brightness
-
ప్రకాశం కరువైన వికాసం
రెండో మాట ‘‘ఇటీవల అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ గెలిచింది ఒకే ఒక్క రాష్ట్రం (అసోం)లో కాగా, మిగతా రాష్ట్రాల ఫలితాలను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఆ పార్టీ సాహసించింది. రెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేసుకుంటోంది.’’ - ఎన్డీఏ భాగస్వామి శివసేన (22.5.2016). గంగలో మునిగిపోతున్నవాడు గడ్డిపోచను ఆసరా చేసుకున్నట్టు ఈశాన్య భారతంలో ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఆపద్ధర్మ ఐక్య సంఘటన ఆసరాతో అధికారంలోకి వచ్చిన బీజేపీ-ఆరెస్సెస్ పరివారం మిగతా నాలుగు రాష్ట్రాలలో చతికిలపడినా ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు పాకి వచ్చే వ్యూహాన్ని వదులుకోలేదు! ఇందులో భాగంగానే అది అత్యంత వివా దాస్పద విధానాల ద్వారా, సమాజాన్ని చీలుబాట్ల వైపు నడిపించే వ్యూహం ఫలితంగా వ్యవస్థ ‘గాయపడక’ తప్పని స్థితిలో తన రెండేళ్ల పాలనా రథాన్ని నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ ఉత్సవాలను జరుపుకునే ప్రయత్నంలో ఎన్నో అబద్ధాలకు, పొంతనలేని ప్రకటనలకూ మోదీ ప్రభుత్వం ఒడిగట్టింది. ప్రభుత్వం జరుపుకునే విజయోత్సవాలకు బలమైన పునాది ఉండాలి. ఆ ప్రభుత్వం విభిన్న మతధర్మాలు, భాషాసంస్కృతులు, బహుళ జాతుల, మైనారిటీల, ఆదివాసీ తెగల, దళిత బహుజనుల విశాల ప్రయోజనాలను సంరక్షించగల సెక్యులర్ వ్యవస్థకు అండదండలు అందించగల ప్రజాస్వామిక పునాదిపైన మనుగడ సాగించగల ప్రభుత్వంగా ప్రజా బాహుళ్యం భావించాలి. ఈ సందర్భంగా పండిత మదన్మోహన్ మాలవ్యా ‘జాతీ యత’కు ఇచ్చిన విశిష్టార్థాన్ని గుర్తించటం అవసరం. ‘భారత ప్రజలమైన మనం - అంటే హిందువులు, ముస్లిములు, పార్శీలు, క్రైస్తవులు ప్రపంచం లోని మహా ప్రాచీన నాగరికతలకు వారసులైన వీరంతా కలిపే భారత ప్రజలని మరవరాదు’. ఇప్పుడా భావనను చెదరగొట్టే యత్నాలకు ఎన్డీఏ పాలనలో యత్నాలు పెచ్చరిల్లడం వల్ల ఇంతకుముందెన్నడూ లేనంతగా (గాంధీజీ హత్య ఉదంతాన్ని మినహాయిస్తే) గత రెండేళ్ల కాలంలో దేశ వ్యాపితంగా అభద్రతాభావం ఏర్పడింది. మాట మారుస్తున్న మోదీ ఒక్క మూడు మాసాల వ్యవధిలోనే బీజేపీ నాయకుల నాలుకలు తిరగబడిపోయాయి. అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ పదవీ స్వీకరణో త్సవంలో మోదీ మాట్లాడుతూ ‘దేశాన్ని అభివృద్ధి చేయడంలో ఇంతకు ముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పాత్ర వహించాయని’ కితాబిచ్చారు (25.05.16). కానీ మూడు నెలలనాడే పార్లమెంటులో ‘దేశంలో దారిద్య్రాన్ని పెంచే మొక్కలను కాంగ్రెస్ నాటింద’ని మోదీ చెప్పారు. నిజానికి ఇన్నాళ్లుగా కాంగ్రెస్ (యూపీఏ)గానీ, తర్వాత బీజేపీ (ఎన్డీఏ) పాలకులుగానీ ‘అభివృద్ధి’ నినాదం చాటున అవినీతితి పెంచుతూ వచ్చారు. ‘హిందుత్వ’ నినాదం చాటున ఈ రాజకీయ కేంద్ర పాలనను చాటు చేసుకుని హేతువాద సంస్థల పైన, ఆర్టీఐ చట్టం కింద పాలక పక్షాల నాయకుల, సభ్యుల అవినీతికర చర్యలను బయటపెడుతున్న సామాజిక కార్యకర్తలపైన వేధింపులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి! ‘ప్రజాధనం దోపిడీని, అవినీతిని నిలవరించేశాం’ అని రెండేళ్ల ‘ప్రోగ్రెస్ చిట్టా’లో మోదీ ప్రకటించారు గానీ, ఆచరణలో బ్యాంకులు, జీవిత బీమా సంస్థలలో ప్రజల సొమ్మును దోపిడీ చేసి, మొండి బకాయిల కింద లక్షల కోట్ల రూపాయలను దిగమింగి ఉడాయించిన విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలపై తీసుకున్న నిర్దిష్ట చర్యల గురించి, రాబట్టుకొన్న ‘బ్లాక్‌మనీ’ విలువ ఎంతో చెప్పడంలో విఫలమయ్యారు! లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటివారు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా దోచుకుని దేశం విడిచిపోతే, మనం వేలు విడిచిన ‘బ్రిటిష్ మామ’ అక్కున చేర్చుకుని ‘మాల్యా మా పౌరుడు’ అతడిని ముట్టుకోడానికి వీల్లేదు, మీ ఇంటర్‌పోల్ కూపీలు ఇక్కడ చెల్లవని దండోరా వేస్తే - ఈ రెండేళ్లలోనూ మోదీ ప్రభుత్వం నోరు మెదపలేని దుస్థితి! కానీ మోదీ ‘వికాస పురుషుడు’ కాడని విమర్శించిన ఉమాభారతి మోదీ మంత్రిమండలిలోనే కొనసాగు తున్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులూ కొనసాగుతున్నారు. అన్నిటా వైఫల్యాలే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 1200 పాత చట్టాలను సవరించడమో, తొలగించడమో జరిగిందని మోదీ ప్రకటించుకున్నారు. అదే చేత్తో ప్రశ్నించే న్యాయవ్యవస్థపై కన్నెర్ర చేస్తున్నారు. పౌరహక్కుల్ని, రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్ని, బాధ్యతలను గుర్తుచేసే ప్రజానుకూల నిబంధనలను కాలరాస్తూ ‘దేశద్రోహం’ పేరిట పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసే సెడిషన్ చట్టాన్ని తొలగించలేదని మరచిపోరాదు! అలాగే బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం భారతదేశంలో అన్ని శాఖలలో సామ్రాజ్య రక్షణ కోసం సాగు భూములపైన ఉన్న హక్కుల్ని అణచివేసి, భూములను బలవంతాన గుంజుకోడానికి తెచ్చిన చట్టాన్ని కూడా మోదీ ప్రభుత్వం తొలగించలేదు. సరికదా విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు భూమిని కట్టబెట్టడానికి ‘భూ సేకరణ’ సమీకరణకు వీలుగా రైతాంగాన్ని బలవంత పెట్టగల బిల్లును ప్రవేశ పెట్టడమూ ఈ రెండేళ్లలోనే జరిగింది! వ్యవసాయోత్పత్తులను బలవంతుల జూదగొండితనానికి కేంద్రమైన షేర్ (స్టాక్) మార్కెట్లో అనుమతించడాన్ని మోదీ ప్రభుత్వం నిషేధించలేక పోయింది. దేశవాళీ సంతల్లో దళారీలను తొలగించి వ్యవసాయోత్పత్తులకు రక్షణ కల్పించలేక పోయింది. ఇక ఆర్థిక రంగం చూద్దాం. ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్క రణల ప్రభావం మన్మోహన్ సింగ్ హయాంలోకన్నా మరింతగా దేశీయ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తోంది. రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరికలను లెక్కజేయకుండా తగాదాలు పడినంత మాత్రానగాని, సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు ఆయనను తొలగించి పారేయమని సలహాలిచ్చినంత మాత్రానగాని అమెరికా తాఖీదులపై నడిచే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్. సంస్థల ప్రభావంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ సంక్షోభాల ఊబినుంచి బయటపడే అవకాశం లేదు. ఇది మోదీకి తెలుసు. పెట్టుబడిదారుల్ని ‘వాస్కోడిగామాలై తరలిరండి’ అని ఆహ్వాన పత్రాలు పంచిన మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే మన దేశీయులే స్వయంగా సరుకులు ఉత్పత్తి చేయాలని కోరుతున్నారా? లేక ‘వాస్కోడిగామాలై తరలివచ్చే విదేశీ గుత్త పెట్టుబడిదారులు ఇండియాకు వచ్చి సరుకులు తయారుచేసి పెట్టమని’ చెబుతున్నారా అన్నది తేలడం లేదు! బ్యాంకులు సహా భారత పరిశ్రమలలోకి 29 శాతం నుంచి 49 శాతానికి విదేశీ గుత్త పెట్టుబడులను అనుమతించిన మన్మోహన్ సింగ్‌ను ప్రధాని మోదీ ఇప్పుడు వెనక సీటులో కూర్చోబెట్టి, ‘దేశాభివృద్ధికి విదేశీ గుత్త పెట్టుబడులను 49 శాతం నుంచి 100 శాతానికి పెంచితేగాని ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి న్యాయం చేయలేమనుకున్నట్టున్నారు. ప్రజల కష్టార్జితాలుగా వెలుగు చూస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను దేశ, విదేశీ గుత్తేదారి సంస్థలకు అయినకాడికి ధారాదత్తం చేసే మార్గంలో ముందుకు వేగంగా సాగుతూం డటం కూడా ఈ రెండేళ్లలోనే ఉధృతం అయింది. ఇక విదేశాంగ విధానం - ఏ దేశంతోనూ గర్వించదగ్గ సత్సంబంధాలను మోదీ నెలకొల్పలేకపోయారు. ఒక్క బంగ్లాదేశ్‌తో తప్ప (అదీ, అసోం బంగ్లాల మధ్య ముస్లింల వలసల కారణంగా) చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్‌లతో సరిహద్దు వివాదాలు, సమస్యలు ఒక్కటీ కొలిక్కి రాలేదు. ఇదేమి ప్రజాస్వామ్యం? ‘ప్రజాస్వామ్యానికి 500 లక్షణాలను పేర్కొన్న డేవిడ్ కొలియర్, స్టీవ్ లెవెస్కీ లాంటి ప్రసిద్ధ రాజకీయ శాస్త్ర పరిశోధకులు ‘పెట్టుబడిదారీ వ్యవస్థ’ అన్న పదానికి ఒకే అర్థమే కానీ, రెండో అర్థం లేదని చెప్పారు. కానీ వీరు ప్రజాస్వామ్యానికి 500 లక్షణాలలో - ఏ ప్రజాస్వామ్యం మోయార్డ్ కీన్స్ది, ఏది మార్షల్‌ది, ఏది కారల్ మార్క్స్‌ది, ఏది ఒబామాది, మరేది ట్రంప్, మోదీల మార్కు ప్రజాస్వామ్యమో నిర్ణయించుకోవలసిన సమయం వచ్చింది! అలా ఎంపిక చేసుకునే బాదరబందీ పడలేకనే బహుశా రూసో మహనీయుడు నికార్సయిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికి ఏది గీటురాయో ఇలా నిర్వచించి పోయాడు: తరతమ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ సరుకుల్ని, సేవల్ని (సర్వీసులు) సమాన ఫాయాలో అందించలేని ప్రజా స్వామ్యం ఓ కాగితపు పులి మాత్రమే! నిజమైన ప్రజా ప్రభుత్వం స్థిరంగా నిలదొక్కుకోవాలంటే - ఎలాంటి అదుపూలేని వ్యక్తుల సంపద ఐశ్వర్యాలకు ఫుల్స్టాప్ పెట్టాలి. ప్రజా శ్రేయస్సును కోరే పాలనా వ్యవస్థలో కోటీ శ్వరులకూ, మహా కోటీశ్వరులకూ చోటుండరాదు. వీరందరిదీ ఒకే మూస. వీరిలో ఒకర్ని కాదని మరొకర్ని ఆదరించలేం. సర్వజన శ్రేయస్సుకూ, సమష్టి శ్రేయస్సుకూ వీరు విఘాతం. వీరిని అనుమతించిన చోట - ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు బేరసారాలకు లోనయ్యే అంగడి సరుకుగా మారిపోతాయి.’ బీజేపీకి రాజకీయ, ఆర్థిక, దేశ వైదేశిక విధానాల రూపకల్పనకు అవసరమైన సైద్ధాంతిక పునాది లేక, కేవలం ఆరెస్సెస్ మత సంస్థ నీడలోనే తన ఉనికిని సమర్థించుకోవాలని భావించడంవల్ల దేశానికి దిశా, దశా గతిని నిర్ణయించ డంలో ఘోరంగా విఫలమయింది! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కాను
జిల్లా ప్రకాశించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి దర్శి: తాను కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కానని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. రాజంపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లలో పొదిలి మండలం కుంచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దర్శి మండలం లక్ష్మీనారాయణపురం ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిందేనన్నారు. ప్రస్తుత పాలనలో బాబు వచ్చాడు జాబు పోయిందని, గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి వచ్చింద ని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులు పక్కదారి మళ్లించడంతో కనీసం బోర్లు ఎండిన చోట మరమ్మతులు చేయించే పరిస్థితులు కూడా లేవన్నారు. ఎన్నికల హామీలు మరిచి ప్రత్యేక విమానాల్లో ఇతర దేశాలు తిరుగుతూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో శాసనసభ్యులను కోట్లు ఇచ్చి కొంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు వద్దకు రావడం.. వెళ్లడం తప్ప.. చేసింది ఏమీ లేదన్నారు. ప్రస్తుతం కరువు వచ్చి రైతులు కన్నీరు పెడుతున్నారని, పల్లెలు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నాయని, యువత ఉద్యోగాలు, ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్నారని, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారందరూ చంద్రబాబుకు ఎందుకు ఓట్లేసి గెలిపించామని బాధపడుతున్నారని చెప్పారు. యువకుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రజల కోసం ఎంతో తపిస్తుంటారని, అటువంటి యువ నాయకుడికి అందరూ ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు. వైఎస్సార్ రామరాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిందేనని జంకె పునరుద్ఘాటించారు. -
అభివృద్ధికి దారులు
జిల్లాలో రెండు రహదారులకు డీపీఆర్ ప్రతిపాదనలు ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు ఒకటి తూర్పుగోదావరి నుంచి కృష్ణా జిల్లా మీదుగా ప్రకాశం వరకు మరొకటి కేంద్రం పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, విజయవాడ : జిల్లాలో రెండు భారీ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా నూతన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. తీరప్రాంతం వెంట కూడా జాతీయ రహదారి నిర్మిస్తే సరకు రవాణాకు ఉపయుక్తంగా ఉంటుందనే యోచనతో కోస్తా కారిడార్ వెంబడి మరో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. కేంద్ర భూఉపరితల రవాణ శాఖ పరిధిలో ఉండే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంస్థ వీటి బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. కొన్ని నెలల క్రితమే రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శాఖను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో మాత్రమే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ హైవేస్ కార్యాలయాలున్నాయి. మచిలీపట్నంలో ఈ కార్యాలయం ఉంది. గతంలో ఆర్ అండ్ బి జాతీయ రహదారుల విభాగం అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని, వారి పరిధిలో ఉన్న కొన్ని జాతీయ రహదారుల్ని ఈ సంస్థ స్వీకరించింది. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు 70 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. దీని కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపారు. ఖరారు కాగానే పనులను కేటాయించనున్నారు. ఇది జగదల్పూర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు ఐదు జిల్లాలను కలుపుతూ రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 390 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. 390 కిలోమీటర్ల రహదారి కావడంతో నిర్మాణానికి వందల కోట్లు ఖర్చవుతుంది. అధికారులు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేయించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో మొదలయ్యే రహదారి కాకినాడ, అమలాపురం, యానాం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోని దిగుమర్రు, కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, కృత్తివెన్ను, మచిలీపట్నం, బంటుమిల్లి, చల్లపల్లి, పెనుమూడి వారధి వరకు.. గుంటూరు జిల్లా రేపల్లె మీదుగా ప్రకాశం జిల్లా వరకు కోస్తా కారిడార్‌కు అనుసంధానంగా రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారయ్యాయి. -
ఈ విలేజ్‌లో... కేవలం రిలాక్స్ అవ్వండి!
విహారం సూర్యుడిలోని ప్రకాశం, పువ్వుల్లోని సుగంధం, ప్రకృతిలోని సౌందర్యం... వీటన్నింటినీ కలగలుపుకున్నది ఆ నదీ తీరం. ఆకట్టుకునే పరిసరాలు, సహజమైన రూపం ఆ ప్రదేశం సొంతం. ఈ రెండింటి సంగమమే ఆ దృశ్యకావ్యం... ఈ వర్ణనకు వాస్తవ రూపమే పోర్టోఫినో.. ఇటలీ దేశంలో, ఇటాలియా నదీ తీరంలోని అందమైన అందాల గ్రామమది. సదుపాయాలు పెరిగి నగరంగా పిలువబడుతోంది. నదీ తీరాలు నాగరికతకు పుట్టిళ్లు. పంటలు ఇచ్చాయి. జ్ఞానాన్ని పెంపొందించుకొనే తీరికనిచ్చాయి. ఉల్లాసాన్ని ఇచ్చే వాతావరణాన్ని ఇచ్చాయి. భూమ్మీద అలాంటి నదిలెన్నో ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. దేని సొగసు దానిదే. ఇలాంటి నేపథ్యంతోనే.. ఎన్నో రిసార్ట్ టౌన్లను తన ఒడిలో అనుసంధానించుకొని గుంభనంగా సాగుతుంటుంది ఇటాలియా నది. యూరప్‌లోని నార్త్ గయానా నుంచి ఫ్రెంచ్ సరిహద్దు వరకూ లైగేరియా సముద్రపు అంచులను కలుపుతూ సాగుతుంది ఈ నది. ఇది యూరప్ ఒడ్డును ఒరుసుకొని పోతున్నా.. అక్కడి మనుషుల సకల జీవరంగాలనూ స్పృశిస్తూనే ఉంటుంది. అలా ఈ నదీ స్పర్శతో ఒక ఉనికిని తెచ్చుకొన్నదే పోర్టోఫినో గ్రామం. ప్రపంచంలో పర్యాటక కేంద్రాలంటే పెద్ద నగరాలే... అనుకునే వారు ఇక్కడికి ఓ సారి రావాల్సిందే. పచ్చని పైరు, చక్కని సెలయేరు, చల్లటి గాలి... అన్నట్టుగా పర్యాటకకేంద్రంగా విలసిల్ల్లుతోంది ఈ గ్రామం. ఎన్నెన్నో విశేషాలు... పోర్టోఫినో గ్రామానిది శతాబ్దాల చరిత్ర. ఇక్కడ కవిత్వం పుట్టింది. సంగీతం పుట్టింది. అందుకే పర్యాటక చిత్రపటంలోనే కాదు... చారిత్రకంగానూ దీనిది ప్రముఖ స్థానమే. ఒక్కమాటలో చెప్పాలంటే పోర్టోఫినో పరిసరాల్లోనే ఇటాలియన్ కళ, కవిత్వం దాగుంది. ఈ ఊరి పరిసరాల స్ఫూర్తితో కవిత్వం రాశామని, ఈ పరిసరాల్లో కూర్చొని తమ కలాలను ఝళిపించామని చెప్పే రచయితలు అనేక మంది. ఇక్కడి ప్రకృతి ఆవరణంలో ఏదో మాయ ఉందని వారు అంటారు. అలాగే ఇది యూరప్‌లోనే సెలబ్రిటీలకు ఫేవరెట్ స్పాట్‌గా పేరు పొందింది. వేసవిలో సేదతీరడానికి ఎంతో మంది ఇక్కడకు చేరుకుంటుంటారు. ఇంత ప్రేరణ ఉందంటే... ఆ వాతావరణం ఎంత అందంగా ఉంటుంటో అర్థం కావట్లేదూ! ఇంకా చిత్రమేంటంటే... ఈ అందమైన ప్రకృతిపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల ముద్ర కూడా ఉంది. ప్రత్యేక ఆకర్షణలు... నడుస్తూ ఈ ఊరి అందాలను చూడటం ఉల్లాసానికి ఒక ఉత్తమమైన మార్గమని ఇటలీ వాసులు, పర్యాటక ప్రేమికులు చెబుతారు. ఇందులో రెండు సౌలభ్యాలున్నాయి. ఒకటి ఇక్కడి హోటళ్ల, బీచ్‌ల అందాలు చూడొచ్చు.. రెండు భారీ స్థాయిలోని టాక్సీ చార్జీలను తప్పించుకోవచ్చు అంటూ ఇక్కడ టాక్సీ చార్జీల గురించి టూరిస్ట్ గైడ్లు ముందుగానే హెచ్చరిక జారీ చేస్తుంటారు. ఇక్కడ అన్నీ ఆకట్టుకొనేవే.. ప్రత్యేకించి ఇక్కడి జీవన విధానం. ఫొర్టోఫినో ట్రిప్ ప్లాన్ చేసుకోవడంలో ముందుగానే ప్రయారిటీలు, షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడానికే అవకాశం లేదట. ఎందుకంటే అక్కడకి వెళ్లే వరకే మన చేతుల్లో ఉంటుంది. అక్కడికెళ్లాక ఆ అందాలు అక్కడ్నుంచి కదలనివ్వవు. దాంతో ప్రణాళిక మొత్తం మారిపోతుంది. బీచ్‌లో కూర్చుని అందాలు తనివి తీరా అనుభవిస్తుంటే... లాగూన్లలో డాల్ఫిన్లు చేసే విన్యాసాలను ఆస్వాదిస్తుంటే.. గంటలు నిమిషాల్లా గడిచిపోతాయని అంటారు. మధ్యయుగం నాటి ఆనవాళ్లు... ఇక్కడ పదహారో శతాబ్దం నాటి కోట క్లాస్టెల్లో బ్రౌన్ ఉంటుంది. ఒకనాడు అంతఃపురంగా విలసిల్లిన ఈ కోట ఇప్పుడు మ్యూజియంగా మారి అలనాటి వైభవానికి ఆనవాలుగా ఉంది. మధ్య యుగానికి చెందిన మరో చారిత్రక ప్రదేశం సెయింట్ మార్టిన్ చర్చి ఇక్కడ మరో ఆకర్షణ. ‘క్రైస్ట్ ఆఫ్ ఏబియస్’ పేరిట ఇక్కడ ఏర్పాటుచేసిన యేసు క్రీస్తు విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 30 అడుగుల ఎత్తుండే ఈ విగ్రహం నది మధ్యలో మునిగి ఉంటుంది. ఇలాంటి అనుభూతి మీకు మరెక్కడా దొరకదు. స్కూబా డ్రైవర్లకు, ఫిషర్ మ్యాన్లకు విగ్రహ రూపంలోని యేసుక్రీస్తు రక్షణగా ఉంటాడని ఒక నమ్మకం. మునిగి ఉన్న ఈ విగ్రహాన్ని పర్యాటకులు వీక్షించడానికి వీలుగా ఉంటుంది. రిలాక్స్...రిలాక్స్... ఈ ఊరిని వచ్చే పర్యాటకులకు ఒకే ఒక్క ముఖ్య సూచన ఉంది. అదేంటంటే.. ఇక్కడ విజ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ప్రకృతి మిస్టరీల గురించి ఆలోచించనే వద్దు... జస్ట్ రిలాక్స్! ఇక్కడ చేయగలిగిన, చేయాల్సిన గొప్ప పని ఏదైనా ఉందంటే అది రిలాక్స్ కావడమే మాత్రమే. ప్రకృతికి ఒక సొంతం గ్రామం ఉంటే అదిలా ఉంటుందనిపించే ఈ చిన్న నగరంలో కలియతిరగండి. ఆద్యంతం అనుభవైకవేద్యమైన అనుభూతి పొందండి. నదీ ప్రవాహ గలగలలు వినండి. చక్కటి ఇటాలియన్ వంటలతో మైమరిచిపోండి. ఎందుకంటే పోర్టోఫినో ఉన్నది అందుకే! ఫోర్టోఫినోకు ఎలా వెళ్లాలి? 1940లలో బ్రిటన్ నుంచి గుర్రాల ద్వారా పర్యాటకులు ఈ ఊరికి వచ్చేవారట. అలా ఇక్కడికి పర్యాటకుల ప్రవాహం మొదలైంది. ప్రస్తుతానికి అయితే పోర్టోఫినో దగ్గరలో జెనోవా నగరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 36 కిలోమీటర్ల కారు ప్రయాణంతో పోర్టోఫినో చేరుకోవచ్చు. ఇంకా ఫ్రాన్స్‌లోని నైస్, ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్ట్‌లు కూడా పోర్టోఫినోకు దగ్గరగా ఉన్న ఇతర విమానాశ్రయాలు. ఊరి పేరు ఎలా వచ్చిందంటే... పోర్టోఫినో రోమన్లు పెట్టిన పేరు. ఈ నదీతీరపు గ్రామానికి కాలక్రమేణా ఊరిపేరు మారిపోయేంత ప్రస్థానం ఉంది. డాల్ఫిన్లకు స్వర్గధామమైన నదికి తీరంలో ఉండే ఈ గ్రామానికి ‘పోర్టస్ డాల్ఫినో’గా రోమన్లు నామకరణం చేశారు. పోర్ట్ ఆఫ్‌ది డాల్ఫిన్‌గా పిలుచుకునే వారు. క్రమేణ ఇదే ఫోర్టోఫినో అయ్యింది. పేరులోనే డాల్ఫిన్లను దాచుకొన్న ఈ ఊరును ఒక ఎక్వేరియంగా అభివర్ణిస్తారు ఇటాలియన్లు. ఇక్కడి తీరంలో కూర్చున్నా.. నదిలో ఈదులాడినా వందల, వేల రకాల చేపలను వీక్షించడానికి అవకాశం ఉంఆది. అందుకే దీన్ని ఫిషింగ్ సిటీ అని అంటారు. ఊరి జనాభా 500! ఇక్కడ శాశ్వతంగా నివసించే వారి సంఖ్య 500. అయితే యూరప్‌లో వేసవి కాలం వచ్చి భానుడు ఒళ్లు విరుచుకున్నాడంటే.. ఈ ఊరిలో జనాభా అమాంతం పెరిగిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకి వస్తారు. వీరి కోసం బొటిక్స్, ఆర్ట్‌గ్యాలరీలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు నడపడమే స్థానికుల జీవనాధారం. ఫిషింగ్ ఆదాయం ఆదనం.