
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రమంతటా ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఒక గ్రామం
మాత్రం ఎన్నికలను బహిష్కరించింది.
జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
ఏడు పర్యాయాలు
తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , ప్రభుత్వాలు, అధికారుల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం నుంచి ఒక్క గ్రామస్థుడు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్ బూత్ వెలవెలబోయింది. అక్కడి అధికారులు తప్ప ఓటర్లలెవరూ కనిపించలేదు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment