Brain chip
-
న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ప్రయోగం సక్సెస్
బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ రెండవ ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని, మొదటి సారి తలెత్తిన సమస్యలేవీ ఇప్పుడు ఎదురుకాలేదని కంపెనీ తెలిపింది.న్యూరాలింక్ మొదటి ఇంప్లాంట్‌ను నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తికి గత జనవరిలో అమర్చారు. అయితే శస్త్రచికిత్స తర్వాత ఇంప్లాంట్‌కు సంబంధించిన అత్యంత సూక్ష్మమైన ఎలక్ట్రోడ్ వైర్లు మెదడు నుంచి బయటకు వచ్చాశాయి. ఫలితంగా మెదడు సంకేతాలను అంచనా వేయడంలో సమస్య ఏర్పడింది. తర్వాత దీన్ని పరిష్కరించినట్లు న్యూరాలింక్ పేర్కొంది. కాగా జంతువులపై నిర్వహించిన ట్రయల్స్‌లోనే న్యూరాలింక్‌కు ఈ సమస్య గురించి తెలుసని రాయిటర్స్ నివేదించింది.ఇలాంటి సమస్య రెండవ రోగిలో పునరావృతం కాకుండా నివారించడానికి శస్త్రచికిత్స సమయంలో మెదడు కదలికను తగ్గించడంతోపాటు ఇంప్లాంట్, మెదడు ఉపరితలం మధ్య గ్యాప్‌ను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. రెండవ రోగికి న్యూరాలింక్ ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చింది. వీడియో గేమ్‌లు ఆడటానికి, త్రీడీ వస్తువులను ఎలా రూపొందించాలో తెలుసుకోవడానికి ఈ బ్రెయిన్ చిప్‌ను ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. -
తొలిసారిగా మానవ మెదడులో విజయవంతంగా చిప్ ఇంప్లాంటేషన్!
నేరుగా మనుషుల మెదడులోకి చిప్‌ని ప్రవేశపెట్టే ప్రయోగాలకు టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే ఈ ప్రయోగం ఉద్దేశం. అమెరికా ప్రభుత్వ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి ఈ అనుమతి లభించడంతో ఈ సరికొత్త ఆవిష్కరణకు నాందిపలికింది ఇలాన్ మస్క్ స్టార్ట్ప్ కంపెనీ న్యూరాలింక్. తొలుత కోతుల మెదడులో ఈ చిప్ అమర్చి ప్రయోగాలు చేయగా, అవి సత్ఫలితాలు ఇవ్వడంతో మానవులపై ప్రయోగాలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఓ రోగి బ్రెయిన్లో న్యూరాలింక్ తొలిసారిగా వైర్లెస్ బ్రెయిన్ చిప్‌ని అమర్చింది. ఈ విషయాన్ని ఇలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. సదరు రోగి కూడా కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ చిప్ ఇంప్లాంటేషన్ చిన్నపాటి సర్జరీ అమర్చుతారు . 'ఇన్వాసిస్' అనే సర్జరీ ద్వారా మెదడులో ఐదు నాణేలతో పేర్చబడినట్లు ఉండే చిప్‌ని అమర్చినట్లు న్యూరాలింక్ పేర్కొంది. ఇది లింక్ అనే ఇంప్లాంట్ ద్వారా పనిచేస్తుంది. మస్క్ కంపెనీ చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలిస్తే బ్రెయిన్ మెషిన్ లేదా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రీసెర్చ్‌లో గొప్ప పురోగతి లభించినట్లు అవుతుంది. దీనివల్ల నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా ఈ ప్రయోగంతో 'మానవాతీత శక్తి'ని పొందగలుగుతాం. అంతేగాదు ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యితే గనుక మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేపినట్లు అవుతుంది. మెదడులో చిప్ అమర్చేది ఇలా.. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు. చిప్‌ను సురక్షితంగా, అత్యంత కచ్చితత్వంతో, చిన్నపాటి సర్జరీతో నేరుగా అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను 'న్యూరాలింక్' అభివృద్ధి చేసింది. చిప్‌లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జి అవుతుంది. అందువల్ల దీన్ని ధరించినవారు సాధారణంగానే కనిపిస్తారు. కంటికి చేసే లేసిక్ సర్జరీ తరహాలో భవిష్యత్‌లో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో బీసీఐ(బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ చిప్)లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాలని మస్క్ భావిస్తున్నారు. ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తోంది. పనిచేసేది ఇలా.. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి ఎన్1 చిప్‌కు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది. కలిగే ప్రయోజనాలు.. న్యూరాలింక్ బీసీఐ చిప్ .. మానవులు, కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తుంది. ఆలోచనశక్తి ద్వారా.. తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్‌లో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులువుగా ఉపకరణాలను ఉపయోగించగలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వీలుంది. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం వాడొచ్చు. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని కూడా నియంత్రించొచ్చు. కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటి చూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు. అంతేగాదు సుదీర్ఘ భవిష్యత్‌లో దీనివల్ల ‘మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం’ (సూపర్ హ్యూమన్ కాగ్నిషన్) సాధించడమే తమ లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని స్పష్టంచేస్తున్నారు. అవసరమైతే ఏఐతో 'సురక్షిత సహజీవనం' చేయడానికీ ఇది సాయపడుతుందని కూడా చెబుతున్నారు. (చదవండి: షుగర్‌ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?) -
ఎలాన్ మాస్క్ మరో సంచలం ...బ్రెయిన్‌లోకి చిప్
-
Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్
మనిషి మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టే కీలక ప్రాజెక్టులో ఎలాన్‌మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌కు అమెరికా రెగ్యులేటరీ కీలక అనుమతి లభించింది. ఈ విషయాన్ని న్యూరాలింక్ స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దీనిపై ట్విటర్లో అభినందనలువ వెల్లువెత్తుతున్నాయి. ఇదీ చదవండి: మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్ తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఎఫ్‌డీఏ మోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. చాట్‌జీపీటి కంటే మనుషులకు ఎక్కువ అవసర మైందంటూ ట్వీపుల్ వ్యాఖ్యానించారు. ఒక కొడుకుకు తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను. అభినందనలు అని ఒకరు, నా కొడుకు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఈ ఏడాదిలో ఉన్న అత్యుత్తమ వార్త అంటూ మరో వినియోగదారుడు న్యూరాలింక్‌ను అభినందించారు. అయితే మానవ మెదడు లోపల చిప్‌లను అమరిక, ప్రయోగాలపై వ్యతిరేక వ్యాఖ్యలున్నప్పటికీ ఈ ట్రయల్స్‌కు నన్ను ఎంచుకోండి అంటూ ఒక యూజర్ మస్క్‌కు విజ్ఞప్తి చేయడం విశేషం. I would like to be the first few people to get it I know all the risks and would sign anything needed 🙏 in 1999 I had a dream of a man that said he used neuralink to be in my dream he also told me about Starship it took 24 years to wait for this they are connected somehow… — Bradley P.R Gannon (@statehood101) May 25, 2023 @neuralink Congratulations on getting the FDA's approval! Hope the first-in-human clinical study goes better than the last time humans were used as test subjects for a first-in-human experiment. — Shing ha (@ReplyGPT) May 26, 2023 ఈ అద్భుత ప్రయోగంలో పాల్గొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను! అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. దాదాపు ఇదే ఆసక్తిని మరొకరు ప్రదర్శించగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్ కోసం రిక్రూట్మెంట్ ఇంకా మొదలు పెట్టలేదనీ, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలో ప్రకటిస్తామని న్యూరాలింక్ సమాధాన మిచ్చింది. మరిన్ని ఇంట్రస్టింగ్వార్తలకోసం చదవండి సాక్షి బిజినెస్ -
మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, ముంబై: టెస్లా అధినేత మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. నేరుగా మనుషుల మెదడులోకి చిప్‌ను (Chip In Brain) ప్రవేశ పెట్టే ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి అనుమతి లభించిందని ఎలాన్ మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇన్-హ్యూమన్ క్లినికల్ స్టడీకి సంబంధించి అనుమతో మరో చారిత్ర ప్రయోగానికి నాంది పడనుంది. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్నవారిని వాలంటీర్లుగా ఎంపిక చేసి ప్రయోగాలు చేపట్టనుంది. ఇది ముఖ్యమైన ముందడుగు. తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఆమోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేసింది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) కాయిన్ సైజ్ (అంచనా) చిప్‌ను కోతుల మెదడులో అమర్చి ఇప్పటికే ప్రయోగాలు చేసింది సంస్థ. ఈ ఫలితాలతో రూపొందించిన నివేదికలను న్యూరాలింక్ కంపెనీ ఎఫ్‌డీఏ ముందుంచింది. వీటిని పరిశీలించిన రెగ్యులేటరీ బ్రెయిన్ చిప్ వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ ) కాగా గత ఏడాది డిసెంబర్లో న్యూరాలింక్ డివైస్ పరీక్షలకు సిద్ధంగా ఉందని మస్క్ వెల్లడించాడు. పందులు, కోతులపై ప్రయోగాల తరువాత క్లినికల్ ట్రయల్స్ చేయాలని భావించాడు. కానీ మార్చి 2023లో భద్రతా ప్రమాదాల రీత్యా మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగాలపై న్యూరాలింక్ అభ్యర్థనను ఎఫ్‌డీఏ తిరస్కరించింది. పక్షవాతం, అంధత్వం వంటి తీవ్రమైన వ్యాధులకు బ్రెయిన్ చిప్ ద్వారా సాధ్యమవుతుందని న్యూరాలింక్ విశ్వసిస్తోంది. మెదడు ఇంప్లాంట్ మానవ పరీక్షల కోసం 2019 నుండి మస్క్ వెయిట్ చేస్తున్నాడు. ఏఐని తీవ్రంగా వ్యతిరేకించే మస్క్ దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెబుతున్న సంగతి తెలిసిందే. (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) న్యూరాలింక్ న్యూరాలింక్ అనే న్యూరోటెక్నాలజీ కంపెనీని 2016లోమస్క్ స్థాపించాడు. మానవమెదడు, కంప్యూటర్లు లేదా ఇతర బాహ్య పరికరాల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేలా ఇంప్లాంటబుల్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను (BCIలు) అభివృద్ధి చేయడం దీని ప్రాథమిక లక్ష్యం. మానవ మేధస్సును కృత్రిమ మేధస్సుతో విలీనం చేయడం ద్వారా మానవ జ్ఞానాన్ని మెరుగుపరచడం , నాడీ సంబంధిత రుగ్మతలను సమర్థవంతంగా ఎదుర్కోవడం. ఇలాంటి మరెన్నో విశేషమైన వార్తలు, అప్డేట్స్ కోసం సాక్షిబిజినెస్ చదవండి: Congratulations Neuralink team! https://t.co/AWZGf33UDr — Elon Musk (@elonmusk) May 26, 2023 -
అద్భుతం.. మైండ్‌తో ట్వీట్ చేసిన తొలి వ్యక్తి
Paralysed man becomes worlds first person: పక్షవాతం గురించి మనందరికి తెలిసిందే. శరీరంలో ఏ భాగానికి పక్షవాతం వస్తుందో ఆయా భాగాలు చచ్చుబడిపోవడమే కాకుండా కదిలించలేరు. ఒక్కొసారి ఆ పరిస్థితి చాలా దయనీయంగా కూడా ఉంటుంది. అయితే పక్షవాతంతో శరీరం అంతా చ్చుబడిపోయి కదలకుండా ఉన్నవ్యక్తి తన మనసుతో ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఎలా ట్విట్ చేశాడని ఆలోచించేయకండి.! (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ ఓకీఫ్ వేళ్లతో కాకుండా మొదడును మాత్రమే ఉపయోగించి ట్వీట్ చేశాడు. అంటే అతను మెదడు కంప్యూటర్‌కి కనక్ట్ అవ్వడంతో తన ఆలోచనలకు అనుగుణంగా సందేశం కంప్యూటర్లో టైప్ అవుతుంది. నిజానికి ఫిలిప్ 2015 నుండి అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏఎల్ఎస్)తో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితి కారణంగా అతను శరీరం అంతా పక్షవాతానికి గురై కదలకుండ చచ్చుబడిపోయింది. అయితే కాలిఫోర్నియాకు చెందిన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ ఇలాంటి వ్యక్తులు తమ మనసుతో కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగేలా ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ 62 ఏళ్ల ఫిలిప్ మొదడుని కంప్యూటర్‌కి అనుసంధినిస్తూ పేపర్క్లిప్ పరిమాణంలో ఉండే సింక్రోన్ స్టెంట్రోడ్ అనే మైక్రోచిప్‌ని అమర్చింది. దీంతో అతని మెదడుకు సంకేతాలను అందజేసే చిన్నమొదడు ఆలోచనలను ఈ ఇంప్లాంట్ మైక్రోచిప్ చదివి టెక్స్ట్(సందేశంగా) రూపొందిస్తుంది లేదా అనువదిస్తుంది. అయితే ఫిలిప్‌కి ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ సాంకేతికతో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువుగా ఫిలిప్ 'హలో వరల్డ్' అనే సందేశాన్ని ట్విట్ చేశాడు. ఈ ట్విట్ కారణంగా ఫిలిప్ ప్రపంచంలోనే ఆలోచన ద్వారా నేరుగా సోషల్ మీడియా సందేశాన్ని విజయవంతంగా పోస్ట్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అంతేకాదు ఇది మొదటి ప్రత్యక్ష-ఆలోచన ట్వీట్‌గా కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో ఫిలిప్ మాట్లాడుతూ..." ఈ సాంకేతికత గురించి మొదటిసారిగా విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అంతేకాదు ఈ సాంకేతికతను వినియోగించాలంటే కొంత సాధన కూడా అవసరం. ఇక ఇప్పుడు నేను కంప్యూటర్లో ఎక్కడ క్లిక్ చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అంతేకాదు ఈమెయిల్, షాపింగ్, బ్యాంకింగ్ వంటి పనుల్ని కంప్యూటర్లో చేయగలను " అని అన్నారు. (చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి) -
మెదడును కంప్యూటర్‌తో అనుసంధానం..
ఇప్పుడున్న టెక్నాలజీ రంగంలో మనిషి ఆలోచనలు కూడా సూపర్‌ఫాస్ట్ అయిపోయాయి.అయితే మన ఆలోచనలు ఆచరణ రూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది. లైట్ వేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాలి.. లేదంటే రిమోట్నైనా వాడాలి. కానీ ఇవేవీ లేకుండా మీరు మనసులో ఓ మాట అనుకోవడమే తడవు పనులు జరిగిపోతే ఎలా ఉంటుంది. అబ్బో ఊహించలేనన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి! ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విభాగం డార్పా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘నెక్ట్స్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరో టెక్నాలజీ ప్రోగ్రాం’పేరుతో ఈ సరికొత్త ప్రాజెక్టుకు ఏడాది క్రితమే శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
మనమూ ‘చిప్’మాన్ అవొచ్చు!
- ‘బ్రెయిన్ చిప్’కు అమెరికా న్యూరోసైంటిస్టు రూపకల్పన - చిప్‌తో దీర్ఘకాల జ్ఞాపకశక్తి కాలిఫోర్నియా: మనుషుల శరీరాల్లో చిప్‌లను అమర్చి వారితో అద్భుతాలు సృష్టించటాన్ని హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం. దీన్ని నిజం చేసే దిశగా.. జ్ఞాపకాలను దీర్ఘకాలం పదిలంగా ఉంచే ‘బ్రెయిన్ చిప్’కు కాలిఫోర్నియా వర్సిటీ న్యూరోసైంటిస్టు థియోడర్ బర్జర్ రూపకల్పన చేశారు. దీన్ని కోతులు, ఎలుకలపై విజయవంతంగా పరీక్షించారు. మరికొన్ని పరీక్షలు చేసి.. మార్కెట్లోకి అందుబాటులోకి తేచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అల్జీమర్స్‌పై ప్రయోగంతో మొదలై.. మతిమరపు(అల్జీమర్స్) బాధితులను ఆదుకోవాలనే సంకల్పంతో 20 ఏళ్ల క్రితం బర్జర్ ప్రయోగం మొదలైంది. ఇందులో భాగంగానే మెదడు మార్పిడి చికిత్సపైనా వివిధ ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల నుంచి పుట్టిందే ‘బ్రెయిన్ చిప్’. మూర్ఛ వ్యాధిగ్రస్తులపై ఈ చిప్‌ను పరీక్షిస్తున్నారు. ప్రాథమికంగా మనుషులపైనా మంచి ఫలితాలొస్తున్నాయని బర్జర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ రూ 655 కోట్లు. ఈ చిప్‌లో ఉండే సాఫ్ట్వేర్.. స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాల జ్ఞాపకాలుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం మెదడు సంకేతాల ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను యూనిక్కోడ్గా మారుస్తుంది. ఇదంతా సహజంగా దీర్ఘకాల జ్ఞాపకాలను గుర్తుంచుకునే పద్ధతిలోనే కొనసాగుతుంది. కావాల్సినపుడు క్షణాల్లోనే ఆ జ్ఞాపకాలను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో తిరిగి మెదడుకు అందిస్తుంది.