697, 698, 699, 700 సర్వే నంబర్లను కేటాయించారు. 1,287 మంది జనాభా ఉన్న ఎల్లంబావికి 650ఎకరాలను కేటాయించారు. 2,313 మంది జనాభా కలిగిన కొయ్యలగూడెం గ్రామానికి మాత్రం 700 ఎకరాల రెవెన్యూని మాత్రమే కేటాయించారు. దీంతో కొయ్యలగూడెం గ్రామంలోనికి వెళ్లే ప్రధాన రహదారి, కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న శ్మశాన వాటిక కూడా ఎల్లంబావి పరిధిలోకి వెళ్లింది. విఫలమైన అధికారుల ప్రయత్నాలు ఎన్నికల్లో గ్రామస్తులతో నామినేషన్లు వేయించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని కొంత మందికి బరోసా ఇచ్చారు. అందులో భాగంగా డి.నాగారం క్లస్టర్ వద్ద ఏసీపీ బాపురెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చిల్లా సాయిలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏదో జరుగుతుందని పసిగట్టిన కొయ్యలగూడెం గ్రామస్తులు ఎవరూ నామినేషన్లు వేయకుండా గస్తీ నిర్వహించారు. క్లస్టర్ వద్ద కాపుకాశారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో గ్రామం నుంచి ఎలాంటి నామినేషన్ దాఖలవ్వలేదు. ప్రయత్నాలు విఫలమవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. బహిష్కరించాలని నిర్ణయం.. తమకు జరిగిన అన్యాయంపై సుమారు 7 నెలలుగా గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు. అయినా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, మరో వైపు ప్రజాప్రనిధులు కనీసం స్పందించలేదు. దీంతో తమ నిరసన తీవ్రస్థాయిలో ఉండాలని గ్రామస్తులంతా భావించారు. అందులో భాగంగా ఈనెల 7న సమావేశమై పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ మాటకు ప్రజలంతా కట్టుబడ్డారు. -
ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు మరోసారి కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగునున్న ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మావోయిస్టులు అత్యంత ప్రభావిత ప్రాంతమైన బీజాపుర్ జిల్లాలో శుక్రవారం ఈ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకూడదని.. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ బ్యానర్లు కట్టారు. కాగా ఇటీవల జరిగిన అరకు టీడీపీ నేతల జంట హత్యల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలు ఇప్పటికే హైఅలర్టు ప్రకటించాయి. ముఖ్యంగా ఎన్నికలు జరుగునున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు గతంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భధ్రతా దళాలను మోహరించనుంది. కాగా డిసెంబర్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా అసెంబ్లీలో ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. -
సాగునీటి సంఘం ఎన్నికల బహిష్కరణ
శ్రీకాకుళం(ఎల్‌ఎన్‌పేట): ఎల్‌ఎన్‌పేట మండలం వాడవలస గ్రామంలో ఆదివారం సాగునీటి సంఘం ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలోని రావిగడ్డ చెరువుకు సంబంధించి ప్రభుత్వం గ్రామస్తుల నుంచి శిస్తు వసూలు చేస్తూ ఉంది. శిస్తు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వాడవలస గ్రామస్తులు 1997 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది సాగునీటి సంఘం ఎన్నికలను బహిష్కరిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఈ ఎన్నికలను బహిష్కరించారు. -
ఎన్నికల్లోనే మేము గుర్తుకొస్తామా?
నక్కారామేశ్వరం(అల్లవరం), న్యూస్‌లైన్ :ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులు, అధికారులు మా గ్రామం వస్తారు తప్ప మిగిలినకాలంలో మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని అటువంటప్పడు మేమెందుకు ఓట్లు వేయాలంటూ అల్లవరం మండలం నక్కారామేశ్వరం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల సమయంలోనే నేతలకు తాము గుర్తుకువస్తున్నామని ఓట్లు వేశాక తమను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతూ పార్టీలకు అతీతంగా గ్రామస్తులు నిర్ణయించుకుని బుధవారం ఎన్నికలను బహిష్కరించారు. కొమరగిరిపట్నం పంచాయతీ పరిధిలోని తీర ప్రాంతంలో ఓ దీవిలా దూరంగా విసిరివేసినట్టుంటుంది మత్స్యకార గ్రామం నక్కారామేశ్వరం. అక్కడ సుమారు రెండు వేల ఐదువందలకుపైగా జనాభా నివాసముంటున్నారు. ఈ శివారు గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పన, రహదారుల అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. గ్రామంలో ఉన్న 1100 వందల ఓటర్లలో మూడువందల మంది ఓటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలోని ఎస్. పల్లెపాలెం గ్రామంలోనూ, మరో రెండొందల మంది ఓటర్లు మూడుకిలోమీటర్ల దూరంలోని కొమరగిరిపట్నంలోని మిలటరీ కాలనీ పోలింగ్ బూత్‌లలో ఓటు వేస్తున్నారు. మిగిలినవారు మాత్రమే గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్‌లో ఓట్లు వేస్తున్నారు. అయితే బుధవారం ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసిన తరువాత గ్రామస్తులంతా ఏకమై పార్టీలకు అతీతంగా ఎన్నికలను బహిష్కరిద్దామని నిర్ణయించుకున్నారు. తాగేందుకు మంచినీరు నాలుగు రోజులకోసారి ఇస్తున్నారని, గ్రామంలో రహదారులు నిర్మించలేదని, గ్రామస్తులం అంతా గ్రామంలోనే ఓటు వేసుకునే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ అవి నెరవేరుస్తామని అధికారులు హామీ ఇచ్చిన తరువాతే ఓట్లు వేస్తామంటూ బీష్మించారు. తమ సమస్యలపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఐ ఎన్.అంజనీ, తహశీల్దార్ జి. మమ్మీ, ఎంపీడీఓ ఉషారాణిలు అక్కడకు చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. మేమెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని లేకుంటే బహిష్కరిస్తామంటూ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఏవిధమైన హామీలు ఇవ్వకూడదని మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తామని అధికారులు వారికి నచ్చజెప్పారు. ఓటు వేయడం మానవద్దని అది మీహక్కని, సమస్యల పరిష్కారానికి ఆందోళన చేయడానికి ఇది సమయం కాదని అధికారులు గ్రామస్తులకు నచ్చచెప్పడంతో వారు ఓట్లు వేసేందుకు అంగీకరించి పదకొండున్నర సమయంలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎన్నికలను బహిష్కరించండి: మావోయిస్టులు
రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. నాయకులు ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వస్తే, వాళ్లను అడ్డుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ) స్పెష్ల జోన్ కమిటీ ప్రతినిధి దయా పేరున పోస్టర్లు వెలిశాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల కోసం వెళ్తున్న భద్రతా బలగాల మీద మావోయిస్టులు దాడులు చేసి ఒకే సంఘటనలో 15 మందిని హతమార్చడం, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి.